Ayodhya Kanda Sarga 85 In Telugu – అయోధ్యాకాండ పంచాశీతితమః సర్గః

అయోధ్యాకాండ పంచాశీతితమః సర్గములో, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పంథానుగా దండకారణ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు అక్కడ నివసించే అరణ్యవాసులు వారి రాకకు సంతోషించి స్వాగతిస్తారు. అరణ్యవాసులపైన శ్రీరాముడు తన ధర్మం ప్రకారం రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తాడు. వీరు అక్కడ స్వచ్ఛందంగా నివసిస్తూ దండకారణ్య సుందర దృశ్యాలను ఆస్వాదిస్తారు. వారి సాంఘిక విధులు నిర్వర్తిస్తారు. ఈ సర్గలో వారి అరణ్యవాసం, అక్కడి ప్రకృతి సౌందర్యం, మరియు శ్రీరాముడు తన ధర్మాన్ని ఎలా పాటిస్తాడో విపులంగా వర్ణించబడింది.

గుహసమాగమః

ఏవముక్తస్తు భరతర్నిషాదాధిపతిం గుహమ్ |
ప్రత్యువాచ మహాప్రాజ్ఞో వాక్యం హేత్వర్థసంహితమ్ ||

1

ఊర్జితః ఖలు తే కామః కృతః మమ గురోస్సఖే |
యో మే త్వమీదృశీం సేనామేకోఽభ్యర్చితుమిచ్ఛసి ||

2

ఇత్యుక్త్వా తు మహాతేజాః గుహం వచనముత్తమమ్ |
అబ్రవీద్భరతః శ్రీమాన్ నిషాదాధిపతిం పునః ||

3

కతరేణ గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ |
గహనోఽయం భృశం దేశో గంగానూపో దురత్యయః ||

4

తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః |
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహో గహనగోచరః ||

5

దాశాస్త్వాఽనుగమిష్యంతి ధన్వినః సుసమాహితాః |
అహం త్వాఽనుగమిష్యామి రాజపుత్ర మహాయశః ||

6

కచ్ఛిన్న దుష్టః వ్రజసి రామస్యాక్లిష్టకర్మణః |
ఇయం తే మహతీ సేనా శంకాం జనయతీవ మే ||

7

తమేవమభిభాషంతమాకాశైవ నిర్మలః |
భరతః శ్లక్ష్ణయా వాచా గుహం వచనమబ్రవీత్ ||

8

మాభూత్స కాలో యత్కష్టం న మాం శంకితుమర్హసి |
రాఘవః స హి మే భ్రాతా జ్యేష్ఠః పితృసమో మతః ||

9

తం నివర్తయితుం యామి కాకుత్స్థం వనవాసినమ్ |
బుద్ధిరన్యా న తే కార్యా గుహ సత్యం బ్రవీమి తే ||

10

స తు సంహృష్టవదనః శ్రుత్వా భరతభాషితమ్ |
పునరేవాబ్రవీద్వాక్యం భరతం ప్రతి హర్షితః ||

11

ధన్యస్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీతలే |
అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిహేచ్ఛసి ||

12

శాశ్వతీ ఖలు తే కీర్తిః లోకాననుచరిష్యతి |
యస్త్వం కృచ్ఛ్రగతం రామం ప్రత్యానయితుమిచ్ఛసి ||

13

ఏవం సంభాషమాణస్య గుహస్య భరతం తదా |
బభౌ నష్టప్రభః సూర్యో రజనీ చాభ్యవర్తత ||

14

సన్నివేశ్య స తాం సేనాం గుహేన పరితోషితః |
శత్రుఘ్నేన సహ శ్రీమాన్ శయనం పునరాగమత్ ||

15

రామ చింతామయః శోకో భరతస్య మహాత్మనః |
ఉపస్థితః హ్యనర్హస్య ధర్మప్రేక్షస్య తాదృశః ||

16

అంతర్దాహేన దహనః సంతాపయతి రాఘవమ్ |
వన దాహాభిసంతప్తం గూఢోఽగ్నిరివ పాదపమ్ ||

17

ప్రసృతః సర్వగాత్రేభ్యః స్వేదం శోకాగ్నిసంభవమ్ |
యథా సూర్యాంశుసంతప్తః హిమవాన్ ప్రసృతః హిమమ్ ||

18

ధ్యాననిర్దరశైలేన వినిశ్శ్వసితధాతునా |
దైన్యపాదపసంఘేన శోకాయాసాధిశృంగిణా ||

19

ప్రమోహానంత సత్త్వేన సంతాపౌషధివేణునా |
ఆక్రాంతర్దుఃఖ శైలేన మహతా కైకయీసుతః ||

20

వినిశ్శ్వసన్వై భృశదుర్మనాస్తతః
ప్రమూఢసంజ్ఞః పరమాపదం గతః |
శమం న లేభే హృదయజ్వరార్దితః
నరర్షభోఽయూథగతో యథర్షభః ||

21

గుహేన సార్ధం భరతః సమాగతః
మహానుభావః సజనః సమాహితః |
సుదుర్మనాస్తం భరతం తదా పునః
గుహః సమాశ్వాసయదగ్రజం ప్రతి ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 85 Meaning In Telugu

గుహుని మాటలను విన్న భరతుడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసినది. మేము అశేష సేనావాహినితో వచ్చాము. మా అందరికీ ఆతిథ్యము ఇవ్వవలెనని నీ కోరిక బహు ప్రశంసనీయము. ఈ ప్రాంతమంతయు చాలా దుర్గమంగా ఉంది. మేము భరద్వాజుని ఆశ్రమమునకు పోవలెను. దానికి మంచి మార్గము చూపగలవా!” అని అడిగాడు.

ఆమాటలు విన్న గుహుడు “మహారాజా! మీము నీకు దాసులము. నేను, మా వాళ్లు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు. కాని ఒక్క సందేహము. తమరు రాముని వద్దకు వెళ్లుచున్నట్టు కనపడుతూ ఉంది. మీరు రామునికి అపకారము చేయడానికి వెళుతున్నారా అని సందేహముగా ఉన్నది. నా సందేహ మును తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను.” అని వినయంగా అసలు విషయం బయట పెట్టాడు గుహుడు.
“నీవు రామునికి మిత్రుడవు కాబట్టి నాకూ మిత్రుడవే. ఓ మిత్రమా! రాముడు నాకు అన్న. నా తండ్రితో సమానుడు. ఆయనకు అపకారము తలపెట్టే దుర్బుద్ధి నాకు కలలో కూడా కలగకుండు గాక! నేను నిజం చెబుతున్నాను. నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుని చేయవలెనని అనుకుంటున్నాను. అంతే కానీ రామునికి అపకారము చేయుటకు కాదు” అని అన్నాడు గుహుడు.

ఆ మాటలకు గుహుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ మహారాజా! నీకు శ్రమ లేకుండా రాజ్యము లభించింది. కాని దానిని నీవు రాముని కొరకు త్యాగం చేస్తున్నావు. నీ వంటి త్యాగధనుడు లోకంలో పుట్టబోడు. అడవులలో కష్టములు పడుతున్న రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని వెళ్లవలెనని కోరుకుంటున్న నీ కీర్తి ముల్లోకము లలో వ్యాపిస్తుంది. నీకు జయమగు గాక!” అని గుహుడు భరతుని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇంతలో చీకటి పడింది. భరతుడు, శత్రుఘ్నుడు తమ తమ శయ్యలమీద పడుకున్నారు. భరతునికి నిద్రపట్టలేదు. రాముడు ఎక్కడ ఉన్నాడో ఎన్ని కష్టములు పడుతున్నాడో అని శోకిస్తున్నాడు.

భరతుని శోకము ఒక పర్వతము మాదిరి వ్యాపించింది. భరతుని ఆలోచనలు ఆ పర్వతశిలల మాదిరి ఉన్నాయి. భరతుని నిట్టూర్హులే ఆ పర్వతములో నిక్షిప్తమైన ధాతువులు మాదిరి ఉన్నాయి. భరతుని దైన్యమే ఆ పర్వతము మీది వృక్షములు మాదిరి కనపడుతున్నాయి. భరతుని శోకములో ముంచిన మోహము, ఆ పర్వతము మీది జంతువులు, భరతునికి కలిగిన మనస్తాపము ఆ పర్వత శిఖరములు. భరతునికి కలిగిన సంతాపము ఆ పర్వతము మీది ఓషధులు. ఆ ప్రకారంగా భరతుడు కొండంత దు:ఖమును మనసులో దాచుకొని బాధపడుతున్నాడు. ఆ రాత్రంతా మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రి గడిపాడు భరతుడు. ఇదంతా చూస్తున్నాడు గుహుడు. భరతుని తన మృదుమధురమైన మాటలతో ఓదార్చాడు గుహుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షడశీతితమః సర్గః (86) >>

Leave a Comment