Balakanda Sarga 73 In Telugu – బాలకాండ త్రిసప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, మేము ఏ ఆహ్వానం లేదా వివాహ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా ఈ వివాహం కోసం కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సమానంగా మరియు వ్యక్తిగతంగా స్వాగతం. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా అక్కడికి వెళ్దాం.

దశరథపుత్రోద్వాహః

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్ |
తస్మింస్తు దివసే శూరో యుధాజిత్సముపేయివాన్ ||

1

పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్ ||

2

కేకయాధిపతీ రాజా స్నేహాత్కుశలమబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్రత్యనామయమ్ ||

3

స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థముపయాతోఽహమయోధ్యాం రఘునందన ||

4

శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ||

5

త్వరయాభ్యుపయాతోఽహం ద్రష్టుకామః స్వసుఃసుతమ్ |
అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ ||

6

దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ |
తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ||

7

ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

8

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ||

9

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |
వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ ||

10

రాజా దశరథో రాజన్కృతకౌతుకమంగళైః |
పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాంక్షతే ||

11

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ ||

12

ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ||

13

కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ||

14

కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేర్యథార్చిషః ||

15

సజ్జోఽహం త్వత్ప్రతీక్షోఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం క్రియతాం రాజన్కిమర్థమవలంబతే ||

16

తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |
ప్రవేశయామాస సుతాన్సర్వానృషిగణానపి ||

17

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మికైః ||

18

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో |
తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః ||

19

విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ |
ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః ||

20

అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమంతతః |
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః ||

21

అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః |
శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః ||

22

లాజపూర్ణైశ్చ పాత్రౌఘైరక్షతైరపి సంస్కృతైః |
దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ ||

23

అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

24

తతః సీతాం సమానీయ సర్వాభరణభుషితామ్ |
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా ||

25

అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ |
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ||

26

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా ||

27

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా |
సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా ||

28

దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ |
ఏవం దత్త్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ ||

29

అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః |
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాం చ మమాత్మజామ్ ||

30

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః |
తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత ||

31

పాణిం గృహ్ణీష్వ మాండవ్యాః పాణినా రఘునందన |
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః ||

32

శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా |
సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః ||

33

పత్నీభిః సంతు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యయః |
జనకస్య వచః శ్రుత్వా పాణీన్పాణిభిరస్పృశన్ ||

34

చత్వారస్తే చతసౄణాం వసిష్ఠస్య మతే స్థితాః |
అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవ చ ||

35

ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ ||

36

కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు |
పుష్పవృష్టిర్మహత్యాసీదంతరిక్షాత్సుభాస్వరా ||

37

దివ్యదుందుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిఃస్వనైః |
ననృతుశ్చాప్సరఃసంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ ||

38

వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత |
ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే ||

39

త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహౌజసః |
అథోపకార్యాం జగ్ముస్తే సదారా రఘునందనాః | [భార్యా]
రాజాప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ||

40

Balakanda Sarga 73 In Telugu Pdf With Meaning

దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.

(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).

కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడుఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.

“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను.” అని అన్నాడు యుధాజిత్తు.

దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాత:కాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.

పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.

“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములనుపూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! ” అని అన్నాడు.

“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదేకదా! వారికి అడ్డేమున్నది. వారునా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రెండు.” అని అన్నాడు జనకుడు.

జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.

“ ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.

వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హెమ కుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు.

తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీఛ్ఛ చైనాం భద్రం తే పాణిం గృష్ణాష్వ పాణినా|”

“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు.” అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.

ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.

తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు.” అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.

తరువాత జనకుడు భరతుని చూచి ” ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు.

ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.

ఓ రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.

అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమ మును వైభవోపేతంగా జరిపించాడు.

తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.

వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>

Leave a Comment