Balakanda Sarga 62 In Telugu – బాలకాండ ద్విషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రామాయణంలోని బాలకాండలో 62వ సర్గ, ద్విషష్టితమః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి కలిసి జనక మహారాజు రాజధాని మిథిలాకి చేరుకుంటారు. జనక మహారాజు రాముడు అహల్య శాప విమోచనం చేసిన విషయాన్ని విని, అతడిని ప్రశంసిస్తాడు. రాజ్యంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది.

|| అంబరీషయజ్ఞః ||

శునఃశేపం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః |
వ్యశ్రామ్యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన ||

1

తస్య విశ్రమమాణస్య శునఃశేపో మహాయశాః |
పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ హ ||

2

తప్యంతమృషిభిః సార్ధం మాతులం పరమాతురః |
వివర్ణవదనో దీనస్తృష్ణయా చ శ్రమేణ చ ||

3

పపాతాంకే మునౌ రామ వాక్యం చేదమువాచ హ | [మునేరాశు]
న మేఽస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః ||

4

త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవః |
త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః ||

5

రాజా చ కృతకార్యః స్యాదహం దీర్ఘాయురవ్యయః |
స్వర్గలోకముపాశ్నీయాం తపస్తప్త్వా హ్యనుత్తమమ్ ||

6

త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా |
పితేవ పుత్రం ధర్మాత్మంస్త్రాతుమర్హసి కిల్బిషాత్ ||

7

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః |
సాంత్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచ హ ||

8

యత్కృతే పితరః పుత్రాంజనయంతి శుభార్థినః |
పరలోకహితార్థాయ తస్య కాలోఽయమాగతః ||

9

అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్ఛతి |
అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః ||

10

సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః |
పశుభూతా నరేంద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్ఛత ||

11

నాథవాంశ్చ శునఃశేపో యజ్ఞశ్చావిఘ్నితో భవేత్ |
దేవతాస్తర్పితాశ్చ స్యుర్మమ చాపి కృతం వచః ||

12

మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యందాదయః సుతాః |
సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్ ||

13

కథమాత్మసుతాన్హిత్వా త్రాయసేఽన్యసుతం విభో |
అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే ||

14

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః |
క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే ||

15

నిఃసాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితమ్ |
అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్ ||

16

శ్వమాంసభోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువత్స్యథ ||

17

కృత్వా శాపసమాయుక్తాన్పుత్రాన్మునివరస్తదా |
శునఃశేపమువాచార్తం కృత్వా రక్షాం నిరామయామ్ ||

18

పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః |
వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర ||

19

ఇమే తు గాథే ద్వే దివ్యే గాయేథా మునిపుత్రక |
అంబరీషస్య యజ్ఞేఽస్మింస్తతః సిద్ధిమవాప్స్యసి ||

20

శునఃశేపో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః |
త్వరయా రాజసింహం తమంబరీషమువాచ హ ||

21

రాజసింహ మహాసత్త్వ శీఘ్రం గచ్ఛావహే సదః |
నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ ||

22

తద్వాక్యమృషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః |
జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటమతంద్రితః ||

23

సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణమ్ |
పశుం రక్తాంబరం కృత్వా యూపే తం సమబంధయత్ ||

24

స బద్ధో వాగ్భిరగ్ర్యాభిరభితుష్టావ వై సురౌ |
ఇంద్రమింద్రానుజం చైవ యథావన్మునిపుత్రకః ||

25

తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః |
దీర్ఘమాయుస్తదా ప్రాదాచ్ఛునఃశేపాయ రాఘవ ||

26

స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్యాంతమవాప్తవాన్ |
ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజమ్ ||

27

విశ్వామిత్రోఽపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాని చ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విషష్ఠితమః సర్గః ||

Balakanda Sarga 62 Meaning In Telugu

ఋచీకుని వద్దనుండి అతని కుమారుడైన శునశేపుని లక్షగోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు, అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేవుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు.

“ఓ మహర్షీ! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. ఇద్దరూ నన్ను వదిలేసారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రివంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి. ” అని వేడుకున్నాడు.

శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. “కుమారులారా! పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేసారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్లడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు శునశేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను శునశేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది.” అని అన్నాడు.

తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. “తండ్రీ! మీరు శునశేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్లమం టున్నారు. అలా చెయ్యడం కుక్కమాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరమూ వెళ్లము.” అని చెప్పారు.

కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. “ఏమన్నారు. పరులకు సాయం చెయ్యడం కుక్కమాంసం తినడంతో సమానమా! అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్కమాంసము తింటూ వేయి సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము.” అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు.

ఇదంతా చూచిన శున శేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు.

“ఓ శునశేవా! యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి, ఊపస్తంభమునకు కడతారు. అపుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

శునశేపునకు రెండు మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన శునశేపుడు అంబరీషుని వెంట వెళ్లాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. శునశేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేసారు. ఊపస్థంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేసారు.

అప్పుడు శునశేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. శునశేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా శునశేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి.

తరువాత విశ్వామిత్రుడు వేయి సంవత్సరములు పుష్కరక్షేత్రములో తపస్సు చేసాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓ తత్సత్.

బాలకాండ త్రిషష్టితమః సర్గః (63) >>

Leave a Comment