Varalakshmi Vratham Pooja Vidhanam In Telugu – శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

Varalakshmi Vratham Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాం…

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. కొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లల చేత పెద్ద ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దగ్గరవుండి శ్రద్ధగా చేయిస్తూ వుంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకి అనువైనవే అయినా, ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసే పూజ వల్ల విశేషమైన ఫలితాలను పొందటం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకుని, స్త్రీలు నూతన వస్త్రాలు ధరించి ఈ పూజలు చేసుకొంటారు.

వ్రతం చేయు విధానం

ఇంటికి తూర్పుదిశలో పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ మంటపాన్ని రంగవల్లులతో అలంకరించి, ఒకకొత్త తువ్వాలుపై బియ్యం పరచి దాని మధ్యలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. లేత మర్రిచిగుళ్ళు, లేత మామిడి ఆకులు వంటి పంచ పల్లవాలతో అలంకరించిన కలశంపై కొబ్బరికాయ, దానిపై రవికల గుడ్డ కాని కొత్త చీరకాని పెట్టి అమ్మవారి రూపాన్ని మనోహరంగా తయారు చేసుకోవాలి. బంగారు నగలతోటి ఆ రూపాన్ని అలంకరించడం యిల్లాళ్ళ సరదా. ఈ విధంగా తయారు చేసుకున్న వరలక్ష్మీదేవిని శ్రీసూక్త విధానంగా ధ్యానం, ఆవాహనం, అర్ఘ్య పాద్యాదులు, స్నానం, ధూపదీపాదుల వంటి షోడశోపచారములతో అర్చించాలి. సబ్రాహ్మణులైన ఋత్విక్కుల ఆధ్వర్యంలో గృహములోని ఆడవారంతా సమూహంగా నిర్వహించుకునే ప్రత్యేక పూజ ఇది. అష్టోత్తర శతనామాలతో పువ్వులతో, కుంకుమతో అమ్మవారిని అర్పించాలి. తొమ్మిది సూత్రములతో (పోచలతో) మధ్యలో పువ్వులు చేర్చి కట్టుకునే తోరాన్ని వామహస్తానికి ధరించాలి. 12 రకాల పిండివంటలు ఒక్కొక్కటి 12 చొప్పున పూజ చేసిన బ్రాహ్మణునకు వాయినం ఇవ్వాలి. దక్షిణ తాంబూలాది సత్కారములతో ఋత్వికులని తృప్తిపరచడం ఒక ముఖ్యమైన కార్యక్రమం.

వరలక్ష్మీ వ్రత ఫలితాలు

ఈ వరలక్ష్మీ పూజలో మరొక ప్రత్యేకత వ్రతకథ. పూజ ఎంత ముఖ్యమో, వ్రతకథని చదువుకోవటం అంతే ముఖ్యం. ఆ తల్లి కరుణాకటాక్ష ప్రభావాన్ని తెలియజేసే ఈ కథని పాటరూపంగా పాడుకోవడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ అలా ఆడవారంతా కలిసి భక్తి శ్రద్దలతో పాట పాడుతూ వుంటే చాలా వినసొంపుగా వుంటుంది. బ్రాహ్మణాశీర్వాదం తరువాత బంధుమిత్రాదులతో అందరూ ప్రసాదం తీసుకోవటం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం సువాసినులను పేరంటానికి పిలిచి, ఎంతో సంతోషంగా వారిని సత్కరించి పంపడం కూడా పూజా సాంప్రదాయంలోని భాగమే. చాతుర్వర్ణాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ దేవిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని, కుటుంబ సుఖసౌఖ్యాలను వరంగా పొందటం ఈ పూజలోని ముఖ్యఉద్దేశం.

శ్రీ ఆదిలక్ష్మీదేవిని కామేశ్వరీ దేవి రూపంలో కూడా కొలవటం ఆనవాయితీ. కొన్ని కుటుంబాలలో కామేశ్వరీ దేవి కులదేవత. ఆ కుటుంబంలోని ఆడవారు అంతా కలసి సమిష్టిగా ఇష్ట కామేశ్వరీ వ్రతం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంవల్ల కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగావుండేలా, అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థిస్తారు. ప్రాణశక్తిని వృద్ధి చేసుకుని తద్వారా శారీరక మానసిక అనారోగ్యాలను తగ్గించుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. ఔషధ సేవనాన్ని ఈ రకంగా బాగా తగ్గించుకోవచ్చు. ప్రాణశక్తిని పెంచమని ఆదిలక్ష్మి అమ్మ వారిని ప్రార్థించి శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుంటే తప్పక ఆరోగ్యం చక్కబడుతుంది దేనికైనా నమ్మకం ముఖ్యం.

సాధారణంగా అనారోగ్యం రాగానే విరివిగా మందులు వాడేయటం మనకి అలవాటయిపోయింది. ఆ మందుల దుష్ప్రభావ ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవటం జరుగుతోంది. ఏ మందులు వాడనక్కరలేకుండా ఆ ఆదిలక్ష్మీ దేవి కృపవల్ల ప్రాణశక్తిని పెంపొందింప జేసుకుని పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకు ఒక మార్గం. పూజా విధా నంలో భాగంగా ఆ ఆదిలక్ష్మీ మాత అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించటం ఇందువల్ల ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ నామావళిలోని నామాలన్నీ మనపూర్వీకులు ఎంతో సాధనచేసి కనుగొన్నవి. ప్రతినామమూ ఎంతో ప్రభావపూరిత మైనది. ఆదిలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని భక్తుల సౌకర్యార్ధం ఈ పుస్తకంలో చేర్చటం జరిగింది. నిత్యపూజలు చేసుకునే సౌకర్యం, అవకాశంలేని వారు కోసం బీజాక్షర జపం చేసుకుంటే తక్షణఫలితాలు కలుగుతాయి.

మరిన్ని వ్రతాలు: