Sri Mrityunjaya Stotram In Telugu – మృత్యుంజయ స్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మృత్యుంజయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mrityunjaya Stotram In Telugu

మృత్యుంజయ స్తోత్రమ్

పల్లవి:

శంబో! మహాదేవ! శంభో! మహాదేవ!
శంభో! మహాదేవ! గంగాధరా!
మృత్యుంజయా! పాహి మృత్యుంజయా! పాహి
మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!!

చరణం:

1. అద్రీశ జాధీశ! విద్రా వితామౌఘ! భద్రాకృతే పాహి మృత్యుంజయా.
2. ఆకాశకేశా మరాధీశవంద్య! త్రిలోకేశ్వరా! పాహి మృత్యుంజయా.
3. ఇందూపలేందుప్రభోత్ఫుల్లకుందార విందాకృతే! పాహి మృత్యుంజయా.
4. ఈక్షాహతానంగ- దాక్షాయణీనాథ-మోక్షాకృతే-పాహి మృత్యుంజయా
5. ఉక్షేశ సంచార – యక్షేశ సన్మిత్ర – దక్షార్చితా! పాహి మృత్యుంజయా.
6. ఊహాపథాతీత మాహాత్మ్య సంయుక్త – మోహాంతకా! పాహి మృత్యుంజయా
7. ఋద్ధిప్రదాశేషబుద్ధిప్రతారజ్ఞ – సిద్దేశ్వరా! పాహి మృత్యుంజయా.
8. ఋపర్వతోత్తుంగ శృంగాగ్ర సంగాంగహేతో – సదా పాహి మృత్యుంజయా.
9. ప్తాత్మ భక్తాఘ సంఘాతి సంఘాతు కారి ప్రహన్ – పాహి మృత్యుంజయా.
10. తీకృతానేక పారాది కృత్యంతనేయాధునా -పాహి మృత్యుంజయా.
11. ఏకాదశాకార- రాకేందు సంకాశ -శోకాంతకా – పాహి మృత్యుంజయా.
12. ఐశ్వర్యధామార్క వైశ్వానరాభాస విశ్వాధికా -పాహి మృత్యుంజయా.
13. ఓషద్యధీశాంశ భూషాధి పాపౌఘ మోక్షప్రదా -పాహి మృత్యుంజయా.
14. ఔద్ధత్యహీన – ప్రబుద్ధప్రభావ – ప్రబుద్ధాఖిలా -పాహి మృత్యుంజయా.
15. అంబా సమాక్లిష్ట – లంబోదరాపత్య – బింబాధరా -పాహి మృత్యుంజయా.
16. అస్తోక కారుణ్య – దుస్తార సంసార – నిస్తారణా -పాహి మృత్యుంజయా.
17. కర్పూర గౌరాగ్ర సరాఢ్య కందర్ప – దర్పాపహా – పాహి మృత్యుంజయా.
18. ఖద్యోతనేత్రాగ్ని విద్యుద్గహర్షాది – విద్యోతితా -పాహి మృత్యుంజయా.
19. గంధేభ చర్మాంగ సక్తాంగ సంసార సింధుప్లవా -పాహి మృత్యుంజయా.
20. ఘర్మాంశు సంకాశ ధర్మైక సంప్రాప్య- మృత్యుంజయా పాహి మృత్యుంజయా.
21. జోత్పత్తి బీజాఖిలోత్పత్తి బీజామరాధీశ – మాం పాహి మృత్యుంజయా.
22. చంద్రార్ధ చూడామరేంద్రార్చితానంద సాంద్రా -ప్రభో – పాహి మృత్యుంజయా.
23. ఛందశ్శిరోరత్న సందేహ సంవేద్య – మందస్మితా -పాహి మృత్యుంజయా.
24. జన్మక్షయాతీత – చిన్మాత్రమూర్తే – భవోన్మూలనా -పాహి మృత్యుంజయా.
25. ఝుణచ్ఛారు ఘంటా మణి వ్రాతకాంచీ గుణశ్రోణికా- పాహి మృత్యుంజయా.
26. ఇణిత్యష్టచింతాంతరంగ శ్రమోచ్చాటనానందకృత్ -పాహి మృత్యుంజయా.
27. టంకాతి టంకా మరున్నేత్ర భంగాంగనా సంగతా – పాహి మృత్యుంజయా.
28. ఠాళీమహాపాళి కేళీ తిరస్కారి సత్ ఖేలనా -పాహి మృత్యుంజయా.
29. డోలాయ మానాంతరంగీకృతానేక లాస్యేశ మాం పాహిమృత్యుంజయా.
30. ఢక్కాధ్వనిధ్వాన దాహధ్వని భ్రాంత శత్రుత్వ -మాం పాహి మృత్యుంజయా.
31. ణాకారనేత్రాంత సంతోషితాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయా.
32. తాపత్రయాత్యుగ్రదావానలా – సాక్షిరూపావ్యయా – పాహి మృత్యుంజయా.
33. స్థాణో – మురారాతి బాణోల్ల సత్పంచ బాణాంతకా -పాహి మృత్యుంజయా.
34. దీనావనాద్యంత హీనాగమాంతైక మానోదితా – పాహి మృత్యుంజయా.
35. ధాత్రీ ధరాధీశ పుత్రీపరిష్వంగ చిత్రాకృతే – పాహి మృత్యుంజయా.
36. నందీశవాహార విందాసనారాధ్య వేదాకృతే – పాహి మృత్యుంజయా.
37. పాపాంధకార ప్రదీపాలి ద్వయానందరూప – ప్రభో! పాహి మృత్యుంజయా.
38. ఫాలాంబకానంత నీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధా – పాహి మృత్యుంజయా.
39. బాలార్క బింబాంశుభాస్వజ్జటాజూటికాలంకృతా – పాహి మృత్యుంజయా.
40. భోగీశ్వరానంత యోగిప్రియాభీష్టభోగప్రదా – పాహి మృత్యుంజయా.
41. మౌళిద్యునద్యూర్శి మాలాజటాజూటికాళీప్రియా – పాహి మృత్యుంజయా.
42. యజ్ఞేశ్వరాఖండ తర్జానిధీ దక్షయజ్ఞాంతకా – పాహి మృత్యుంజయా.
43. రాకేందుకోటి ప్రతీకాశలోకాది సృడ్వందితా – పాహి మృత్యుంజయా.
44. లంకేశ వంద్యాంఘి పంకేరుహా శేష శంకాపహా – పాహి మృత్యుంజయా.
45. వాగీశవంద్యాంఘి వందారు మందార – శౌరిప్రియా – పాహి మృత్యుంజయా.
46. శర్వాఖిలాధార సర్వేశగీర్వాణ గర్వాపహా – పాహి మృత్యుంజయా.
47. షడ్వక్త్రతాత త్రిషాడ్గుణ్య లోకాది సృడ్వందితా – పాహి మృత్యుంజయా.
48. సోమావతం సాంతరంగ స్వయంధామ సామప్రియా – పాహి మృత్యుంజయా.
49. హేలా నిగీర్ణోగ్రహాలా హలాసహ్యకాలాంతక – పాహి మృత్యుంజయా.
50. ళాణీధరాధీశ బాణాసనాపాస్త శోణాకృతే – పాహి మృత్యుంజయా.
51. క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే – పాహి మృత్యుంజయా.
52. ఈశార్చితాంఘ్ర మహేశాఖిలావాస కాశీపతే -పాహి మృత్యుంజయా.

మృత్యుంజయా! పాహి, మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!
పాహి, మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!!
శంభో మహాదేవ! శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధరా!!
హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ
ఇతి శ్రీ మృత్యుంజయ స్తోత్రం సమాప్తమ్

మరిన్ని స్తోత్రములు

Leave a Comment