Balakanda Sarga 48 In Telugu – బాలకాండ అష్టచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము బాలకాండ అష్టచత్వారింశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో విష్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణుల్ని సీతా స్వయంవరానికి తీసుకువెళతారు. రాముడు శివ ధనుస్సును విరచి సీతను గెలుచుకుంటాడు. ఈ సందర్భంలో, పరశురాముడు రాముడి శక్తిని పరీక్షించడానికి వస్తాడు. రాముడు శాంతంగా పరశురాముడి పరీక్షను తట్టుకుని తన శౌర్యాన్ని నిరూపిస్తాడు.

|| శక్రాహల్యాశాపః ||

పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పరసమాగమే |
కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్ ||

1

ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ |
గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ ||

2

పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ |
అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ ||

3

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ |
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే ||

4

భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః ||

5

కిమర్థం చ నరశ్రేష్ఠౌ సంప్రాప్తౌ దుర్గమే పథి |
వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

6

తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్ |
సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా ||

7

విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః |
అతిథీ పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ ||

8

పూజయామాస విధివత్సత్కారార్హౌ మహాబలౌ |
తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ ||

9

ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం తతః |
తాన్దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభామ్ ||

10

సాధు సాధ్వితి శంసంతో మిథిలాం సమపూజయన్ |
మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః ||

11

పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవమ్ |
శ్రీమదాశ్రమసంకాశం కిం న్విదం మునివర్జితమ్ ||

12

శ్రోతుమిచ్ఛామి భగవన్కస్యాయం పూర్వ ఆశ్రమః |
తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః ||

13

ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ ||

14

యస్యైతదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా |
గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః ||

15

ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి సుపూజితః |
స చేహ తప ఆతిష్ఠదహల్యాసహితః పురా ||

16

వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః |
కదాచిద్దివసే రామ తతో దూరం గతే మునౌ ||

17

తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్షః శచీపతిః |
మునివేషధరోఽహల్యామిదం వచనమబ్రవీత్ ||

18

ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః సుసమాహితే |
సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే ||

19

మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్ ||

20

అథాబ్రవీత్సురశ్రేష్ఠం కృతార్థేనాంతరాత్మనా |
కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రమితః ప్రభో ||

21

ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష మానద |
ఇంద్రస్తు ప్రహసన్వాక్యమహల్యామిదమబ్రవీత్ ||

22

సుశ్రోణి పరితుష్టోఽస్మి గమిష్యామి యథాగతమ్ |
ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామోటజాత్తతః ||

23

స సంభ్రమాత్త్వరన్రామ శంకితో గౌతమం ప్రతి |
గౌతమం స దదర్శాథ ప్రవిశంతం మహామునిమ్ ||

24 [తం]

దేవదానవదుర్ధర్షం తపోబలసమన్వితమ్ |
తీర్థోదకపరిక్లిన్నం దీప్యమానమివానలమ్ ||

25

గృహీతసమిధం తత్ర సకుశం మునిపుంగవమ్ |
దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోఽభవత్ ||

26

అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః |
దుర్వృత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్ ||

27

మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే |
అకర్తవ్యమిదం తస్మాద్విఫలస్త్వం భవిష్యసి ||

28

గౌతమేనైవముక్తస్య సరోషేణ మహాత్మనా |
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ ||

29

తథా శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్ |
ఇహ వర్షసహస్రాణి బహూని త్వం నివత్స్యసి ||

30

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ |
అదృశ్యా సర్వభూతానామాశ్రమేఽస్మిన్నివత్స్యసి ||

31

యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః |
ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి ||

32

తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహవివర్జితా |
మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి ||

33

ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీమ్ |
ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణసేవితే |
హిమవచ్ఛిఖరే రమ్యే తపస్తేపే మహాతపాః ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టచత్వారింశః సర్గః ||

Balakanda Sarga 48 Meaning In Telugu

సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షి! నీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలిఉంది. వారు అమితమైన బల పరాక్రమ ములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనము లోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్వినీ దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి.” అని అడిగాడు సుమతి.

విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకూ అన్ని విషయములు చెప్పాడు.

విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామ లక్ష్మణులకు అతిధి సత్కారములు చేసాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు.

మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి?” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“ఓ రామా! ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఒక రోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున, ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు.

“ఓ సుందరీ! నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా! నేను నీతో రతి సంగమ మును కోరుచున్నాను.” అని అన్నాడు..

తన భర్త వేషములో వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుప వలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది.

“ఓ దేవేంద్రా! నేను కృతార్థురాలను అయ్యాను. (కోరిక తీరినదానను అయ్యాను). దేవేంద్రా! ఇక్కడి నుండి తొందరగా వెళ్లిపొండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము.”అని అంది అ

అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ” ఓ సుందరీ! నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను.” అని అన్నాడు ఇంద్రుడు.

ఓ రామా! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు, ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ, గౌతముని ఆశ్రమము నుండి త్వర త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు, సమిధలను, దర్భలను తీసుకొని, ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు.

గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెల వెల బోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు.

“ఓ దుర్మతీ! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నాభార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కిందపడిపోవు గాక!” అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి.

తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడ గడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు.

‘అహల్యా! నీవు పాపం చేసావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్యరూపంలో వేల సంవత్సరములు, మట్టిలో దొర్లుతూ, నిరాహారంగా, కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, ఈ ఆశ్రమములో పడి ఉండు.

దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినపుడు నీకు శాపవిముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిధ్యము ఇచ్చి, శాపవిమోచనము పొందిన తరువాత, నీలో ఉన్న మోహము నశించి, పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు.” అని పలికాడు.

తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హిమవత్పర్వము నకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకోనపంచాశః సర్గః (49) >>

Leave a Comment