Aranya Kanda Sarga 32 In Telugu – అరణ్యకాండ ద్వాత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాత్రింశః సర్గలో, రావణుడి ఆడంబరం మరియు వైభవం అతని విలక్షణత మరియు వ్యక్తిత్వం, అతని విజయాలు మరియు విజయాలు, అతని అసూయలు మరియు దురాశలతో పాటు చిత్రీకరించబడింది. లక్ష్మణుడి చేతిలో తన గతి గురించి తెలియజేయడానికి శూర్పణఖ అతనిని సమీపించింది.

శూర్పణఖోద్యమః

తతః శూర్పణఖా దృష్ట్వా సహస్రాణి చతుర్దశ |
హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణామ్ ||

1

దూషణం చ ఖరం చైవ హతం త్రిశిరసా సహ |
దృష్ట్వా పునర్మహానాదం ననాద జలదో యథా ||

2

సా దృష్ట్వా కర్మ రామస్య కృతమన్యైః సుదుష్కరమ్ |
జగామ పరమోద్విగ్నా లంకాం రావణపాలితామ్ ||

3

సా దదర్శ విమానాగ్రే రావణం దీప్తతేజసమ్ |
ఉపోపవిష్టం సచివైర్మరుద్భిరివ వాసవమ్ ||

4

ఆసీనం సూర్యసంకాశే కాంచనే పరమాసనే |
రుక్మవేదిగతం ప్రాజ్యం జ్వలంతమివ పావకమ్ ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
అజేయం సమరే శూరం వ్యాత్తాననమివాంతకమ్ ||

6

దేవాసురవిమర్దేషు వజ్రాశనికృతవ్రణమ్ |
ఐరావతవిషాణాగ్రైరుద్ఘృష్టకిణవక్షసమ్ ||

7

వింశద్భుజం దశగ్రీవం దర్శనీయపరిచ్ఛదమ్ |
విశాలవక్షసం వీరం రాజలక్షణశోభితమ్ ||

8

స్నిగ్ధవైడూర్యసంకాశం తప్తకాంచనకుండలమ్ |
సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమమ్ ||

9

విష్ణుచక్రనిపాతైశ్చ శతశో దేవసంయుగే |
అన్యైః శస్త్రప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితమ్ ||

10

ఆహతాంగం సమస్తైశ్చ దేవప్రహరణైస్తథా |
అక్షోభ్యాణాం సముద్రాణాం క్షోభణం క్షిప్రకారిణమ్ ||

11

క్షేప్తారం పర్వతేంద్రాణాం సురాణాం చ ప్రమర్దనమ్ |
ఉచ్ఛేత్తారం చ ధర్మాణాం పరదారాభిమర్శనమ్ ||

12

సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞవిఘ్నకరం సదా |
పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిమ్ ||

13

తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహార యః |
కైలాసపర్వతం గత్వా విజిత్య నరవాహనమ్ ||

14

విమానం పుష్పకం తస్య కామగం వై జహార యః |
వనం చైత్రరథం దివ్యం నలినీం నందనం వనమ్ ||

15

వినాశయతి యః క్రోధాద్దేవోద్యానాని వీర్యవాన్ |
చంద్రసూర్యౌ మహాభాగావుత్తిష్ఠంతౌ పరంతపౌ ||

16

నివారయతి బాహుభ్యాం యః శైలశిఖరోపమః |
దశవర్షసహస్రాణి తపస్తప్త్వా మహావనే ||

17

పురా స్వయంభువే ధీరః శిరాంస్యుపజహార యః |
దేవదానవగధర్వపిశాచపతగోరగైః ||

18

అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే |
మంత్రైరభిష్టుతం పుణ్యమధ్వరేషు ద్విజాతిభిః ||

19

హవిర్ధానేషు యః సోమముపహంతి మహాబలః |
ఆప్తయజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణమ్ ||

20

కర్కశం నిరనుక్రోశం ప్రజానామహితే రతమ్ |
రావణం సర్వభూతానాం సర్వలోకభయావహమ్ ||

21

రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలమ్ |
తం దివ్యవస్త్రాభరణం దివ్యమాల్యోపశోభితమ్ ||

22

ఆసనే సూపవిష్టం చ కాలకాలమివోద్యతమ్ |
రాక్షసేంద్రం మహాభాగం పౌలస్త్యకులనందనమ్ ||

23

రావణం శత్రుహంతారం మంత్రిభిః పరివారితమ్ |
అభిగమ్యాబ్రవీద్వాక్యం రాక్షసీ భయవిహ్వలా ||

24

తమబ్రవీద్దీప్తవిశాలలోచనం
ప్రదర్శయిత్వా భయమోహమూర్ఛితా |
సుదారుణం వాక్యమభీతచారిణీ
మహాత్మనా శూర్పణఖా విరూపితా ||

25

Aranya Kanda Sarga 32 In Telugu Pdf Download

తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్లముందు నాశనం కావడం చూచి తట్టుకోలేక పోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలుపెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది.

లంకానగరంలో, రావణుడు, మూర్తీభవించిన దేవేంద్రుని వలె, సభాప్రాంగణంలో, తన బంగారు సింహాసనము మీద, కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టు అతని మంత్రులు కూర్చుని ఉన్నారు.

రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగు లేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలనా, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి.

రావణుడు దశకంఠుడు. అంటే పది తలలు కలవాడు. అతనికి ఇరువది చేతులు, పది తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండమాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. రావణుడు పరాక్రమవంతుడే కాదు. ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ. ఒకసారి భోగవతీ నగరానికి పోయి, తక్షకుని భార్యను బలాత్కారంగా తీసుకొని వచ్చాడు. రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు. రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక
విమానమును అపహరించాడు.

రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు. రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను, అందమైన వనములను, సరస్సులను నాశనం చేస్తాడు. ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది. రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపశ్శాలి.

పూర్వము బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేసాడు. తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు. దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్దనుండి తనకు యుద్ధములో దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిజాతులు, సర్పజాతులు, ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జీవ జాతుల నుండి కూడా తనకు మరణము లేకుండా వరం పొందాడు. మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డినమ్మకం రావణునిది.

రావణునికి దేవతలు అంటే మంట. ఋత్విక్కులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు. రావణుడు బ్రాహ్మణులను, ఋషులను, మునులను కూరంగా చంపేవాడు. అతని హృదయము పాషాణము. జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు. ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు.

అటువంటి రావణునికి శూర్పణఖ చెల్లెలు. తన గోడు చెప్పుకోడానికి శూర్పణఖ పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది. కోయబడిన తన ముక్కు, చెవులను రావణుని చూపించి ఇలా పలికింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయస్త్రింశః సర్గః (33) >>

Leave a Comment