Balakanda Sarga 30 In Telugu – బాలకాండ త్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ త్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి రావడం వివరించబడింది. సీతా కల్యాణం అనంతరం, వారు విశ్వామిత్రుడితో కలిసి స్వస్థలానికి చేరుకుంటారు. అయోధ్య ప్రజలు మరియు దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతించేందుకు ఎదురుచూస్తారు. తమ కుమారులను, వారి భార్యలను చూసి దశరథుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు.

యజ్ఞరక్షణమ్

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిందమౌ |
దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః ||

1

భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్కాలే నిశాచరౌ |
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్నాతివర్తేత తత్ క్షణమ్ ||

2

ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సయా |
సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ ||

3

అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్ |
దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి ||

4

తౌ చ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ |
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్ ||

5

ఉపాసాం‍చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ |
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ ||

6

అథ కాలే గతే తస్మిన్షష్ఠేఽహని సమాగతే |
సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః ||

7

రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా |
ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయపురోహితా ||

8

సదర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా |
విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా ||

9

మంత్రవచ్చ యథాన్యాయం యజ్ఞోఽసౌ సంప్రవర్తతే |
ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్భయానకః ||

10

ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః |
తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్ ||

11

మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే |
ఆగమ్య భీమసంకాశా రుధిరౌఘమవాసృజన్ ||

12

సా తేన రుధిరౌఘేణ వేదీం తామభ్యవర్షతామ్ |
దృష్ట్వా వేదిం తథాభూతాం సానుజః క్రోధసంయుతః ||

13

సహసాఽభిద్రుతో రామస్తానపశ్యత్తతో దివి |
తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః ||

14

లక్ష్మణం త్వాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ |
పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్రాక్షసాన్పిశితాశనాన్ ||

15

మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్ |
[* అధికపాఠః – కరిష్యామి న సందేహో నోత్సహే హంతుం ఈదృశాన్ | ఇత్యుక్త్వా వచనం రామశ్చాపే సంధాయ వేగవాన్ | *]
మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్ ||

16

చిక్షేప పరమ క్రుద్ధో మారీచోరసి రాఘవః |
స తేన పరమాస్త్రేణ మానవేన సమాహితః ||

17

సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే |
విచేతనం విఘూర్ణంతం శీతేషుబలపీడితమ్ ||

18

నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ |
పశ్య లక్ష్మణశీతేషుం మానవం మనుసంహితమ్ ||

19

మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వియుజ్యతే |
ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్దుష్టచారిణః ||

20

రాక్షసాన్పాపకర్మస్థాన్యజ్ఞఘ్నాన్పిశితాశనాన్ |
[* ఇత్యుక్త్వా లక్ష్మణం చాశు లాఘవం దర్శయన్ ఇవ | *]
సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్ ||

21

సుబాహూరసి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి |
శేషాన్వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః ||

22

రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్ |
స హత్వా రక్షసాన్సర్వాన్యజ్ఞఘ్నాన్రఘునందనః ||

23

ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా |
అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః |
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్స్థమిదమబ్రవీత్ ||

24

కృతార్థోఽస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా |
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః ||

25
[* స హి రామం ప్రశస్యైవం తాభ్యాం సంధ్యాముపాగమత్ | *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రింశః సర్గః ||

మరునాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు.

“ఓ మహర్షీ! మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు. మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలెను. ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా!” అని అడిగారు.

ఆసమయములో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు.

“మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి ఆరు రాత్రులు మీరు యాగమును రక్షించవలెను.” అని పలికారు.

వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరమూ ధనస్సును చేత బూని రామ లక్ష్మణులు ఆరు పగళ్లు ఆరు రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కను ఉండి ఆయనకు ఎలాంటి ఆపదా రాకుండా రక్షించారు.

ఆరవ దినము గడుచు చున్నది. రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇది ఆరవ రోజు. చాలా అప్రమత్తంగా ఉండు.రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు.” అని లక్ష్మణుని హెచ్చరించాడు.

ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోూత్రము లోనుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు.

ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపములో ఆకాశము అంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తము పడిన హెూమ గుండము లో నుండి అగ్ని జ్వాలలు పైకి ఎగిసాయి.

ఇదంతా చూచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! రాక్షసులు ఆకాశము నుండి రక్త వర్షము కురిపించు చున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపములో ఉన్న రాక్షసులను తరిమి వేస్తాను.” అని అన్నాడు.

రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలము • మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు నూరు యోజనముల దూరములో ఉన్న సముద్రములో పోయి పడ్డాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు. కేవలము మూర్ఛపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రములో పడ్డాడు. కాని ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి ప్రాణములు తీయడమే సరిఅయిన మార్గము” అని అన్నాడు.

వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలా గిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేసాడు.

ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసుల నందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు.

యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామ లక్ష్మణులను చూచాడు. ఎంతోసంతోషంతో ఇలా అన్నాడు.

“రామా! నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమముపేరు సార్థకం చేసావు.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము బాల కాండ ముప్పయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Leave a Comment