మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.
సాయిబాబా పూజా విధానం
పూజా విధానము
శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)
ఆచమనము
ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)
ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…
సంకల్పము
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యప్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన… నామసంవత్సరే . యినే… ఋతౌ.. మాసే… పక్షే… తిధౌ… వాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః … నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థైర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవతా ప్రీత్యర్థం యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)
కలశారాధన
తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోఽధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య (పువ్వుతోగాని,తమలపాకుతోగాని, కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)
అథాంగపూజా
ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్త్రం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్ఫూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
షోడశోపచార పూజ
శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి. అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి (అక్షతలతో పూజచేయాలి )
మరిన్ని పూజా విధానాలు: