Sai Baba Pooja Vidhanam In Telugu – సాయిబాబా పూజా విధానం

Sai Baba Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

సాయిబాబా పూజా విధానం

పూజా విధానము

శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)

ఆచమనము

ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)

ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…

సంకల్పము

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యప్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన… నామసంవత్సరే . యినే… ఋతౌ.. మాసే… పక్షే… తిధౌ… వాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః … నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థైర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవతా ప్రీత్యర్థం యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోఽధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య (పువ్వుతోగాని,తమలపాకుతోగాని, కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)

అథాంగపూజా

ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్త్రం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్ఫూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

షోడశోపచార పూజ

శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి. అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి (అక్షతలతో పూజచేయాలి )

మరిన్ని పూజా విధానాలు:

Sri Hanuman Pooja Vidanam In Telugu – శ్రీ హనుమాన్ పూజా విధానం

Sri Hanuman Pooja Vidanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ పూజా విదానం గురించి తెలుసుకుందాం.

శ్రీ హనుమాన్ పూజా విధానం

పూ || తిధౌ || గో ॥ నా ॥ మమ శరీర ఆవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్తర్ధ్యం, దుష్టస్థాన స్థితా యే యే గ్రహాః తద్దోష పరిహారార్ధం శ్రీ హనుమత్పూజా ప్రదక్షిణాని కరిష్యే ॥ తదాదౌ నిర్విఘ్న పరిసమాప్తర్థ్యం గణాధిపతి పూజాం కరిష్యే ॥ అథ హనుమత్పూజా విధిః॥

శ్లో॥ అంజనానందనం వీరం కోటి బాలార్క సన్నిభం
ధ్యాయామ్యహం రామదూతం సర్వదా హృదయాంబుజే ॥

శ్రీ మదాంజనేయ పరబ్రహ్మణే నమః ధ్యానం సమర్పయామి॥

శ్లో॥ ఆవాహయామి పింగాక్షం మహావీర్యం మహాబలం
వాయుసూనం రామభక్తం లంకానిర్మూలకారణం ॥

శ్రీ ఆంజనేయ ఆవాహనం సమర్పయామి॥

శ్లో॥ రత్నసింహాసనం చారు జాంబూనదమయం శుభం
ప్రీత్యర్ధ్యం తవ దాస్యామి సంగృహాణ ద్రుతం ప్రభో ॥

శ్రీ ఆంజనేయ రత్న సింహాసనం సమర్పయామి ॥

శ్లో॥ పాద్యం దదా మ్యహం భక్తా నిర్మలం పాపనం శుభం
గృహాణ వానరాధీశ సుగ్రీవ ప్రియబాంధవ ॥

శ్రీ ఆంజనేయ పాద్యం సమర్పయామి ॥

శ్లో॥ అర్ఘ్య మష్టాంగ సంయుక్తం శుభ్రం తే ప్రదదా మ్యహం
గృహ్యతాం కరుణాసింధో పీతవస్త్రం ప్రసీద భో ॥

శ్రీఆంజనేయ అర్ఘ్యం సమర్పయామి ॥

శ్లో॥ వాసితం సర్వతీర్థేభ్యః ఆనీతం శీతలం శుభం |
దడా మ్యాచమనార్ధం తే గృహ్యతా మంజనాసుత ॥

శ్రీఆంజనేయ ముఖే ఆచమనీయం సమర్పయామి।।

యత్పురుషేణ హవిషా॥ పంచామృత స్నానం సమర్పయామి ॥

శ్లో॥ గంగా గోదావరీ ముఖ్య నదీభ్య స్సముపాహృతం।
జలం దదామి స్నానార్ధం స్వీకురుష్వ హరీశ్వర ॥

శ్రీఆంజనేయ శిరస్స్నానం సమర్పయామి॥

శ్లో॥ నవరత్నమయీం దివ్యాం మేఖలాం హేమనిర్మితాం ।
దదామి తుభ్యం గృష్ణాష్వ శ్రీరామప్రియ మారుతే ॥

శ్రీ ఆంజనేయ కటిసూత్రం సమర్పయామి॥

శ్లో॥ పీతకౌశేయ కౌపీనం ధార్యం చ బ్రహ్మాచారిభిః |
అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ ॥

శ్రీఆంజనేయ కౌపీనం సమర్పయామి ॥

శ్లో॥ ‘పీతవస్త్రయుగం దేవ ప్రయచ్ఛామి తవ ప్రభో
ప్రీత్యర్ధం పావనే మహ్యం ప్రసీద కరుణాకర ॥

శ్రీఆంజనేయ వస్త్రయుగ్మం సమర్పయామి ॥

శ్లో॥ రాజితం బ్రహ్మాసూత్రం చ నిర్మితం బ్రహ్మణా పురా |
ప్రీత్యర్థం తవ బాస్యామి సంగృహాణ కపీశ్వర ॥

శ్రీఆంజనేయ బ్రహ్మసూత్రం సమర్పయామి॥

శ్లో॥ చందనం రోచనామిశ్రం హరిద్రా కుంకుమాన్వితం ।
స్వీకురుష్వ దయాసింధో మయార్పిత మిదం ప్రభో ॥

శ్రీఆంజనేయ దివ్య చందనం సమర్పయామి॥

శ్లో॥ అక్షతాం స్తవదాస్యామి హరిద్రాక్తాన్ శుభ ప్రదాన్
రామ ప్రియ నమస్తుభ్యం సంగృహాణా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ అక్షతాన్ సమర్పయామి ॥

శ్లో॥ కిరీట హార కేయూర కటకాంగుళి ముద్రికాఃః
ధారయవ్వ మయాదత్తాః భక్త్యా కపికులోత్తమ॥

శ్రీఆంజనేయ సర్వాభరణాని సమర్పయామి॥

శ్లో॥ చంపకారక పున్నాగ జాతీ మందార చంపకైః |
త్వాం పూజయా మ్యహం భక్త్యా సుప్రస్రీదా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి।।

అథాంగపూజా

ఓం హనుమతే నమః పాదౌ పూజయామి | గూడ గుల్ఫాయ నమః గుల్భౌ పూజయామి | అంజనా గర్భ సంభూతాయ నమః జంఘే పూజయామి | అతి బలపరాక్రమాయ నమః ఊరూ పూజయామి | ఉదధి లంఘనాయ నమః కటిం పూజయామి | సీతాశోకాపహారిణే నమం నాభిం పూజయామి। కాలనేమిమథనాయ నమః హృదయం పూజయామి । మకరీవిపాటనాయ నమః ప్తనౌ పూజయామి | సంజీవన ధరాధర ధారిణే నమః బాహూ పూజయామి ! సుగ్రీవ సచివాయనమః గ్రీవం పూజయామి | లక్ష్మణ ప్రాణదాత్రే నమః పూజయామి | భక్తాభీష్ట ప్రదాయకాయ నమః సర్వాణ్యంగాని పూజయామి |

అథదిక్పాలపూజా

ఇంద్రాయ నమః | అగ్నయే నమః | యమాయ నమః | నైరుతయే నమః | వరుణాయ నమః | వాయవే నమః | కుబేరాయ నమః । ఈశానాయ నమః |

మరిన్ని పూజా విధానాలు:

Gayatri Nitya Pooja Vidhanam In Telugu – గాయత్రీ నిత్య పూజా విధానము

Gayatri Nitya Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ నిత్య పూజా విధానము గురించి తెలుసుకుందాం.

గాయత్రీ నిత్య పూజా విధానము

ఓం గణేశాయ నమః

గాయత్రీ నిత్య పూజా విధానము (శ్రీ సూక్త ప్రకారము)
ముందుగా మడిబట్టలు కట్టుకుని, తూర్పుముఖంగా చిత్రాసనముపై ఉపవిష్ణులై – బాహ్యాభ్యంతరాల శుచి నిమిత్తముగా కాసిని నీళ్లు కుడిచేతిలో పోసుకుని –

మార్జనం

శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యఃస్మరే త్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః |
అని చెప్పుకుంటూ – ఆ నీళ్లను శిరస్సుపై ప్రోక్షించు కోవలెను.

ఆచమనం

అటుపిమ్మట ఆచమించవలెను. కుడి చేతిని గోకర్ణమువలె మడిచి, ఎడమ చేతితో ఉద్ధరిణెడు నీళ్లు అందులో పోసుకుని

  1.  “ఓం కేశవాయస్వాహా” అనుకుని లోనికి తీసుకొనవలెను. ఆ నీళ్లు బొడ్డు వరకు చేరిన పిదప మరియొక ఉద్ధరిణెడు జలము తీసుకుని
  2. “ఓం నారాయణాయ స్వాహా” అని లోనికి పుచ్చుకొనవలెను. తదుపరి యింకొక ఉద్ధరిణెడు నీళ్లను తీసుకుని
  3. “ఓం మాధవాయ స్వాహా” అని లోనికి స్వీకరించవలెను పిదప
  4. “ఓం గోవిందాయ నమః”
  5. “విష్ణవే నమః” అని చెప్పుకొనుచూ ఎడమ అరచేతితో కుడి అరచేతిని, కుడి అరచేతితో ఎడమ అరచేతిని తుడుచుకొనవలెను. అటుపైన
  6. “ఓం మధుసూదనాయ నమః”
  7. “ఓం త్రివిక్రమాయ నమః” అని చెప్పుకొనుచు కుడి బొటన వ్రేలితో ముందుగా పై పెదవినీ, పిదప క్రింద పెదవిని తుడుచుకొనవలెను.
  8. “ఓం వామనాయ నమః”
  9. “ఓం శ్రీధరాయ నమః” అను రెండు నామముల నుచ్చరించుచు తలపై జలమును ప్రోక్షించుకొనవలెను. తరువాత
  10. “ఓం హృషీకేశాయ నమః” అని ఎడమ అరచేతిలోనూ
  11. “ఓం పద్మనాభాయ నమః” అని రెండు పాదముల పైనను
  12. ” ఓం దామోదరాయ నమః” అని తలపైననూ కొంచెము ఉదక ప్రోక్షణము కావించుకొనవలెను. అనంతరము
  13. “ఓం సంకర్షణాయ నమః” అని వ్రేళ్లు ముడిచి గడ్డమును
  14. “ఓం వాసుదేవాయ నమః” అని కుడిచేతి నడిమి వ్రేలితో ఎడమ ముక్కును
  15. “ఓం ప్రద్యుమ్నాయ నమః” అని బొటన వ్రేలితో కుడి నాసికను తాక వలెను. పిమ్మట
  16. “ఓం అనిరుద్ధాయ నమః” అని యెడమ కన్నును
  17. “ఓం పురుషోత్తమాయ నమః” అని కుడి కన్నును నీటితడితో తుడుచుకొనవలెను.
  18. “ఓం అధోక్షజాయ నమః” అని ఎడమ చెవినీ
  19. “ఓం నారసింహాయ నమః” అని కుడి చెవినీ, తాకవలెను.
  20. “ఓం అచ్యుతాయ నమః” అనుకొని చిటికెన వ్రేలితో నాభిని స్పృశించవలెను.
  21. “ఓం జనార్దనాయ నమః” అని కుడి అరచేతితో వక్షస్థలము నదుముకొనవలెను.
  22. “ఓం ఉపేంద్రాయ నమః” అని వ్రేళ్ల కొసలతో శిరమును స్పృశించుకొనవలెను.
  23. “ఓం హరయే నమః” అని కుడి చేతి వ్రేళ్లు చుంచువువలె ముడిచిగాని, విప్పారగా గాని – ఎడమ కుడి భుజములను తాకవలెను. (కొందరు ఎడ మ చేత కుడి మూపును, కుడిచేత ఎడమ మూపును ‘ ఆకారముగా తాకుటయు ప్రచారమున గలదు) పిదప
  24. “శ్రీకృష్ణాయ నమః” అని కొంచెము నీరు ఒక చిన్న పళ్లెరములో విడిచి నమస్కరించుకొనవలెను.

భూశుద్ధి

తదుపరి కాసిని అక్షింతలు చేతబట్టుకుని
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అని చెప్పుకుని, ఆ అక్షతలు వాసనచూసి వెనుక వైపునకు వేసుకొన వలెను.

ప్రాణాయామం

పిదప ముక్కుపట్టుకుని “ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః – ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం”

అను మంత్రమును శ్వాస బంధించి ముమ్మారు పఠించవలెను. దీనినే ప్రాణాయామ మందురు. యధాశక్తి నిట్లొనరించిన తరువాత సంకల్ప ము చెప్పుకొనవలెను.

Gayatri Nitya Pooja

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ సవితా దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వ తమన్వంతరే కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే, మేరో ర్ధక్షిణదిగ్భాగే, గంగాగోదావర్యోర్మద్యదేశే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన… నామసంవత్సరే… అయనే… ఋతౌ… మాసే… పక్షే…. తిధౌ…. వాసరే, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీ… గోత్రోత్పన్నోహం…. నామథే యోహం మమ సమస్తారిష్ట నిరసన పూర్వకం, అధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోపశమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం శ్రీ సవితా దేవతా ప్రీత్యర్థం శ్రీ గాయత్రీ పూజనం కరిష్యే.

గణాధిపతి పూజ

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతిం స్మరామి –

శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే |
సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబోస్కందపూర్వజః |
షోడశైతాని నామాని యఃపఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుని కాసిన్ని అక్షింతలు నీటితో
ఏదైనా ఒక పళ్లెములో విడువవలెను.

శాంతిపాఠం

“ఓం సహనా వవతు సహనౌ భునక్తు

అంగన్యాసం

1. ఓం తత్ సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః – చేతిని హృదయ స్థానమందుంచుకొనవలెను.
2. ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా తల మాడుపట్టును స్పృశించుకొనవలెను.
3. ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయైవషట్ – జుట్టుముడి (ప్రస్తుతము ముడి ఆచారములో లేదు గావున జుట్టు)ని తాకవలెను.
4. ఓం ధీమహి సత్యాత్మనే కవచాయహుం – రెండు భుజములను తాకవలెను.
5. ఓం ధియోయో నః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ – బొటన వ్రేలితో కుడికన్ను, ఉంగరం వ్రేలితో ఎడమకన్ను, నడిమి వ్రేలితో భృకుటి స్థాన మును ఏకకాలమున తాకవలెను.
6. ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్ కుడి చేతిని తలచుట్టూ త్రిప్పి ఎడమ చేతిలో చప్పుడగునట్లు (చప్పట్టు) కొట్టవలెను. పిదప “భూర్భువస్సువరోమితి దిగ్బంధః” అనుకొనవలెను.

ధ్యానం

శ్లో। యోదేవ స్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే |

శ్లో। భక్తలోభం భాస్కరాభం బ్రహ్మాండరాజ్యప్రదాం
సృష్టిస్థితి లయాధారాం ధ్యాయామి మమ మాతరం !

ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీగాయత్రీదేవ్యై నమః, ధ్యానం సమర్పయామి.

ఆవాహనం

మంత్రం :
ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిర ణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ |

శ్లో। సవితృమండలావాసం పవిత్రీకృతృపంచకం
ఇహాగచ్ఛ మహాదేవీ గాయత్రీ కరుణాయుతాం |

సాంగం – సాయుధం సవాహనం సశక్తిం ససర్వకళాం – భర్తృ పుత్రాశ్రిత పరివార సమేతం శ్రీ గాయత్రీ మహామాతా మావాహయామి. ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆవాహనం సమర్పయామి.

ఆసన సమర్పణం

మంత్రం :
ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం |

శ్లో॥ సూర్యకోటి నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
సింహాసన మిదం దేవీ స్వీయతాం సురసేవితే |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి. (రత్న సింహాసన మీయ లేనివారు, లేదా, అదీ లభ్యం కాని పక్షంలో “తతాభావేన అక్షతాన్ సమర్పయామి” అని చెప్పుకుని – అక్షతలను అమ్మవారి ముందు వుంచవలెను).

అర్ఘ్యం

మంత్రం :
ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియందేవీ ముప హ్వయే శ్రీర్మాదేవీ జుషతాం |

శ్లో॥ గంధపుష్ప సమాయుక్తం సర్వేషాం ప్రీతిదాయకం
అర్ఘ్యం గృహాణత్వం దేవీ సిద్ధచారణ సేవితాం |
ఓం భూర్భువస్స్వః శ్రీగాయత్రీ దేవ్యై నమః హస్తయో రర్ఘ్యం సమర్పయామి (అని కొంచెము నీరు సమర్పించవలెను)

పాద్యం

మంత్రం :
ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారా మార్ధం
జ్వలంతీన్ తృప్తాం తర్పయంతీం !
పద్మేస్థితాం పద్మవర్ణాన్ తా
మిహోపహ్వయే శ్రియం |

శ్లో॥ సర్వతీర్థ సమానీతం జలం రమ్యం సువాసితం
పాద్యం గృహాణ దేవేశి బ్రహ్మాది ర్యభివందితే ||
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః పాదయోః
పాద్యం సమర్పయామి (ఒక పువ్వుతోగాని, తమలపాకుతోగాని రవ్వంత జలం సమర్పించవలెను)

ఆచమనం

మంత్రం :
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవ జుష్టాముదారాం ॥
తాం పద్మినీమీం శరణ మహం ప్రపద్యే
అలక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే !

శ్లో। సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం
గృహాణాచమనం దేవీ సర్వదేవ నమస్కృతే |

ఓం భూర్భువస్స్వః భగవత్వై శ్రీగాయత్రీ దేవ్యై నమః ఆచమనం సమర్ప యామి (ఉద్ధరిణెడు నీళ్లు సమర్పించవలెను)

మధుపర్కం

మంత్రం :
ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో
వనస్పతి స్తవవృక్షోధ బిల్వః
తస్యఫలాని తపసానుదంతు
మాయాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ।

శ్లో। స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధుప్తుతం
మధుపర్కం గృహాణేదం మయాదత్తం సురేశ్వరీ |
ఓం భూర్భువస్స్వ ః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః మధు పర్కం సమర్పయామి.

పంచామృత స్నానం

మంత్రం :
ఓం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ ప్రాదుర్భూతోస్మి రాస్ట్రేస్మిస్ కీర్తి మృద్ధిం దదాతుమే |

శ్లో। పంచామృతం మయానీతం పయోదధిఘృతం మధు
శర్కరా సహితం దేవీ స్నానార్థం ప్రతిగృహ్యతాం ।

ఓం భూర్భువస్స్వః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. (ఒక పువ్వును పంచామృతములలో ముంచి అమ్మ వారిపై చిలకరించవలెను).

శుద్ధోదక స్నానం

మంత్రం :
ఓం క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్ నిరుదమే గృహాత్ |

శ్లో! గంగా గోదావరీ కృష్ణా పయోష్వాద్వాపగా స్తధా
ఆయాస్తుతాన్సదాదేవ్యా గాయత్రీ స్నానకర్మణి |

ఓం భూర్భువస్స్వః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః స్పపయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. (అని కొంచెము నీరు చిలికి) ‘స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి’ అని అనుకుని మరల కొంచెము నీరు పళ్లె ములో విడువలెను.

గంధ – వస్త్ర – కంచుక – ఆభరణములు

మంత్రం :
ఓం గంధద్వారాం ధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం |
మనసః కామమాకుతిం – వాచస్పత్యమశీమహే
పశూనాగ్ం రూపమన్నస్య మయిశ్రీ శ్ర్మయతాం యశః |
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ।

శ్లో॥ శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగరు సంయుతం
కర్పూరేణచ సంయుక్తం – విలేపనం సురేశ్వరి |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః చందనం సమర్ప యామి – అని, కుడిచేతి మధ్య మాంగుళితో రవ్వంత గంధం అమ్మవారిపై చిలకరించాలి.

శ్లో॥ దుకూలం స్వీకురుష్వేదం స్వర్ణబిందు సమాయుతం
ఉత్తరీయం కంచుకంచ తదావిధ మతంద్రితే |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః కంచుక సహిత వస్త్రం సమర్పయామి – అని చీర రవికెలగుడ్డ సమర్పించవలెను. అలా సమ ర్పించుకొనలేని పక్షంలో – ‘త దభావేన అక్షతాన్ సమర్పయామి’ అని చెప్పు కుని, కాసిన్ని అక్షతలు భక్తితో అమ్మవారి పాదముల వద్ద వుంచవలెను.

శ్లో। కేయూరైః కంకణై ర్దివ్యై హారనూపురమేఖలా
విభూషణా న్యమూల్యాని గృహాణ పరమేశ్వరి |
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః సంభవితాన్ సర్వాభరణాని (అవి లభించని యెడల – త దభావేన అక్షతాన్) సమర్ప యామి (అక్షతలు, నీళ్లు విడువవలెను)

Gayatri Nitya Pooja pdf

యజ్ఞోపవీతం

మంత్రం :
ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే |

శ్లో॥ తప్త హేమకృతం సూత్రం గృహాణత్వం శుభప్రదే
ఉపవీతమిదం దేవీ – ముక్తాదామ సుభూషితం ।

అథాంగపూజా

(పసుపు కుంకుమ పువ్వులు అక్షతలతో పూజించవలెను)
ఓం నటనాట్యైక నిరతాయై నమః – పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్యమూర్యై నమః – గుల్ఫౌ పూజయామి
ఓం జగదాధారిణ్యై నమః – జంఘా పూజయామి
ఓం రేవాతీరనివాసిన్యై – జానునీ పూజయామి
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః – ఊరూ పూజయామి
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః – కటిం పూజయామి
ఓం భవాతీతాయై నమః – జఘనం పూజయామి
ఓం గంభీరనాభ్యై నమః – నాభిం పూజయామి
ఓం తురీయపదగామిన్యై నమః – ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః – స్తనౌ పూజయామి
ఓం విశాలవక్షస్థలాయై నమః – వక్షస్థలం పూజయామి
ఓం విచిత్రమాల్యాభరణాయై నమః – కంఠం పూజయామి
ఓం స్కందజనన్యై నమః – స్కంధౌ పూజయామి
ఓం మహాబాహవే నమః – బాహూన్ పూజయామి
ఓం వరదాభయహస్తాభ్యాయై నమః – హస్తా పూజయామి
ఓం శ్రోత్రియబంధూయై నమః – శ్రోత్రే పూజయామి
ఓం వేదమాతాయై నమః – వక్త్రం పూజయామి
ఓం నాసాంచితమౌక్తికాయై నమః – నాసికాం పూజయామి
ఓం అరుణబింబోష్ఠాయై నమః – ఓషౌ పూజయామి
ఓం త్రినేత్రధారిణ్యై నమః – ఫాలం పూజయామి
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః – చికురం పూజయామి
ఓం సర్వోత్క ృష్టాయై నమః – శిరః పూజయామి
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

ధూపం – దీపం

మంత్రం :
ఓం ఆర్ధాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||

శ్లో॥ వనస్పతి రసైర్దివ్యైర్గంధాడ్యైః సుమనోహరైః
కపిలాఘృత సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః ధూపమాఘ్రాప యామి. సాంబ్రాణి – సాంబ్రాణి కడ్డీలు / అగరొత్తులు / ఊదొత్తులు – గాని వెలిగించి అమ్మవారికి చూపవలెను.

శ్లో॥ గణచ్చక్షు స్వరూపంచ ప్రాణరక్షణకారకం
ప్రదీప్తం శుద్ధరూపంచ – గృహ్యతాం పరమేశ్వరీ |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం

మంత్రం :
ఓం తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాహిరణ్యం ప్రభూతం గావోదా స్యోశ్వాన్విన్దేయం పురుషానహం |

శ్లో। నానోపహార రూపంచ నానా రస సమన్వితం
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం |

మంత్రం :
‘ఓం భూర్భువస్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్
అనుకొనుచూ – పువ్వుతోగాని, తమలపాకుతోగాని – నివేదింపబడే పదార్థము లపై జలమును ప్రోక్షించి ‘సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు | అమృతోపస్తరణమసి’ అంటూ –

నీరు చిలికి –
ఆ పదార్ధములచుట్టూ ఔపోసనవిధిగా
1. ఓం ప్రాణాయస్వాహా,
2. ఓం అపానాయస్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా అని చెప్పు చూ
5 పర్యాయములు నివేదనమును గాయత్రీ దేవికి కైవోలు చేయవలెను. పిదప –
“మధ్యే మధ్యే పానీయం సమర్పయామి” అని – ఒకటి, రెండు చుక్క ల నీరును పదార్థములపై ప్రోక్షించవలెను.

తదనంతరం –
“ఉత్తరాపోశనం సమర్పయామి” అని ఒకమారు
“హస్తా ప్రక్షాళయామి” అని యొకమారు
“పాదౌ ప్రక్షాళయామి” అని యొకమారు
“శుద్ధాచమనీయం సమర్పయామి” అని యింకొక మారునూ వెరసి నా లుగు పర్యాయాలు నీరు సమర్పించాలి.

తాంబూలం

మంత్రం :
ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణందధాతి
మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతే |
ఏకదైవయజమాన ఆయుస్తేజో దదాతి
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యగం
రాజ్యం మహారాజామాధిపత్యం |

శ్లో। తాంబూలం వరం రమ్యం కర్పూరాది సమన్వితం జిహ్వజాడ్య భేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం ! ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. అమ్మవారి పాదములచెంత తమల పాకులూ వక్కలూ వుంచవలెను.

నీరాజనం

మంత్రం :
ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే |
సర్వాణి రూపాణి విచిత్ర ధారః
నామాభి కృత్వాభి వదనం యదాస్తే |

శ్లో। నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహందేవీ – గృహ్యతాం దివ్యరూపిణీ |
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః కర్పూర నీరాజ నం సమర్పయామి అని కర్పూరం వెలిగించి అమ్మవారికి ప్రదక్షిణ పూర్వ కముగా చూపుచూ గంట వాయించవలెను.

“కర్పూర నీరాజనానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి” అనుచూ – పువ్వుతో ఒక బొట్టు నీరును అమ్మవారి వద్ద ఉంచాలి. అనంతరం కొన్ని అక్షతలూ, పువ్వులూ, చిల్లర డబ్బులూ చేతితో పట్టు కుని సువర్ణ మంత్ర పుష్పమును పఠించవలెను.

సువర్ణ మంత్ర పుష్పము

ఓం హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావసో
అనంతం పుణ్యఫలదం అతశ్శాంతిం ప్రయచ్ఛమే |

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, గాయత్రీం దేవీగ్ం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నేత్వం పారయా నవ్యో అస్మానథ్స్వస్తి భిరతి దుర్గాణి విశ్వాపూశ్చ పృథివీ బహులాస ఉర్వీ భవాతో కాయ తనయాయ శంయోః విశ్వానినో గాయత్ర్యా జాత వేదస్సింధుం ననావాదురి తాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బోధ్య వితాతనూనామ్ పృతనాజితగ్ం సహ మాసముగ్రమ గ్నిగ్రాంహువేమ పరమాత్సధస్థాత్ సనఃపర్షదతిగాయత్ర్యా విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ స్సత్సి స్సాం చాగ్నే తనువంపిప్రయస్వాస్మభ్యఞ్చ సౌభగమాయజస్వ। గౌభిర్జుష్ట మయుజో నిషఙక్తం తవేంద్ర విష్ణో రను సంచసఞ్చరేమ ! నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీంలోక ఇహమాదయంతామ్ |

శ్లో॥ కాత్యాయనాయ విద్మహే
కన్యకుమారి ధీమహి
తన్నో దేవీః ప్రచోదయాత్ |

శ్రీ గాయత్రీదేవ్యై నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

సాష్టాంగ నమస్కారము

శ్లో॥ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే |
శ్రీ గాయత్రీ దేవ్యై నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి.

ఆత్మప్రదక్షిణ నమస్కారం

శ్లో। యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సర్వోపచారాః

ఛత్రం ధారయామి | చామరం విజయామి | గీతం శ్రావ్యయామి |
ఇత్యాదిః సమస్త దేవ్యోపచార పూజాం సమర్పయామి.

శ్లో। యద్యద్రవ్యమపూర్వంచ పృధివ్యా మతిదుర్గభమ్
దేవభూపార్హ, భోగ్యంచ తద్రవ్యం త్వం సంగృహ్యతామ్ శ
్రీ గాయత్రీ దేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి.

క్షమా ప్రార్ధన

శ్లో। అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా |
దాసో హమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి |

శ్లో। ఆవాహనం నజానామి నజానామి విసర్జనం |
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి |

శ్లో। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పఠేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే॥

అనయా మయాకృత పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ సుప్రీతా సుప్రసన్నా వరదాభవన్తు
(అని అక్షతలు నీళ్లు పళ్లెరములో విడువవలెను)

శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ నిత్యపూజా విధానము సమాప్తం.
ఏతత్సర్వం శ్రీ గాయత్రీ దేవతార్పణమస్తు.

మరిన్ని పూజా విధానాలు: