Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

31. అసావేరి రూపకతాళం

పల్లవి : ఆవుమీ హమర బాద్దిటికి చల్ మీ
గోల్కొండకు చల్ మీ అరే లేపు మీ
అంటే యేమోయోచించేవు మీ అరే అరే ఉటో ఉటోచల్

|| ఆవుమీ||

తివాసిదిండటిక్కా నేడుదిగూ నవాబు హుకుమిదిచూడు.
జవాబు మాతోసరిగా నేడు చెప్పి నీవు మానము కాపాడు

|| ఆవుమీ||

అవురంగ బాదుతఖత్తులోన అనేక తహసీల్దార్లున్నారు
వారిపై నున్న ఏమో నీపై బాకీశానా

|| ఆవుమీ||

నిముషమైనా నిలువనీయము నిలువలన్ని ఝటా పైకము
చేకొనుము వేగమే యిపుడు చేర్చందు చేసుకొందుముచూడు

||ఆవుమీ||

ఆవు లే కానీ యీ సీమకధికారైన వేరువాము
మీదొక భద్రాద్రి శ్రీరామదాసుడని తాళలేముసుమ్మి

|| ఆవుమీ||

32. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఆనందమానందమాయెను శ్రీజానకిరామస్మరణచేయును
నేడార్యుల కృప మాకుగల్గెను ఇప్పుడిరువ దేడింటనున్న రాజును జూడగానే

||ఆనంద॥

పరమభక్తి శ్రద్ధగల్గెను బహుదురితజాలములెల్ల దొలగెను
పలురాగద్వేషమువల్ల వీడెఅట్టె రాజయోగమందున్న పరమాత్మ జూడగనే

||ఆనంద॥

పూర్వపుణ్యములొనగూడెను శ్రీపార్వతి జపమంత్రమీడేరెను
పూర్వకృతంబు కనబడేను పరమపావనమైన శ్రీహరి సేవ గల్గెనేడు

||ఆనంద॥

సామాన్యులచెంత చేరము వట్టిపామర జనులనింక గూడము
విషయ కామములజేరి వేడము
మాకు హరినామస్మరణజేయు పరమభాగవతులు దిక్కు

॥ఆనంద॥

రామభక్తుల జేరగల్గెను ఇతర కామముల్లను వీడగల్గెను
పరభామలపైన భ్రాంతి దొలగెను మేము నరులదోషము లెన్న మొరులకు నెదురాడము

॥ఆనంద॥

ఇతర చింతలు చేయమువేరే ఇతరదైవమును గొలిచియాడము
ధరాపతులకు మ్రొక్కింతలు చేయము ఇనకులచంద్రుడైన
భద్రాద్రిస్వామి మాదుదైవము పేరు
క్షుద్రదేవతలను దలపము దారిద్ర్యములనెల్లమది నెంచము
భద్రగిరి రామదాసు నేలిన పరమదయాళుడు గల్గె

॥ఆనంద॥

33. కాంభోజి చాపుతాళం

పల్లవి :ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
నాపామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్ర

॥ఆన॥

తామసింపక యిత్తరి నన్ను కృపజూడు రామచంద్ర
తడియక మీ తల్లి దండ్రియాన తీరు రామచంద్ర

॥ఆన॥

సేవకునిగా జేసి చేయిబట్టి రక్షింపు రామచంద్ర
చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్ర

॥ఆన॥

కోరిక దయచేసి కొదవలు దీర్చుమో రామచంద్ర
కొమరొప్ప మీ కులగురువాయుదీరు రామచంద్ర

॥ఆన॥

నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్ర
వినయమిగా సౌమిత్రి యానతీరు రామచంద్ర

॥ఆన॥

వేడుకమీరగ వేగరక్షింపుమి రామచంద్ర
జోడుగ భరత శత్రుఘ్ను లానతీరు రామచంద్ర

॥ఆన॥

జంటగ మీ వెంట బంటుగ నేలుము రామచంద్ర
తంటలేని మీయింటి యానతీరు రామచంద్ర

॥ఆన॥

ఆదరింపుము నన్ను అడియేన్ దాసుడ రామచంద్ర
వాడేల రామదాసుని బ్రోవుమిక రామచంద్ర

॥ఆన॥

34. ఆనందభైరవి ఏకతాళం

పల్లవి : ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
రఘురాములతో నే పుట్టనైతి
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని
దశరథనందుడై దాశరథి రాముల వశముగ బాలురతో
వరదుడై యాడగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ

॥ఆశ॥

సకల సేవలుసల్పుచుమురియును అకటనలుగురితోనాడుకొనుదుగద
అయోధ్యాపురిలో గజమునెక్కి అత్యుతుండు రాగాను నాట్యమాడుచు
నన్ను రక్షింపుమంచును విశ్వామిత్రుని వెంటపోగా నేనునుపోదును జనకుడు హరికి

॥ఆశ॥

జానకిని పెండ్లాడగ వారిద్దరికి నే శేషబియ్యము నిత్తును
అమ్మవారికి ఆకులమడచి యిత్తును నరులార యితడే నారాయణుడని చాటుదును

॥ఆశ॥

మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద

॥ఆశ॥

నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును

॥ఆశ॥

ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద

॥ఆశ॥

మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి

॥ఆశ॥

పంపాతీరమున పరిమార్చి కబంథుని
ఇంపుగ శబరివిందులు యిష్టములోజేసి
ఇంద్రసూనుని హతముగావించి ఆంజనేయాంగదముఖ్యాదులు
మంజులవాణిని మరువక వెతకగ వారలతోగూడి వెడుదుగద
వైదేహిని ప్రేమతో సహాయముగా రమ్ము
సముద్రము నే చౌకళించి వేగ దుముకుదును
లంకను గాలించి పంకజాక్షిని నే సేవింతును
సంపాతి పోకముందు

॥ఆశ॥

అంగుళీయకమిచ్చి అమ్మా హరి యిచ్చెనందును
ఆవృత్తాంతము హరికినే విన్న వింతును
జానకిరామ జాగేల రమ్మందును అపరాధిని నేనని వారికి వాహనము
ఆంజనేయుడు ఆ లక్ష్మణునకు అంగదడా
ప్రభు రాములనే ప్రార్థించెదను గద సేనలగూడుక చెండాడు

॥ఆశ॥

కపులచే వారధి గట్టింతుగద సముద్రుడా యిది సమయమందు
గద హరిసేనతో పనులాచరింతుగద వలీముఖులకుగల బలము
జూతుగద శుభరామునితో సొంపు నొందుగద

॥ఆశ॥

లక్ష్మణాగ్రజుడు సేననురావించి లక్ష్మికొరకు కపి లంక జుటంగ
రక్షించు భద్రాద్రివాసుడనై రణములో రావణుని ద్రుంతును
మాధవుకర్పించి మురియుదును అమ్మకు మారుగ అగ్నిలో జొత్తును

॥ఆశ॥

పుష్పకమెక్కి హరితో నయోధ్యకు బోదును
భరతుడానంద భరితుడై వేడుకొనగ
జోరున వాద్యములు భువనములు నిండి మ్రోయగ
పట్టాభిషేకము పరమఋషులు సేవింపగ
జలజాక్షులు జయములు పాడంగ రాములతొడపై లక్ష్మియుండగ
లక్ష్మణానుజులు వింజామర విసరగా వాయుసుతుడు పద వనజము లొత్తగా
జేరి విభీషణ మహాత్మయనగా అర్థికపులు హరిగోవిందయనగ
బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా తల్లిమారుతికి దండవేయగా
నా తల్లియపుడు నాకును వేయునుగద కష్టపడితినని కరుణించుగద
సీతారాములు సిరులిత్తురుగద

॥ఆశ॥

35. వరాళి రూపకతాళం

పల్లవి :ఇదిగో రండి పైకము చూడండి
దినిటీ వేయించండి తివాసులు పరిపించండి.
రవాణ ధనములు కన్నుల జూచి
రశీదు మాకు వ్రాసియివ్వండి
పండ్రేండ్లాయెమీరు బందిఖానాలోన నుంచీ
పాపమనక రామదాసుని బాధించుచున్నావు చాలు

||ఇదిగో||

పారనలేని దొరతనమట పాలించుచుండి
మీరేప్పుడూ చెల్లి చెలకలున్నను ప్రొద్దున చెల్లగట్టి పోయెదముగాని

||ఇదిగో||

రామదాసుని తల్లిదండ్రులు రయమున తనయునిగనుగొని
క్షేమమరసిపోవగ వచ్చితి మీక్షణమాలస్యము చేయుటతగదిక

||ఇదిగో||

36. కల్యాణి చాపుతాళం

పల్లవి : ఇన్ని గల్గి మీరూరకున్న నేనెవరినాడ నౌదు
కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు
అక్షయ మియ్యదలచిన శ్రీ మహలక్ష్మీదేవి లేదా
రక్షింప దయగలిగిన భూదేవియు రత్నగర్భగాదా

||ఇన్ని||

పక్షపాతమొదలి పని చేతిలో పరుసవేది లేదా
ఈ తక్షణమున దయగలిగిన సంచిత ధనమున్నదిగాదా

||ఇన్ని||

ననుగని నిర్హేతుక కృపజూచిన కల్పతరువు లేదా
మనవాడని నెనరుంచిన చింతామణి యున్నది గాదా

||ఇన్ని||

పెనబడు వెతదీర్పును శరణాగతి బిరుదు నీదేగదా
వనజ భవాండము లేలు దొరలు దేవరవారలెగదా

||ఇన్ని||

కరిప్రహ్లాద విభీషణాదులను కాచితివని వింటి
హరసుర బ్రహ్మాదుల కంటెను నిను నధికుడవనియంటి

||ఇన్ని||

రామసిరిదాయక నీ మరుగుజొచ్చితిని చేపట్టు మటంటి
కరుణతో భద్రాచల రామదాసుని గావుము యనియంటి

||ఇన్ని||

37. వరాళి రూపకతాళం

పల్లవి : ఎంతో మహానుభావుడవు నీవు
ఎంతో చక్కని దేవుడవు
వింతను చేసితి నీ లోకమందున
సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర

||ఎంతో||

తొలివేల్పు జాంబవంతుని చేసినావు
మలివేల్పు పవనజుగా జేసినావు
వెలయ సూర్యు సుగ్రీవుగ జేసినావు
ఇల సర్వామరుల కోతుల జేసినావు

||ఎంతో||

కారణ శ్రీ సీతగ జేసినావు
గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు
ఆరెంటిని భరతశత్రుఘ్నుల జేసినావు
నారాయణ నీవు నరుడవైనావు

||ఎంతో||

రాతికి ప్రాణము రప్పించినావు
నాతి ఎంగిలి కానందించినావు
కోతి మూకలనెల్ల గొలిపించినావు
నీటిపై కొండలు నిల్పించినావు

||ఎంతో||

లంకపై దండెత్తి లగ్గెక్కినావు
రావణకుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షిని సీత పాలించినావు
లంకేశు దివ్యపుష్క మెక్కినావు

||ఎంతో||

పరగ నమోధ్యకు బరతెంచినావు
పట్టాభిషిక్తుడవై పాలించినావు
వర భద్రగిరి యందు వసియించినావు
ధరను రామదాసు దయ నేలినావు

||ఎంతో||

38. ఆనందభైరవి చాపుతాళం

పల్లవి :ఎటుబోతివో రామ ఎటుబోతివో
ఎటుబోతివో నిన్ను నే వేడు కొనుచుంటి
గటకటా నేడు నా కనుల జూతామంటే

||ఎటు||

అంధకారమువంటి బంధిఖానాలో
నన్ను నిందల నెడబాపనేల నీకు మ్రొక్కెదస్వామీ

||ఎటు||

పాపము లన్ని యెడబాపెడి దొరవు నీవు
ఆపదలుదీర్చి నన్నాదుకొమ్మంటీ స్వామీ

||ఎటు||

తాసీషాగారు వచ్చి సరితీర్పు చేరుదును
పైకము బంపించి వేగ బంధిఖానా వదిలింప

||ఎటు||

అపరాధినని చాల మతిచేసి మొరలిడగ
వెనుకటి నేరము లెంచక వేగమె రావే

||ఎటు||

అప్పుల వారొచ్చి యరికట్టుచున్నారు
ఒప్పుకోబడునని చెప్పక దాగినావె

||ఎటు||

నీవు భద్రాచల నిలయుడవయ్య రామ
బ్రోవవయ్య రామదాసు నేయెడ స్వామీ

||ఎటు||

39. వరాళి చాపుతాళం

పల్లవి : ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదును ఓరామా
నన్నింత కన్నడ జేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా

॥ఎన్నెన్ని॥

మొదటి నిబంధనము సగమాయువు నిదురపాలై పోయెనుగా ఓ రామా
పదపడి తక్కిన సగములో పదియేండ్లు బాలత్వమున బోయెనుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వదలక యౌవనము పరాభావమువలన దగులనాయెనా ఓ రామా
రాముడిమి సంసారకూపములో జిక్కి మునిగి తేలగనాయేనా ఓ రామా

॥ఎన్నెన్ని॥

తను వస్థిరంబని తారకనామము తలపోయలేనైతిగా ఓ రామా
దినదినము పొట్టకొరకై దీనులవేన దీనత్వమొందితిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

అనుదినమును గురువుపదేశయోగము నభ్యసించనైతిగా
ఎనసి నిమిషమైన మీ పాదములపైన మనసు నిల్పగనైతిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వాసిగ నిహములో బడిన పాటునెల్ల బాసిన పాశముగా ఓ రామా
మీ సేవజేయు మిమ్మే నమ్మిన భవపాపములంటవుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

లేశమైన కృతజేసి భద్రశైలవాస కావగా రావుగా ఓ రామా
ఆశతోనే రామదాసుడని మీకు దోసిలి యొగ్గితిరా ఓ రామా

॥ఎన్నెన్ని॥

40. బిలహరి ఆదితాళం

పల్లవి : ఎవరు దూషించిన నేమి మరి ఎవరు భూషించిన నేమి
అపగుణము మాన్పి యార్చే రా తీర్చే రా
నవనీతచోరుడు నారాయణుడుండగ

॥ఎవరు॥

పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిన నేమి
కొమ్మరో రమ్మని కోరికలొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుడుండగ

॥ఎవరు॥

వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల
భాషించువారితో పలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడు

॥ఎవరు॥

అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై యున్నారు.
విపరీత చరితలు వినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టి యుండగ

॥ఎవరు॥

వారి వన్నెలు సల్పనేల మూడు వాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదాసుడై యుండగ

॥ఎవరు॥

మరిన్ని కీర్తనలు:

 1. కన్నడ ఆదితాళం
 2. సావేరి చాపుతాళం
 3. మోహన ఆదితాళం
 4. ఆనందభైరవి రూపకతాళం
 5. కళ్యాణి ఆదితాళం
 6. నాదనామక్రియ రూపకతాళం
 7. మాయామాళవగౌళ ఏకతాళం
 8. నాదనామక్రియ ఆదితాళం
 9. కాంభోజి ఆదితాళం
 10. మధ్యమావతి చాపుతాళం
 11. మోహన ఆదితాళం

Leave a Comment