Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

51. సావేరి చాపుతాళం

పల్లవి : కలయే గోపాలం కస్తూరి తిలక సుఫాలం
కుండల రుచిరం లలితకపోలం
చంద్రసన్నిభ కాంతి కాంతం
జగన్నాధపురీ నిశాంతం
అనుపమ రూపం మహితమణి కనిక కలాపం
విగతగోప వినుతాడు తాపం.
ముని మనోనీరేజ తరణీం
పంకజ సన్నిభ చారుచరణం
విదిత ద్విజకాంత కరాంభోజ నవనీతం
కమల భవముని గీతం
వివిధ కుసుమాలంకారం
విమల బృందావన విహారం

॥కలయే॥

భాసిత భాసురం భద్రాద్రినివాస నిధానం
దివ్యానంత భూసురగానం
రాజకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం

॥కలయే॥

52. మోహన ఆదితాళం

పల్లవి : కలికి యీ కల సాంగముగ వినవే
ఓ కలికి పలుకగ నీతో మైపులకలొద వేడిని
అప్పుకలుగువాడె యువతి రామదాసుడు
అప్పుడతనికై నేడు
ఇద్దరు గూడి జోడుకప్పము పుచ్చికొనెడి
చెప్పున మము బంపుడు
తప్పక యెసగుడు తడవులేక రసీదనుడు

॥కలికి॥

రామలక్ష్మణులట వా రర్క వంశజులట
రామదాసు పైకమట రసీదు బంపెనట
రాములవారు చెల్లించిరట రసీదందిపోయిందట
ఏమి కారణము యెరుగను ఈ కలను
యేమని చెప్పుదునే నెలనాగ యీ వింత
ఈ మహిమలు ఆ రాములది కాబోలు
జాము ప్రొద్దున్నది జయ మపజయమే యెరుగ

॥కలికి॥

53. ఆనందభైరవి రూపకతాళం

కలియుగ వైకుంఠము భద్రాచలనిలయము సేవింతము
అలివేణులారా మీరానందముగ వేగ విలిసితమైనట్టి వేడుక చూడరె

|| కలియుగ||

కాంచనసౌధములు కంబమును మించిన దూలములు
వజ్రములు చెక్కించిన స్తంభములు
పగడములని భ్రమించు ద్వారములు
అందయాన మరి యెంచలేనుగాదె
మంచి పచ్చలు గూర్చిన వాకిళ్ళు

|| కలియుగ||

బంగారు గోపురములు దేవళముల వెలుంగు మాణిక్యములు
భేరీమృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు
సొంపైన కల్యాణరత్న మంటపములు
శృంగారమేమని దెలియ విన్నవింతు

|| కలియుగ||

తీరైన పురవీధులు సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్ష వినవే సరిలేని గోదావరి స్నానములు
సంపత్కరమై యొప్పినది

॥కలియుగ॥

చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులు గ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు

॥కలియుగ॥

వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని మేలు
స్వామి శ్రీ కోదండరాము నివాసము

॥కలియుగ॥

54. కళ్యాణి ఆదితాళం

పల్లవి : కైంకర్యము చేసెను రామదాసు కైంకర్యము చేసెను
కైంకర్యముచేసె కాకుత్థ్స తిలకునకు
సంకటహరణ సర్వాత్మయని మ్రొక్కి

||కైంకర్యము॥

శ్రీ కరమగు రాజిత మణిశాలల
ప్రాకారంబుల బహుమఠమెల్లెడ
మంజుల తరమగు మణి మంటపములు
రంజరాగమణి కలితాంగంబుల

||కైంకర్యము॥

చౌకంగ కాంచన కూటంబుల
నాకాశంబున కంటెడు తేరుల
గోపుర మెరసెడి నోపురవితతుల
దీవించు వితర్థిశల బెడంగుల

||కైంకర్యము॥

తళుకుగులుకు పగడంపు కంబముల
బలుపడంబులును బలు కలువడముల
రంగుగ ముత్యపు రంగవల్లికల
శృంగారములగు చిరతపాలికల

॥కైంకర్యము॥

మకరతోరణ మణి మాల్యంబుల
ముకురతోరణ సమ్మోదంబుల
భుగభుగ వెలసెడు పూ చప్పరముల
అగరు ధూపముల నాలపట్టములు

||కైంకర్యము॥

మెరసెడు రీతిని మేలిమిగాగను
ధారాళములగు ద్వారబంధముల
చారురత్న కాంచన శిఖరంబులకు
ఘుమఘుమమనియెడు గంధవాసనల

||కైంకర్యము॥

ఘుమఘుము యను బలు కుంకుమరసముల
ఘణఘణఘణ యను గంటలు తలుపుల
ధణధణ యనెడి మృదంగ వాద్యముల
మిసమిస మెరిసెడి మేనిమిగోడల

||కైంకర్యము॥

కనకమయంబగు గరుడ ధ్వజముల
రామరామయను రామ శుకంబుల
వేమరు పొగడెడు విబుధ గణంబుల
పొసగ మ్రోయు తంబురుల పరంబుల

||కైంకర్యము॥

కొసరి యాడు భక్తుల నృత్యంబుల
వైనతేయముఖ వాహన చయముల
పూనమర్దల భూరి నినాదము
మెరసెడిరీతిని మేలిమిగాగను

||కైంకర్యము॥

వెల్లగొడుగులను వింజామరములు
మల్లెల మొల్లల మంచివాసనల
పిల్లనగ్రోవి గంభీర స్వరముల
ఝల్లరి ఢక్కా జయనాదమ్ముల

||కైంకర్యము॥

పల్లవపాణులు పాటలాటల
సల్లలితోత్పలచయ పరిమళముల
వనమాలా సంత సౌరభముల
ఘన తులసీదళ ఘన కదంబముల

॥కైంకర్యము॥

రామభజన సంభారోత్కరముల
రామతీర్థ సారసముల తావుల
రామస్మరణావ మధురమ్ముల
రామభద్ర విగ్రహదర్శనముల
హనుమదంగ వాహనముల ఘనముల

॥కైంకర్యము॥

అనుపమ శృంగారానందముల
రమణ భద్రగిరి రామాలయములు
అమలానందంబై ధరలోపల
మెరసెడిరీతిని మేలిమి గాగను

॥కైంకర్యము॥

55. నాదనామక్రియ రూపకతాళం

పల్లవి : ధన్యుడవు తానీషా నీవు
నన్ను గన్నయ్య పదములు కలగన్నావు

॥ధన్యుడవు॥

నిన్నటిరాతిరి వారు వచ్చియున్న ముచ్చటలాడి యేమేమి యున్నారు
ఎంతవేడినగాని రారు నీవు పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు
తానీషా : ధన్యుడవు గోపన్న నీవు యా దాశరథికి నిజదాసుడైనావు
సామాన్యుడని యెంచుకొంటి శ్రీరామచంద్రుల సేవ మీవలన గంటి
ప్రేమతో సేవించుకొంటి నేను పామరుడనై మిమ్ము బాధింపుచుంటి

॥ ధన్యుడవు ॥

గోపన్న : ఏమి పూజలు చేసినారు మా స్వామి భద్రగిరి దాసులు మీరు
ప్రేమతో సేవించినారు శ్రీరామ కృపగల్గి రంజిల్లుతారు
తానీషా : పైకము దీసుకుపొండి భద్రాచల రామదాసులై పట్టమేలండి
అయినదెల్ల వేడుకొనండి మీరు అనుదినము రాముల నర్చించండి

॥ధన్యుడవు||

గోపన్న : ఏటిమాటలు పలికెదరు నా కేటికి రాజ్యమీ యిలలోనే మీరు
మేటి జన్మమెత్తినారు మీ సాటివారలు యీ జగములోలేరు

||ధన్యుడవు ||

తానీషా : భద్రాచలము నెప్పటికి మీ రామభద్రున కిచ్చితి బాగుగా వినుమా
ముద్ర నిశానీల్ కొనుమా శ్రీ భద్రాద్రివర రామదాసుడై యేలుమి

॥ధన్యుడవు||

56. మాయామాళవగౌళ ఏకతాళం

పల్లవి : నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవా బృందాలోలం

|| నంద ||

జలజ సంభవాది వినుత చరణారవిందం
లలితమోహన రాధావదన నళిన మిళిందం

|| నంద ||

నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
ఘటిత శోభిత గోపికా ధర మకరందం

॥నంద॥

గోదావరీ తీర రాజగోపికా రామం కృష్ణం
ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం

|| నంద ||

57. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కయినా
వెయ్యారులు దాచుకొనియు నర్థులకియ్యని లోభుల కయ్యయ్యో

||పొయ్యే||

చరణములు :
ఇచ్చిన మాత్రం బిచ్చును దైవము హెచ్చడిగినరాదు
వచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు

||పొయ్యే||

హెచ్చుగతిది తెలియని పామరులు దురాశను తగులుకొని
ఇచ్చుటనార్జించిన ధనమెచ్చటకెత్తుకు పొయ్యే దరయ్యయ్యో

||పొయ్యే||

తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరు
తనువును సుతబాంధవు లస్థిరమని తలచి గానగలేరు

||పొయ్యే||

58. కాంభోజి ఆదితాళం

పల్లవి : బహుకాలమునకు శ్రీ భద్రాచలశేషునకు పాదసేవకుడనైతి
అహహా నాజన్మము సఫలమాయె నేటికిని అనుమానములు దీరె నిక సుంతగను

||బహు||

తల్లి గర్భమునందు మలమూత్రముల మునిగి ధరణిపై జన్మించితి
కల్లలాడుచు పాపకర్మలొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి

||బహు||

కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడను
దాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమా యికను

||బహు||

అఖిల లోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముడు
సక్రియతో గూడిన సమయమందుజేరి సన్నుతులు చేయకలిగి తొలుత

||బహు||

రామదాసుని నేలుకొరకై శ్రీభధ్రాద్రిధాములై యుదయించి
యేమికొదవలు మనకు నెరుగగలుగజేసే స్నేహంబునితరమెల్లకల్ల

||బహు||

59. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : బిడియ మేలనిక మోక్షమిచ్చి నీవడుదుదాటిపోరా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా

॥ బిడియ॥

మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
నీ అరుదుమీరలని నెగురవేయ నే హనుమంతుడనుగాను
సరగున మ్రుచ్చుల మాటలు విన నే జాంబవంతుడను గాను
బిరబిర మీవల లోపల బడ నే విభీషణుడనుగాను

||బిడియ॥

మాయచేత వంచింపబడగనే మహేశుడనుగాను
న్యాయములేకయే యిటునటు దిరుగను నారదుండగాను
ఆయముచెడి హరినరుడని కొలువను నర్జునుండగాను
దాయాదుండని మదిలో మురియను దశరథుడనుగాను

||బిడియ||

గరిమతోడ మా సీతనుజూడ కాచితినిందాక
పరగభద్రుని శిఖరావాసా పరబలసంహార
నరహరి నను రక్షింపువేగమే నారాయణరూపా
మంచి నిదురలోనైనను మీపద సరసిజములు మరువ

||బిడియ||

60. మోహన ఆదితాళం

పల్లవి : భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము
అద్రిజాధిప బ్రహ్మేంద్రాదులకెల్ల భద్రములొసగెడు భవ్యవిధానము

॥భద్రాద్రి॥

ఇనవంశజులు మేమిద్దరము చాలదినమునుండి యున్నారము
అనిశము రామదాసుని యాజ్ఞ చొప్పున పనులు చేయుచు

॥భద్రాద్రి॥

ఖైదు చేసిన వార్తదెలిసి యిల్లు బయలుదేరి మిమ్ములకలసి
పైకము చెల్లించి భక్తుని యాపదబాపి గొంపోయెడి పనికై వచ్చితిమి

॥భద్రాద్రి॥

భక్తుడైన రామదాసు యెంతో శక్తిచేసిరి మంచి మేలని
ముక్తిని ధానమౌ యుక్తి తెలియక యాశక్తి ధనాపేక్షకై యిటు చేసిరి

||భద్రాద్రి॥

మించిన కార్యమేమాయె యెంతో వంచన చేయుటలాయె
సంచులన్నీ మీరె యెంచి రసీదు వ్రాయించి సెలవిప్పించండి వేగమె

||భద్రాద్రి॥

రామదాసుని రప్పించు తండ్రి ప్రేమతో మాకప్పగించు
స్వామి యా భద్రాద్రి సదయుని కనుగొన రామదాసునిగూడి రయమున బోవలె

||భద్రాద్రి॥

మరిన్ని కీర్తనలు:

Leave a Comment