మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిషష్టితమః సర్గలో, విశ్వామిత్రుని యొక్క తీవ్రమైన ఆశ్రయంపై బ్రహ్మ అతనికి ‘మహా-ఋషి’ యొక్క ఋషిత్వాన్ని అంగీకరిస్తాడు, అయితే విశ్వామిత్రుని ఆశయం ‘బ్రహ్మ-ఋషి’ సంపూర్ణ-జ్ఞాన జ్ఞానాన్ని పొందడం. ఇంతలో, స్వర్గీయ వేంచ్ మేనక ఆ ప్రదేశానికి చేరుకుంటుంది మరియు విశ్వామిత్రుడు ఆమె అందానికి మోహింపబడి ఆమెతో కొన్నాళ్ళు గడిపాడు. తరువాత, అతను కామంపై విజయం సాధించాలని గ్రహించిన తరువాత, అతను మరింత తీవ్రమైన అస్తిత్వాన్ని చేపట్టాడు, దాని ద్వారా దేవతలు కలవరపడతారు.
మేనకానిర్వాసః
పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిమ్ |
అభ్యాగచ్ఛన్సురాః సర్వే తపఃఫలచికీర్షవః ||
1
అబ్రవీత్సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః |
ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః ||
2
తమేవముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్ |
విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహత్తపః ||
3
తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే ||
4
తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః |
రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా ||
5
దృష్ట్వా కందర్పవశగో మునిస్తామిదమబ్రవీత్ |
అప్సరః స్వాగతం తేఽస్తు వస చేహ మమాశ్రమే ||
6
అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్ |
ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్ ||
7
తపసో హి మహావిఘ్నో విశ్వామిత్రముపాగతః |
తస్యాం వసంత్యాం వర్షాణి పంచ పంచ చ రాఘవ ||
8
విశ్వామిత్రాశ్రమే తస్మిన్సుఖేన వ్యతిచక్రముః |
అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః ||
9
సవ్రీడ ఇవ సంవృత్తశ్చింతాశోకపరాయణః |
బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునందన ||
10
సర్వం సురాణాం కర్మైతత్తపోఽపహరణం మహత్ |
అహోరాత్రాపదేశేన గతాః సంవత్సరా దశ ||
11
కామమోహాభిభూతస్య విఘ్నోఽయం ప్రత్యుపస్థితః |
వినిఃశ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః ||
12
భీతామప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితామ్ |
మేనకాం మధురైర్వాక్యైర్విసృజ్య కుశికాత్మజః ||
13
ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ |
స కృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః ||
14
కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తస్య వర్షసహస్రాణి ఘోరం తప ఉపాసతః ||
15
ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయమ్ |
ఆమంత్రయన్సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః ||
16
మహర్షిశబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః |
దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః ||
17
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ |
మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః ||
18
మహత్త్వమృషిముఖ్యత్వం దదామి తవ సువ్రత |
బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ ||
19
[* న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః | *]
ప్రాంజలిః ప్రణతో భూత్వా ప్రత్యువాచ పితామహమ్ |
బ్రహ్మర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః ||
20
యది మే భగవానాహ తతోఽహం విజితేంద్రియః |
తమువాచ తతో బ్రహ్మా న తావత్త్వం జితేంద్రియః ||
21
యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః |
విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః ||
22
ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ |
ధర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః ||
23
శిశిరే సలిలస్థాయీ రాత్ర్యహాని తపోధనః |
ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్ ||
24
తస్మిన్సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ |
సంభ్రమః సుమహానాసీత్సురాణాం వాసవస్య చ ||
25
రంభామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః |
ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ ||
26
Balakanda Sarga 63 In Telugu Pdf With Meaning
విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు.
విశ్వామిత్రుని చూచి బ్రహ్మ “ఓ విశ్వామిత్రా! నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు.” అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు.
కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వసిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి.
ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్లాడు.
“ ఓ అప్సరసా! నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మధబాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు.”అని వేడుకున్నాడు.
విశ్వామిత్రుని కోరికను మన్నిచింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు.
అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడా గడా వణికి పోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి
మేనకను పంపించి వేసాడు.
తరువాత హిమాలయ పర్వతములకు వెళ్లాడు. ఇంద్రియము లను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరములో తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ ప్రకారంగా వేయి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడా ” పోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకొని విశ్వామితుని వద్దకు వెళ్లారు.
బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ” ఓ విశ్వామిత్రా! నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహా ఋషికి అయ్యావు. ఓ విశ్వామిత్రా! నీవు మహర్షివి.” అని అన్నాడు.
కాని విశ్వామిత్రునికి సంతోషము కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు.
“ఓ బ్రహ్మదేవా! నాకు మహర్షి పదవి లభించినది అనే మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను (అనగా ఇంద్రియములను జయించినవాడు) అయ్యానా!” అని అడిగాడు.
ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి “నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలి.” అని అన్నాడు.
తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు.
ఈ సారి చేతులుపైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సుచేయడం మొదలెట్టాడు. విశ్వామిత్రుడు ఎండా కాలంలో ఐదు అగ్నుల మధ్య, వర్షాకాలములో ఆరుబయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి, వేయి సంవత్సరములు తపస్సుచేసాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సుచూచి దేవేంద్రునకు దేవతలకు భయం పట్టుకుంది.
దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.