Sri Raghavendra Sthotram In Telugu | శ్రీ రాఘవేంద్ర స్తోత్రం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రాఘవేంద్ర స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Sri Raghavendra Sthotram In Telugu

గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా సనము గావించెను. ఆపావన చరిత్రుని దివ్యలీలలను శ్రీ రాఘ వేంద్ర కల్పవృక్ష గ్రంథములో వర్ణించి కృతార్థుడ నై తిని.

శ్రీ రాఘవేంద్ర స్తోత్రము

శ్లో||

శ్రీ పూర్ణ బోధ గురుతీర్థ పయోబ్ధిపారా
కామారి మాక్ష విషమాక్ష శిరః స్పృశ స్తీ |
పూర్వోత్తరామిత తరఙ్గ చర త్సుహంసా
దేవాళి సేవిత పరాంఫ్రీ పయోజ లగ్నా ||

1

తా||

కాంతిపూర్ణుడైన పూర్ణచంద్రునికి ఉత్పత్తి స్థానమగు పాలసంద్రములో గలియునదియు, మన్మథుని అణచిన వాడును, జానేంద్రియుడును, బేసికంటివాడును నగు నీశ్వరునిచే సైతము శిరసా వహింపబడినదియు, తూర్పు పడమరల యందలి అంతు లేని యలలయందు గ్రీడించు హంసములు గలదియు, దేవతలు అను తుమ్మెదలచే ( దేవతా సమూహముచే) సేవింప బడుచున్న శ్రీహరి పాదపద్మము లందు బొడమినదియు, దుర్వాదులు అనెడు పొట్టేళ్ళను ్రింగునదియు, బ్రాణి శ్రేష్ఠము లగు గజాదులను జీల్చి వేయ గల యోగ్యమగు పరాక్రమము గలదియు, మొగములయందు మిట్టపల్లములు గల మొసళ్ళగుంపులతో గూడినదియు నగు గురువర్యు లగు శ్రీరాఘవేంద్ర తీర్థుల వాగ్రూప మగు తన్ను సేవించు భ క్తజనమును చేయుగాక!

శ్లో||

జీవేశ భేద గుణపూర్తి జగత్సుసత్వ
నీచోచ్చభావ ముఖ నక్రగణై స్సమేతా |
దుర్వాద్యజాపతి గిలై ర్గురు రాఘవేన్ద్ర
వాగ్దేవతాసరి దముం విమలీకరోతు ||

2

తా||

జ్ఞానసంపద గల శ్రీ పూర్ణ ప్రజ్ఞ గురువుల పాల సంద్రము వంటి సచ్ఛాత్రము ననుసరించునదియు, అరిషడ్వర్గమును జయించిన యపరోక్షజ్ఞానులచే సైతము శిరసా శ్లాఘింపబడి నదియు, లేదా జ్ఞానసాధనీభూతో పనిషత్సమ్మత మైనదియు, పూర్వపక్ష సిద్ధాంతములను (లేదా) పూర్వోత్తర మీమాంస లను బాగుగా వెలిసిన వారిని శుశ్రూష చేయు పరమ హంసలును, నిర్లోభ రాజులును గలదియు, బ్రహ్మాదులచే సైతము సేవింపబడు శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములను బ్రతిపాదించునదియు, దుష్టవాదులను నిరాకరించునదియు, జీవేశ్వర భేదమును, పరమాత్మ యందు గుణపూర్ణత్వమును, జగత్సత్యత్వమును, దారతమ్యమును బ్రధానముగా శాస్త్రాను గుణమగు యు_క్తిసమూహముచే సాధించునదియు, అమరగంగ వ లె నిరాఘాటధాటి గలిగి అందఱిని బవిత్రుల నొనర్చు శ్రీరాఘ వేంద్ర గురువర్యుల సచ్ఛాస్త్రరూపమగు వాక్కు మమ్ము నిర్మలుల జేయు గాక!

శ్లో||

శ్రీ రాఘవేంద్రః సకలప్రదాతా
స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః |
అఘాద్రిసంభేదనదృష్టివజ్రః
క్షమాసురేంద్రోఽవతు మాం సదాఽయమ్ ||

3

శ్లో||

శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ-
నిషేవణాల్లబ్ధసమస్తసమ్పత్ |
దేవస్వభావో దివిజద్రుమోఽయమ్
ఇష్టప్రదో మే సతతం స భూయాత్ ||

4

శ్లో||

భవ్యస్వరూపో భవదుఃఖతూల-
సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలీ |
సమస్తదుష్టగ్రహనిగ్రహేశో
దురత్యయోపప్లవసింధుసేతుః ||

5

తా||

మంగళకరమగు స్వరూపము గలవాడును, దూది మొత్తము నగ్నివలె వివిధ సాంసారిక దుఖఃములను విధ్వంస మొనర్చువాడును, ఆనందము గలవాడును, ధైర్యశాలియు, సమస్త దుష్టగ్రహములను నిర్మూలింపదగిన మహాశక్తి కల వాడును, ఉపద్రవ సముద్రముల ను తరించుటకు సేతువు వంటి అగు శ్రీరాఘవేన్ద్ర స్వామి మమ్ము రక్షించు గాక.

శ్లో॥

నిరస్త దోషో నిరవద్యవేషః
ప్రత్యర్థి మూశత్వ నిదానభాషః |
విద్వ త్పరిజ్ఞేయ మహావి శేషో
వాగ్వైఖరీ నిర్జిత భవ్య శేషః ||

6

తా||

రాగాది దోషములను ద్రోసిపుచ్చిన వాడును,నిర్దుష్ట మగు నా కారము గలవాడును, సభయందు బ్రతిపక్షులను మూగ వారినిగా జేయు వాగ్వైభవము గలవాడును, వాగ్విలాసముచే నందఱిని జయించిన వాడును అగు శ్రీరాఘ వేంద్రగురువు మమ్ము రక్షించుగాక.

శ్లో||

సంతాన సంప త్పరిశుద్ధ భక్తి
విజ్ఞాన వాగ్గేహ సుపాటవాదీన్ |
దత్వా శరీరోత్థ సమ స్తదోషాన్
హత్వాస నోఒన్యా ద్గురురాఘ వేన్ద్రః ||

7

తా||

అట్టిలోకోత్తర మహిమగల శ్రీరాఘవేవ గురుపాదులు మాకు సత్సంతానమును సంపదలను నిర్మల మగు భక్తిని విజ్ఞానమును వాక్పాటవమును దేహదా ర్థ్యమును ఈ మొదలుగాగల సమ సశుభముల నొసంగి శారీర దోషముల నెల్ల నడంచి సదా మమ్ము రక్షింతురుగాక.

శ్లో ||

య త్పాదోదక సంచయ స్సురనదీ ముఖ్యాపగాసాది తా
సంఖ్యాను త్తమ పుణ్య సంఘవిలసత్ప్రఖ్యాతపుణ్యావహః |
దుస్తాపత్రయనాశనో భువి మహావంధ్యాసుపుత్రప్రణో
వ్యంగ స్వంగ సమృద్ధిదో గ్రహమహాపాపాపహ స్తంశ్రయే ||

8

తా ||

నీరాఘ వేంద్ర స్వాముల పాదప్రక్షాళనోదక సమూహము దివిజ గంగాది పుణ్యనదీస్నానములచే సంపాదిం పబడిన సర్వోత్తమ మగు పుణ్యముకంటె నధిక పుణ్య మిచ్చునో, తాపత్రయము నడంచునో, మహావంధ్యలకు సైతము సత్పుత్రుని దయచేయునో, వికలాంగులకు సై తము అంగ దార్థ్యాదికము నొసంగునో, గ్రహబాధలను బ్రహ్మహత్యాది పాపములను బాపునో యట్టి గురువర్యులగు శ్రీరాఘ వేంద్ర తీర్థుల నాశ్రయించుచున్నాను.

శ్లో ||

యత్పాద కంజరజసా పరిభూషితాంగా
యత్పాదపద్మమధుపాయితమానసా యే |
యత్పాదపద్మపరికీ ర్తన జీర్ణవాచ
స్త దర్శనం దురితకాననదావభూతమ్ ||

9

తా ||

ఏ భక్తులు శ్రీరాఘ వేంద్రస్వాముల పాద పద్మపరాగము నవయవములం దలంకరించు కొందుగో, ఏభ క్తులు శ్రీరాఘ వేంద్ర గురుల పాదపద్మములందు మానసంబును దుమ్మెదను బోలె లగింపజేయుదురో, ఏభ క్తులు రాఘవేంద్ర గురు పదపద్మకీర్తనముచేదము వాక్కుల జీర్ణింప యట్టి మహాపురుషుల దర్శనము పాపకాం తార
జేసికొందురో మును గారుచిచ్చువోలె భస్మ మొనర్చును.

శ్లో ||

సర్వతంత్ర స్వతంత్రోసౌ
శ్రీ మధ్వమత వర్థనః |
విజయీంద్ర కరాబోత
సుధీంద్రవరపు స్త్రకః ||

10

తా ||

సర్వతంత్ర స్వతంత్రుడును, మధ్వమతమును వృద్ధి చేసినవాడును, విజయీంద్రస్వాములవలన నాశ్రమముగొన్న సుధీంద్ర స్వాముల కరాంబుజజనితుండు నగు శ్రీరాఘవేంద్ర స్వామి నా భయముల దీర్చుగాక.

శ్లో ||

శ్రీరాఘ వేంద్రో యతిరాట్
గురు ర్మే స్యా ద్భయావహః |
జ్ఞాన భక్తి సుపుత్రాయు
ర్యశః స్రీ పుణ్యవర్ధనః ||

11

తా ||

భ క్తులకు జ్ఞానమును, భక్తిని, సత్ప్ర్పుష్త్రులను, అయువును, కీర్తిని, సంపదలను వృద్ధిచేయు శ్రీరాము గురురాజులు నాభయమును దీర్తురు గాక.

శ్లో ||

ప్రతివాదిజయస్వాంత
భేదచిహ్నా దరోగురుః |
సర్వవిద్యాప్రవీణోఒన్యో
రాఘ వేంద్రా న్న విద్య తే ||

12

తా ||

వాదము చేయునపుడు ప్రతివాదులు నొప్పింపక శాస్త్రర్థ విషయములను చర్చించి వారిని రులుగ జేసి విజయమును గడించువాడు, సమస్త విద్యలయయు నిపుణుడు నగు శ్రీరాఘ వేంద్రస్వామి యొక్క వాకు కప్ప మఱియొక గురువు లేరు.

శ్లో ||

అపరోక్షీకృత శ్రీశః
సము పేక్షిత భావజః |
అపేక్షిత ప్రదాతాజన్యో
రాఘ వేంద్రా న్న విద్య తే ||

13

తా ||

శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యక్షము చేసుకొనగల్గి వాడును, ఉపేక్షింప బడిన మన్మధుడు కలవాడును, వాంఛి తముల నెక్కువగా నిచ్చువాడును, శ్రీరాఘవేంద్ర గురుదేవుని కంటె మఱియొకరు లేరు.

శ్లో ||

దయా దాక్షిణ్య వైరాగ్య
వాక్పాటవ ముఖాంకితః |
శాపానుగ్రహ శక్తోఒన్యో
రాఘ వేంద్రా న్న విద్య తే ||

14

తా ||

కారణము లేకుండగనే పరులదుఃఖమును తొల గింప వలయు ననుదయయు, సౌమ్యస్వభావము, విర క్తియు, వాక్పటుత్వము మొదలగు గుణములు గలవాడును, శపించుటకును, కరుణించుటకును సమర్థుడును శ్రీరాఘవేంద్ర గురు దేవుల కంటె మఱియొకరు లేరు.

శ్లో ||

అజ్ఞాన విస్మృతిభ్రాంతి
సంశయాపస్మృతి క్షయాః |
తంద్రా కంప వచఃకౌంఠ్య
ముఖా యే చేంద్రియోద్భవాః
దోషా స్ర్తీ నాశ మాయాంతి
రాఘ వేంద్ర ప్రసాదతః ||

15

తా ||

శ్రీరాఘ వేంద్రస్వాముల యనుగ్రహము వలన అజ్ఞానము, మఱపు, అన్యథాజ్ఞానము, సందేహము, అపస్మారము, క్షయరోగము, ఇంద్రియ జనితంబులగు తంద్ర, వణకు, వాక్త్రృజ్ఞత (మాట చచ్చుబడుట) మున్నుగా గల దోషంబు లన్నియు నశించిపోవును.

శ్లో ||

[ఓం] శ్రీరాఘవేన్ద్రయ నమ
ఇత్యష్టాక్షర మంత్రతః |
జపితా ద్భావితా న్నిత్య
మిష్టార్థాః స్యు ర సంశయః ||

16

తా ||

ఓం శ్రీరాఘ వేంద్రాయనమః’ అను ఈయష్టాక్షరీ మంత్రమును నిత్యము జపము చేయువారికి సర్వాభీష్టములు సిద్ధించును. ధ్యానము చేయువారికి సంశయజ్ఞానము నశించి మోక్షోపయోగి జాన ముదయించును.

శ్లో ||

హంతు నః కాయజాన్ దోషా
నాత్మాత్మీయ సముద్భవాన్ |
సర్వా నపి పునుర్థాం శ్చ
దదాతు గురు రాత్మవిత్ ||

17

తా ||

బ్రహ్మజ్ఞాని యగు శ్రీరాఘ వేంద్రస్వామి సూ వలనగాని మా సంబంధులవలన గాని పొడమిన కాయికము లగు సమస్త పాపముల నశింపజేసి మాకు జతుర్విధ పురుషార్థ ముల నిచ్చుగాక!

శ్లో ||

ఇతి కాలత్రయే నిత్యం
ప్రార్థనాం యః కరోతి సః !
ఇహాముతాప సర్వేష్టో
మోదతే నాత్ర సంశయః

18

తా ||

ఈ ప్రకారముగ ప్రతిదినము మూడు వేళల ప్రార్థనను చేయుచున్న వాడు ఈలోకమునను, పరలోక మునను సమస్త మనోరథములను సిద్ధించుకొనినవాడై ఆనందించు చున్నాడు. ఈ విషయమున సం దేహము లేదు.

శ్లో ||

అగమ్యమహిమా లోకే
రాఘవేన్ద్ర మహాయశాః |
శ్రీమధ్వమత దుగ్ధాబ్ధి
చంద్రో౭పతు సదానఘః ॥

19

తా ||

లోకమునందు సాకల్యముగ దెలియరాని మహాత్మ్యము కలవాడును, గొప్పకీర్తికలవాడును సంపదగల శ్రీమద్వాచార్యుల వారియొక్క సిద్ధాంతమనెడు పాలసంద్ర మునకు చంద్రునివంటి వాడును జరామరణాది వ్యసనములు లేనివాడును నగు శ్రీరాఘ వేంద్రస్వామి ఎల్లప్పుడు నన్ను రక్షించుగాక !

శ్లో ||

సర్వయాత్రా ఫలావాక్ష్యై
యథాశక్తి ప్రదక్షిణమ్ |
కరోమి తవ సిద్ధస్య
బృందావనగతం జలమ్,
శిరసా ధారయా మ్యద్య
సర్వతీర్థ ఫలా_ప్తయే ||

20

తా ||

మహాగురూ ! కాశీరామేశ్వరాది యాత్రలు సలిపి నందువలన గలుగు పుణ్యమునకై తమ బృందావనమునకు యథాశక్తి ప్రదక్షిణ మొనర్చుచున్నాను. మఱియు గంగాది సమస్తతీర్థముల యందు గ్రుంకిన నెట్టి ఫల మబ్బునో యట్టి ఫలమునకై నీ బృందావనమున కభిషేకించిన కై దలపై దాల్చుకొనుచున్నాను.

శ్లో ||

సర్వాభీష్టార్థ సిద్ధ్యర్థం
నమస్కారం కరో మ్యహమ్ |
తవ సంకీర్తనం వేద
శాస్త్రార్థజ్ఞానసిద్ధయే ||

21

తా ||

శ్రీరాఘ వేంద్రస్వామి! సర్వాభీష్టములు సిద్ధించు కొఱకు దమకు నమస్కారము నొనర్చుచున్నాను. మఱియు సమస్త మగు వేదశాస్త్రజ్ఞానము లభించుటకై నిన్ను స్తుతించు చున్నాను.

శ్లో ||

సంసారేక్షయసాగ రేప్రకృతితో ఒగాధే సదా దుస్తరే
సర్వావద్య జలగ్రహై రనుపమైః కామాదిభంగాకు లే
నానావిభ్రమదు ర్భమే మితభయస్తోమాది ఫేనోత్కపే
దుఃఖోత్కృష్టవి పే సముద్ధరగునో!మా మగ్న రూపంసదా.

22

తా ||

స్వభావముచే అగాధమై అనుపమానంబులగు మొసళ్ళు మొదలగు జలచరంబుల బోలు దోషసమూహములచే దాట శక్యము గానిదై, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనెడు తరంగములచే భీకరమై, నానావిభ్రమము లనెడు సుడులచే ” ఆకర్షించుచు నపాయము గూర్చునదియై, ర మండలముచే వెఱగు గొలుపునదియై, దుఃఖంబు లనెడు కాలకూటాది విషంబులచే భయజనకమై, అక్షయమై యొప్పు నీ సంసారసాగరంబున నెంతయు మునిగి పారము జేర లేకున్న నన్ను రాఘవేంద్ర ప్రభూ! ఉద్దరింపు ముద్ధరింపుము.

శ్లో ||

రాఘ వేంద్ర గురుస్తోత్రం
యః పఠే ద్భక్తిపూర్వకమ్ |
తస్య కుష్ఠాది రోగాణాం
నివృత్తి స్వరయా భవేత్ ||

23

తా ||

భ క్తి పూర్వకముగా నెవ డీ రాఘ వేంద్రగురు స్తోత్రమును బఠించునో వానికి ద్వరలోనే కుష్ఠాదిరోగములు సై తము నివారణమగును.

శ్లో ||

అంథోపి దివ్యదృష్టిః స్యా
దేడమూక్కోపి వాక్పతిః
పూర్ణాయుః పూర్ణ సంప త్తిః
స్తోత్రస్యాఒస్య జపా ద్భవేత్ ||

24

తా ||

ఈ రాఘవేంద్ర స్తోత్రమును జపించునేని జాత్యంధుడును, దివ్యదృష్టిగలవా డగును.మూగయు బృహస్పతివలె వాక్చాతుర్యము గలవాడగును. మఱియు బూణాయుర్దాయము పూర్ణసంపదలు గలవాడు సై తము నగును.

శ్లో ||

యః పిబే జల మే తేన |
స్తో తే ణెవాభిమంత్రితమ్
తస్య కుక్షిగతా గోషాః
సర్వే నశ్యంతి తత్థ ణాత్ ||

25

తా ||

ఈ స్తోత్రముచే అభిమంత్రింప బడిన నీరము నెవడు త్రాగునో వాని కుక్షిలో నున్న యాధి వ్యాధి రూపంబులగు సమస్త దోషములు తక్షణమే నశించును.

శ్లో ||

యదృందావన మాసాద్య |
పంగుః ఖంజోపి వా జనః
స్తోత్రేణానేన యః కుర్యాత్
ప్రదక్షిణ నమస్కృతీ |
స్తోత్రైణానేన యః కుర్యాత
ప్రదక్షిణ నమస్కృతీ |
స జంఘాలో భవే దేవ
గురురాజ ప్రసాదతః ||

26

తా ||

ఈచకాలువాడు గాని నడువశక్తి లేని కుంటి వాడు గాని యీ స్తోత్రమును బఠించుచు శ్రీరాఘవేంద్ర స్వాములు బృందావనమ నకు బృందావనమనకు బ్రదక్షిణ నమస్కారములు చేసినచో నాతడు వెంటనే స్వామివారి యనుగ్రహాతి శయముచే వడిగా వడువగల పిక్క బలము గలవాడు నిశ్చ. శయముచే వడిగా వడువగల పిక్క బలము గలవాడు నిశ్చ యముగా నగును.

శ్లో ||

సోమసూర్యోపరాగే చ
పుష్యార్కాది సమాగమే |
యోనుత్తమ మిదం స్తోత్ర
మష్టోత్తరశతం జపేత్ |
భూత ప్రేత పిశాచాది
పీడా తస్య న జాయతే ||

27

తా ||

చంద్ర సూర్యగ్రహణంబులయందును, పుష్యమీ నక్షత్ర సహితభానువాసరమునను, జన్మనక్షత్ర వైధృతి పూర్ణిమానవాస్యార్ణోదయ మహోదయాది పుణ్య కాలములందును ఎవడీ స్త్రోత్రమును నూటయెనిమిదిమార్లు జపించునో వానికి భూత ప్రేత పిశాచాది పీడలు తొలగును.

శ్లో ||

ఏతత్ స్తోత్రం సముచ్చార్య
గుగో ర్బృందావనాంతి కే |
దీపసం యోజనాత్ జానం
పుత్రలాభో భవేత్ ధ్రువమ్ ||

28

తా ||

ఈ స్తోత్రమును భక్తితో బఠించుచు వేంద్ర స్వాముల బృందావన సమీపమున వెలిగించినచో జ్ఞానము, పుత్రసంతానము కలుగును.

శ్లో ||

పరవాదిజయో దివ్య
జ్ఞానభ క్త్యాది వర్ధనమ్ |
సర్వాభీష్ట ప్రవృద్ధిః సా
న్నాత్ర కార్యా విచారణా ||

29

తా ||

ఈ స్తోత్రమును బఠించుచు గురువుల బృందా వనము కడదీపము వెలిగించువానికి సభలయందు బ్రతివాదులను గెలుచుటయు, అపరోక్షజ్ఞానము, హరి గురువులయెడ భక్తి మొదలగునవియు, సకల వాంఛల బడయుటయు గలుగును, సంశయ మేమాత్రమును లేదు.

శ్లో ||

రాజచోర మహావ్యాఘ్ర.
సర్పనక్రాది పీడనమ్ |
న జాయ త్కేస్య స్తోత్రస్య
ప్రభావా న్నాత్ర సంశయః ||

30

తా ||

ఈ రాఘ వేంద్ర స్తోత్రమును బఠించు భక్తులకీ స్తోత్ర మహిమవలన రాజులవలన గాని, చోరులవలనగాని, వ్యాఘ్రముల వలనగాని సర్పములవలన గాని మొసళ్లు మొదలుగాగల వాని వలనగాని బాధ కలుగదు. సందేహ మేమాత్రము లేదు.

శ్లో ||

యో భక్త్యా గురురాఘ వేంద్రచరణ
ద్వంద్వం స్మరన్ యః పఠేత్ |
స్తోత్రం దివ్య మిదం సదా నహీ భవే
త్తస్యాసుఖం కించన |
కింత్విత్ష్టార్థసమృద్ధి రేప కమలా
నాథ ప్రసాదోదయాత్
కీర్తి రిగ్విదితా విభూతి రతులా

31

తా ||

ఎవడు భ క్తి శ్రద్ధలతో శ్రీరాఘ వేంద్రస్వాముల పాదపద్మములను స్మరించుచు నీస్తోత్రరత్నమును` బారాయణ మొనర్చునో వానికి గొంచెమేనియు దుఃఖము గలుగదు. పైగా శ్రీహరి యనుగ్రహముచే సర్వాభీష్టములు సిద్ధించును. గొప్ప కీర్తి వచ్చును. సాటిలేని సంపదలు కలుగును. ‘ఈ విష యమున హయగ్రీవమూ ర్తియే ప్రమాణము.

శ్లో ||

ఇతి శ్రీరాఘ వేంద్రార్య
గురురాజ ప్రసాదతః |
కృతం స్తోత్ర మిదం పుణ్యం
శ్రీమద్భిర్యప్పణాభి ధై ః ||

32

తా ||

ఈ విధముగా శ్రీరాఘ వేంద్రార్యు లై న గురుశ్రేష్ఠుల అనుగ్రహమునలన గురు కృపాపాత్రుడైన అప్పణాచార్యు లను పేరుగల వారి చేత ఈ స్తోత్రము స్తుతింపబడెను.

శ్లో ||

పూజాయ రాఘ వేంద్రాయ
సత్యధర్మరతాయ చ |
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే ||

33

తా ||

పూజింప దగినవాడును, సత్యధర్మముల యందా ససక్తిగలవాడును, భ క్తితో సేవించువారికి కల్పవృక్షమువంటి వాడును, ప్రపత్తితో ‘నమస్కరించు వారికి కామధేనువువంటి వాడును నగు శ్రీరాఘ వేంద్రస్వామికి నమస్కారము.

మరిన్ని స్తోత్రములు

Leave a Comment