Balakanda Sarga 52 In Telugu – బాలకాండ ద్విపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విపంచాశః సర్గ అంటే 52వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మిథిలాకు చేరుకున్న తరువాత, వారు జనక మహారాజును కలుస్తారు. జనకుడు రామలక్ష్మణులను చూసి ఆనందపడి, వారిని ఆత్మీయంగా స్వాగతిస్తాడు. జనకుడు సీతా స్వయంవరానికి సంబంధించిన వివరాలను వారికి వివరిస్తాడు.

వసిష్ఠాతిథ్యమ్

స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః | [తం]
ప్రణమ్య విధినా వీరో వసిష్ఠం జపతాం వరమ్ ||

1

స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా |
ఆసనం చాస్య భగవాన్వసిష్ఠో వ్యాదిదేశ హ ||

2

ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే |
యథాన్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్ ||

3

ప్రతిగృహ్య చ తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః |
తపోగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత ||

4

విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా |
సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్ ||

5

సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః |
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణః సుతః ||

6

కచ్చిత్తే కుశలం రాజన్కచ్చిద్ధర్మేణ రంజయన్ |
ప్రజాః పాలయసే రాజన్ రాజవృత్తేన ధార్మిక ||

7

కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్ఠంతి శాసనే |
కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన ||

8

కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప |
కుశలం తే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ ||

9

సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్ |
విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః ||

10

కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తాః కథాః శుభాః |
ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్ ||

11

తతో వసిష్ఠో భగవాన్కథాంతే రఘునందన |
విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ ||

12

ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల |
తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛ మే ||

13

సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతామ్ |
రాజా త్వమతిథిశ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||

14

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః |
కృతమిత్యబ్రవీద్రాజా పూజావాక్యేన మే త్వయా ||

15 [ప్రియ]

ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే |
పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ ||

16

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః |
గమిష్యామి నమస్తేఽస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా ||

17

ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవ హి |
న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః ||

18

బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ |
యథా ప్రియం భగవతస్తథాస్తు మునిసత్తమ ||

19

ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః ||

20

ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ |
సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోఽస్మ్యహమ్ ||

21

భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే |
యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్ ||

22

తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ |
రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్ |
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విపంచాశః సర్గః ||

Balakanda Sarga 52 Meaning In Telugu

విశ్వామిత్రుడు వసిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేసాడు. వసిష్ఠమహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానిం చాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని ఇలా అడిగాడు. “ఓ మహర్షీ! మీకు మీ శిష్యులకు క్షేమమే కదా! మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా! మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా! ” అని అడిగాడు.

విశ్వామిత్ర మహారాజా! తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారా! మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా! రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా! నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా! నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా! నీవు శత్రుసంహారము చేసి, శాంతి స్థాపన చేసావు కదా! ఓ విశ్వామిత్రా! నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా! ” అని కుశల ప్రశ్నలు అడిగాడు వసిష్ఠుడు.

వసిష్ఠుడు అడిగిన దానికి “ఓ మహర్షీ! తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరమూ కుశలముగానే ఉన్నాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహారాజా! మీరు మీ పరివారము ఈ రోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన, నీకును నీ పరివారమునకూ నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు.” అని అడిగాడు.

“ఓ వసిష్ట మహర్షీ! మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్లి వస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

కాని వసిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేసాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.

వెంటనే వసిష్ఠుడు తన వద్దఉన్న కామధేనువును పిలిచాడు.

“ఓ కామధేనువా! ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనకు అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రక రకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికీ ఎట్టి లోపము రానీయవద్దు.” అని పలికాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము,
బాలకాండము యాభైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ త్రిపంచాశః సర్గః (53) >>

Leave a Comment