Aranya Kanda Sarga 25 In Telugu – అరణ్యకాండ పంచవింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – పంచవింశః సర్గలో, రాముడు లక్ష్మణుడితో కలిసి పంచవటికి చేరుకుంటాడు. అక్కడ వారు సుగ్రీవుని కలుసుకుంటారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలి గురించి చెబుతూ, వారి మధ్య శత్రుత్వం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయినట్లు వివరించడంతో రాముడు సుగ్రీవునికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఖరసైన్యావమర్దః

అవష్టబ్ధధనుం రామం క్రుద్ధం చ రిపుఘాతినమ్ |
దదర్శాశ్రమమాగమ్య ఖరః సహ పురఃసరైః ||

1

తం దృష్ట్వా సశరం చాపముద్యమ్య ఖరనిఃస్వనమ్ |
రామస్యాభిముఖం సూతం చోద్యతామిత్యచోదయత్ ||

2

స ఖరస్యాజ్ఞయా సూతస్తురగాన్ సమచోదయత్ |
యత్ర రామో మహాబాహురేకో ధున్వన్ స్థితో ధనుః ||

3

తం తు నిష్పతితం దృష్ట్వా సర్వే తే రజనీచరాః |
నర్దమానా మహానాదం సచివాః పర్యవారయన్ ||

4

స తేషాం యాతుధానానాం మధ్యే రథగతః ఖరః |
బభూవ మధ్యే తారాణాం లోహితాంగ ఇవోదితః ||

5

తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసమ్ |
అర్దయిత్వా మహానాదం ననాద సమరే ఖరః ||

6

తతస్తం భీమధన్వానం క్రుద్ధాః సర్వే నిశాచరాః |
రామం నానావిధైః శస్త్రైరభ్యవర్షంత దుర్జయమ్ ||

7

ముద్గరైః పట్టిశైః శూలైః ప్రాసైః ఖడ్గైః పరశ్వధైః |
రాక్షసాః సమరే రామం నిజఘ్నూ రోషతత్పరాః ||

8

తే బలాహకసంకాశా మహానాదా మహౌజసః |
అభ్యధావంత కాకుత్స్థం రథైర్వాజిభిరేవ చ ||

9

గజైః పర్వతకూటాభై రామం యుద్ధే జిఘాంసవః |
తే రామే శరవర్షాణి వ్యసృజన్రక్షసాం గణాః ||

10

శైలేంద్రమివ ధారాభిర్వర్షమాణాః బలాహకాః |
స తైః పరివృతో ఘోరై రాఘవో రక్షసాం గణైః ||

11

[* తిథిష్వివ మహాదేవో వృతః పారిషదాం గణైః | *]
తాని ముక్తాని శస్త్రాణి యాతుధానైః స రాఘవః |
ప్రతిజగ్రాహ విశిఖైర్నద్యోఘానివ సాగరః ||

12

స తైః ప్రహరణైర్ఘోరైర్భిన్నగాత్రో న వివ్యథే |
రామః ప్రదీప్తైర్బహుభిర్వజ్రైరివ మహాచలః ||

13

స విద్ధః క్షతజైర్దిగ్ధః సర్వగాత్రేషు రాఘవః |
బభూవ రామః సంధ్యాభ్రైర్దివాకర ఇవావృతః ||

14

విషేదుర్దేవగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
ఏకం సహస్రైర్బహుభిస్తదా దృష్ట్వా సమావృతమ్ ||

15

తతో రామః సుసంక్రుద్ధో మండలీకృతకార్ముకః |
ససర్జ విశిఖాన్బాణాన్ శతశోఽథ సహస్రశః ||

16

దురవారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్రణే |
ముమోచ లీలయా రామః కంకపత్రానజిహ్మగాన్ ||

17

తే శరాః శత్రుసైన్యేషు ముక్తా రామేణ లీలయా |
ఆదదూ రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ ||

18

భిత్త్వా రాక్షసదేహాంస్తాంస్తే శరా రుధిరాప్లుతాః |
అంతరిక్షగతా రేజుర్దీప్తాగ్నిసమతేజసః ||

19

అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాత్ |
వినిష్పేతురతీవోగ్రా రక్షః ప్రాణాపహారిణః ||

20

[* తే రథో సాంగదాన్ బాహూన్ సహస్తాభరణాన్ భుజాన్ | *]
ధనూంషి చ ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ |
బహూన్ సహస్తాభరణాన్ ఊరూన్ కరికరోపమాన్ ||

21

చిచ్ఛేద రామః సమరే శతశోఽథ సహస్రశః |
హయాన్ కాంచనసన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ ||

22

గజాంశ్చ సగజారోహాన్ సహయాన్ సాదినస్తథా |
పదాతీన్ సమరే హత్వా హ్యనయద్యమసాదనమ్ ||

23

తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
భీమవార్తస్వరం చక్రుర్భిద్యమానా నిశాచరాః ||

24

తత్సైన్యం నిశితైర్బాణైరర్దితం మర్మభేదిభిః |
రామేణ న సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా ||

25

కేచిద్భీమబలాః శూరాః శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ |
రామస్యాభిముఖం గత్వా చిక్షిపుః పరమాయుధాన్ ||

26

తాని బాణైర్మహాబాహుః శస్త్రాణ్యావార్య రాఘవః |
జహార సమరే ప్రాణాంశ్చిచ్ఛేద చ శిరోధరాన్ ||

27

తే ఛిన్నశిరసః పేతుశ్ఛిన్నవర్మశరాసనాః |
సుపర్ణవాతవిక్షిప్తా జగత్యాం పాదపా యథా ||

28

అవశిష్టాశ్చ యే తత్ర విషణ్ణాశ్చ నిశాచరాః |
ఖరమేవాభ్యధావంత శరణార్థం శరార్దితాః ||

29

తాన్ సర్వాన్ పునరాదాయ సమాశ్వాస్య చ దూషణః |
అభ్యధావత కాకుత్స్థం క్రుద్ధో రుద్రమివాంతకః ||

30

నివృత్తాస్తు పునః సర్వే దూషణాశ్రయనిర్భయాః |
రామమేవాభ్యధావంత సాలతాలశిలాయుధాః ||

31

శూలముద్గరహస్తాశ్చ చాపహస్తా మహాబలాః |
సృజంతః శరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే ||

32

ద్రుమవర్షాణి ముంచంతః శిలావర్షాణి రాక్షసాః |
తద్బభూవాద్భుతం యుద్ధం తుములం రోమహర్షణమ్ ||

33

రామస్య చ మహాఘోరం పునస్తేషాం చ రక్షసామ్ |
తే సమంతాదభిక్రుద్ధా రాఘవం పునరభ్యయుః ||

34

తైశ్చ సర్వా దిశో దృష్ట్వా ప్రదిశశ్చ సమావృతాః |
రాక్షసైరుద్యతప్రాసైః శరవర్షాభివర్షిభిః ||

35

స కృత్వా భైరవం నాదమస్త్రం పరమభాస్వరమ్ |
సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః ||

36

తతః శరసహస్రాణి నిర్యయుశ్చాపమండలాత్ |
సర్వా దశ దిశో బాణైరావార్యంత సమాగతైః ||

37

నాదదానం శరాన్ ఘోరాన్న ముంచంత శిలీముఖాన్ |
వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శరార్దితాః ||

38

శరాంధకారమాకాశమావృణోత్సదివాకరమ్ |
బభూవావస్థితో రామః ప్రవమన్నివ తాన్ శరాన్ ||

39

యుగపత్పతమానైశ్చ యుగపచ్చ హతైర్భ్రుశమ్ |
యుగపత్పతితైశ్చైవ వికీర్ణా వసుధాభవత్ ||

40

నిహతాః పతితాః క్షీణాశ్ఛిన్నా భిన్నా విదారితాః |
తత్ర తత్ర స్మ దృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః ||

41

సోష్ణీషైరుత్తమాంగైశ్చ సాంగదైర్బాహుభిస్తథా |
ఊరుభిర్జానుభిశ్ఛిన్నైర్నానారూపవిభూషణైః ||

42

హయైశ్చ ద్విపముఖ్యైశ్చ రథైర్భిన్నైరనేకశః |
చామరైర్వ్యజనైశ్ఛత్రైర్ధ్వజైర్నానావిధైరపి ||

43

రామస్య బాణాభిహతైర్విచిత్రైః శూలపట్టిశైః |
ఖడ్గైః ఖండీకృతైః ప్రాసైర్వికీర్ణైశ్చ పరశ్వధైః ||

44

చూర్ణితాభిః శిలాభిశ్చ శరైశ్చిత్రైరనేకశః |
విచ్ఛిన్నైః సమరే భూమిర్వికీర్ణాఽభూద్భయంకరా ||

45

తాన్ దృష్ట్వా నిహతాన్ సంఖ్యే రాక్షసాన్ పరమాతురాన్ |
న తత్ర సహితుం శక్తా రామం పరపురంజయమ్ ||

46

[* బలావశేషం తు నిరస్తమాహవే ఖరాధికం రాక్షసదుర్బలం బలమ్ |
జఘాన రామః స్థిరధర్మపౌరుషో ధనుర్బలైరప్రతివారణైః శరైః || *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశః సర్గః ||

Aranya Kanda Sarga 25 Meaning In Telugu

ఖరుడు తన రధాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు. ధనుర్బాణములతో నేలమీద నిలుచుని ఉన్న రాముని చూచాడు.

“రథమును రాముని మీదికి నడిపిపంచు” అని సారధిని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఖరుని ఆజ్ఞను అందుకొని సారథి రథమును రాముని మీదికి పోనిచ్చాడు. అది చూచి రాక్షస సేనలు కూడా రాముని మీదికి తమ తమ రథములను నడిపించాయి. రాముని చుట్టుముట్టాయి. రాముని మీద బాణముల వర్షము కురిపించాయి.

ఆ బాణఘాతములను రాముడు చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ బాణములు తన దేహమును బాధించినా ఓర్చుకున్నాడు. రాక్షసులు ప్రయోగించిన బాణములతో, ఆయుధముల దెబ్బలతో రాముని శరీరం అంతా రక్తసిక్తము అయింది. కాని రాముడు చలించలేదు.

అన్ని వేల మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముని చుట్టుముట్టి గాయపరచడం చూచి ఆకాశంలో నిలబడ్డ దేవతలు, గంధర్వులు ఎంతో వ్యధచెందారు. అన్ని దెబ్బలు తింటేగానీ, రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు. (రాముడు కోపం తెచ్చుకున్నాడు అన్న మాటకు అర్థం ఇదేకాబోలు.)

అప్పుడు రాముడు కోపంతో కంపించి పోయాడు. తన ధనుస్సును మండలాకారంగా వంచి వేలకొలది బాణములను రాక్షసులు మీద ప్రయోగించాడు. (ధనుస్సు నిలువుగా ఉంటుంది. ఎక్కుపెడితో గుండ్రంగా వంగుతుంది. రాముని ధనుస్సు గుండ్రంగా ఉంది అంటే రాముడు ఎంత వేగంగా బాణాలు ప్రయోగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు)

రాముడు తన వద్ద ఉన్న దివ్యాస్త్రములను వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము నేలకొరిగింది. రాముడు వదిలిన ఒక్కొక్క బాణము ఒక్కొక్క రాక్షసుని గుండెలు చీల్చింది. రాముడు ప్రయోగించిన వేలకొలది బాణములు వేలకొలది రాక్షసులను మట్టుబెట్టాయి. రాముడు తన బాణములతో రాక్షసుల రథములను విరగ్గొట్టాడు. హయములను, గజములను చంపాడు. పతాకములను విరిచాడు. రథికులు, ఆశ్వికులు, పదాతి దళము అందరూ రామ బాణములకు ఆహుతి అయ్యారు. రాముని బాణముల దెబ్బలకు తాళలేక రాక్షసులు చేయు హాహాకారములతో ఆ ప్రాంతము అంతా మార్మోగి పోయింది.

చావగా మిగిలిన రాక్షస వీరులు రాముని మీదికి గండ్రగొడ్డళ్లను, శూలములను, కత్తులను విసిరారు. రాముడు నిర్విరామంగా బాణప్రయోగం చేస్తూ వారు విసిరిన నానారకాల ఆయుధములను మధ్యలోనే తుంచేసాడు. ఆ ఆయుధములు ప్రయోగించిన వారి కంఠములు ఖండించాడు. అలా రాక్షసులు తలకాయలు తెగి పడుతుంటే, ఆ ప్రాంతమంతా రాక్షసుల కళేబరాలతో నిండిపోయింది. చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున ఖరుని వద్దకు పోయి దాక్కున్నారు.

ఖరుని పక్కనే ఉన్న దూషణుడు వారినందరినీ ఓదార్చి, ధైర్యము చెప్పి, వారినందరినీ వెంటబెట్టుకొని పట్టరాని కోపంతో రాముని మీదికి ఉరికాడు. దూషణుని నాయకత్వంలో రాక్షసులు చేతికి అందిన రాళ్లను, చెట్లను పట్టుకొని రాముని మీదికి లంఘించారు. రాముని మీదికి చెట్లను రాళ్లను విసిరారు. రాముడు వాటిని తన శరములతో పిండి పిండి చేసాడు.

ఆ ప్రకారంగా రాక్షసులకు రామునికి ఘోరయుద్ధము జరిగింది. ఇలా కాదని రాక్షసులు అందరూ రాముని చుట్టు చేరి ఆయుధములను ప్రయోగించారు. అది చూచిన రాముడు వారి మీద గాంధర్వము అనే అస్త్రమును ప్రయోగించాడు.

ఆ ప్రభావంతో రాక్షసులకు తాము ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియడం లేదు. రాముని ధనుస్సు మండలాకారంలో ఉండటం మాత్రం కనపడుతూ ఉంది వారికి. కాని రాముని ధనుస్సునుండి వెలువడిన బాణములు రాక్షసులను హతమారుస్తున్నాయి.

ఆ ప్రాంతమంతా రాక్షసుల తలలతోనూ, కాళ్లతోనూ, మొండెములతోనూ నిండిపోయింది. వారి వారి ఆయుథములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారే కాదు వారు ఎక్కి వచ్చిన గుర్రములు, ఏనుగులు కూడా చచ్చి పడి ఉన్నాయి. రథములు, వాటికి కట్టిన పతాకములు తునా తునకలుగా విరిగిపడి ఉన్నాయి. రాక్షసుల మృతకళేబరములతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా, భీభత్సంగా ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యపర్వము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షడ్వింశః సర్గః (26) >>

Leave a Comment