Ayodhya Kanda Sarga 89 In Telugu – అయోధ్యాకాండ ఏకోననవతితమః సర్గః

అయోధ్యాకాండలోని ఏకోననవతితమః సర్గ అంటే 89వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని అశ్రువులతో వేడుకుంటాడు, అతని తండ్రి మరణం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమని కోరతాడు. రాముడు తన వనవాస ప్రతిజ్ఞను విరమించలేదని భరతునికి చెప్తాడు. భరతుడు తన ప్రార్థనలు విఫలమయ్యాక, రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళతాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పాలించవలసిన బాధ్యతను స్వీకరిస్తాడు. భరతుడు రాముని సాక్షిగా కాబట్టి తాను పాలకుడు కాకుండా సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా భరతుడు రాముని ఆజ్ఞలను పాటిస్తూ ధర్మాన్ని కాపాడతాడు.

గంగాతరణమ్

పుష్య రాత్రిం తు తత్రైవ గంగాకూలే స రాఘవః |
భరతః కాల్యముత్థాయ శత్రుఘ్నమిదమబ్రవీత్ || ౧ ||

శత్రుఘ్నోత్తిష్ఠ కిం శేషే నిషాదాధిపతిం గుహమ్ |
శీఘ్రమానయ భద్రం తే తారయిష్యతి వాహినీమ్ || ౨ ||

జాగర్మి నాహం స్వపిమి తమేవార్యం విచింతయన్ |
ఇత్యేవమబ్రవీద్భ్రాత్రా శత్రుఘ్నోఽపి ప్రచోదితః || ౩ ||

ఇతి సంవదతోరేవమన్యోన్యం నరసింహయోః |
ఆగమ్య ప్రాంజలిః కాలే గుహో భరతమబ్రవీత్ || ౪ ||

కచ్చిత్సుఖం నదీతీరేఽవాత్సీః కాకుత్స్థ శర్వరీమ్ |
కచ్చిత్తే సహసైన్యస్య తావత్సర్వమనామయమ్ || ౫ ||

గుహస్య వచనం శ్రుత్వా తత్తు స్నేహాదుదీరితమ్ |
రామస్యానువశో వాక్యం భరతోఽపీదమబ్రవీత్ || ౬ ||

సుఖా నః శర్వరీ రాజన్ పూజితాశ్చాపి తే వయమ్ |
గంగాం తు నౌభిర్బహ్వీభిర్దాశాః సంతారయంతు నః || ౭ ||

తతో గుహః సంత్వరితం శ్రుత్వా భరతశాసనమ్ |
ప్రతిప్రవిశ్య నగరం తం జ్ఞాతిజనమబ్రవీత్ || ౮ ||

ఉత్తిష్ఠత ప్రబుధ్యధ్వం భద్రమస్తు చ వః సదా |
నావః సమనుకర్షధ్వం తారయిష్యామ వాహినీమ్ || ౯ ||

తే తథోక్తాః సముత్థాయ త్వరితా రాజశాసనాత్ |
పంచనావాం శతాన్యాశు సమానిన్యుః సమంతతః || ౧౦ ||

అన్యాః స్వస్తికవిజ్ఞేయాః మహాఘంటాధరా వరాః |
శోభమానాః పతాకాభిర్యుక్తవాతాః సుసంహతాః || ౧౧ ||

తతః స్వస్తికవిజ్ఞేయాం పాండుకంబలసంవృతామ్ |
సనందిఘోషాం కళ్యాణీం గుహో నావముపాహరత్ || ౧౨ ||

తామారురోహ భరతః శత్రుఘ్నశ్చ మహాబలః |
కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా రాజయోషితః || ౧౩ ||

పురోహితశ్చ తత్పూర్వం గురవో బ్రాహ్మణాశ్చ యే |
అనంతరం రాజదారాస్తథైవ శకటాపణాః || ౧౪ ||

ఆవాసమాదీపయతాం తీర్థం చాప్యవగాహతామ్ |
భాండాని చాదదానానాం ఘోషస్త్రిదివమస్పృశత్ || ౧౫ ||

పతాకిన్యస్తు తా నావః స్వయం దాశైరధిష్ఠితాః |
వహంత్యో జనమారూఢం తదా సంపేతురాశుగాః || ౧౬ ||

నారీణామభిపూర్ణాస్తు కాశ్చిత్ కాశ్చిచ్చ వాజినామ్ |
కాశ్చిదత్ర వహంతి స్మ యానయుగ్యం మహాధనమ్ || ౧౭ ||

తాః స్మ గత్వా పరం తీరమవరోప్య చ తం జనమ్ |
నివృత్తాః కాండచిత్రాణి క్రియంతే దాశబంధుభిః || ౧౮ ||

సవైజయంతాస్తు గజాః గజారోహప్రచోదితాః |
తరంతః స్మ ప్రకాశంతే సధ్వజా ఇవ పర్వతాః || ౧౯ ||

నావస్త్వారురుహుశ్చాన్యే ప్లవైస్తేరుస్తథాపరే |
అన్యే కుంభఘటైస్తేరురన్యే తేరుశ్చ బాహుభిః || ౨౦ ||

సా పుణ్యా ధ్వజినీ గంగా దాశైః సంతారితా స్వయమ్ |
మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమమ్ || ౨౧ ||

ఆశ్వాసయిత్వా చ చమూం మహాత్మా
నివేశయిత్వా చ యథోపజోషమ్ |
ద్రష్టుం భరద్వాజమృషిప్రవర్యమ్
ఋత్విగ్వృతః సన్భరతః ప్రతస్థే || ౨౨ ||

స బ్రాహ్మణస్యాఽశ్రమమభ్యుపేత్య
మహాత్మనో దేవపురోహితస్య |
దదర్శ రమ్యోటజవృక్షషండమ్
మహద్వనం విప్రవరస్య రమ్యమ్ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోననవతితమః సర్గః || ౮౯ ||

Ayodhya Kanda Sarga 89 Meaning In Telugu

భరతుని మాటలకు అక్కడున్నవారికి దు:ఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. “శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు.” అని అన్నాడు.

అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను.”అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు.

“రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు. “మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. “భరతుని ఆదేశము ప్రకారము మనమందరమూ భరతుని ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి.” అని ఆదేశించాడు.

గుహుని ఆదేశము ప్రకారము ఐదువందల పడవలను సిద్ధం చేసారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేసాడు గుహుడు. ముందుగా వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజ మాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారి వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూగంగానదిని క్షేమంగా దాటారు.

ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరి కొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు. అందరినీ అక్కడవిడిది చేయమని చెప్పి, భరతుడు వసిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకువెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ఎనుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ నవతితమః సర్గః (90) >>

Leave a Comment