Sai Samaja Tambulamu In Telugu – సాయి సమాజ తాంబూలము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి సమాజ తాంబూలము గురించి తెలుసుకుందాం…

Sai Samaja Tambulamu Telugu

సాయి సమాజ తాంబూలము

దృష్టి లోపమో నరునిది దుష్ట పథమొ
బురదలో భ్రమించగ వీరి బుద్ధి యంత
చేయుచుండిరి స్వార్థపు చేతలెల్ల
నీవు రక్షింప మాయెద నిలువు సాయి

1

నీతి ఎరుగని వారలు నీతులరసి
అనుసరించుట మరచి బోధనల పడిరి
నీతి మరచిన జనులకు నీతి దెలిపి
నీదు మహిమలు చాటగ నిలువు సాయి

2

మురియు సంపదలను గని మూర్ఖులిచట
ఉన్న దంతయు తనదని ఉరిమి పడుచు
లేని దానికై వీరంత లేచి పడగ
ఆశకంతము ఏముండునయ్య సాయి

3

లీలలను చేసి నువ్వు నిలిపితి వయ్య
మమ్ము నీ సుందర జగతి మాటునందు
వ్యాప్తి చెందెను కాలుష్య వాయు గణము
నీదు మహిమతో వారింప నిలువు సాయి

4

అందమగు రూప లావణ్య మవని యందు .
సాంప్రదాయపు గౌరవ సంపదలును
మోడలింగులో ముత్యాల ముసుగు లోన
విలువ మరచెను చూడుము వినతి సాయి

5

మాట చెల్లిన వారికే మంతనాలు
మాటున జరుగునట్టిదే మదియు గాంచె
చిత్రమగు చేష్టలకులోన చింత పెరిగె
నీవు రావయ్య నియతిని నిలుప సాయి

6

పైకి మెరిపించు వారలు పైకములను
దోచుకుని పోవుచుండిరి దొరల తీరు
వేషములు ఎన్నొ గట్టిన వీరి వింత
నీవు మార్చగ రావయ్య నిత్య సాయి

7

మానవత్వమును మనిషి మరచి పోయి
సాటి మనుజుల చంపుచు సాకుచెపుచు
జీవకోటి నెత్తురు ముద్ద జేసియాడు
నీ మనుషులను మార్చుము ఇలను సాయి

8

నీరు లేనట్టి పంటలో నిండి గరక
పంటయే తానని భ్రమించి పరుగు లెత్తు
కోత రోజు తెలియు దాని కొసరు బ్రతుకు
మూర్ఖులిటుల భ్రమింతురు ముందు సాయి

9

కాల రాత్రిలో కలి కండ్లుకమ్మి వేయ
లోకమంత విధిని విడచి వెడల
పిచ్చి చేష్టల బ్రతుకులు పెరిగిపోవ
మమ్ము కాపాడ రావయ్య మహిత సాయి

10

రేయి పగలు మరచి నల్ల రేయి
ఒకటి లోకమంతట తిరిగెను లోకనాథ
ఎంచి చూడగ ఈ భూతమెదలు పిండి
ఏలుకొను నిన్ను బాపగ నెదిగె సాయి

11

ఆగలేని కాలానికి అవధి మరచి
అడుగు వేయక ముందు ఈ అవని లోన
అంత తనదేననుచు జీవుడరయు చుండ
అసలు సొంతమైనది యేమిటయ్య సాయి

12

నాది నీదను పోరులు నరుని యందు
తెగని రీతిగ ఎదిగెను తెలియకుండ
కుల మతాల గోడలు పెట్టి గూలు నట్టి
ఈ జనుల పోరును అణచు మిచట సాయి

13

మతము పేరిట పాపుచు మానవతను
ఉగ్రవాదము లోకాన ఉరుము చుండె
అణచి వేయు మా నాధుడవంటు మేము
నిన్ను జేరితిమిక తోడు నిలువు సాయి

14

అవనిలోన అలజడులు అధికమయ్యె
మానవత్వమును మరచి మనుజులంత
జరుపు చుండిరి మతముల జాతి పోరు
నీవు పారద్రోల నియతి నిలుపు సాయి

15

ప్రేమ చిత్రాలపై నేడు పెరిగె మోజు
మత్తులోన మునింగి మైమరచి పోయి
చదువులశ్రద్ధ చేయుచు సాగు యువత
కాలపు విలువ మరచిరి కనుము సాయి

16

దేశమన్నను ఎవరికి దెలిసి యుండు
చెప్పడానికి మాటలు చెల్లినట్లు
చెప్పినది చేయు సరికెల్ల చెదిరి పోవు
చిత్రమగు దేశ భక్తియే చింత సాయి

17

మా మతము గొప్ప చూడ మామతమె మిన్న
సాటిరాదు ఏ మతమైన సాహసించ
యనెడు మతవాదులు సిరుల అంచులందు
మరియు చుండిరి చూడుమా ముదము సాయి

18

వలదు మీకు మా భారత వనితలార
కాటిలోనికి పంపెడు కట్న కాన్క
లెల్ల, కొరివి దెయ్యములగు ఎల్లరకును
ఊర కుండని బిగించు ఉరిని సాయి

19

మేలు కొలుపుము జనులను మేళ వించి
యుద్ధమును కోరు మూర్ఖుల బుద్ధి మార్చి
ధైర్యమున వారి నణచుము తాల్మి తోడ
మమ్ము చేరెడు మా తండ్రి మహిత సాయి

20

నీతి తప్పదు తండ్రి ఈ నేల తల్లి
నీటి బొట్టు దొరకక కన్నీరు బెట్టి
నీ శరణుగోరె నొక మారు నిక్కి చూసి
ఆపదల బాపి రక్షింపుమయ్య సాయి

21

అన్న పానీయములనిచ్చు అవని ఇపుడు
అన్నమో రామచంద్రాయ టంచు అడలె
ఏమిటి మరి ఈ వింత నీ ఎదుట నింక
ఆలకించి జనుల బ్రోవు మయ్య సాయి

22

వాయిదాలకు జనులెల్ల వారసులయి
వాంఛ యున్నను వీరికి వలపు లేదు
కాంత చెంతనున్న కనులు కాన రాక
మూర్ఖ బుద్ధులవనిలోన మురియు సాయి

23

పదవి యున్నపుడు పరులు పంచజేరి
పదవి పోయిన నెవ్వరు పిదప రారు
సిరియు సైతము ఆ వేళ చిందు లేయు
పదవి జారిన సిరి కనపడదు సాయి

24

చేయ చేత కాకున్నను చిందు లేయు
చెమట విలువ తెలియ కుండు సోమరులకు
కాయకష్టమదేమిటో కాస్త దెల్పి
బద్ధకపు బుద్ధులను నీవు బాపు సాయి

25

జారిన తిరిగి రానిది జనుని మాట
కలత పెంచి కత్తులు దూయు కసిది మాట
మనసు నింపగ నుండును మంచి మాట
మాటలన్నింట నిలుపు నీ మహిమ సాయి

26

తల్లి ఋణము తీర్చుకొనగ తనను మరచి
కాన రానంతగ జవాను కదిలి పోయి
బాధలు భరించి తల్లిని భద్రపరచు
వీర పుత్రులలో మేటి వీడె సాయి

27

మాటు వేసిరి చోరులు మూట గట్ట
రాత్రి వేళలో వీరంత రాటుదేలి
పగటి వేళనే చోరీకి పాలుపడుచు
నిన్ను ముంచగ నున్నారు నిజము సాయి

28

అడుగు వేయ అలజడులు అవని యందు
వికట హాసము చేయగ వెళ్లి గూడె
ఏ క్షణమునేమి చేయునో వెక్కిరించి
ఈవు కాపాడ రావయ్య ఇలను సాయి

29

మాయ చేయ తలచి కలి మహిని ముంచ
ఆగనంతటి అహముతో అరసి చూడ
అంధులను జేసి అందినదంత దోచి
అవనికే గొప్పనౌ భారమయ్యె సాయి

30

తెల్లదొర లెల్ల ధనముల కొల్లగొట్ట
రాట్నములు మొద్దు బారెను రాతి శిలగ
ఇనుప యంత్రాలు చేనేత నిడెను చితిని
చేతి పని వారినొక మారు చేరు సాయి

31

కట్టు బొట్టు కున్న విలువ కాలరాసి
అంద చందాల పోటీలు అనుచు ఇలను
దొరికినది యంత కొందరు దోచ దలచి
కొత్త విధమున యోచింప గొనిరి సాయి

32

శిలను శిల్పముగా శిల్పి చెమట తోడ
తనను తీర్చిన దేవుని తనువు గూర్చె
శిథిలమై తాను జీవము శిలకు నింపి
నిరతము నిను కొలుచు చుండు నిజము సాయి

33

రెప్ప పాటైన రే రాజు రేయి పూట
నవ్వనంత ఆ రేయికి నగవు యేది
యింత ఈ వెన్నెలను గాంచు యింపు ఏది
నీదు మహిమల నిచ్చట నిలుపు సాయి

34

తపము చేసిన తీరని తాప మాయె
ఏమిటో ఎల్ల కాలము ఎదుగు చుండె
గాలిలో మేడ లెన్నెన్నొ గట్టి మురిసి
ఇపుడు గగనమ్ము నేదింప నెంచె సాయి

35

మంటలో గల్ప నేర్చిరి మనుజులంత
మానవీయ విలువలన్ని మతులు చెడగ
ఏమి చేయుదువో నీవు ఏలుకొనగ
తోలు బొమ్మలౌ జనులు నీ తోడు సాయి

36

మరిన్ని భక్తి గీతాలు

Leave a Comment