అయోధ్యాకాండంలో షడశీతితమః సర్గ అంటే 86వ సర్గ. ఈ సర్గలో దశరథ మహారాజు శ్రీరాముని వలక పంపించడంపై దుఃఖంతో మరణిస్తాడు. ఆయన మరణం తరువాత, భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి తీవ్ర దుఃఖంలో ఉంటారు. భారతుడు, శత్రుఘ్నుడు తల్లిదండ్రుల మరణవార్త విని శోకసముద్రంలో మునిగిపోతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఇతర సకల గురువులు, మరియు మంత్రి వర్గం దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. దశరథుడి మరణం తర్వాత ప్రజలు విసిగిపోతారు. రాజ్యంలో ఈ విషాదం మహోన్నతమైన సంఘటనగా ప్రజలు బాధపడతారు. ఇది రామాయణం యొక్క ప్రధాన సంఘటనలలో ఒకటి.
గుహవాక్యమ్
ఆచచక్షేఽథ సద్భావం లక్ష్మణస్య మహాత్మనః |
భరతాయాప్రమేయాయ గుహో గహనగోచరః || ౧ ||
తం జాగ్రతం గుణైర్యుక్తం శరచాపాసిధారిణమ్ |
భ్రాతృగుప్త్యర్థమత్యంతమహం లక్ష్మణమబ్రవమ్ || ౨ ||
ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసి హి శేష్వాస్యాం సుఖం రాఘవనందన || ౩ ||
ఉచితోఽయం జనః సర్వో దుఃఖానాం త్వం సుఖోచితః |
ధర్మాత్మంస్తస్య గుప్త్యర్థం జాగరిష్యామహే వయమ్ || ౪ ||
న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
మోత్సుకోభూర్బ్రవీమ్యేతదప్యసత్యం తవాగ్రతః || ౫ ||
అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్ సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ || ౬ ||
సోఽహం ప్రియసఖం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వైః స్వైర్జ్ఞాతిభిః సహ || ౭ ||
న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం ప్రసహేమ వయం యుధి || ౮ ||
ఏవమస్మాభిరుక్తేన లక్ష్మణేన మహాత్మనా |
అనునీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా || ౯ ||
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా || ౧౦ ||
యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య గుహ సంవిష్టం తృణేషు సహ సీతయా || ౧౧ ||
మహతా తపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యైష పుత్రః సదృశలక్షణః || ౧౨ ||
అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి || ౧౩ ||
వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం నూనమద్య రాజనివేశనమ్ || ౧౪ || [విరతో]
కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవేయుః సర్వే తే శర్వరీమిమామ్ || ౧౫ ||
జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
దుఃఖితా యా తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి || ౧౬ ||
అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి || ౧౭ ||
సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలే హ్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ || ౧౮ ||
రమ్యచత్వరసంస్థానాం సువిభక్త మహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం సర్వరత్నవిభూషితామ్ || ౧౯ ||
గజాశ్వరథసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకల్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాకులామ్ || ౨౦ ||
ఆరామోద్యానసంపూర్ణాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ || ౨౧ ||
అపి సత్యప్రతిజ్నేన సార్ధం కుశలినా వయమ్ |
నివృత్తే సమయే హ్యస్మిన్ సుఖితాః ప్రవిశేమహి || ౨౨ ||
పరిదేవయమానస్య తస్యైవం సుమహాత్మనః |
తిష్ఠతో రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత || ౨౩ ||
ప్రభాతే విమలే సూర్యే కారయిత్వా జటావుభౌ |
అస్మిన్ భాగీరథీతీరే సుఖం సంతారితౌ మయా || ౨౪ ||
జటా ధరౌ తౌ ద్రుమచీరవాససౌ
మహాబలౌ కుంజర యూథపోపమౌ |
వరేషుచాపాసిధరౌ పరంతపౌ
వ్యవేక్షమాణౌ సహ సీతయా గతౌ || ౨౫ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడశీతితమః సర్గః || ౮౬ ||
Ayodhya Kanda Sarga 86 Meaning In Telugu
ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. “ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు.
ఆ సమయంలో నేను లక్ష్మణునితో “లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు.
మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు.” అని అన్నాను.
నామాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! నాతోపాటు రాజభోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్యమీద నిద్ర ఎలా పడుతుంది. అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించ వలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు.
ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే, ఆయాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతోకాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్యకూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని, రాముని వదిలి కౌసల్య జీవించలేదు.
రాముని రాజ్యాభిషిక్తుని చేయలేక పోగా, అరణ్యములకు పంపిన దు:ఖంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేతసంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ పదునాలుగు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము.” అని లక్ష్మణుడు ఆ రాత్రి పరి పరి విధములు గా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు.
మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకొని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటివెళ్లిపోయారు.” అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.