Aranya Kanda Sarga 58 In Telugu – అరణ్యకాండ అష్టపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58వ సర్గ), రాముడు లక్ష్మణుడితో కలిసి సీత కోసం ఆత్రంగా అన్వేషణ చేస్తూ, మార్గమధ్యంలో జటాయువును కలుస్తాడు. జటాయువు, రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. తన చివరి శ్వాసలో జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి మరణిస్తాడు. జటాయువు త్యాగానికి రాముడు దుఃఖిస్తూ, అతనికి అర్హమైన అంత్యక్రియలు నిర్వహిస్తాడు.

అనిమిత్తదర్శనమ్

స దృష్ట్వా లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజః |
పర్యపృచ్ఛత ధర్మాత్మా వైదేహీమాగతం వినా ||

1

ప్రస్థితం దండకారణ్యం యా మామనుజగామ హ |
క్వ సా లక్ష్మణ వైదేహీ యాం హిత్వా త్వమిహాగతః ||

2

రాజ్యభ్రష్టస్య దీనస్య దండకాన్ పరిధావతః |
క్వ సా దుఃఖసహాయా మే వైదేహీ తనుమధ్యమా ||

3

యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితుమ్ |
క్వ సా ప్రాణసహాయా మే సీతా సురసుతోపమా ||

4

పతిత్వమమరాణాం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ |
తాం వినా తపనీయాభాం నేచ్ఛేయం జనకాత్మజామ్ ||

5

కచ్చిజ్జీవతి వైదేహీ ప్రాణైః ప్రియతరా మమ |
కచ్చిత్ప్రవాజనం సౌమ్య న మే మిథ్యా భవిష్యతి ||

6

సీతానిమిత్తం సౌమిత్రే మృతే మయి గతే త్యయి |
కచ్చిత్సకామా సుఖితా కైకేయీ సా భవిష్యతి ||

7

సపుత్రరాజ్యాం సిద్ధార్థాం మృతపుత్రా తపస్వినీ |
ఉపస్థాస్యతి కౌసల్యా కచ్చిత్సౌమ్య న కేకయీమ్ ||

8

యది జీవతి వైదేహీ గమిష్యామ్యాశ్రమం పునః |
సువృత్తా యది వృత్తా సా ప్రాణాంస్త్యక్ష్యామి లక్ష్మణ ||

9

యది మామాశ్రమగతం వైదేహీ నాభిభాషతే |
పునః ప్రహసితా సీతా వినశిష్యామి లక్ష్మణ ||

10

బ్రూహి లక్ష్మణ వైదేహీ యది జీవతి వా న వా |
త్వయి ప్రమత్తే రక్షోభిర్భక్షితా వా తపస్వినీ ||

11

సుకుమారీ చ బాలా చ నిత్యం చాదుఃఖదర్శినీ |
మద్వియోగేన వైదేహీ వ్యక్తం శోచతి దుర్మనాః ||

12

సర్వథా రక్షసా తేన జిహ్మేన సుదురాత్మనా |
వదతా లక్ష్మణేత్యుచ్చైస్తవాపి జనితం భయమ్ ||

13

శ్రుతస్తు శంకే వైదేహ్యా స స్వరః సదృశో మమ |
త్రస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః ||

14

సర్వథా తు కృతం కష్టం సీతాముత్సృజతా వనే |
ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరమ్ ||

15

దుఃఖితాః ఖరఘాతేన రాక్షసాః పిశితాశనాః |
తైః సీతా నిహతా ఘోరైర్భవిష్యతి న సంశయః ||

16

అహోఽస్మిన్ వ్యసనే మగ్నః సర్వథా శత్రుసూదన |
కింన్విదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశమ్ ||

17

ఇతి సీతాం వరారోహాం చంతయన్నేవ రాఘవః |
ఆజగామ జనస్థానం త్వరయా సహలక్ష్మణః ||

18

విగర్హమాణోఽనుజమార్తరూపం
క్షుధా శ్రమాచ్చైవ పిపాసయా చ |
వినిఃశ్వసన్ శుష్కముఖో వివర్ణః
ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యమ్ ||

19

స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరో
విహారదేశాననుసృత్య కాంశ్చిత్ |
ఏతత్తదిత్యేవ నివాసభూమౌ
ప్రహృష్టరోమా వ్యథితో బభూవ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 58 Meaning In Telugu

అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు.

“లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా?

లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె దుఃఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!

లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా! లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా! ఒకవేళ సీత బతికి ఉంటే, నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా!

లక్ష్మణా! మారీచుడు హా లక్ష్మణా! అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా! నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా! లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా!

ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే, నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపానుకదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులుసీతను చంపి ఉంటారు!

లక్ష్మణా! చూచావా! అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో! ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా!” అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడి వడిగా ఆశ్రమం వేపు నడుస్తున్నావు రాముడు.

రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు. నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసి పోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టు పక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు.

“లక్ష్మణా! నేను అనుకున్నట్లే జరిగింది.” అని రోదిస్తున్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గః (59) >>

Leave a Comment