రథ సప్తమి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రథ సప్తమి విశిష్టత, రథ సప్తమి పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు రథ సప్తమి గురించి తెలుసుకుందాం.
రథ సప్తమి విశిష్టత
సమస్త సృష్టికి శ్రీసూర్యనారాయణుడు పంచకల్యాణి అశ్యములు పూనిన రథముపై సంచరిస్తూ, తన ప్రభాత కిరణాల వెలుగుతో మేలుకొలుపు పొందుతాడు. భాస్కరుడు, ఆదిత్యుడు, కశ్వపుడు, భానుడు, ఆదిత్యుడు, రవి అనే పర్యాయనామాలతో ఆకంతిమూర్తిని ప్రస్తుతిస్తారు.
జన్మకుండలిలో రవి మహర్ధశ రవి అంతర్దశ అను కాలము లుంటుందని ఈ దశల, ప్రభావం మానవుల జీవితం మీద అమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రము ఉద్ఘాటిస్తున్నది. దీనివలన సూర్యభగవానుడు వెలుగుల దేవుడేకాక మానవులజీవితంలో ఉచ్ఛ నీచ స్థితులను నిర్దేశించే విధాత అని తేట తెల్లమవుతున్నది.
“తేజ స్కామో విభావసుమ్” అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతమందు చెప్పబడినది.
“ఆరోగ్యం భాస్కరదాచ్చేత్” నిత్యం ప్రాతఃకాలమునందు సూర్యుని దర్శించి నమస్కారప్రణామాలు చేయుట వలన ఆరోగ్యం చేకూరును (మత్స్యపురాణం) “దినేశం సుఖార్ధం” సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును (స్కాంధపురాణం).
సూర్యభగవానుని ఆరాధించటం వలన శుభఫలితాలను పొందవచ్చునని పురాణములు, వేదములు కొన్ని వృత్తాంతముల వలన తేటతెల్లమవుతున్నది.
“ఉదయం బ్రహ్మ స్వరూపో మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే సదా విష్ణుఃత్రిమూర్తి శ్చ దివాకరః”
ఈశ్లోకమునందు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మవలెను, సాయంత్రం విష్ణువు వలెను, మధ్యాన్నం మహేశ్వరుడు వలెను త్రిమూర్తుల అంశతో ప్రకాశిస్తాడని చెప్పబడింది. కనుకనే శ్రీసూర్యనారాయణుని ఆరాధన వలన త్రిమూర్తులను ఆరాధించి పొందు ఫలములను పొందవచ్చునని శాస్త్రఉవాచ.
రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు?
“మాఘ మాసే సితేపక్ష సప్తమ న్యాద్ర దన్యతు
తత్ర స్కానంచ దానంచ తత్పర్యం చాక్షయం భవేత్”
మాఘమాసం ప్రిబ్రవరి, శుక్లపక్షంలో వచ్చే రథ సప్తమినాడు సూర్య భగవానుడు భూమికి దగ్గరగా రావటం జరుగుతుంది. ఈ సమయంలో సూర్యభగవానుడి శక్తి భూమిమీద పుష్కలంగా ప్రసరిస్తూ ఉంటుంది.
“సూర్య గ్రహణ తుల్యాతు శుక్లా మాఘస్వసప్తమే.
ఈ సప్తమ శుభదినంగా సూర్యగ్రహణంగా పరిగణిస్తూ ఆ రోజు దీక్షలు, వ్రతాలు, నోములు చేబడతారు ఇది విశేష ఫలం ఇస్తుందని నమ్మకం ఈ సప్తమినే “ రథ సప్తమీ” అంటారు.
అయపు వేళసప్తమి తిధిఉండి సాయంత్రంకల్లా “అష్టమి” వస్తే అద్భుతమైన అపురూపమైన రహస్యమైన మంత్రములను జపం చేయుట మంత్ర తంత్ర యంత్ర పివ్వల ఉపాసనను చేయుట వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చునని పూర్వీకులునుండి బలమైన నమ్మకం కలదు.
రథ సప్తమి నాడు సూర్యభగవానుడు నక్షత్రరధము నెక్కి ఆకాశమంతా తిరుగుతాడు, అందుకే రధసప్తమినాడు ఆకాశములో నక్షత్రములు రధాకారములో కనిపిస్తాయని ఇతిహాసంలో ఉన్నది. రధసప్తమినాడు తలమీద జిల్లేడు, రేగు ఆకులను ఉంచుకుని తలనిండాస్నానం చేస్తారు ఇలా స్నానంచేయుట వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చుని ధర్మశాస్త్రం ప్రవచిస్తోంది. తలస్నానం చేయునపుడు సూర్యుని యొక్క పన్నెండు నామములను స్మరిస్తూ తల, మెడ, కాళ్ళు, చేతులు, భుజాలు, కళ్ళు, హృదయం. నాభి, పాదాలపై ఆకులను ఉంచుకుని స్నానం చేస్తారు ఇలా చెయ్యడం వల్ల ఈ అంగములపై సూర్యుని శుభదృష్టి ప్రసరించి రోగములు నాశనమవుతాయని నమ్మకం.
“సప్త సప్త మహా సప్త సప్త ద్వీపా వసుంధర
సప్తార వర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి”
ఈ శ్లోకం స్నాన మాచరించునప్పుడు పరించాలి.
సమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే॥
యద్యజ్ఞన్మ కృతం పాపం మయా జన్మసు సప్తమ
తన్మేరోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ ॥
ఏతజ్ఞన్మ కృతం పాపం యజ్ఞన్మాంతారార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతేచయే పునః ॥
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ॥
ఆర్ధ్యం – “ఓననా సర్వలోకాం సప్తమీ సప్త సప్తిగా
సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్యమండలే”
సప్తమాదేవతని సూర్యమండలాన్ని నమస్కరించి జిల్లేడు, రేగు, చందనం, అక్షింతలు కలిపిన నీటిని లేక క్షీరమును రాగి పాత్రతో ఆర్ఘ్యమివ్వడం శుభం.
రథ సప్తమి యొక్క పూజావిధానం:
ఎర్ర చందనంతో పద్మాన్నిగీసి ఎర్రని పువ్వులతో ఆదిత్యుని పన్నెండు నామాలతో పూజించాలి.
నామాలు
- మిత్రాయ నమః
- రవేనమః
- సూర్యా నమః
- భానవే నమః
- ఖగాయ నమః
- పూషాయ నమః
- హిరణ్యగర్భాయ నమః
- మరీచయే నమః
- ఆదిత్యాయ నమః
- సనిత్రేయనమః
- ఆర్కాయ నమః
- భాస్కరాయ నమః
సూర్యదర్శనం జిల్లేడు అకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి చేసుకొనుట శుభం సూర్యగాయత్రిని 108 సార్లు జపించి, సూర్యుని శాంతి రత్నములను పూజించుట సాంప్రదాయం.
పూజనివేదన
ఆవు పేడతో చేసిన శ్రేష్ఠమైన పిడకలమీద క్షీరాన్నమును వండి చిక్కుడు ఆకులు మీదనుంచి నైవేద్యం పెట్టవలెను సృష్టికి వెలుగును, శక్తిని ప్రసాదించు అదిత్యుని ఆరాధించుట వలన శుభము శ్రేష్టము కనుక ఈవిధమైన పూజా విధానములను రథ సప్తమినాడు ఆచరించుట వలన సూర్యభగవానుని అనుగ్రహమును పొందవచ్చును.
మరిన్ని పండుగలు: