మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివషడక్షరీ స్తోత్రము గురించి తెలుసుకుందాం…
Sri Shiva Shadakshara Stotram Lyrics Telugu
శివషడక్షరీ స్తోత్రము
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మాత్ ఓం కారాయ నమోనమః॥
1
ఓం నం॥
నమంతి మునయస్స ర్వే నమ త్యప్సరసాంగణాః
నరాః నమంతి దేవేశం “న” కారాయ నమోనమః ||
2
ఓం మం||
మహాదేవ మహాత్మానం మహాధ్యాన పరాయణం
మహాపాపహారం దేవం “మ” కారాయ నమోనమః
3
ఓం శిం॥
శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
శివ మేకపరం నిత్యం “శి” కారాయ నమోనమః ॥
4
ఓం వాం॥
వాహనం వృషభోయస్య, వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వ” కారాయ నమోనమః ||
5
ఓం యం॥
యకారే సంస్థితో దేవో యకారం పరమంశుభం
యం నిత్యం పరమానందం “య” కారాయ నమోనమః
6
యః క్షీరాంబుధి మంధనోద్భవ మహాహాలాహలం భీకరం
దృష్ట్వాతత్ర పలాయతా స్సురగణా న్నారాయణాదీ స్తదా
సంపీత్వా పరిపాలయ జ్జగదిదం విశ్వాధికం శంకరం
సేవ్యేన తృకలాపదాం పరిహర తైలాసవాసీ విభుః ||
7
షడక్షర మిదం సోతత్రం య పఠే చ్చివ సన్నిధౌ
తస్యమృత్యుభయం నాస్తి వ్యాపమృత్యుభయం కుతః ॥
8
యత్కృతత్యంతన్న కృత్యంయదకృత్యంకృత్యవ త్తదాచరితమ్
ఉభయోః ప్రాయశ్చిత్తం శివతవనామాక్షర ద్వయోచ్చరితమ్ ||
9
శివ శివేతి శివేతి శివేతి వా భవ భవేతి భవేతి భవేతివా
హర హరేతి హరేతి హరేతివా, భజ నమశ్శివ మేవనిరంతరమ్ ||
10
మరిన్ని స్తోత్రములు