Sai Manasu Maniharamulu In Telugu – సాయి మనస్సు మణిహారములు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి మనస్సు మణిహారములు గురించి తెలుసుకుందాం…

Sai Manasu Maniharamulu Telugu

సాయి మనస్సు మణిహారములు

పది కనులు పడకుండను పదిల పరచి
ముచ్చట గొలుపు తీరుగ మోము దిద్ది
భక్తి భావన లొలుకగా పరమ నిరతి
నిన్ను చేరితి మదిలోన నిలువు సాయి

1

గర్వపడుచుందు జనకుల గాంచి నేను
ఆది గురువులయిరి నాకు అమ్మ నాన్న
ఋణము దీర్చగ నాదంటు ఏమి గలదు
వారికొసగెద నతులను భక్తి సాయి

2

చూడుమయ్య ఈ మదిలోని చూపు లెల్ల
చిత్రములు చేయు చుండెను శిథిల మవగ
నవ్వినట్టి తారల వెంట నడిచి వెడల
అదుపు తప్పెడు మముమార్చు మయ్య సాయి

3

నిన్ను చూడకున్న కనులు నిలువ వాయె
అందమైన దేముండెనో అక్షయాత్మ
నిన్ను వదలగ ఈమది నిలువ బోదు
అంధకారమై తో రావయ్య సాయి

4

ఎంత చెప్పిన మారదు వింత మనసు
తనకు నచ్చిన దానికి తలను ఊపి
మాను దొరికి మురిసినట్టి మల్లె వోలె
ఎదిగి పోయి నేర్చెను వెక్కిరించ సాయి

5

దాచినంతన ప్రేమలు దాగబోవు
ముల్లెగట్టి మురియ చూడ ముసరి పోవు
మనసు విప్పనంతగనవి మాయమవవు
విప్పి చెప్పి చూడంగను విరియు సాయి

6

సంకట మొకటి వాటిల్లె సంశయముగ
మొదట ఈమది పరుగెత్తి మోస బోయె
తనకు నచ్చిన దెల్ల సొంతమని తలచి
నన్ను విడచి ఎడారిలో నడిచె సాయి

7

మధుర పిలుపుతో తాకిరి మనసునెవరో
మగువయో మణి మాణిక్య మాల ఏమొ
రాగమో బంధమో లేక రాణి చెలిమి
మహిమయో నాకు తెలుపుము మహిత సాయి

8

గాలిలోని దీపానికి గాఢమైన
మనసు కలిగెను నీపైన మంజునాథ
లోకమునకంత నీదు వెల్గులను నింపి
నిరతముగ మము బ్రోవుమా నిత్య సాయి

9

ఎప్పుడెటు పోవునో మది నెరుగు నెవరు
ముందెరుగని లోకాలతో మురియ చేసి
వెనక గోతులతో మాటు వేసి యుండు
ఆటలాడే మదిని గాంచు మయ్య సాయి

10

తలచి తలపోసి మాదైన తనువు సతము
పరితపించుచు నున్నది ప్రాణదాత
ఎదురు చూపులతో ప్రతి యెదయు గూడ
మూగ వోయె గొంతుకలన్ని సాగి సాయి

11

మానవతకు నిలయము నీ మందిరమట
అలజడుల నెదురించుచు అలసిపోయి
భక్తితో మమ్ము నీవె కాపాడుదువని
నిర్మలమ్మగు మది ముందు నిలిచె సాయి

12

మనసు నీకు మందిరముగ మలచియుంచి
పరచితిని నేను మమతల పాన్పునయ్య
సాధుమూర్తి సకల గుణశాలి దేవ
నిలువుమయ్య ఈ మది నిండ నీవు సాయి

13

మరిన్ని భక్తి గీతాలు

Leave a Comment