మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గరుడ గర్వభంగం నీతికథ.
గరుడ గర్వభంగం
(ఉద్యోగ పర్వంలో చేయబార సమయంలో కణ్వమహర్షి చెప్పిన కథ)
” నాయనా దుర్యోధనా !
దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా! ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి.
ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల లోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.
ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీలసంపన్న, విద్యావతి. తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని, ఆచార మర్యాదలనూ చక్కగా అలవరచుకొని పదినుందిలో వినయగుణవతిగా పేరు పొందింది.
బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభిం చాడు మాతలి.
ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతు రాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలాకష్టం.
విద్యఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటే సంపద ఉండదు.
విద్యా వినయ గుణరూపాలున్ని వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు.
ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించ కుండా తిరుగుతూనే ఉండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు.
ఇరువురూ కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆలోకం లోని వింతలు, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి!
దేవమునీ :
నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా ! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
గరుడ లోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు.
ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపు తున్నారు. అది మాతలికి రుచించలేదు.
అప్పుడు నాగలోకానికి చేరారు. ఆలోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధానీ నగరంలో అన్వేషణ ఆరంభించారు.
నాగ వంశ ప్రముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు.
వింటూ వింటూన్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి.
అది గ్రహించి నారదుడు మాతలీ
నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది. అందులో పెద్ద ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు.
నువ్వు చూపే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు, అని చెప్పాడు. తరువాత ‘ కుల పెద్ద ‘ అయిన ఆర్యకునితో:
‘నాయనా! ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు దేవయినీ: వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీ రెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయాడు. అప్పుడే చెప్పాడాయన.
తరువాయి వంతు సుముఖునిది, అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వడల మంటారా ? ‘ అన్నాడు.
అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు.
తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖు నితో వివాహం జరిపించాడు.
వా రుభయులా అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తున్నారు.
ఈ వార్త గరుత్మంతుని చెప్పిని పడింది.
తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి
‘చతుర్దశ భువనాలకూ అధిపతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించ లేడని తెలియదామీకు? అంతటి శక్తికల నన్ను మీరు అవమానించారు, నామాట వినకుండా ఈ వివాహం జరిపించి’ అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించ బోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో:
‘నాయనా! వినతానందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది, నా చెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు,’ అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు.
అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి నాలుక పిడచకట్టింది.
అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి? ‘నాయనా గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తి స్తాయి’ అన్నాడు.
అనంతరం గరుడవాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు.
‘చూశావా, దుర్యోధనాః గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చి పెడు తుందో ! కనక అది విడిచి పెట్టాలి’ అన్నాడు కణ్వమహర్షి.
మరిన్ని నీతికథలు మీకోసం: