మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కణికనీతితో కార్యాలు సాధించాలి నీతికథ.
కణికనీతితో కార్యాలు సాధించాలి
( ఈ కథ ఆదిపర్వం కోసేది )
హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులున్నారు.
అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మ పరుడు, నీతికోవిదుడు.రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వ హిస్తూ, నిరంతరం ధృతరాష్ట్రుని అంతరంగిక సలహాదారుగా ఉంటాడు.
మూడవ వాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే !
మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైనా కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీరు చదవబోతున్నారు.
మహారాజా !
అనగా అనగా ఓ మహారణ్యం.
ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు, యథేచ్ఛగా విహరిస్తు న్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరులచేత చేయించుకుని, పని పూర్తికాగానే వాటిని మోసంచేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిప, ఎలుక. వీటితో కలిసి మెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నారు.
ఆరోజులలో ఒకనాడు – .
పిక్కబలీసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటబడింది. ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. నిను కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా, దాన్ని పట్టడం సాధ్యం కావడంలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని:
” స్నేహితులారా ! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యంకాదు. ఇప్పుడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంతరుచిగా ఉంటుందో చూపించింది.
అన్నిటికీ నోరూరింది.
“ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతు రతతో అటేచూస్తూ.
అది కొంతసేపు ఆలోచన అభినయించింది.
“ఆ ఇప్పుడు ఆలోచన వచ్చింది.”
” జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకు వగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అద నులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది.
దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.
అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతు లేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళుజాపి నిద్రపోతున్నది లేడి. నక్క పలహా ప్రకారం అలికిడి కాకుండా ఎంకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతూండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతోపాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.
అప్పుడా నక్క:
“స్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందు చేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.
అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.
అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.
నక్క బొటబొటా కన్నీప కారుస్తూంటే చూసిన పులి :
“బావా ! ఎందుకు విచారిస్తున్నావు? అంది.
“ఏం చెప్పను పులిబావా : ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో
తెలుసా ? ‘పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం. నేను కాళ్ళు కొరి కితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలి గింది, అంటూ నక్క కన్నీరు విడిచింది.
పులికి పౌరుషం వచ్చింది.
“మిత్రమా! ఎఇక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను. ” అంటూ వెళ్లిపోయింది.
అంతలో ఎలక రాగా –
విన్నావా, ఎలకబావా ! ఈ లేడిని పులి ముట్టుకుంది కనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎంకము తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.
మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులిబావకు నీ మీద కోపంవచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.
అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్ని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడిమాంసం ఆరగించింది నక్క. విన్నారా ! మహారాజా ! తెలివితో వంచనతో మనకార్యాలు చక్క బెట్టుకోవాలి అన్నాడు కణికుడు. ఇదే కణిక నీతి.
మరిన్ని నీతికథలు మీకోసం: