Vatapi Jeernam In Telugu – వాతాపి జీర్ణం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వాతాపి జీర్ణం నీతికథ.

వాతాపి జీర్ణం

(ఈ కథ ఆరణ్యపర్వంలో ఉంది.)

చాలా రోజులక్రితం మాట.
అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణి కోటినీ దయాహృదయంతో చూసే వాడు.
ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా – పితృ పితామహులు కనిపించి:
‘నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు ‘ అన్నారు.
కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు.
తిరిగి తిరిగి విదర్భదేశం చేరాడు.
ఆరాజుగారి యింట మెరపు తీగెవంటి లావణ్యంతో, నిర్మల సరో వరంలోని నల్ల కలువ వలె పెరుగుతున్న లోపాముదము చూశాడు.
అందచందాలలోనే కాదు వినయగుణ శీలాలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు.
ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు.

వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునిచంద్రుడు :
‘మహారాజా! మా వంశాన్ని ఉద్దరించే ఉత్తమ సంతానం కోసం కుమార్తెను నా భార్యగా కోరుతున్నాము’ అన్నాడు. మహారాజు గుండె దడ దడ లాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీని చీనాంబ రాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాం సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు, ఈ మునీశ్వరుడి భార్యగా వనవాసం చేస్తూ పటకుటీరాలలో నార చీరలు ధరించి, కందమూల ఫలాలు తింటూ జీవించగలదా? అనే సందేహంలో పడ్డాడు.

ఈ వార్త విని మహారాణి విదార సాగరంలో మునిగింది.
అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి :
నా వల్ల మీరు కష్టాలపాలు కానవసరం లేదు. నేను సంతో షంతో ఈ మునీశ్వరుని భార్యగా, ఆయన సేవచేసి వారి అనుగ్రహం పొందుతాము’ అంది.

విధి విహితంగా లోపాముద్రా వరిణయం జరిపించాడు మహారాజు.
లోపాముద్ర తన ఆభరణాలు, చీని చీనాంబరాలు విడిచి నార చీరలతో సామాన్య మునిపత్నీ వేషంతో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది.
గంగానదీ తీరాన రమణీయ వనంలో పట కుటీరంలో రాజపుత్రిక వార చీరలతో చలిగాలులూ, వేడిగాడ్పులూ లెక్కచెయ్యకుండా ఎంతో ఓరిమితో సేవలు చెయ్యడం ఆ మునిని ఎంతగానో అలరించింది.
అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తున్నాడు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది.
ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతు స్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడు. చుండగా మహర్షి మనస్సు చలించింది.

ఆమెను చేరబిలిచి, చెయ్యిపుచ్చుకుని; బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుదిరిగి !
‘స్వామీ! ఆశ్రమ ధర్మాన సారం మనం ఈ పట కుటీరంలో దర్భ శయ్యలమీద జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే, నేను మానాన్న గారింట ఏ భోగభాగ్యాలతో ఉండే దానినో అవి సమకూర్చగలిగితే, సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వ గలను’ అని క్షణం ఆగి, మీ వంటి మహా తపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి’ అంది.
ఆలోచించాడు, ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖంకోసం తపశ్శక్తిని వ్యయం చేరడం యిష్టం లేకపోయింది.
ఏ మహారాజు నయినా ఆర్థించాలని బయలుదేరాడు. వెళ్ళి ముగ్గురు మహారాజులను దర్శించి.
‘ఎవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నా కెంక దానం చెయ్యగలరు’, అని అడిగాడు.
వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నా యన్నారు.
వారి సూచనానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపవలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకుని అదే బయలుదేరాడు.
ఈ ఇల్వలుడు వాతాపిసోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు.
ఆ మేకను చంపి వండి పెడతాడు, ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు:
“సోవరా, వాతాపీ’ అని పిలవగానే వాడు పొట్ట చీల్పుకుని బయటపడగానే అన్న దమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు.

అది వారి జీవన విధానం.
అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వివయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు.
వారి ఎదురుగానే మేకను వండిపెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు.
ఆయన వారికి అభయమిచ్చి వండినదంతా ముందు నాకు వడ్డించు. మిగిలితే వారి విషయం చూద్దాం’ అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు –
సోదరా ! వాతాపీ’ అని అరిచాడు.
అదివిని అగస్త్యుడు: ‘ఇంకా ఎక్కడ వాతాపి వాడింక తిరిగి రాడు’, అని నవ్వగా ఇల్వలుడు భయపడి :

‘స్వామిః క్షమించండి’ మీకు నా సర్వ సంపదలూ యిస్తాను, అని తన వద్ద నున్న మణిరత్న సువర్ణ రాసులు రథంమీద ఉంచి ఆయనకు అర్పించాడు.
ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెను తిరిగి హుంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద
మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి !
‘ధర్మచారిణీ లోకంలో అందరిలా ఉండే పుత్రులు, అసంఖ్యా
కంగా కావాలా? గుణశీల వంతుడయిన కుమారుడు ఒకడు కావాలా? అని ఆడిగారు.
ఆవిడ గుణవంతు డొకడు చాలునంది.
అనంతరం ఆ దంపతుల సంసార యాత్రా ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు.
వాతాపిజీర్ణం జీర్ణం జీర్ణం వాతాపితీర్థం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగ జీర్ణమవుతుందని పెద్ద అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment