Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

Sri Sai Baba Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః
  2. శ్రీ లక్ష్మీనారాయణాయ
  3. శ్రీ కృష్ణరామ శివ మారుత్యాదిరూపాయ
  4. శ్రీ శేషశాయినే
  5. గోదావరీ తట షిర్డివాసినే
  6. భక్తహృదయాలయాయ
  7. సర్వహృద్వాసినే
  8. భూతవాసాయ
  9. భూతభవిష్యద్భావ వర్జితాయ
  10. కాలాతీతాయ
  11. కాలాయ
  12. కాలకాలాయ
  13. కాల దర్పదమనాయ
  14. మృత్యంజయాయ
  15. అమర్త్యాయ
  16. మార్త్యాభయ ప్రదాయ
  17. జీవధారాయ
  18. సర్వాధారాయ
  19. భక్తావన సమర్థాయ
  20. భక్తావనప్రతిజ్ఞానసమరాయ
  21. అన్నవస్త్రదాయ
  22. ఆరోగ్య క్షేమదాయ
  23. ధనమాంగల్యదాయ
  24. బుద్ధి సిద్ధిప్రదాయ
  25. పుత్రమిత్రకళత్రబంధువే
  26. యోగ క్షేమవహాయ
  27. ఆపద్భాంధవాయ
  28. మార్గబంధవే
  29. భుక్తిముక్తిస్వర్గాపవర్గాదాయ
  30. ప్రియాయ
  31. ప్రీతి వర్ధనాయ
  32. అంతర్యామినే
  33. సచ్చిదాత్మనే
  34. నిత్యానందాయ
  35. పరమసుఖదాయ
  36. పరమేశ్వరాయ
  37. పరబ్రహ్మణే
  38. పరమాత్మనే
  39. జ్ఞాన స్వరూపిణే
  40. జగత్పిత్రే
  41. భక్తానాం మాతృధాతృ పితామహాయ
  42. భక్తాభయప్రదాయ
  43. భక్తవత్సలాయ
  44. భక్తానుగ్రహకారకాయ
  45. శరణాగత వత్సలాయ
  46. భక్తి శక్తిప్రదాయ
  47. జ్ఞాన వైరాగ్యదాయినే
  48. ప్రేమప్రదాయ
  49. సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ
  50. హృదయగ్రంధి భేదకాయ
  51. కర్మ ధ్వంసినే
  52. శుద్ధ సత్త ్వస్థితాయ
  53. గుణాతీత గుణాత్మనే
  54. అనంత కళ్యాణ గుణాయ
  55. అమిత పరాక్రమాయ
  56. జయనే
  57. దుర్ధర్షాక్షోభ్యాయ
  58. అపరాజితాయ
  59. త్రిలోకేష్వ స్కంధితగతయే
  60. అశక్యరహితాయ
  61. సర్వశక్తి మూర్తయే
  62. సురూప సుందరాయ
  63. సులోచనాయ
  64. బహురూప విశ్వమూర్తయే
  65. అరూపా వ్యక్తాయ
  66. అచింత్యాయ
  67. సూక్ష్మాయ
  68. సర్వాంతర్యామినే
  69. మనోవాగతీతాయ
  70. ప్రేమమూర్తయే
  71. సులభ దుర్లభాయ
  72. అసహాయ సహాయాయ
  73. అనాధనాధ దీనబాంధవే
  74. సర్వభార భృతే
  75. అకర్మానేక కర్మ సుకర్మణే
  76. పుణ్య శ్రవణ కీర్తనాయ
  77. తీర్ధాయ
  78. వాసుదేవాయ
  79. సతాంగతయే
  80. సత్పరాయణాయ
  81. లోకనాథాయ
  82. పాపనాశనాయ
  83. అమృతాంశవే
  84. భాస్కర ప్రభాయ
  85. బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ
  86. సత్యధర్మ పరాయణాయ
  87. సిద్ధేశ్వరాయ
  88. యోగీశ్వరాయ
  89. సిద్ధ సంకల్పనాయ
  90. భగవతే
  91. శ్రీభక్తవశ్యాయ
  92. సత్పురుషాయ
  93. పురుషోత్తమాయ
  94. సత్య తత్వబోధకాయ
  95. కామాది సర్వాజ్ఞాన ధ్వంసినే
  96. అభేదానందాను భవదాయ
  97. సమసర్వమత సమ్మతాయ
  98. శ్రీ దక్షిణామూర్తయే
  99. శ్రీ వేంకటేశ రమణాయ
  100. అద్భుతానంద చర్యాయ
  101. ప్రసన్నార్తి హరాయ
  102. సంసార సర్వదుఃఖక్షయాయ
  103. సర్వవిత్ సర్వతో ముఖా
  104. సర్వాంతర్భహి స్థితాయ
  105. సర్వమంగళ కరాయ
  106. సర్వాభీష్ట ప్రదాయ
  107. సమరస సన్మార్గ స్థాపనాయ
  108. శ్రీ సమర్థ సద్గురు సాయినాధాయ నమః

ధూపమాఘ్రాపయామి (అగరువత్తులు చూపించవలెను.)
దీపం దర్శయామి (దీపారాధన చేయవలెను.)
నైవేద్యం సమర్పయామి (నివేదనము సమర్పించవలెను)
తాంబూలం సమర్పయామి
నీరాజనం దర్శయామి (నివేదనము సమర్పించవలెను) మంత్రపుష్పం సమర్పయామి.

మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.

మరిన్ని అష్టోత్తరములు

Sai Baba Pooja Vidhanam In Telugu – సాయిబాబా పూజా విధానం

Sai Baba Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

సాయిబాబా పూజా విధానం

పూజా విధానము

శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)

ఆచమనము

ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)

ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…

సంకల్పము

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యప్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన… నామసంవత్సరే . యినే… ఋతౌ.. మాసే… పక్షే… తిధౌ… వాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః … నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థైర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవతా ప్రీత్యర్థం యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోఽధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య (పువ్వుతోగాని,తమలపాకుతోగాని, కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)

అథాంగపూజా

ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్త్రం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్ఫూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

షోడశోపచార పూజ

శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి. అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి (అక్షతలతో పూజచేయాలి )

మరిన్ని పూజా విధానాలు:

Sai Baba Mantra Pushpam In Telugu – సాయి మంత్రపుష్పం

Sai Baba Mantra Pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం  అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

సాయి మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.
సహస్ర శీర్షం దేవం – విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్.
విశ్వమే వేదం పురుష – స్తద్విశ్వ ముపజీవతి,
పతిం విశ్వ స్యాత్మే శ్వరగ్ం శాశ్వతగ్ం శివ మచ్యుతం,
నారాయణః పరో జ్యోతి – రాత్మా నారాయణః పరః,
నారాయణః పరం బ్రహ్మ – తత్త్వం నారాయణః పరః,
నారాయణః పరో ధ్యాతా – ధ్యానం నారాయణః పరః,
యచ్చ కించి జ్జగ త్సర్వం దృశ్యతేశ్రయతే 2 పివా,
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః,
అనంత మవ్యయం కవిగ్ం – సముద్రేతం విశ్వశంభువం,
పద్మకోశప్రతీకాశగ్ం – హృదయం చాప్యధోముఖం,
అధో నిష్ట్యాం వితస్త్యాంతే – నాభ్యా ముపరి తిష్ఠతి,
జ్వాలామాలాకులంభాతి – విశ్వ స్యాయతనం మహత్,
సంతతగ్ం శిలాభిస్తు – లంబత్యాకోశసన్నిభం,
త స్యాంతే సుషిరగ్ం సూక్ష్మం – తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితం,
తస్య మధ్యే మహానగ్ని – ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః,
సో గ్రభు గ్వభజ న్తిష్ఠ – న్నాహార మజరః కవిః,
తిర్య గూర్ధ్వ మధ శ్శాయీ రశ్మయ స్తస్య సన్తతా,
సంతాపయతి స్వం దేహ – మాపాదతలమస్తకః,
తస్య మధ్యే వహ్ని శిఖా -అణాయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతో యదమధ్యస్థా – విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ తన్వీ – పీతా భాస్వత్యణూపమా,
తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః.
స బ్రహ్మ స శివ స్సహరి స్సేంద్ర – స్సోక్షరః పరమ స్స్వరాట్.
అపాం పుష్పమ్
యోపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
చంద్రమా వా అపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
య ఏవం వేద
యో పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్ని ర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యో గ్నే రాయతనంవేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యే పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపా మాయాతనం, ఆయతనవాన్ భవతి
యో వాయో రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యో పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అసౌ వై తప న్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
యో ముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి

య ఏవం వేద
యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్య స్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై పర్జన్య స్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోప్సు నావం ప్రతిష్ఠితం వేద, ప్రత్యేవ తిష్ఠతి,
ఇమే లోకా అప్సు ప్రతిష్ఠితాః త దేషాం భ్యుక్తా,
కిం త ద్విష్ణో ర్బల మాహుః కా దీప్తిః కిం పరాయణం,
ఏ కో యద్ధార య దేవః రేజతీ రోదసీ ఉభే,
వాతా ద్విష్ణో ర్బల మాహుః అక్షర దీప్తి రుచ్యతే,
ప్రతిపదా ధారయ దేవః – య ద్విష్ణో రేక ముత్తమమ్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వైశ్రవణాయ కుర్మహే,
సమే కామాన్ కామకామయ మహ్యం,
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ – మహారాజాయ నమః.
ఓం తద్భహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా,
ఓం త్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః,
అంత శ్చరతి భూతేషు – గుహాయాం విశ్వమూర్తిషు,
త్వం యజ్ఞస్త్వం వషట్కార – స్వ మింద్ర స్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః, త్వం త దాప అపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్.
ఈశాన స్సర్వవిద్యానా – మీశ్వర స్సర్వభూతానాం. – బ్రహ్మాధిపతి
రహ్మణో2 ధిపతి – రహ్మా శివో మే అస్తు సదాశివోమ్.
తద్విష్ణోః పరమం పదగ్ధం – సదా పశ్యంతి సూరయః,
దివీవ చక్షు రాతతం – త ద్విప్రాసో విపన్యవో,
జాగృవాంస స్సమింధతే – విష్ణో ర్య త్పరమం పదమ్.
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ – పురుషం కృష్ణపింగళం
ఊర్ధ్వ రేతం విరూపాక్షం – విశ్వరూపాయ వై నమోనమః,
నారాయణాయ విద్మహే – వాసుదేవాయ ధీమహి,
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
ఆకాశా త్పతితం తోయం – యథా గచ్ఛతి సాగరం,
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి. ఇతి మంత్రపుష్పమ్
పరివార సహిత శ్రీసాయినాధ పరబ్రహ్మణే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమామ్ కృపయాదేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఏతత్ఫలం శ్రీ సాయినాధ సమర్పణమస్తు
(చేతిలో ఉదకము వదలవలయును)
శ్రీ సాయినాధ దేవతా ప్రసాదం శిరసాగృష్ణమి.

మరిన్ని:

Sai Bratuku Batalu In Telugu – సాయి బ్రతుకు బాటలు

Sai Bratuku Batalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి బ్రతుకు బాటలు గురించి తెలుసుకుందాం…

Sai Bratuku Batalu Telugu

సాయి బ్రతుకు బాటలు

లక్ష్య సాధనతో విద్య లక్షితముగ
తలచిన గురిని సాధించ వలయు నెపుడు
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి

1

నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు
కొండ తోను పందెము గాసి కుప్పగూలు
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి

2

నీవు పెంచిన తోటకు నీరు లేక
కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె
ముళ్ళతో నిండె నీ వనములిట నేరి
వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి

3

తెల్లనగు కాగితాలపై నల్ల రాత
జీవితమ్మన రంగు పేజీలు గావు
నడుమ వచ్చిన అమృతంపు నాణ్యతయును
వ్యర్థమే కాద యోచింపవలయు సాయి

4

సాగ నది వోలె జీవిక సాగి పోవ
మధ్యలో దూరు మాయని మచ్చ ఝరులు
మాటి మాటికి మాయచే మరియు మారె
మాయ వల నుండి కాపాడు మమ్ము సాయి

5

నడిమి సంద్రము నందున్న నావ మేము
మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు
కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు
అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి.

6

ఆపి ఏ రాగ మనెద నేను
ఆకలియను నీ రాగమునాలపించ
ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ
కాటికేగెడు ముసలి రాగమిది సాయి

7

విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు
తాను ముందనుచు జనుడు తలచునెపుడు
సకల జీవులన్ని తెలివి చాలవనెడు
మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి

8

కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట
అలమటించు చుండెను దేవ ఆలకించు
ఆకలి కలి పిశాచమై అరయు చుండ
ఆపకుండ నీ కరుణను చూపు సాయి

9

చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి
అక్షరముల తోడనె లోకమంత వెలుగు
చిలుకరించెడు గురువులు చేరు సాయి

10

కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి
పదములన్నియు నొకటిగా పదిల పరచి
నీతి విలువ చాటుచు అవినీతినణచి
చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి

11

ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని
చేత గాని వారిని చేసి చిదిమివేయ
ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి

12

ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక
అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇప్పుడు
ముందు చూడు నీయాలయ మందు చూడు
వరుస గూర్చుండిరీ ముష్టి వారు సాయి

13

పనుకు బట్టెను ఫలములు పసరు లేక
పాహియనుచిల దరి చేరె పసరు కోరి
కనికరమ్మును పూనుచు గాంచవయ్య
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి

14

ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న
నీడ పట్టు కుదురుగ నిలిచి యుండు
మగని బ్రతుకును వలచిన మగువతీరు
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి

15

తెలివి యున్నను జనులకు తెల్ల మొహము
చదువులెన్ని యున్నను వీరి చవట బుద్ధి
విందు ముందరున్నను రుచి విధమెరుగదు
నీవు మార్చగ ఇటు రమ్ము నియతి సాయి

16

పల్లె పల్లె నీరాకకై పరితపించె
వానదేవుడ కరుణించి వరములిమ్ము
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి
మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి

17

ఒక్క చినుకైన రాదేమి ఓర్మి గూర్చ
ధరణి తల్లికి కానని దాహ మయ్యె
మేఘునకు నెట్టి మబ్బులు మేళ వించ
యిట్టి పగబూనుచు అలిగె నేమి సాయి

18

ధాన్యరాసులు కాలము దారి మరిచి
ఆకలి కడుపులన్నియు అధిక మయ్యె
రాజ్య పదవులేమియు కానరావు ధరణి
నీవు దిగిరాగ నేమిత్తు నిజము సాయి.

19

ఆశయనెడు మూటతొ వచ్చే అవని తల్లి
అలసి పోయెను ఈ భారమంత మోసి
భాగ్య మెంతున్న బాధల బరువు పెరిగె
భారములు దించ రావయ్య భవ్య సాయి.

20

చల్లనైన కరుణ చూపు శాంత మూర్తి
చెదిరి పోతున్న బ్రతుకుల చింత దీర్చి
లోకమంతను నీ ప్రేమలోన నిలిపి
మా మదికి రాజువై యేలు మహిత సాయి

21

మరిన్ని భక్తి గీతాలు

Sai Baba Mangala Harathi In Telugu – సాయిబాబా మంగళహారతి

Sai Baba Mangala Harathi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా మంగళహారతి విధానం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

సాయిబాబా మంగళహారతి

స్వామి సాయినాథయ శిరిడిక్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ మహితమంగళం

లోకనాథాయ భక్తలోకసంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం ||స్వామి||

భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ
ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం ||స్వామి॥

మరిన్ని: