Mantra Matruka Varnamaala Sthotram In Telugu | మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Mantra Matruka Varnamaala Sthotram In Telugu

మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్

కల్లోలోల్లసితా మృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్జ్వలే
రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే ||

1

ఏణాంకానల భానుమండల లసఛ్ఛీ చక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశా బిభ్రతీం
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంస మకుటాంచారుస్మితాంభావయే ||

2

ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమ చందనాది భరిత్యై రర్ఘ్యం స రత్నాక్షతైః
శుద్దె రాచమనీయకం తప జలై ర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృత వారిధే తదఖిలం సంతుష్టయే కల్ప్యతామ్ ||

3

అక్ష్యే యోగిజనస్య రక్షిత జగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకైః
గోక్షీరై రపి నారికేళసలిలై శ్శుద్దోదకై ర్మంత్రితై
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్ప్యతాం ||

4

హ్రీంకారాంకిత మంత్రలక్షతతనో హేమాచలత్సంచితైః
రత్నైరుజ్జ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకం
ముక్తాసంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం
దత్తం దేవి ధియా మయై దతఖిలం సంతుష్టయే కల్ప్యతామ్ ||

5

హంసై రప్యతి లోభనీయ గమనే హోరావళీ ముజ్జ్వలాం
హిందోళద్యుతి హీరపూరితతరే హేమాంగదే కంకణే
మంజీరే మణికుండలే మకుట మప్యర్ధేందు చూడామణిం
నాసామౌక్తిక మంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు ||

6

సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండాదర్శన మండలే నయనయో ర్దివ్యాంజనం తేంచితం
కంఠాణ్ణి మృగనాభిపంక మమలం త్వత్రీతయే కల్ప్యతామ్ ||

7

కల్హారోత్పల మల్లికా మరువకెః సౌవర్ణపంకేరుహైః
జాజీ చంపక మాలతీ వకుళకై ర్మందార కుందాదిభిః
కేతక్యా కరవీరకై ర్భహువిధైః క్లుప్తాః సజోమాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ||

8

హంతారం మదనస్య నందయసి యైరంగై రనంగోజ్జ్వలై
ర్యైర్భృంగావళి నీలకుంతలభరై ర్బధ్నాసి తస్యాశయం
తానీమాని తవాంబ కోమలతరా ణ్యామోద లీలాగృహా
ణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతై ర్ధూపై రహం ధూపయే ||

9

లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహో ద్భాసాన్తరే మన్దిరే
మాలారూప విలంబితై ర్మణిమయ స్తంభేషు సంభావితైః
చిత్రైర్హాటక పుత్రికా కరధృతైర్గవైర్ఘృతైర్వర్థితైః
దివ్యై ర్దీపగణై ర్థియా గిరిసుతే సంతుష్టయే కల్ప్యతాం ||

10

హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైః స్థాలీ సహస్త్రైర్యుతం
దివ్యాన్నం ఘృత సూపశాక భరితం చిత్రాన్నభేదం తథా
దుగ్ధాన్నం మధుశర్కరా దధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూప సహస్రమంబస ఫలం నైవేద్య మావేదయే ||

11

సచ్ఛాయైర్వర కేతకీ దళరుచా తాంబూలవల్లీ దళైః
పూగైర్భూరిగుణైః స్సుగంధి మధురైః కర్పూర ఖండోజ్జ్వలైః
ముక్తాచూర్ణ విరాజితై రృహువిధై ర్వక్రాంబుజా మోదితైః
పూర్ణారత్నకలాచికా తవ ముదే న్యసా&త పురస్తాదుమే ||

12

కన్యాభిః కమనీయ కాంతిభి రలంకారామలా రార్తికా
పాత్రే మౌక్తిక చిత్రపంక్తి విలస త్కర్పూర దీపాళిభిః
తత్తత్తాళ మృదంగగీత సహితం నృత్య త్పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతామ్ ||

13

లక్ష్మీర్మౌక్తి కలక్షకల్పిత సిత చ్ఛత్రం తు ధత్తే రసా
దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధతే &త స్వయంభారతీ
వీణామేణ విలోచనా స్సుమనసా తానృత్యంతి తద్రాగవ
ద్భావై రాంగిక సాత్వికైః స్ఫుటరసం మాత స్త్వమాకర్ణ్యతాం ||

14

హ్రీంకార త్రయ సంపుటేన మనునో పాస్యే త్రయీ మౌళీభిః
వాక్యై ర్లక్ష్యతనో ! తవ స్తుతి విధౌ కో వాక్షమేతాంబికే
సల్లాపాస్తుృతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తుతే
సంవేశో నమస్సహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం ||

15

శ్రీ మంత్రాక్షర మాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామల స్యాచిరాత్
చిత్తాంభోరుహ మంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా
ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా ||

16

ఇతి గిరివరపుత్రీ పాదరాజీవ భూషా భువన మమలయంతి సూక్తిసౌరభ్య సారైః
శివపద మకరన్ద స్యన్దినీ మన్నిబద్దా
మదయతు కవిభృంగా న్మాతృకా పుష్పమాలా ||

17

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పూజ్య పాదాచార్యులు చెప్పిన మంత్ర మాతృకా పుష్పమాలాత్మకమైన నిత్య మానసపూజా స్తుతి సంపూర్ణము.

మరిన్ని స్తోత్ర పోస్ట్లు మీకోసం:

Leave a Comment