Ayodhya Kanda Sarga 98 In Telugu – అయోధ్యాకాండ అష్టనవతితమః సర్గః

అయోధ్యాకాండం అష్టనవతితమ (98వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్తాడు. అయోధ్యలో ప్రజలు భరతుని తీర్పును స్వాగతిస్తారు. భరతుడు, రాముడు లేకపోవడం వలన తన బాధను వ్యక్తం చేస్తూ, ప్రజలకు ధర్మపరంగా పాలనను అందిస్తాడు. భరతుడు రాముని ప్రతినిధిగా పాదుకలను సింహాసనంపై ఉంచి, తాను తాత్కాలికంగా పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గలో భరతుని ధర్మనిష్ఠ, రాముడిపై అపారమైన ప్రేమ, ప్రజల పట్ల అతని కర్తవ్యనిష్ఠ కనిపిస్తాయి. భరతుడు రాముడి వలెనే న్యాయంగా, ధర్మబద్ధంగా పాలిస్తానని నిర్ణయిస్తాడు. ప్రజలు భరతుని తీర్పుకు సహాయం చేస్తారు, రాముని తిరిగి రాక కోసం ఎదురుచూస్తారు.

రామాన్వేషణమ్

నివేశ్య సేనాం తు విభుః పద్భ్యాం పాదవతాం వరః |
అభిగంతుం స కాకుత్స్థమియేష గురువర్తకమ్ || ౧ ||

నివిష్టమాత్రే సైన్యే తు యథోద్దేశం వినీతవత్ |
భరతో భ్రాతరం వాక్యం శత్రుఘ్నమిదమబ్రవీత్ || ౨ ||

క్షిప్రం వనమిదం సౌమ్య నరసంఘైః సమంతతః |
లుబ్ధైశ్చ సహితైరేభిస్త్వమన్వేషితుమర్హసి || ౩ ||

గుహో జ్ఞాతిసహస్రేణ శరచాపాసిధారిణా |
సమన్వేషతు కాకుత్స్థమస్మిన్ పరివృతః స్వయమ్ || ౪ ||

అమాత్యైః సహ పౌరైశ్చ గురుభిశ్చ ద్విజాతిభిః |
వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృతః స్వయమ్ || ౫ ||

యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలమ్ |
వైదేహీం వా మహాభాగాం న మే శాంతిర్భవిష్యతి || ౬ ||

యావన్న చంద్రసంకాశం ద్రక్ష్యామి శుభమాననమ్ |
భ్రాతుః పద్మపలాశాక్షం న మే శాంతిర్భవిష్యతి || ౭ ||

యావన్న చరణౌ భ్రాతుః పార్థివవ్యంజనాన్వితౌ |
శిరసా ధారయిష్యామి న మే శాంతిర్భవిష్యతి || ౮ ||

యావన్న రాజ్యే రాజ్యార్హః పితృపైతామహే స్థితః |
అభిషేకజలక్లిన్నో న మే శాంతిర్భవిష్యతి || ౯ ||

సిద్ధార్థః ఖలు సౌమిత్రిర్యశ్చంద్రవిమలోపమమ్ |
ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి || ౧౦ ||

కృతకృత్యా మహాభాగా వైదేహీ జనకాత్మజా |
భర్తారం సాగరాంతాయాః పృథివ్యా యాఽనుగచ్ఛతి || ౧౧ ||

సుభగశ్చిత్రకూటోఽసౌ గిరిరాజోపమో గిరిః |
యస్మిన్వసతి కాకుత్స్థః కుబేర ఇవ నందనే || ౧౨ ||

కృతకార్యమిదం దుర్గం వనం వ్యాలనిషేవితమ్ |
యదధ్యాస్తే మహాతేజాః రామః శస్త్రభృతాం వరః || ౧౩ ||

ఏవముక్త్వా మహాతేజాః భరతః పురుషర్షభః |
పద్భ్యామేవ మహాబాహుః ప్రవివేశ మహద్వనమ్ || ౧౪ ||

స తాని ద్రుమజాలాని జాతాని గిరిసానుషు |
పుష్పితాగ్రాణి మధ్యేన జగామ వదతాం వరః || ౧౫ ||

స గిరిశ్చిత్రకూటస్య సాలమాసాద్య పుష్పితమ్ |
రామాశ్రమగతస్యాగ్నేః దదర్శ ధ్వజముచ్ఛ్రితమ్ || ౧౬ ||

తం దృష్ట్వా భరతః శ్రీమాన్ ముమోహ సహబాంధవః |
అత్ర రామ ఇతి జ్ఞాత్వా గతః పారమివాంభసః || ౧౭ ||

స చిత్రకూటే తు గిరౌ నిశమ్య
రామాశ్రమం పుణ్యజనోపపన్నమ్ |
గుహేన సార్ధం త్వరితో జగామ
పునర్నివేశ్యైవ చమూం మహాత్మా || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టనవతితమః సర్గః || ౯౮ ||

Ayodhya Kanda Sarga 98 Meaning In Telugu

భరతుడు తనసేనలను చిత్రకూట పర్వతము చుట్టు నిలిపి, రాముని వెతుక్కుంటూ కాలినడకన బయలుదేరాడు. శత్రుఘ్నుని చూచి ఇలాఅన్నాడు. “శత్రుఘ్నా! నీవు కొంత మంది సైనికులను, ఆటవికులను తీసుకొని, ఈ అరణ్యములో రాముని ఆశ్రమము ఎక్కడ ఉందో వెతుకు. గుహుడు తన పరివారముతో మరియొక పక్కనుండి వెతుకుతాడు. నేను కూడా నా పరివారముతోనూ, వసిష్ఠులవారితోనూ బ్రాహ్మణులతో కలిసి మరొక పక్కనుండి వెతుకుతాను. ఆ రాముని దర్శనభాగ్యము ఎవరికి కలుగుతుందో వారు అదృష్టవంతులు.. రాముని చూచేటంత వరకూ నాకు మనశ్శాంతి లేదు.

రాముని చూచిన వెంటనే ఆయన పాదముల మీద నా తలపెట్టి నా కన్నీటితో ఆయన పాదములకు అభిషేకము చేసెదను. రాముడు తిరిగి అయోధ్య వచ్చి తన రాజ్యమును స్వీకరిస్తాను అని చెప్పేవరకూ నేను ఆయన పాదములు వదలను. రాముని పక్కనే ఉ ండి రామును ముఖకమలమును సర్వదా దర్శించు లక్ష్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా!

అన్ని కష్టములకు ఓర్చి రాముని అనుసరించిన మా వదిన సీతమ్మ కృతార్థురాలు. రాముడు తిరుగాడు ఈ పర్వతము, ఈ వనములు, ఈ నది ఎంతో పుణ్యము చేసుకొన్నాయి. లేకపోతే ఎక్కడో అయోధ్యలో ఉండవలసిన రామపాద స్పర్శ వీటికి లభిస్తుందా.” అని ఆ పరిసరముల యొక్క శోభను పొగుడుతూ భరతుడు రాముని వెదకడానికి ఉపక్రమించాడు.

పర్వత చరియలు, చెట్లు, పుట్టలు కొండగుహలు అన్నీ గాలిస్తున్నాడు. వారంతా ఒక పెద్ద సాలవృక్షము వద్దకు వచ్చారు. వారికి గాలిలోకి లేస్తున్న పొగ కనపడింది. అక్కడ ఏదో ఆశ్రమము ఉండవచ్చు. అని అనుకున్నారు. అది రాముని ఆశ్రమము అక్కడ రాముడు ఉంటాడు అని మనసులో రూఢిగా అనుకున్నాడు భరతుడు. ఇంతలో గుహుడు కూడా అక్కడకు వచ్చాడు. భరతుడు గుహునితో కలిసి రాముని ఆశ్రమము వద్దకు కాలి నడకన వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకోనశతతమః సర్గః (99) >>

Leave a Comment