Sri Hanuman Pooja Vidanam In Telugu – శ్రీ హనుమాన్ పూజా విధానం

Sri Hanuman Pooja Vidanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ పూజా విదానం గురించి తెలుసుకుందాం.

శ్రీ హనుమాన్ పూజా విధానం

పూ || తిధౌ || గో ॥ నా ॥ మమ శరీర ఆవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్తర్ధ్యం, దుష్టస్థాన స్థితా యే యే గ్రహాః తద్దోష పరిహారార్ధం శ్రీ హనుమత్పూజా ప్రదక్షిణాని కరిష్యే ॥ తదాదౌ నిర్విఘ్న పరిసమాప్తర్థ్యం గణాధిపతి పూజాం కరిష్యే ॥ అథ హనుమత్పూజా విధిః॥

శ్లో॥ అంజనానందనం వీరం కోటి బాలార్క సన్నిభం
ధ్యాయామ్యహం రామదూతం సర్వదా హృదయాంబుజే ॥

శ్రీ మదాంజనేయ పరబ్రహ్మణే నమః ధ్యానం సమర్పయామి॥

శ్లో॥ ఆవాహయామి పింగాక్షం మహావీర్యం మహాబలం
వాయుసూనం రామభక్తం లంకానిర్మూలకారణం ॥

శ్రీ ఆంజనేయ ఆవాహనం సమర్పయామి॥

శ్లో॥ రత్నసింహాసనం చారు జాంబూనదమయం శుభం
ప్రీత్యర్ధ్యం తవ దాస్యామి సంగృహాణ ద్రుతం ప్రభో ॥

శ్రీ ఆంజనేయ రత్న సింహాసనం సమర్పయామి ॥

శ్లో॥ పాద్యం దదా మ్యహం భక్తా నిర్మలం పాపనం శుభం
గృహాణ వానరాధీశ సుగ్రీవ ప్రియబాంధవ ॥

శ్రీ ఆంజనేయ పాద్యం సమర్పయామి ॥

శ్లో॥ అర్ఘ్య మష్టాంగ సంయుక్తం శుభ్రం తే ప్రదదా మ్యహం
గృహ్యతాం కరుణాసింధో పీతవస్త్రం ప్రసీద భో ॥

శ్రీఆంజనేయ అర్ఘ్యం సమర్పయామి ॥

శ్లో॥ వాసితం సర్వతీర్థేభ్యః ఆనీతం శీతలం శుభం |
దడా మ్యాచమనార్ధం తే గృహ్యతా మంజనాసుత ॥

శ్రీఆంజనేయ ముఖే ఆచమనీయం సమర్పయామి।।

యత్పురుషేణ హవిషా॥ పంచామృత స్నానం సమర్పయామి ॥

శ్లో॥ గంగా గోదావరీ ముఖ్య నదీభ్య స్సముపాహృతం।
జలం దదామి స్నానార్ధం స్వీకురుష్వ హరీశ్వర ॥

శ్రీఆంజనేయ శిరస్స్నానం సమర్పయామి॥

శ్లో॥ నవరత్నమయీం దివ్యాం మేఖలాం హేమనిర్మితాం ।
దదామి తుభ్యం గృష్ణాష్వ శ్రీరామప్రియ మారుతే ॥

శ్రీ ఆంజనేయ కటిసూత్రం సమర్పయామి॥

శ్లో॥ పీతకౌశేయ కౌపీనం ధార్యం చ బ్రహ్మాచారిభిః |
అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ ॥

శ్రీఆంజనేయ కౌపీనం సమర్పయామి ॥

శ్లో॥ ‘పీతవస్త్రయుగం దేవ ప్రయచ్ఛామి తవ ప్రభో
ప్రీత్యర్ధం పావనే మహ్యం ప్రసీద కరుణాకర ॥

శ్రీఆంజనేయ వస్త్రయుగ్మం సమర్పయామి ॥

శ్లో॥ రాజితం బ్రహ్మాసూత్రం చ నిర్మితం బ్రహ్మణా పురా |
ప్రీత్యర్థం తవ బాస్యామి సంగృహాణ కపీశ్వర ॥

శ్రీఆంజనేయ బ్రహ్మసూత్రం సమర్పయామి॥

శ్లో॥ చందనం రోచనామిశ్రం హరిద్రా కుంకుమాన్వితం ।
స్వీకురుష్వ దయాసింధో మయార్పిత మిదం ప్రభో ॥

శ్రీఆంజనేయ దివ్య చందనం సమర్పయామి॥

శ్లో॥ అక్షతాం స్తవదాస్యామి హరిద్రాక్తాన్ శుభ ప్రదాన్
రామ ప్రియ నమస్తుభ్యం సంగృహాణా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ అక్షతాన్ సమర్పయామి ॥

శ్లో॥ కిరీట హార కేయూర కటకాంగుళి ముద్రికాఃః
ధారయవ్వ మయాదత్తాః భక్త్యా కపికులోత్తమ॥

శ్రీఆంజనేయ సర్వాభరణాని సమర్పయామి॥

శ్లో॥ చంపకారక పున్నాగ జాతీ మందార చంపకైః |
త్వాం పూజయా మ్యహం భక్త్యా సుప్రస్రీదా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి।।

అథాంగపూజా

ఓం హనుమతే నమః పాదౌ పూజయామి | గూడ గుల్ఫాయ నమః గుల్భౌ పూజయామి | అంజనా గర్భ సంభూతాయ నమః జంఘే పూజయామి | అతి బలపరాక్రమాయ నమః ఊరూ పూజయామి | ఉదధి లంఘనాయ నమః కటిం పూజయామి | సీతాశోకాపహారిణే నమం నాభిం పూజయామి। కాలనేమిమథనాయ నమః హృదయం పూజయామి । మకరీవిపాటనాయ నమః ప్తనౌ పూజయామి | సంజీవన ధరాధర ధారిణే నమః బాహూ పూజయామి ! సుగ్రీవ సచివాయనమః గ్రీవం పూజయామి | లక్ష్మణ ప్రాణదాత్రే నమః పూజయామి | భక్తాభీష్ట ప్రదాయకాయ నమః సర్వాణ్యంగాని పూజయామి |

అథదిక్పాలపూజా

ఇంద్రాయ నమః | అగ్నయే నమః | యమాయ నమః | నైరుతయే నమః | వరుణాయ నమః | వాయవే నమః | కుబేరాయ నమః । ఈశానాయ నమః |

మరిన్ని పూజా విధానాలు:

Sri Rama Ashtottara Shatanamavali In Telugu – శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

Sri Rama Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును

 • ఓమ్ శ్రీరామాయ నమః
 • రామభద్రాయ నమః
 • రామచంద్రాయ నమః
 • రాజీవలోచనాయ నమః
 • శ్రీమతే నమః
 • రాజేంద్రాయ నమః
 • రఘుపుంగవాయ నమః
 • జానకీవల్లభాయ నమః
 • జైత్రాయనమః
 • జితామిత్రాయ నమః
 • జనార్ధనాయ నమః
 • విశ్వామిత్ర ప్రియాయ నమః
 • దాంతాయ నమః
 • శరణత్రాణతత్పరాయ నమః
 • వాలి ప్రమథనాయ నమః
 • వాగ్మినే నమః
 • సత్యవాచే నమః
 • సత్యవిక్రమాయ నమః
 • సత్యవ్రతాయ నమః
 • వ్రత ధరాయ నమః
 • సదాహనుమదాశ్రితాయ నమః
 • కౌసలేయాయ నమః
 • ఖరధ్వంసినే నమః
 • విరాధవధ పండితాయ నమః
 • విభీషణ పరిత్రాత్రే నమః
 • దశగ్రీవశిరోహరాయ నమః
 • సప్త తాళ ప్రభేత్రే నమః
 • వేదాంతసారాయ నమః
 • వేదాత్మనే నమః
 • భవరోగస్యభేషజాయ నమః
 • దూషణశిరోహంత్రే నమః
 • త్రిమూర్తయే నమః
 • త్రిగుణాత్మకాయ నమః
 • త్రివిక్రమాయ నమః
 • త్రిలోకాత్మనే నమః
 • పుణ్యచారిత్రకీర్తనాయ నమః
 • త్రిలోకరక్షకాయ నమః
 • ధన్వినే నమః
 • దండకారణ్యపుణ్యకృతే నమః
 • అహల్యాశాపశమనాయ నమః
 • పితృభక్తాయ నమః
 • వరప్రదాయ నమః
 • జితక్రోధాయ నమః
 • జితమిత్రాయ నమః
 • జనార్ధనాయ నమః
 • ఋక్షవానరసంఘాతినే నమః
 • చిత్రకూట సమాశ్రయాయ నమః
 • జయంత త్రాణతత్పరాయ నమః
 • సుమిత్రాపుత్ర సేవితాయ నమః
 • సర్వదేవాదిదేవాయ నమః
 • సదావానర సేవితాయ నమః
 • మాయామారీచహంత్రే నమః
 • హర కోదండఖండనాయ నమః
 • మహాభోగాయ నమః
 • జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
 • తాటకాంతకాయ నమః
 • సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః
 • మునిసంస్తుతాయ నమః
 • మహాయోగినే నమః
 • మహోదారాయ నమః
 • సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
 • సర్వపుణ్యాధిక ఫలాయ నమః
 • స్మృతసర్వాఘనాశనాయ నమః
 • ఆదిపురుషాయ నమః
 • మహాపురుషాయ నమః
 • పురాణపురుషస్తుతాయ నమః
 • పుణ్యోదయాయ నమః
 • దయాసారాయ నమః
 • పురాణపురుషోత్తమాయ నమః
 • స్మిత వక్రాయ నమః
 • హరయే నమః
 • సుందరాయ నమః
 • అనంత గుణగంభీరాయ నమః
 • సీతవాసనే నమః
 • మాయామానుషచారిత్రాయ నమః
 • సేతుకృతే నమః
 • మితభాషిణే నమః
 • పూర్వభాషిణే నమః
 • రాఘవాయ నమః
 • సస్వతీర్ధమయాయ నమః
 • మహాభుజాయ నమః
 • సర్వదేవస్తుత్యాయ నమః
 • సర్వయాజ్జాధిపాయ నమః
 • యజ్వినే నమః
 • జరామరణవర్జితాయ నమః
 • శివలింగప్రతిష్ఠాత్రే నమః
 • సర్వాభరణ భూషితాయ నమః
 • పరమాత్మనే నమః
 • పరబ్రహ్మాణే నమః
 • సచ్చిదానంద విగ్రహాయ నమః
 • పరస్మై జ్యోతిషే నమః
 • పరస్యైధామ్నే నమః
 • పరాకాశాయ నమః
 • పరాత్పరాయ నమః
 • పరేశాయ నమః
 • పారగాయ నమః
 • పారాయ నమః
 • శ్యామాంగాయ నమః
 • శూరాయ నమః
 • ధీరోదాత్త గుణాశ్రయాయ నమః
 • ధనర్ధరాయ నమః
 • మహాదేవాదిపూజితాయ నమః
 • జితరాశయ నమః
 • సర్వ దేవాత్మకాయ నమః
 • శివాయ నమః
 • శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సరివార సమేత శ్రీ రామ చంద్రాయ నమః

శ్రీ రామా నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

మరిన్ని అష్టోత్తరములు