Gaja kacchava Sangramam in Telugu – గజ కచ్ఛవ సంగ్రామం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గజ కచ్ఛవ సంగ్రామం నీతికథ.

గజ కచ్ఛవ సంగ్రామం

(ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగుల కోరికమీద ” ‘అమృత కలశం’ తేవడానికి బయలుదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తం. డి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నారు.)

ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధరకముల జల పక్షులతో నయనానందకరంగా ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం (తాబేలు) ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మత్తగజం ఉన్నది.

ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ ఆ తాబేలుమపట్టిలాగి హిం సిస్తుండేవి. తాబేలు ఏనుగుకాళ్ళు పట్టి లోపాలకు ఈడ్చి హింస పెడ్తూ ఉండేది.

అలా అవి ఎన్నో ఎళ్ళుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతు వులూ నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు.

అదివిని గరుత్మంతుడు :
‘పితృపూజ్య వాటిమధ్య ద్వేషకారణం ఏమిటి?ఏనుగుతో తాబే లుకు పోరాటం ఎలా సంభవం’ అని ప్రశ్నించాడు.

కశ్యపుడు :
“నా కునా ! ఆ ప్రాణులు రెండూ పూర్వజన్మలో మానవులు. అ తమ్ములుగా పుట్టాయి. పెద్దవాడు విభాసుడు. రెండోవాడు సుబ్రతీకుడు.

ఇద్దరు నిత్యం ప్రాతః కాలంలోలేచి స్నానసంధ్యాదులు ముగించి, నియమ పరాయణులయి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధనసంపద ఉంది. ఆ ధనంలో తనవంతు తనకు పంచిపెట్ట మున్నాడు సుప్రతీకుడు.

అన్న విభాసుడు!
‘తమ్ముడూ ! ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు. మనం అన్నదమ్ములం. మనకు లోభం పనికిరాదు. పైగా ధనవ్యామో హంవల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి. అప్పుడు ఇరుగు పొరుగులు పరిష్కారం చెయ్యడానికివచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు: అందు వల్ల మనం సర్వనాశనం అవుతాం. కనక పంపకాలమాట ఎప్పుడూ మనస్సులోకి రానివ్వకు. ఇంటి పెద్దకొడుకు తండ్రితో సమానం. నువ్వు నా బిడ్డవంటివాడవు’ అని సముదాయించ బోయాడు.

సుప్రతీకుడు వినలేదు. ఏమయినాసరే పంపకాలు జరిగి తీరా అన్నాడు.
అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి –
‘ అన్న గారి మాటమీద గౌరవంలేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భానపడి, గజజన్మఎత్తు’ అని శపించాడు.
సుప్రతీకుడు మరింతకోపంతో – ‘అదే అరణ్యంలో చెరువులో కాబేలువై పుడతావు నువ్వు’ అని శపించాడు.

ఇద్దరూ పవిత్రమానవ శరీరాలు విడిచి జంతువు లయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టుమీదనిలిచి ఘీంకరిస్తుంది. తాబేలు నీటిమీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభమవుతుంది.

అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో.
ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు, పొడవు వన్నెండు యోజనాలు .
తాబేలు చుట్టుకొలత పది యోజనాలు, మందం మూడు యోజనాలు,

ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనం గగ్గోలయి పోతున్నాయి.
ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు.
ఆ వనంలో ఏ మృగమూ హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశంలేదు.

ఆ రెండుజంతువులనూ నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువూ, వనమూ, మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంత ములో పక్షులూ, జంతువులూ స్వేచ్ఛగా తిని, తాగి, తిరుగుతాయి. వెళ్ళు, నీకు శుభం” అని తండ్రి ఆశీర్వదించాడు,

గరుత్మంతుడు తండ్రికి నమస్కారంచేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి, సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు.
తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్కపూపులో క్రిందికిదిగి గరుత్మంతుడు ఒక కాలిగోళ్ళకు తాబేలును తగిలించి, రెండవ కాలిగోళ్ళతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు.

ఈ విధంగా ఆ అన్నదమ్ములపోరు ముగిసింది.
ఈ కథను విన్నవారే దీర్ఘకాలంసాగే పోటీలనూ, పోరావాలనూ గజకచ్ఛవసం గ్రామంతో పోలుస్తూంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment