Shiva Naamavali Ashtakam In Telugu – శివనామావళ్యాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివనామావళ్యాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Shiva Namavali Ashtakam Lyrics In Telugu

శివనామావళ్యాష్టకమ్

హేచంద్రచూడ మదనాంతక శూలాపాణే
స్థాణో గిరీశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మా మనాథం
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

1

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

2

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

3

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

4

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖ కాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

5

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగ రాగ నృకపాలకలాపమాల
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

6

కైలాసశైలవినివాస వృషాకపేహే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణ ప్రియమదాపహ శక్తినాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

7

విశ్వేశ విశ్వ భవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వబంధు కరుణామయ దీనబంధో
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

8

మరిన్ని అష్టకములు

Leave a Comment