మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃపంచాశః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతుకుతూ శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి ఒక దివ్య భక్తురాలిగా, రాముడిని కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. రాముడు ఆమె భక్తిని, విశ్వాసాన్ని ప్రశంసిస్తూ సత్సంగం చేస్తాడు.
లంకాప్రాపణమ్
హ్రియమాణా తు వైదేహీ కంచిన్నాథమపశ్యతీ |
దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానరపుంగవాన్ ||
1
తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనకప్రభమ్ |
ఉత్తరీయం వరారోహా శుభాన్యాభరణాని చ ||
2
ముమోచ యది రామాయ శంసేయురితి మైథిలీ |
వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణమ్ ||
3
సంభ్రమాత్తు దశగ్రీవస్తత్కర్మ న స బుద్ధవాన్ |
పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరనిమిషైరివ ||
4
విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః |
స చ పంపామతిక్రమ్య లంకామభిముఖః పురీమ్ ||
5
జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః |
తాం జహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మనః ||
6
ఉత్సంగేనేవ భుజగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషామ్ |
వనాని సరితః శైలాన్ సరాంసి చ విహాయసా ||
7
స క్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివ చ్యుతః |
తిమినక్రనికేతం తు వరుణాలయమక్షయమ్ ||
8
సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరమ్ |
సంభ్రమాత్పరివృత్తోర్మీ రుద్ధమీనమహోరగః ||
9
వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయః |
అంతరిక్షగతా వాచః ససృజుశ్చారణాస్తదా ||
10
ఏతదంతో దశగ్రీవ ఇతి సిద్ధాస్తదాఽబ్రువన్ |
స తు సీతాం వివేష్టంతీమంకేనాదాయ రావణః ||
11
ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః |
సోఽభిగమ్య పురీం లంకాం సువిభక్తమహాపథామ్ ||
12
సంరూఢకక్ష్యాబహులం స్వమంతఃపురమావిశత్ |
తత్ర తామసితాపాంగాం శోకమోహపరాయణామ్ ||
13
నిదధే రావణః సీతాం మయో మాయామివ స్త్రియమ్ |
అబ్రవీచ్చ దశగ్రీవః పిశాచీర్ఘోరదర్శనాః ||
14
యథా నేమాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యత్యసమ్మతః |
ముక్తామణిసువర్ణాని వస్త్రాణ్యాభరణాని చ ||
15
యద్యదిచ్ఛేత్తదేవాస్యా దేయం మచ్ఛందతో యథా |
యా చ వక్ష్యతి వైదేహీం వచనం కించిదప్రియమ్ ||
16
అజ్ఞానాద్యది వా జ్ఞానాన్న తస్యా జీవితం ప్రియమ్ |
తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్రః ప్రతాపవాన్ ||
17
నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్కిం కృత్యమితి చింతయన్ |
దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాశనాన్ ||
18
స తాన్ దృష్ట్వా మహావీర్యో వరదానేన మోహితః |
ఉవాచైతానిదం వాక్యం ప్రశస్య బలవీర్యతః ||
19
నానాప్రహరణాః క్షిప్రమితో గచ్ఛత సత్వరాః |
జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయమ్ ||
20
తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహతరాక్షసే |
పౌరుషం బలమాశ్రిత్య త్రాసముత్సృజ్య దూరతః ||
21
బలం హి సుమహద్యన్మే జనస్థానే నివేశితమ్ |
సదూషణఖరం యుద్ధే హతం రామేణ సాయకైః ||
22
తత్ర క్రోధో మమామర్షాద్ధైర్యస్యోపరి వర్తతే |
వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణమ్ ||
23
నిర్యాతయితుమిచ్ఛామి తచ్చ వైరమహం రిపోః |
న హి లప్స్యామ్యహం నిద్రామహత్వా సంయుగే రిపుమ్ ||
24
తం త్విదానీమహం హత్వా ఖరదూషణఘాతినమ్ |
రామం శర్మోపలప్స్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః ||
25
జనస్థానే వసద్భిస్తు భవద్భీ రామమాశ్రితా |
ప్రవృత్తిరుపనేతవ్యా కిం కరోతీతి తత్త్వతః ||
26
అప్రమాదాచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరైః |
కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి ||
27
యుష్మాకం చ బలజ్ఞోఽహం బహుశో రణమూర్ధని |
అతశ్చాస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః ||
28
తతః ప్రియం వాక్యముపేత్య రాక్షసా
మహార్థమష్టావభివాద్య రావణమ్ |
విహాయ లంకాం సహితాః ప్రతస్థిరే
యతో జనస్థానమలక్ష్యదర్శనాః ||
29
తతస్తు సీతాముపలభ్య రావణః
సుసంప్రహృష్టః పరిగృహ్య మైథిలీమ్ |
ప్రసజ్య రామేణ చ వైరముత్తమం
బభూవ మోహాన్ముదితః స రాక్షసః ||
30
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃపంచాశః సర్గః ||
Aranya Kanda Sarga 54 Meaning In Telugu PDF
రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత.
సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు.
తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు.
రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు.
నేరుగా తన అంతఃపురానికి వెళ్లాడు రావణుడు. సీతను తన అంతఃపురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు.
“ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కానీ, స్త్రీలుకానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇదినా ఆజ్ఞ” అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు.
తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే ఎనిమిది మంది రాక్షసులను పిలిచాడు.
“మీరు ఆయుధ ధారులై వెంటనే జనస్థానమునకు వెళ్లండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను, 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది.
ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ, ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్యసాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను.” అని పలికాడు.
రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ ఎనిమిది మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి, లంకను విడిచి జనస్థానము నకు బయలుదేరారు.
అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ ఎనిమిది మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55) >>