Gowri Devi Pooja Vidhanam In Telugu- శ్రీ గౌరి దేవి పూజ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజలు హిందూ మతంలో ఆరాధన, ప్రార్థన, మరియు ధార్మిక అనుబంధానికి ముఖ్యమైన భాగం. పూజలు దేవతలకు, దేవుళ్లకు, మరియు ఇతర ఆధ్యాత్మిక శక్తులకు ఆరాధన చూపడానికి, వారి ఆశీర్వాదాలు పొందడానికి చేస్తారు. పూజల ద్వారా మనసుకు శాంతి, ఆనందం, మరియు అనుభూతిని పొందవచ్చు. గౌరి పూజా హిందూ మతంలో ముఖ్యమైన పూజా. ఇది ముఖ్యంగా ఆడవారు వారి కుటుంబ సంక్షేమం కోసం మరియు భర్తల దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. గౌరి దేవి పూజ, ముఖ్యంగా గౌరి హబ్బా లేదా గౌరిహబ్బా అని కూడా పిలుస్తారు, ఇది గణేష్ చతుర్థికి ముందు రోజు జరుపుకుంటారు. గౌరి దేవి పూజా, పరమ శివుడి భార్య అయిన గౌరి దేవిని ఆరాధించడం ద్వారా ప్రారంభమవుతుంది. గౌరి దేవి శక్తి మరియు కాంతి స్ఫూర్తిని సూచిస్తుంది. ఆమెను ఆరాధించడం వల్ల జీవితంలో శుభం, ఆనందం మరియు శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గౌరి దేవి పూజ గురించి తెలుసుకుందాం.

శ్రీ గౌరి దేవి పూజ

ప్రాణ ప్రతిష్ఠా

హ్రాం హ్రీం క్రోం యం రం లం సం శం షం హం సః
మంగళ గౌరీదేవతా స్థిరా భవతు – సుప్రసన్నా భవతు – వరదా భవతు – అనుచు గౌరీదేవిని ప్రతిష్ఠించి ఈ క్రింది విధముగా జెప్పుచూ నమస్కారము చేయవలెను.

దీపారాధనమ్

శ్లో॥ దీపస్త్వం బ్రహ్మరూపో సి – జ్యోతిషాం ప్రభు రవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ – సర్వాన్ కామాంశ్చ దేహి మే ||
దీపదేవతాభ్యోనమః – అని దీపమును పువ్వులతో పూజించవలెను. తరువాత పరిశుద్ధహృదయముతో పుష్పములు తీసికొని మ్రొక్కుచు శ్రీ మంగళగౌరీ దేవిని ఈ విధముగా ధ్యానించవలెను.

శ్లో॥ సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరి కాం
సమందహాసితేక్షణాం – సశరచాపపాశాంకుశాం |
అశేషజనమోహినీ – మరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం – జపవిధౌ స్మరే దంబికామ్ ॥

కల్లోలోల్ల సితామృతాబ్దిల హరీ – మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికాపరివృతే – కాదంబవాట్యుజ్జ్యలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభా -మధ్యే విమూనోత్తమే
చింతారత్నవినిర్మితం జనని! తే – సింహాసనం భావయే॥

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్నఖచితసింహాసనం సమర్పయామి అని వినుతించి శ్రీ మంగళగౌరికి సింహాసనము నొసంగినట్లు భావన చేసి పువ్వుల నుంచవలెను.

ఆవాహనమ్

ఆగచ్ఛ సర్వదేవేశి। సర్వకార్యార్థసిద్ధయే।
సర్వసిద్ధిప్రదే! దేవి। సర్వపాపప్రణాశిని.
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః ఆవాహనం సమర్పయామి.

పాద్యమ్

గంగాదిసలిలై ర్యుకై – సుగన్దేన సువాసితం!
పాద్యం గృహాణ సుశ్రోణి – రుద్రపత్ని! నమోస్తుతే ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః పుష్పముతో చల్లవలెను.
అర్ఘ్యం సమర్పయామి కలశ జలమును

అర్ఘ్యమ్

భాగీరథ్యాదిసలిలం – నానాతీర్థసమన్వితం
కర్పూరగంధసంయుక్త మర్థ్యం తుభ్యం దదా మ్యహమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – అర్ఘ్యం సమర్పయామి- అని కలశ జలమును పుష్పముతో చల్లవలెను.

ఆచమనమ్

హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆచమనం సమర్పయామి.

అని కలశములోని జలమును దేవి ఆచమనమును చేయుట కనుకొని, పుష్పముతో అందించవల యును.

మధుపర్కమ్

స్వర్ణపాత్రే సమానీతం – దధిఖండమధుపుతం
మధుపర్కం గృహాణేదం – మయా దత్తం సరేశ్వరి ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – మధుపర్కం సమర్పయామి. మధుపర్కమును సమర్పించవలెను. (పాలు, తేనె కలిపిన ద్రవ్యము)

పంచామృతమ్

క్షీరం దధ్యాజ్యమధురా – శర్క రాఫల సంయుతం
స్నానం స్వీకురు దేవేశి। సర్గస్థిత్యంతరూపిణి॥
హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – పంచామృతస్నానం సమర్పయామి.

స్నానమ్

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి. పువ్వుతో నీరు జల్లవలెను.

వస్త్రమ్

సర్వదే! సర్వదా గౌరి! సర్వాభరణ భూషితే !
పీతాంబరద్వయ మిదం గృహాణ పరమేశ్వరి.

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – కంచుకం సమర్పయామి – అని రవికె, వస్త్రము మున్నగునవి సమర్పించి పువ్వులు చల్లి నమస్కరించవలెను.

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః ఉత్తరీయం సమర్పయామి – ఉత్తరీయమును సమర్పించవలెను.

గన్దం

గన్దం మనోహరం దివ్యం – దివ్యం – ఘనసారసమన్వితం
తుభ్యం భవాని ! దాస్వామి – చోత్తమం చానులేపనమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః – చల్లని గంధం సమర్పయామి గంధమును గౌరీదేవిపై చిందించవలెను.

అక్షతలు

అక్షతాన్ శుభవర్ణాభాన్ – హరిద్రాద్యై స్సుసంయుతాన్
కాత్యాయని ! గృహాణ త్వం – సర్వదేవనమస్కృతే.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయైనమః – అక్షతాన్ సమర్పయామి.

మరిన్ని పూజలు:

Leave a Comment