మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఉత్తమ సంసారి ఇలా ఉండాలి నీతికథ.
ఉత్తమ సంసారి ఇలా ఉండాలి.
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)
” మహామునులారా !
జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు”. అని సూతుడు కథ మొదలు పెట్టాడు.
జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు.
క్రింద పెద్ద గొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు.
దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు. ఆశ్చర్యంతో వారిని సమీపించి :
‘అయ్యా ! మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు. నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు.
నాయనా! మేము వరమ విషాదంతో యిలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం.
ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగి పోతుంది. మేము ఈ నరకకూపంలో పడతాం. వాడు వివాహం చేసు కుని సంతానవంతుడై తే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి’ అన్నారు. అప్పుడా ముని :
‘ఆర్యా, నేనే ఆ జరత్కారుడను. మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను’ అని తనకు తగిన భార్యకోసం అన్వేషణ ఆరంభించాడు.
తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు.
ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి.
తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి
‘మహామునీ ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలూ ఉద్ధరించండి’ అని ప్రార్థించాడు.
అందుకు అంగీకరించాడు జరత్కారుడు.
ఒకానొక సుముహూర్తంలో వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో
‘ధర్మచారిణి ఈ రోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు ! ” అన్నాడు.
జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి, నిరంతరం పతిసేవతో గున్నది.
అలా ఆయన మనసుకి అనుగుణంగా మెంగుతూ, ఆయన అను రాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ, గర్భవతి అయింది.
రోజులు గడుస్తున్నాయి.
ఒకనాడాయన తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన, తన భార్య తొడమీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు.
సూర్యుడు పడమటి కొండకు చేరాడు.
మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు.
అప్పుడామె ఆలోచనలో పడింది.
సంధ్యాసమయంలో జరపవలసిన వేదవిహిత కర్మలకు లోపం రాకూడదు కదా ! ఇప్పుడీయనను లేపితే కోపం వస్తుందేమో! లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపంవస్తే అది నేను భరించాలి. కాని ధర్మలోపం జరగరాదు కదా అని నిశ్చయించి నిద్ర లేపింది.
సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది.
‘ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు?’ అని తీవ్రంగా అడిగాడు.
‘స్వామి | సంధ్యాసమయం అయింది. మీరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా !’ అంది.
‘ఎంత వెర్రిదానివి. నేను నిద్రపోతూండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు. కనుక వా నియమ ప్రకారం నిన్ను విడిచి పెడుతు న్నాను. అయితే యింత కాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతో షము కలిగించింది.
ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయవంశాలనూ ఉద్ధరిస్తాడు. మవ్వు నిర్వి చారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు’ అని తన కమండలుపు తీసు కుని ఆయన వెళ్ళిపోయాడు.
విచారంతో జరత్కారువు తన అన్న గారి దగ్గరకు వచ్చింది.
జరిగిన విషయం విన్నాడు వాసుకి. సోదరిని ఓదార్చి, ఆదరంతో చూసుకుంటున్నాడు.
నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసుకి పరమానందంతో వారుభయులకూ ఉచిత సేవలు చేయించాడు.
పెరిగిన కుమారునికి ఆ స్తీకుడని పేరు పెట్టారు.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడై, పర్వ విద్యలూ నేర్పి పలువురి ప్రశంసలు పొందాడు.
‘ఈ ఆస్తీకుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్ప యాగాన్ని ఆపి తన తల్లి చుట్టాఅయిన నాగజాతిని మహ వివత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు.” జ్ఞానులయినవారు సంసార కూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తిచేసి విరాగు లవాలి.
మరిన్ని నీతికథలు మీకోసం: