Balakanda Sarga 46 In Telugu – బాలకాండ షట్చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో 46వ సర్గ విశేషాల గురించి తెలుపుతుంది. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. యజ్ఞం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటక, సుబాహు, మరిచిలాంటి రాక్షసులు వస్తారు. రాక్షసులను అడ్డుకోవడానికి రాముడు తన అస్త్రశస్త్రాలను ఉపయోగించి వారిని సంహరిస్తాడు.

దితిగర్భభేదః

హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా |
మారీచం కశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్ ||

1

హతపుత్రాఽస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః |
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్ ||

2

సాఽహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి |
బలవంతం మహేష్వాసం స్థితిజ్ఞం సమదర్శినమ్ ||

3

ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతుమర్హసి |
తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా ||

4

ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితామ్ |
ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే ||

5

జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే |
పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి ||

6

పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి |
ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జ తామ్ ||

7

సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ |
గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా ||

8

కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార హ ||

9

సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా |
అగ్నిం కృశాన్కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ ||

10 [కుశాన్]

న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితమ్ |
గాత్రసంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా ||

11

శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ |
అథ వర్షసహస్రే తు దశోనే రఘునందన ||

12

దితిః పరమసంప్రీతా సహస్రాక్షమథాబ్రవీత్ |
యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా ||

13

వరో వర్షసహస్రాంతే మమ దత్తః సుతం ప్రతి |
తపశ్చరంత్యా వర్షాణి దశ వీర్యవతాం వర ||

14

అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః |
తమహం త్వత్కృతే పుత్రం సమాధాస్యే జయోత్సుకమ్ ||

15

త్రైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః |
ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే ||

16

నిద్రయాఽపహృతా దేవీ పాదౌ కృత్వాఽథ శీర్షతః |
దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజామ్ ||

17

శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ |
తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః ||

18

గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్ |
భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా ||

19

రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత |
మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోఽభ్యభాషత ||

20

బిభేద చ మహాతేజా రుదంతమపి వాసవః |
న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ ||

21

నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్ |
ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత ||

22

అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా |
తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే |
అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 46 Meaning In Telugu

“ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది.

“నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అడిగింది.

ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. ” ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు.” అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు.

కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది.

ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు.

దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. “ఓ దేవేంద్రా! నేను పరాక్రమ వంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నాభర్త అయిన కశ్యపుని వరం అడిగాను. వేయి సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్తనాకు వరం ప్రసాదించాడు. ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి.” అని పలికింది.

తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్లింది. కాని తొందరగా నిద్ర పోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించ వలసిన వైపు కాళ్లు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు.

తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరక బడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది.

ఇంద్రుడు ఆ పిండమును చూచి ” ఏడవ వద్దు ఏడవ వద్దు” అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు.

ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భము లోనుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు.

“తల్లీ! నన్ను క్షమించు. నీవు తల వైపు కాళ్లు పెట్టుకొని, నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేసావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు.” అని ప్రార్థించాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ నలుబది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Leave a Comment