Aranya Kanda Sarga 5 In Telugu – అరణ్యకాండ పంచమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచమః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. సుర్పణఖ రాముడిని చూసి మోహించి, సీతను వదిలేయమని కోరుతుంది. రాముడు సీతను వదలకుండా సుర్పణఖతో మాట్లాడతాడు. సుర్పణఖ తన మాయలు ప్రయోగించి రాముడిని పొందాలని ప్రయత్నిస్తుంది.

|| శరభంగబ్రహ్మలోకప్రస్థానమ్ ||

హత్వా తు తం భీమబలం విరాధం రాక్షసం వనే |
తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్ ||

1

అబ్రవీల్లక్ష్మణం రామో భ్రాతరం దీప్తతేజసమ్ |
కష్టం వనమిదం దుర్గం న చ స్మ వనగోచరాః ||

2

అభిగచ్ఛామహే శీఘ్రం శరభంగం తపోధనమ్ |
ఆశ్రమం శరభంగస్య రాఘవోఽభిజగామ హ ||

3

తస్య దేవప్రభావస్య తపసా భావితాత్మనః |
సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతమ్ ||

4

విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమమ్ |
అవరుహ్య రథోత్సంగాత్సకాశే విబుధానుగమ్ ||

5

అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరమ్ |
సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణమ్ ||

6

తద్విధైరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః |
హరిభిర్వాజిభిర్యుక్తమంతరిక్షగతం రథమ్ ||

7

దదర్శాదూరతస్తస్య తరుణాదిత్యసన్నిభమ్ |
పాండురాభ్రఘనప్రఖ్యం చంద్రమండలసన్నిభమ్ ||

8

అపశ్యద్విమలం ఛత్రం చిత్రమాల్యోపశోభితమ్ |
చామరవ్యజనే చాగ్ర్యే రుక్మదండే మహాధనే ||

9

గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని |
గంధర్వామరసిద్ధాశ్చ బహవః పరమర్షయః ||

10

అంతరిక్షగతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే |
సహ సంభాషమాణే తు శరభంగేన వాసవే ||

11

దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్ |
రామోఽథ రథముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్ ||

12

అర్చిష్మంతం శ్రియా జుష్టమద్భుతం పశ్య లక్ష్మణ |
ప్రతపంతమివాదిత్యమంతరిక్షగతం రథమ్ ||

13

యే హయాః పురుహూతస్య పురా శక్రస్య నః శ్రుతాః |
అంతరిక్షగతా దివ్యాస్త ఇమే హరయో ధ్రువమ్ ||

14

ఇమే చ పురుషవ్యాఘ్రా యే తిష్ఠంత్యభితో రథమ్ |
శతం శతం కుండలినో యువానః ఖడ్గపాణయః ||

15

విస్తీర్ణవిపులోరస్కాః పరిఘాయతబాహవః |
శోణాంశువసనాః సర్వే వ్యాఘ్రా ఇవ దురాసదాః ||

16

ఉరోదేశేషు సర్వేషాం హారా జ్వలనసన్నిభాః |
రూపం బిభ్రతి సౌమిత్రే పంచవింశతివార్షికమ్ ||

17

ఏతద్ధి కిల దేవానాం వయో భవతి నిత్యదా |
యథేమే పురుషవ్యాఘ్రా దృశ్యంతే ప్రియదర్శనాః ||

18

ఇహైవ సహ వైదేహ్యా ముహూర్తం తిష్ఠ లక్ష్మణ |
యావజ్జానామ్యహం వ్యక్తం క ఏష ద్యుతిమాన్రథే ||

19

తమేవముక్త్వా సౌమిత్రిమిహైవ స్థీయతామితి |
అభిచక్రామ కాకుత్స్థః శరభంగాశ్రమం ప్రతి ||

20

తతః సమభిగచ్ఛంతం ప్రేక్ష్య రామం శచీపతిః |
శరభంగమనుప్రాప్య వివిక్త ఇదమబ్రవీత్ ||

21

ఇహోపయాత్యసౌ రామో యావన్మాం నాభిభాషతే |
నిష్ఠాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి ||

22

[* తావద్గచ్ఛామహే శీఘ్రం యావన్మాం నాభిభాషతే | *]
జితవంతం కృతార్థం చ ద్రష్టాహమచిరాదిమమ్ |
కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యైః సుదుష్కరమ్ ||

23

నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి |
ఇతి వజ్రీ తమామంత్ర్య మానయిత్వా చ తాపసమ్ ||

24

రథేన హరియుక్తేన యయౌ దివమరిందమః |
ప్రయాతే తు సహస్రాక్షే రాఘవః సపరిచ్ఛదమ్ ||

25

అగ్నిహోత్రముపాసీనం శరభంగముపాగమత్ |
తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః ||

26

నిషేదుః సమనుజ్ఞాతా లబ్ధవాసా నిమంత్రితాః |
తతః శక్రోపయానం తు పర్యపృచ్ఛత్స రాఘవః ||

27

శరభంగశ్చ తత్సర్వం రాఘవాయ న్యవేదయత్ |
మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి ||

28

జితముగ్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః |
అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమదూరతః ||

29

బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాతిథిమ్ |
త్వయాఽహం పురుషవ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా ||

30

సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితమ్ |
అక్షయా నరశార్దూల మయా లోకా జితాః శుభాః ||

31

బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ |
ఏవముక్తో నరవ్యాఘ్రః సర్వశాస్త్రవిశారదః ||

32

ఋషిణా శరభంగేణ రాఘవో వాక్యమబ్రవీత్ |
అహమేవాహరిష్యామి సర్వలోకాన్మహామునే ||

33

ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే |
రాఘవేణైవముక్తస్తు శక్రతుల్యబలేన వై ||

34

శరభంగో మహాప్రాజ్ఞః పునరేవాబ్రవీద్వచః |
ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామ ధార్మికః ||

35

వసత్యరణ్యే ధర్మాత్మా స తే శ్రేయో విధాస్యతి |
సుతీక్ష్ణమభిగచ్ఛ త్వం శుచౌ దేశే తపస్వినమ్ ||

36

రమణీయే వనోద్దేశే స తే వాసం విధాస్యతి |
ఇమాం మందాకినీం రామ ప్రతిస్రోతామనువ్రజ ||

37

నదీం పుష్పోడుపవహాం తత్ర తత్ర గమిష్యసి |
ఏష పంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్య తాత మామ్ ||

38

యావజ్జహామి గాత్రాణి జీర్ణాం త్వచమివోరగః |
తతోఽగ్నిం సుసమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ ||

39

శరభంగో మహాతేజాః ప్రవివేశ హుతాశనమ్ |
తస్య రోమాణి కేశాంశ్చ దదాహాగ్నిర్మహాత్మనః ||

40

జీర్ణాం త్వచం తథాస్థీని యచ్చ మాంసం సశోణితమ్ |
రామస్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహాత్మవాన్ ||

41

స చ పావకసంకాశః కుమారః సమపద్యత |
ఉత్థాయాగ్నిచయాత్తస్మాచ్ఛరభంగో వ్యరోచత ||

42

స లోకానాహితాగ్నీనామృషీణాం చ మహాత్మనామ్ |
దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత ||

43

స పుణ్యకర్మా భవనే ద్విజర్షభః
పితామహం సానుచరం దదర్శ హ |
పితామహశ్చాపి సమీక్ష్య తం ద్విజం
ననంద సుస్వాగతమిత్యువాచ హ ||

44

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమః సర్గః ||

Aranya Kanda Sarga 5 Meaning In Telugu

విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము.” అని అన్నాడు.

లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు.

తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. “రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవ కార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరుమాత్రము రామునికి అన్నివిధాలా సాయం చెయ్యండి.” అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకొని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆమహామునికి పాదాభివందనము చేసారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు.

రాముడు శరభంగ మహర్షిని చూచి “ఓ మహర్షీ!
దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను.” అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు.

“రామా! నేను ఎంతో తపస్సు చేసాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని, నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా! నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మ లోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు.” అని అన్నాడు.

దానికి రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షి! పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించు కోవాలేగానీ, ఒకరు ఇస్తే స్వీకరించ కూడదు.కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి.” అని అడిగాడు.

ఆ మాటలకు శరభంగ మహాముని ఇలాఅన్నాడు. “ఓ రామా! ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించ గలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహము నకు ఎదురు వెళితే, (అంటే ఎగువభాగంలో అని అర్థం) సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది.

రామా! నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూఉండు.” అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేసాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగమహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షష్ఠః సర్గః (6) >>

Leave a Comment