Aranya Kanda Sarga 22 In Telugu – అరణ్యకాండ ద్వావింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్వావింశః సర్గలో, రావణుని సోదరి శూర్పణఖ పంచవటికి వస్తుంది. రాముడిని చూసి ఆమె ఆకర్షితురాలవుతుంది. రాముని ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంది, కానీ రాముడు సీతమ్మను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిరాశలో శూర్పణఖ తన రూపం మార్చుకుని లక్ష్మణుడి దగ్గరకు వెళుతుంది.

ఖరసంనాహః

ఏవమాధర్షితః శూరః శూర్పణఖ్యా ఖరస్తదా |
ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః ||

1

తవావమానప్రభవః క్రోధోఽయమతులో మమ |
న శక్యతే ధారయితుం లవణాంభ ఇవోత్థితమ్ ||

2

న రామం గణయే వీర్యాన్మానుషం క్షీణజీవితమ్ |
ఆత్మదుశ్చరితైః ప్రాణాన్ హతో యోఽద్య విమోక్ష్యతి ||

3

బాష్పః సంహ్రియతామేష సంభ్రమశ్చ విముచ్యతామ్ |
అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనమ్ ||

4

పరశ్వధహతస్యాద్య మందప్రాణస్య సంయుగే |
రామస్య రుధిరం రక్తముష్ణం పాస్యసి రాక్షసి ||

5

సా ప్రహృష్టా వచః శ్రుత్వా ఖరస్య వదనాచ్చ్యుతమ్ |
ప్రశశంస పునర్మౌర్ఖ్యాద్భ్రాతరం రక్షసాం వరమ్ ||

6

తయా పరుషితః పూర్వం పునరేవ ప్రశంసితః |
అబ్రవీద్దూషణం నామ ఖరః సేనాపతిం తదా ||

7

చతుర్దశ సహస్రాణి మమ చిత్తానువర్తినామ్ |
రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినామ్ ||

8

నీలజీమూతవర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణామ్ |
లోకహింసావిహారాణాం బలినాముగ్రతేజసామ్ ||

9

తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసామ్ |
సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్య కారయ ||

10

ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్య ధనూంషి చ |
శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గశ్చ శక్తీశ్చ వివిధాః శితాః ||

11

అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనామ్ |
వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిద ||

12

ఇతి తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథమ్ |
సదశ్వైః శబలైర్యుక్తమాచచక్షేఽథ దూషణః ||

13

తం మేరుశిఖరాకారం తప్తకాంచనభూషణమ్ |
హేమచక్రమసంబాధం వైడూర్యమయకూబరమ్ ||

14

మత్స్యైః పుష్పైర్ద్రుమైః శైలైశ్చంద్రసూర్యైశ్చ కాంచనైః |
మంగళైః పక్షిసంఘైశ్చ తారాభిరభిసంవృతమ్ ||

15

ధ్వజనిస్త్రింశసంపన్నం కింకిణీకవిరాజితమ్ |
సదశ్వయుక్తం సోమర్షాదారురోహ ఖరో రథమ్ ||

16

నిశామ్య తు రథస్థం తం రాక్షసా భీమవిక్రమాః |
తస్థుః సంపరివార్యైనం దూషణం చ మహాబలమ్ ||

17

ఖరస్తు తాన్మహేష్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ |
నిర్యాతేత్యబ్రవీద్దృష్టో రథస్థః సర్వరాక్షసాన్ ||

18

తతస్తద్రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజమ్ |
నిర్జగామ జనస్థానాన్మహానాదం మహాజవమ్ ||

19

ముద్గరైః పట్టిశైః శూలైః సుతీక్ష్ణైశ్చ పరశ్వధైః |
ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థైర్భ్రాజమానైశ్చ తోమరైః ||

20

శక్తిభిః పరిఘైర్ఘోరైరతిమాత్రైశ్చ కార్ముకైః |
గదాసిముసలైర్వజ్రైర్గృహీతైర్భీమదర్శనైః ||

21

రాక్షసానాం సుఘోరాణాం సహస్రాణి చతుర్దశ |
నిర్యాతాని జనస్థానాత్ఖరచిత్తానువర్తినామ్ ||

22

తాంస్త్వభిద్రవతో దృష్ట్వా రాక్షసాన్ భీమవిక్రమాన్ |
ఖరస్యాపి రథః కించిజ్జగామ తదనంతరమ్ ||

23

తతస్తాన్ శబలానశ్వాంస్తప్తకాంచనభూషితాన్ |
ఖరస్య మతమాజ్ఞాయ సారథిః సమచోదయత్ ||

24

స చోదితో రథః శీఘ్రం ఖరస్య రిపుఘాతినః |
శబ్దేనాపూరయామాస దిశశ్చ ప్రదిశస్తదా ||

25

ప్రవృద్ధమన్యుస్తు ఖరః ఖరస్వనో
రిపోర్వధార్థం త్వరితో యథాఽంతకః |
అచూచుదత్ సారథిమున్నదన్ ఘనం
మహాబలో మేఘ ఇవాశ్మవర్షవాన్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వావింశః సర్గః ||

Aranya Kanda Sarga 22 Meaning In Telugu PDF

శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు.

” నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము.” అని పలికాడు ఖరుడు.

“అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది.

శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు.

“సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి నాయకత్వము వహిస్తాను. నా కొరకు ఒక రథము, ఆయుధములు, ధనుస్సులు, బాణములు సిద్ధం చేయండి. మనమందరమూ ఆ రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము.” అని ప్రకటించాడు.

ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథం సిద్ధం చేసాడు. రథం తీసుకొచ్చి ఖరుడి ముందు నిలిపాడు. ఖరుడు ఆ రథం ఎక్కాడు. ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షస వీరులు చుట్టు వలయాకారంలో నిలబడ్డారు. ఖరుడు అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. జనస్థానమునుండి 14,000 మంది రాక్షసవీరులు ముద్గరలు, పట్టిసములు, శూలములు, పరశువులు, కత్తులు, చక్రాయుధములు, తోమరములు, శక్తి ఆయుధములు, పరిఘలు, కారుకములు (బాణములు), గదాయుధములు, ముసలములు, వజ్రాయుధములు ధరించి, రాముని మీదికి యుద్ధానికి బయలుదేరారు.

(ఇక్కడ కూడా 14 వేల మంది రాక్షస సైన్యము, బయలుదేరింది. ఇది మూడవ 14 సంఖ్య)

ముందు సైనికులు నడువగా ఖరుని రథము వారిని అనుసరించింది. ఖరుడు కోపంతో ఊగి పోతున్నాడు.

“త్వరగా పదండి. శత్రువును చంపండి. నరకండి” అని పెద్దగా అరుస్తున్నాడు.

ఖరుని అరుపులతో, రాక్షసవీరుల పదఘట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోవింశః సర్గః (23) >>

Leave a Comment