మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకపంచాశః సర్గలో, తన తండ్రి గౌతముడు తన తల్లి అహల్యతో తిరిగి కలవడం గురించి ఆరా తీస్తూ, శతానంద మహర్షి విశ్వామిత్రుని పురాణాన్ని వివరిస్తాడు. విశ్వామిత్రుడు ఒకానొక సమయంలో గొప్ప రాజుగా ఉన్నప్పుడు, అనేక స్వీయ-ముఖ్యమైన దోపిడీల ద్వారా సంపాదించిన విశ్వామిత్రుని యొక్క నిజాయితీకి కట్టుబడి ఉన్నందుకు శతానంద రాముడిని అభినందించాడు. విశ్వామిత్రుని జీవిత చరిత్రను రాముడికి తెలియజేయడంలో శతానంద విలువైనది, ఎందుకంటే విశ్వామిత్రుడు చేసినట్లుగా రాజులను అతిగా భరించడం రాజులకు అననుకూలంగా ఉంటుంది.
విశ్వామిత్రవృత్తమ్
తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః |
హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః ||
1
గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః |
రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః ||
2
స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ |
శతానందో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్ ||
3
అపి తే మునిశార్దూల మమ మాతా యశస్వినీ |
దర్శితా రాజపుత్రాయ తపోదీర్ఘముపాగతా ||
4
అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ |
వన్యైరుపాహరత్పూజాం పూజార్హే సర్వదేహినామ్ ||
5
అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్ |
మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్ ||
6
అపి కౌశిక భద్రం తే గురుణా మమ సంగతా |
మాతా మమ మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః ||
7
అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజ |
ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః ||
8
అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ |
ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః ||
9
తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః |
ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ ||
10
నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా |
సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా ||
11
తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య ధీమతః |
శతానందో మహాతేజా రామం వచనమబ్రవీత్ ||
12
స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ |
విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్ ||
13
అచింత్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః |
విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్ ||
14
నాస్తి ధన్యతరో రామ త్వత్తోఽన్యో భువి కశ్చన |
గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః ||
15
శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః |
యథా బలం యథా వృత్తం తన్మే నిగదతః శృణు ||
16
రాజాఽభూదేష ధర్మాత్మా దీర్ఘకాలమరిందమః |
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః ||
17
ప్రజాపతిసుతస్త్వాసీత్కుశో నామ మహీపతిః |
కుశస్య పుత్రో బలవాన్కుశనాభః సుధార్మికః ||
18
కుశనాభసుతస్త్వాసీద్గాధిరిత్యేవ విశ్రుతః |
గాధేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||
19
విశ్వమిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్ |
బహువర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||
20
కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూథినీమ్ |
అక్షౌహిణీపరివృతః పరిచక్రామ మేదినీమ్ ||
21
నగరాణి చ రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ |
ఆశ్రమాన్క్రమశో రాజా విచరన్నాజగామ హ ||
22
వసిష్ఠస్యాశ్రమపదం నానావృక్షసమాకులమ్ |
నానామృగగణాకీర్ణం సిద్ధచారణసేవితమ్ ||
23
దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితమ్ |
ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘనిషేవితమ్ ||
24
బ్రహ్మర్షిగణసంకీర్ణం దేవర్షిగణసేవితమ్ |
తపశ్చరణసంసిద్ధైరగ్నికల్పైర్మహాత్మభిః ||
25
[* సతతం సంకులం శ్రీమద్బ్రహ్మకల్పైర్మహాత్మభిః | *]
అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా |
ఫలమూలాశనైర్దాంతైర్జితరోషైర్జితేంద్రియైః ||
26
ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః |
అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితమ్ ||
27
వసిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరమ్ |
దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః ||
28
Balakanda Sarga 51 In Telugu Pdf With Meaning
జనకుని పక్కను ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు.
“ ఓ మహర్షీ! శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా! నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా! మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా! దైవము ప్రతికూలించడం వలన మా తల్లి గారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా! రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా! మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరిం చాడా! నా తండ్రి అయిన గౌతముడు శ్రీ రాముని పూజించాడా! అతిధి సత్కారములు చేసాడా! శ్రీ రాముడు నా తండ్రిని ఆదరించాడా! గౌరవించాడా! మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా!” అని శతానందుడఱు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. “ఓ శతానందా! నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేసాను. రేణుకా దేవి జమదగ్నిని చేరి నట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది.” అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు.
ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు. “శ్రీ రామా! సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యము చే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను.
ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు. చక్రవర్తి. ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసాడు. వీరి వంశము గురించి చెబుతాను విను.
ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసాడు. అందరు రాజులను ఓడించాడు.
ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు. ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వసిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫల వృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవ ఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వసిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్య ద్వేషములు, కోప తాపములు అసూయ లేవు. వాలఖిల్యులూ, వైఖానసులు, ఋషులు జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంత మంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంత మందికేవలము నీరు తాగుతూ మరి కొంత మంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటుచూచినా పవిత్రత ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణము లో ఉన్న వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు.
శ్రీమద్రామాయణము,
బాల కాండము యాభైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
బాలకాండ ద్విపంచాశః సర్గః (52) >>