Aranya Kanda Sarga 59 In Telugu – అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గం, రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు సీత హరణం జరుగుతుంది. రావణుడు మారీచుని సహాయంతో సీతను మాయాజాలంతో మోసపుచ్చి హరిస్తాడు. మారీచుడు స్వర్ణమృగం రూపంలో వస్తుంది, దాన్ని వెంటపడి తీసుకురావాలని సీత కోరుతుంది. రాముడు, లక్ష్మణుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్లడం వల్ల సీతను రక్షించడానికి ఎవరూ లేకుండా పోతారు.

లక్ష్మణాగమనవిగర్హణమ్

అథాశ్రమాదుపావృత్తమంతరా రఘునందనః |
పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్దితం పునః ||

1

తమువాచ కిమర్థం త్వమాగతోఽపాస్య మైథిలీమ్ |
యదా సా తవ విశ్వాసాద్వనే విరహితా మయా ||

2

దృష్ట్వైవాభ్యాగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ |
శంకమానం మహత్పాపం యత్సత్యం వ్యథితం మనః ||

3

స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే |
దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతావిరహితం పథి ||

4

ఏవముక్తస్తు సౌమిత్రిర్లక్ష్మణః శుభలక్షణః |
భూయో దుఃఖసమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్ ||

5

న స్వయం కామకారేణ తాం త్యక్త్వాహమిహాగతః |
ప్రచోదితస్తయైవోగ్రైస్త్వత్సకాశమిహాగతః ||

6

ఆర్యేణేవ పరాక్రుష్టం హా సీతే లక్ష్మణేతి చ |
పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తచ్ఛ్రుతిం గతమ్ ||

7

సా తమార్తస్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలీ |
గచ్ఛ గచ్ఛేతి మామాహ రుదంతీ భయవిహ్వలా ||

8

ప్రచోద్యమానేన మయా గచ్ఛేతి బహుశస్తయా |
ప్రత్యుక్తా మైథిలీ వాక్యమిదం త్వత్ప్రత్యయాన్వితమ్ ||

9

న తత్పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్ |
నిర్వృతా భవ నాస్త్యేతత్కేనాప్యేవముదాహృతమ్ ||

10

విగర్హితం చ నీచం చ కథమార్యోఽభిధాస్యతి |
త్రాహీతి వచనం సీతే యస్త్రాయేత్త్రిదశానపి ||

11

కింనిమిత్తం తు కేనాపి భ్రాతురాలంబ్య మే స్వరమ్ |
రాక్షసేనేరితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే ||

12

విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి |
న భవత్యా వ్యథా కార్యా కునారీజనసేవితా ||

13

అలం వైక్లవ్యమాలంబ్య స్వస్థా భవ నిరుత్సుకా |
న సోఽస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే ||

14

జాతో వా జాయమానో వా సంయుగే యః పరాజయేత్ |
న జయ్యో రాఘవో యుద్ధే దేవైః శక్రపురోగమైః ||

15

ఏవముక్తా తు వైదేహీ పరిమోహితచేతనా |
ఉవాచాశ్రూణి ముంచంతీ దారుణం మామిదం వచః ||

16

భావో మయి తావాత్యర్థం పాప ఏవ నివేశితః |
వినష్టే భ్రాతరి ప్రాప్తుం న చ త్వం మామవాప్స్యసి ||

17

సంకేతాద్భరతేన త్వం రామం సమనుగచ్ఛసి |
క్రోశంతం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే ||

18

రిపుః ప్రచ్ఛన్నచారీ త్వం మదర్థమనుగచ్ఛసి |
రాఘవస్యాంతరప్రేప్సుస్తథైనం నాభిపద్యసే ||

19

ఏవముక్తో హి వైదేహ్యా సంరబ్ధో రక్తలోచనః |
క్రోధాత్ ప్రస్ఫురమాణోష్ఠ ఆశ్రమాదభినిర్గతః ||

20

ఏవం బ్రువాణం సౌమిత్రిం రామః సంతాపమోహితః |
అబ్రవీద్దుష్కృతం సౌమ్య తాం వినా యత్త్వమాగతః ||

21

జానన్నపి సమర్థం మాం రాక్షసాం వినివారణే |
అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిస్సృతో భవాన్ ||

22

న హి తే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీమ్ |
క్రుద్ధాయాః పరుషం వాక్యం శ్రుత్వా యత్త్వమిహాగతః ||

23

సర్వథా త్వపనీతం తే సీతయా యత్ప్రచోదితః |
క్రోధస్య వశమాపన్నో నాకరోః శాసనం మమ ||

24

అసౌ హి రాక్షసః శేతే శరేణాభిహతో మయా |
మృగరూపేణ యేనాహమాశ్రమాదపవాహితః ||

25

వికృష్య చాపం పరిధాయ సాయకం
సలీలబాణేన చ తాడితో మయా |
మార్గీం తనుం త్యజ్య స విక్లబస్వరో
బభూవ కేయూరధరః స రాక్షసః ||

26

శరాహతేనైవ తదార్తయా గిరా
స్వరం మమాలంబ్య సుదూరసంశ్రవమ్ |
ఉదాహృతం తద్వచనం సుదారుణం
త్వమాగతో యేన విహాయ మైథిలీమ్ ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 59 Meaning In Telugu

అప్పటి దాకా సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు.

ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!” అని సూటిగా ప్రశ్నించాడు రాముడు.

అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను.

నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి “లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు.” అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాడు. “సీతా! రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసే వాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు. ఎవరో రాముని అనుకరించారు.

ఓ సీతా! దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే! అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా! అసంభవము. ఇది రాక్షసులు పన్నాగము. రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి. ఓ సీతా! రాముడి బలపరాక్రమ ములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంక ఈ సామాన్య రాక్షసుడు ఎంత?” అని ఆమెను అనునయించాను.

కాని రామా! సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది. “నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్నుపొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు.” అని నన్ను నానారకాలుగా నిందించింది.

ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది.” అని వివరించాడు లక్ష్మణుడు.

అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. “ఏది ఏమైనా లక్ష్మణా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా, సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని, నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు.

ఏవో నాలుగు పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచి పెట్టి వస్తావా! అంటే అంది. ఏమయింది. ఆమెకు కోపం వచ్చింది సరే! నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు. నీవు అన్ని విధాలా తప్పు చేసావు. సరిదిద్దుకోలేని తప్పు చేసావు.

నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలి వచ్చావు. అంతే కదా! దాని ఫలితంగా నాసీత నాకు దూరం అయింది.” అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పు పట్టాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది తొమ్మిదవ సర్గ. సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షష్టితమః సర్గః (60) >>

Leave a Comment