Sri Mahalakshmi Vaibhavam In Telugu – శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి భారతీయ హిందూ సామ్రాజ్యాలులో పూజించబడును ఉన్న ప్రధాన దేవి. ఆమె ధన, సమృద్ధి, ఆరోగ్య, ధర్మ, కీర్తి, ప్రేమ, ఆశీర్వాద మరియు సౌందర్యమును సూచించేవారు. మహాలక్ష్మీదేవి విష్ణువుని పత్ని మరియు ఐశ్వర్యము, ధనము, లక్ష్మీ రూపముగా ఉన్నారు. ఆమెను పరమేశ్వరుడు మరియు విష్ణువు చేత ప్రేమపూర్వకముగా పూజించబడుతారు.

శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

శ్లో ॥ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం||

శ్లో ॥ జయతు జయతు లక్ష్మీర్దేవ సంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా
జయతు జయతు నిత్యానిర్మల జ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా |

చరాచర సృష్టిలోని సకల జీవావళికి తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి. కంటికి రెప్పలా ఆ తల్లి మనలంనదరినీ రక్షిస్తూ వుండటం వల్లనే మనం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఈ భువిలో జీవించ గలుగుతున్నాము. సకల శుభాలూ, సంపదలూ, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ అలౌకిక ఆనందదాయిని, పరతత్వ సంధాయిని, మోక్షప్రదాయిని కూడా అయిన ఆ తల్లిని సమస్త దేవతాగణం సదా సేవిస్తూ వుంటారు. ఆ తల్లి నిత్య సత్యస్వరూపిణి. శాశ్వతమైన, నిజమైన ఆనందం ఆ మాతఅనుగ్రహంవల్లనే లభిస్తుంది. నిజానికి మనమందరం ఆ తల్లి ప్రతిరూపాలమే. అందరి హృదయాలలోను ఆమెనివాసమై వుంటుంది. ఆ విషయం తెలుసు కోవడమే నిజమైనజ్ఞానం. ఆజ్ఞానం కూడా ఆతల్లిని సేవించటంవల్లనే లభిస్తుంది.

యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

జీవులందరిలోనూ చైతన్యశక్తి రూపంగా ఆ విశ్వమాత నెలకొని వుంటుంది. అన్ని రకాల శక్తులూ ఆ తల్లి కరుణ వల్లనే లభిస్తాయి. బ్రహ్మరుద్ర ఇంద్రాదులచే సేవించబడే ఆ మాత స్థితికారకుడైన శ్రీమహావిష్ణువుకు ఇల్లాలు. మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అన్నారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి సాత్వికమూర్తి. స్థితి నిర్వాహణ బాధ్యతలో ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేదోడు వాదోడుగా తన వంతు పాత్రని ఎంతో సమర్థవంతంగా పోషిస్తుంది విష్ణుపత్ని అయిన శ్రీమహాలక్ష్మీదేవి. దుష్టశిక్షణ చేసి సజ్జనులను రక్షించి ధర్మసంస్థాపన చేయటం కోసం, ఆ జగత్పిత శ్రీమహావిష్ణువు ఏకంగా వివిధ రూప విశేషాలతో అవతారాలను దాల్చటం జరిగిందో, అదే విధంగా జగన్మాత లక్ష్మీదేవి కూడా లోక కళ్యాణానికై అష్టలక్ష్మీ రూప ధారణ చేసింది. ఆ తల్లి ఆ అవతారాలన్నీ తన పిల్లలమైన మన అభ్యున్నతి కోసమే దాల్చింది.

శ్రీ అనే పదం ద్వారా లక్ష్మీదేవి వేదాలలో సంపద, ఐశ్వర్యము, శక్తి, శుభం అనే అర్థాలలో గుర్తించబడింది. విష్ణుపురాణం ద్వారా లక్ష్మీదేవి పుట్టు పూర్వోత్తరాలు, బ్రహ్మవైవర్త, మార్కండేయ పురాణాల ద్వారా లక్ష్మీదేవి ప్రశస్తి, ఆమె నివాస స్థానాలు గురించి వివరంగా తెలుస్తోంది. వేదాంగాలలో ముఖ్యమైనది అయిన శతపథ బ్రాహ్మణంలో లక్ష్మి అందానికి అధిష్ఠానదేవతగా చెప్పటం జరిగింది.

శ్లో ॥ యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయసాక్షి
గంభీరావర్త నాభిః స్తనభరనిమితా శుభ్రవస్త్రోత్తరీయా
లక్ష్మీర్తివైర్గజేంద్రః మణిగణఖచితై స్నాపితా హేమకుంభై:
నిత్యం సాపద్మహస్తామమవసతుగృహేసర్వమాంగళ్యయుక్తా!॥

నిత్యం ఆ లక్ష్మీదేవి ఆరాధన జరిగే వారి గృహంలో సమస్త శుభాలూ నెలకొని వుంటాయి. ఋగ్వేదంలోని శ్రీసూక్తంలో లక్ష్మీదేవి దివ్యమైన గజేంద్రాలు (ఏనుగులు) యిరువైపులా సేవిస్తూ వుండగా మహా పద్మంలో పద్మాసన భంగిమలో కూర్చుని వుంటుంది అని వర్ణించబడింది. ఆ గజేంద్రాలు బంగారు కలశాలతో ఆ తల్లిపై అమృతవర్షం కురిపిస్తూ వుంటాయి. లోక వ్యవహారాలలో “లక్ష్మి” అనే పదం మన నిత్య జీవితంతో పెనవేసుకు పోయిన ఒక మహత్తరమైన ప్రజ్ఞావిశేషం. గృహానికి శోభనిచ్చే ఇల్లాలుని గృహలక్ష్మిగా సంభావిస్తూ వుంటాం. అదృష్టవంతుడైన ఒక వ్యక్తిని గూర్చి చెప్పాలంటే వాడికేమిరా లక్ష్మీ పుత్రుడు అంటాం. అలాగే ఒక అందమైన ఆడపిల్లని చూసినప్పుడు ఆహా ఈ పిల్ల మొహంలో లక్ష్మీకళ తాండవిస్తోంది అని అనుకుంటాం. విరిసిన ముద్ద మందారం, తామరపూవులను చూసినపుడు మనసు దైవీకమైన భావనతో నిండిపోయి ఆ తల్లి లక్ష్మీదేవే గుర్తుకు వస్తుంది.

మరిన్ని:

Leave a Comment