Ayodhya Kanda Sarga 112 In Telugu – అయోధ్యాకాండ ద్వాదశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 112

అయోధ్యాకాండలోని 112వ సర్గలో, రాముడు సీతను, లక్ష్మణుడిని తీసుకుని చిత్తుర్థానంవైపుగా ప్రయాణిస్తాడు. ఈ సర్గలో వారు ప్రస్తుతిస్తున్న ప్రకృతి దృశ్యాలు సుందరంగా వర్ణించబడ్డాయి. దారిలో సీత తన భర్త రామునికి ప్రణయాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంది. రాముడు సీతకు భద్రతను, ప్రేమను అందిస్తాడు. లక్ష్మణుడు తన అన్నకు సేవ చేయడం వల్ల సంతోషిస్తున్నాడు. ఈ సర్గలో వారు అనేక అవాంతరాలను ఎదుర్కొంటారు, కానీ రాముని ధైర్యం, సీతకున్న విశ్వాసం, లక్ష్మణుడి భక్తి వారిని ముందుకు నడిపిస్తాయి. ఈ ప్రయాణం రామాయణ కథలో కీలకమైన ఘట్టం.

పాదుకాప్రదానమ్

తమప్రతిమతేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణమ్ |
విస్మితాః సంగమం ప్రేక్ష్య సమవేతా మహర్షయః || ౧ ||

అంతర్హితాస్త్వృషిగణాః సిద్ధాశ్చ పరమర్షయః |
తౌ భ్రాతరౌ మహాత్మానౌ మహాత్మానౌ కాకుత్స్థౌ ప్రశశంసిరే || ౨ ||

స ధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ |
శ్రుత్వా వయం హి సంభాషాముభయోః స్పృహయామహే || ౩ ||

తతస్త్వృషిగణాః క్షిప్రం దశగ్రీవవధైషిణః |
భరతం రాజశార్దూలమిత్యూచుః సంగతా వచః || ౪ ||

కులే జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశః |
గ్రాహ్యం రామస్య వాక్యం తే పితరం యద్యవేక్షసే || ౫ ||

సదానృణమిమం రామం వయమిచ్ఛామహే పితుః |
అనృణత్వాచ్చ కైకేయ్యాః స్వర్గం దశరథో గతః || ౬ ||

ఏతావదుక్త్వా వచనం గంధర్వాః సమహర్షయః |
రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాంస్వాం గతిం గతాః || ౭ ||

హ్లాదితస్తేన వాక్యేన శుభేన శుభదర్శనః |
రామః సంహృష్టవదనస్తానృషీనభ్యపూజయత్ || ౮ ||

స్రస్తగాత్రస్తు భరతః స వాచా సజ్జమానయా |
కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ || ౯ ||

రాజధర్మమనుప్రేక్ష్య కులధర్మానుసంతతిమ్ |
కర్తుమర్హసి కాకుత్స్థ మమ మాతుశ్చ యాచనామ్ || ౧౦ ||

రక్షితుం సుమహద్రాజ్యమహమేకస్తు నోత్సహే |
పౌరజానపదాంశ్చాపి రక్తాన్ రంజయితుం తథా || ౧౧ ||

జ్ఞాతయశ్చ హి యోధాశ్చ మిత్రాణి సుహృదశ్చ నః |
త్వామేవ ప్రతికాంక్షంతే పర్జన్యమివ కర్షకాః || ౧౨ ||

ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్య హి |
శక్తిమానసి కాకుత్స్థ లోకస్య పరిపాలనే || ౧౩ ||

ఇత్యుక్త్వా న్యపతద్భ్రాతుః పాదయోర్భరతస్తదా |
భృశం సంప్రార్థయామాస రామమేవ ప్రియంవదః || ౧౪ ||

తమంకే భ్రాతరం కృత్వా రామో వచనమబ్రవీత్ |
శ్యామం నలినపత్రాక్షం మత్తహంసస్వరం స్వయమ్ || ౧౫ ||

ఆగతా త్వామియం బుద్ధిః స్వజా వైనయికీ చ యా |
భృశముత్సహసే తాత రక్షితుం పృథివీమపి || ౧౬ ||

అమాత్యైశ్చ సుహృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రిభిః |
సర్వకార్యాణి సమ్మంత్ర్య సుమహాంత్యపి కారయ || ౧౭ ||

లక్ష్మీశ్చంద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ |
అతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః || ౧౮ ||

కామాద్వా తాత లోభాద్వా మాత్రా తుభ్యమిదం కృతమ్ |
న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్ || ౧౯ ||

ఏవం బ్రువాణం భరతః కౌసల్యాసుతమబ్రవీత్ |
తేజసాఽఽదిత్యసంకాశం ప్రతిపచ్చంద్రదర్శనమ్ || ౨౦ ||

అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే |
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః || ౨౧ ||

సోఽధిరుహ్య నరవ్యాఘ్రః పాదుకే హ్యవరుహ్య చ |
ప్రాయచ్ఛత్ సుమహాతేజాః భరతాయ మహాత్మనే || ౨౨ ||

స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ |
చతుర్దశ హి వర్షాణి జటాచీరధరో హ్యహమ్ || ౨౩ ||

ఫలమూలాశనో వీర భవేయం రఘునందన |
తవాగమనమాకాంక్షన్ వసన్ వై నగరాద్బహిః || ౨౪ ||

తవ పాదుకయోర్న్యస్తరాజ్యతంత్రః పరంతప |
చతుర్దశే హి సంపూర్ణే వర్షేఽహని రఘూత్తమ || ౨౫ ||

న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
తథేతి చ ప్రతిజ్ఞాయ తం పరిష్వజ్య సాదరమ్ || ౨౬ ||

శత్రుఘ్నం చ పరిష్వజ్య భరతం చేదమబ్రవీత్ |
మాతరం రక్ష కైకేయీం మా రోషం కురు తాం ప్రతి || ౨౭ ||

మయా చ సీతయా చైవ శప్తోఽసి రఘుసత్తమ |
ఇత్యుక్త్వాఽశ్రుపరీతాక్షో భ్రాతరం విససర్జ హ || ౨౮ ||

స పాదుకే తే భరతః ప్రతాపవాన్
స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ |
ప్రదక్షిణం చైవ చకార రాఘవం
చకార చైవోత్తమనాగమూర్ధని || ౨౯ ||

అథానుపూర్వ్యాత్ ప్రతినంద్య తం జనం
గురూంశ్చ మంత్రిప్రకృతీస్తథానుజౌ |
వ్యసర్జయద్రాఘవవంశవర్ధనః
స్థిరః స్వధర్మే హిమవానివాచలః || ౩౦ ||

తం మాతరో బాష్పగృహీతకంఠ్యో
దుఃఖేన నామంత్రయితుం హి శేకుః |
స త్వేవ మాతౄరభివాద్య సర్వాః
రుదన్ కుటీం స్వాం ప్రవివేశ రామః || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాదశోత్తరశతతమః సర్గః || ౧౧౨ ||

Ayodhya Kanda Sarga 112 Meaning In Telugu

ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోప వాదములు చూచి, విని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు.

“భరతా! నీవు గొప్పవంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య ఋణము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు. రాముడు తండ్రి ఋణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు.” అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములను వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా, మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ, చేతులు జోడించి, భయం భయంగా రామునితో ఇలా అన్నాడు.

“అన్నయ్యా! రాజధర్మము, కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కానీ చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మము నకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీ కన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను అసమర్థుడను. మన బంధువులు మిత్రులు అందరూ నీవే రాజు కావాలని ఎదురు చూస్తున్నారు. వారందరి దృష్టిలో నీవే రాజు కావడానికి సమర్థుడివి. కాబట్టి వెంటనే అయోధ్యకు బయలుదేరు.” అని అన్నాడు భరతుడు. అనడమే కాదు. రాముని పాదముల మీద పడి ప్రార్థించాడు. రాముడు భరతుని రెండు చేతులతో లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని తల ప్రేమతో నిమిరాడు.

“భరతా! నీవు సామాన్యుడివి కావు. బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు. ధైర్యంగా అయోధ్యకు వెళ్లు. రాజ్యాధికారము చేపట్టు. నీకు తోడుగా కులగురువు వసిష్ఠులవారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు.

చంద్రుడు తన వెన్నెలను కోల్పోయినా, హిమవత్పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయినా, సముద్రము చెలియలి కట్టదాటినా, నేను మాత్రము తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొకమాట. నీ తల్లి మితి మీరిన ఆశవలననో, నీ మీద ఉన్న అధిక ప్రేమ వలననో ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాము. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు

గతం గత: అంతా మరిచిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాత్రురాలు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు. దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనసు బాధపెట్టకు.” అని హితబోధ చేసాడు రాముడు.
అప్పుడు భరతుడు బంగారముతో చేసిన పాదుకలు తెప్పించాడు. రాముని పాదముల వద్ద పెట్టాడు. రామునితో ఇలా అన్నాడు.

“రామా! ఇవి బంగారముతో చేసిన పాదుకలు. వీటిమీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంక నుంచి ఈ రామ పాదుకలే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రమే. నీ ప్రతినిధిగా అయోధ్యను పాలిస్తాను.” అని అన్నాడు.
రాముడు భరతుని మాటలను మన్నించాడు. ఆ పాదుకల మీద తన పాదములను పెట్టి ఆ పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించాడు.

“రామా! నేటి నుంచి ఈ పాదుకలు నాకు దిశానిర్దేశము చేస్తాయి. నేను కూడా నీ మాదిరి నారచీరలు, జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమము వేసుకొని ఉంటాను. అక్కడ ఈ పాదుకలను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను.

రామా! ఈ పదునాలుగు సంత్సరములు గడువు పూర్తి అచిప మరునాడు నువ్వు అయోధ్యకు రావలెను. అలా రాకపోతే ఆరోజే నేను అగ్నిప్రవేశము చేస్తాను.” అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించాడు. శత్రుఘ్నుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు. తరువాత భరతుని చూచి ఇలా అన్నాడు.

“భరతా! నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నామీద, సీత మీద ఒట్టు.” అని అన్నాడు. కళ్లనిండా నీళ్లు నిండగా రాముడు భరతునికి వీడ్కోలు పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పూజచేసాడు. వాటిని భద్రగజము మీద రాజు కూర్చునే స్థానములో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణం అయ్యాడు. రాముడు అయోధ్యనుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికాడు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారము చేసాడు. దు:ఖము ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

ఇంతటితో అయోధ్య గురించిన వారసత్వపు వివాదము ముగిసింది. అది త్రేతాయుగము. ధర్మం మూడు పాదాలతో నడిచింది అని పెద్దలు చెబుతారు. రాముడు, భరతుడు రాజ్యం నీది అంటే నీది అను వాదులాడుకున్నారు. అప్పనంగా అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని తీసుకోడానికి రాముడు ఇష్టపడలేదు. తనది కాని దానిని అనుభవించడానికి భరతుడు ఇష్టపడలేదు. ఇదే ఆనాటి ధర్మము.

ద్వాపరం లో అలా కాదు. అంతా నాదే. నీకు ఏమీ లేదు. అనేది దుర్యోధనుడి మనస్తత్వం. కనీసం నా భాగం అన్నా నాకు ఇవ్వు. లేకపోతే చావగొట్టి తీసుకుంటాను అనేది ధర్మరాజు మనస్తత్వం. యుద్ధం ఎందుకు దండగ– పాచికలు ఉండగా. ఒక్క రక్తం బొట్టు చిందకుండా పేకాటలో సర్వస్వం గెల్చుకుందాము, ఎదుటి వాడి తల గొరిగిద్దాము అన్నది శకుని మనస్తత్వము. అందరికీ అన్నిమాటలు చెబుతూ, తాను మాత్రం అంటీముట్టనట్టు జితేంద్రియుడిలాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇదీ ద్వాపర యుగ ధర్మము.

ఇంక కలియుగ ధర్మము మనం చూస్తూనే ఉన్నాము. అందినంత వరకూ దోచుకోవడం. ఆఖరుకు జైలుపాలవడం. బంగారు పళ్లాలలో తిన్న వారు, సత్తుకంచాలలో, చిప్పకూడు తినడం వారి జీవితాలలో పరాకాష్ట. నాకు, నా కొడుకులకు, నా మనుమలకు, మునిమనుమలకు కూడా ఆస్తి సంపాదించాలి అన్న అత్యాశతో అన్ని అక్రమాలు చెయ్యడం. అడ్డం వచ్చిన వాళ్లను అడ్డంగా నరికెయ్యడం. ఇదీ నేటి కలియుగ ధర్మము.
యుగ యుగానికీ ధర్మం మారుతూ ఉంటుంది. మనుషుల మనస్తత్వాలూ మారుతుంటాయి. కాని, నాడూ జాబాలి లాంటి నాస్తిక వాదులు ఉన్నారు. నేడూ రాముడు, కృష్ణుడు లాంటి జితేంద్రియులూ ఉ న్నారు. (రమణ మహర్షి, కంచి పరమాచార్య, మొదలగు వారు). మంచి చెడూ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే చెడు వైపుకు ఆకర్షితులైనంత త్వరగా మంచి వైపు ఆకర్షితులం కాము. అదే మానవ బలహీనత. ఈ బలహీనతలను జయించిన వాడు రాముడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు.

నేడు రామాలయం లేని ఊరు లేదు. “శ్రీరామ” రాయని పత్రమూ లేదు. రామనామం చెయ్యని భక్తుడూ లేడు. రామరాజ్యం రావాలని కోరని వాడూ లేడు. ఇంతకూ రామరాజ్యం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? అందరూ తలొకవిధంగా చెబుతారు. కాని దీనికి రాముడి జీవితమే జవాబు. రాముడు తన జీవితం ద్వారా రెండు విషయాలు ప్రపంచానికి చెప్పాడు. ఒకటి తనది కాని దానికి ఆశించక పోవడం. రెండవది పెద్దల మాట పాటించడం. తండ్రి ఆజ్ఞను శిరసావహించడం. ఈరెండు గుణాలు నేడు ఎవరిలోనూ లేవు.

అంతర్లీనంగా రాముడు తన నడవడి ద్వారా మరొక విషయం కూడా చూచాయగా చెప్పాడు. అదేమిటంటే…..
దశరథుడు మహారాజు. మహారాజు ఆదేశాలను పాటించడం పౌరుల ధర్మము. ఒక సామాన్య మానవుడిగా రాముడు మహారాజు ఆదేశాలను పాటించాలి. అదే చేసాడు రాముడు. అంతేగానీ మహారాజు ఇచ్చిన ఆదేశాల వెనక ఉన్న కారణాలు వెదక లేదు. రాజు చెప్పాడు. నేను పాటించాలి. రాజు ఎప్పుడూ తప్పు చెయ్యడు. ఒకవేళ రాజు తప్పు చేసినా ప్రజలు దానిని ప్రశ్నించకూడదు. అదీ రాముడు ప్రతిపాదించిన ధర్మం. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.

ఈనాడు మనము దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ప్రభుత్వము ఆదేశాలను పాటించకపోవడం మనకు దైనందిన కృత్యము అయిపోయింది. ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం, ప్రభుత్వ ధనాన్ని అపహరించడం అలవాటయిపోయింది. పెద్ద వాళ్లను గౌరవించడం, తల్లితండ్రుల మాటలను మన్నించడం ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. గురువులను గౌరవించడం మహా పాపం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు విద్యార్ధులు. తండ్రిగా భావించవలసిన గురువులతో ప్రేమాయణాలు సాగిస్తున్నారు నేటి విద్యార్ధినులు.

గురువులు కూడా తక్కువ తిన లేదు. క్లాసురూములలో పాఠాలు చెప్పడం మానేసి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, రాజకీయాలలో మునిగితేలుతూ, రాజకీయ నాయకుల మాదిరి ప్రవర్తిస్తూ విద్యార్థులను స్కూళ్లకు పోవద్దనీ, కాలేజీలకు పోవద్దని బోధిస్తూ, రైళ్లు, బస్సులు ఆపమనీ, హింస చేయమనీ ప్రేరేపిస్తున్నారు. అలాంటప్పుడు మనది రామరాజ్యం ఎలా అవుతుంది. రామరాజ్యం అని ఎలా అనగలము. ఆలోచించండి.
ఇంక భరతుడు. కులధర్మం, రాజ ధర్మం గొప్పది అన్నాడు. క్షత్రియ కులంలో పెద్ద వాడు రాజు కావడం సాంప్రదాయం. దానిని పాటించమన్నాడు. వసిష్ఠుడు కూడా ఇక్ష్వాకు వంశచరిత్రను ఏకరువుపెట్టాడు. కాని రాముడు చలించలేదు. తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.

వీరి మధ్యలో లక్ష్మణుడు ఒక వాదాన్ని లేవదీసాడు. అందులో ఒకటి రెండు న్యాయ సూత్రాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. లక్ష్మణుడు ప్రతిపాదించిన మొదటి సూత్రము. కైక వరాలు అడిగింది. దశరథుడు ఇస్తాను అన్నాడు. అడగడం, ఇవ్వడం, పుచ్చుకోడం వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. అంతే కాని మూడవ వ్యక్తి అయిన రామునికి ఆ ఒప్పందంతో ఎలాంటి సంబంధము లేదు. దశరథుడు కైకకు వరాలు ఇవ్వడం వలన మూడవ వ్యక్తి నష్టపోకూడదు. కాని దశరథుడు కైకకు ఇచ్చిన వరాల వల్ల రాముడు అంటే మూడవ వ్యక్తి నష్టపోయాడు. ఇది అధర్మము. ఇతరులకు నష్టం, కష్టం కలిగించని రీతిలో దశరథుడు ఎన్ని వరాలు అయినా ఇవ్వవచ్చు. కైక పుచ్చుకోవచ్చు. కాని ఆ వరాలు ఇవ్వడం వల్ల మూడవ వ్యక్తి నష్టపోతే ఆ వరాలను, దాని మూలంగా రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించనవసరం లేదు. రాముడిని కాదని భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యవచ్చు. కానీ రాముడు అడవులకు పోవడం దేనికి. ఇదీ లక్ష్మణుని వాదన.

ఈ రోజుల్యో సర్వీసు రూల్సులో ఇది పాటిస్తున్నారు. పైవాడికి అనుగ్రహం కలిగితే ప్రమోషన్లు, అన్ని నిబంధనలను తుంగల్లో తొక్కి యధేచ్ఛగా ఇస్తున్నారు. కాని ఆ ప్రమోషను ఇవ్వడం ద్వారా మూడవ వ్యక్తికి నష్టం కలిగించకూడదు. అది చట్టవిరుద్ధం. అలా మూడవ వ్యక్తికి నష్టం జరిగితే కోర్టు జోక్యం చేసుకొని ఆ నష్టాన్ని నివారిస్తుంది.

మీరు అధిక ప్రసంగం అని అనుకోకపోతే ఇక్కడ నా స్వానుభవం వివరిస్తాను. అప్పుడు నేను కోర్టుమాస్టరు గా హైకోర్టులో పనిచేస్తున్నాను. హైకోర్టులో అన్ని ఉద్యోగనియామకాలు ఛీఫ్ జస్టిస్ చేస్తాడు. అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుకు, లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఒక అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుఖాళీ అయింది. నా పైన నలుగురు సీనియర్సు ఉన్నారు. కాని వారు మెట్రిక్యులేట్సు. నేను లా గ్రాడ్యుయేట్. న్యాయప్రకారం, ధర్మ ప్రకారము ఆ పోస్టులో నన్ను నియమించాలి. కాని అప్పటి ఛీఫ్ జస్టిస్, కేవలం మెట్రిక్యులేట్ అయిన సీనియర్ను, ఆయన సెంట్రల్ లా మినిస్టరుకు తెలియడం వల్ల, అన్ని నిబంధనలను తోసి పుచ్చి అసిస్టెంటురిజిస్ట్రారు గా నియమించారు. “అయ్యా! మీరు మీ ఇష్టంవచ్చినవారిని ఇష్టం వచ్చినట్టు నియమించు కోవచ్చు. కానీ దానివలన ఇతరులకు అన్యాయం జరగకూడదు. అది రూలు.” అని మేము వాదించాము. కాని మా వాదన అరణ్య రోదన అయింది లెండి. న్యాయం చెయ్యవలసిన న్యాయమూర్తులే ఆశ్రిత పక్షపాతంతో అన్యాయాలకు పాల్పడుతుంటే, మనది రామరాజ్యం ఎలా అవుతుంది.

ఇంక రెండవ సూత్రం. దశరథుడు మహారాజు. ఇంటికి పెద్ద వాడు. రాజ్యము పిత్రార్జితము. దశరథుడు తన ఇష్టం వచ్చిన వాళ్లకు ఇవ్వడానికి వీలు లేదు. కులధర్మాన్ని పాటించి పెద్దవాడికే ఇవ్వాలి. కానీ దశరథుడు స్త్రీవ్యామోహంలో పడి చిన్నవాడైన భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అడ్డం వస్తాడని రాముని అడవులకు పొమ్మన్నాడు. ఇదంతా స్త్రీవ్యామోహంతో చేసాడు కాబట్టి రాముడికి తండ్రి ఆదేశాలను పాటించనవసరం లేదు. తండ్రి చేసిన పనులు చట్టరీత్యా చెల్లవు. ఈ నాడు కూడా ఈ సూత్రం అమలులో ఉంది. దీనినే పయస్ ఆబ్లిగేషన్ అంటారు. ఉమ్మడి కుటుంబంలో తండ్రి ఆస్తిని అజమాయిషీ చేస్తుంటాడు. కుటుంబక్షేమం కోసం అప్పులు చేస్తాడు. ఆస్తులు అమ్ముతాడు, కొంటాడు. తండ్రి చనిపోతే, తండ్రి చేసిన అప్పులకు కొడుకులు బాధ్యులు అవుతారు. కాని, కొడుకులు మైనర్లుగాఉ న్నప్పుడు, తండ్రి స్త్రీవ్యామోహంతోనో, జూదం ఆడటానికో అప్పులు చేస్తే కుటుంబ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే, కొడుకులు తండ్రి చేసిన పనులకు బాధ్యులు కారు. కొడుకులు ఆ అప్పులు తీర్చనవసరం లేదు. పైగా ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. తండ్రి చేసిన లావాదేవీలకు కట్టుబడనవసరం లేదు. ఇదీ నేటి సూత్రము. దీనినే నాడు లక్ష్మణుడు సూత్రప్రాయంగా ప్రతిపాదించాడు.

ఇది ఇలా ఉంటే, అయోధ్యా కాండ చదివిన తరువాత ఒక సందేహము వస్తుంది. కైక రాముని అల్లారుముద్దుగా పెంచింది. రాముడు అంటే ఎంతో ప్రేమ. అలాంటి కైక కేవలం ఒక దాసి చెప్పిన మాటలు విని రామునికి ఇంతటి అపకారము తలపెడుతుందా. ఒక వేళ పుత్రవ్యామోహంతో భరతునికి పట్టాభిషేకము చెయ్యాలని కోరినా, రాముని అడవులకు పంపుతుందా. అంత క్రూరంగా ప్రవర్తిస్తుందా! కాని కైక అలాఎందుకు చేసింది. ఎందుకు నిందలపాలయింది. దీని వెనక బలమైనకారణం ఏమైనా ఉందా! ఊహిస్తే ఉంది అని అనిపించక మానదు. ఇలా జరగడానికి అవకాశం ఉందేమో ఆలోచించండి..

దశరథుడికి హటాత్తుగా రాముడికి పట్టాభిషేకము చెయ్యాలని ఆలోచన వచ్చింది. అదీ మరునాడే. ఆలోచించుకోడానికి కూడా వ్యవధి లేదు. రాముని పిలిచి తన నిర్ణయం చెప్పాడు. కైకకు కూడా చెప్పలేదు. కాని కైకకు మంథర ద్వారా తెలిసింది. మొదట్లో ఆనందించింది. కాని ఆలోచించింది.
కైక సామాన్యురాలు కాదు. గొప్పరాజనీతిజ్ఞురాలు. భర్తకు రాజకీయాలలో చేదోడు వాదోడుగా ఉండేది. యుద్ధాలలో కూడా పాల్గొంది. దేవ దానవ యుద్ధంలో, దశరథుడి తోపాటు స్వయంగా తాను కూడా పాల్గొని యుద్ధం చేసింది. దశరథుని రెండు సార్లు ప్రాణాపాయస్థితినుండి కాపాడింది. కైక అంతటి వీరనారి. పూర్వాపరాలు ఆలోచించగల దిట్ట.

రాముడికి పట్టాభిషేకము అనగానే మొదట్లో సంతోషము కలిగినా, తరువాత కొంచెం భయం వేసింది. రాముడు చిన్నవాడు. యౌవనంలో ఉన్నాడు. రాజకీయాలు కొత్త. అస్సలు అనుభవం లేదు. ఇంతటి భారాన్ని మొయ్యలేడు. ఇప్పుడు రాముడు రాజు అయితే చిన్న వయసులో భోగలాలసుడు అయ్యే ప్రమాదం ఉంది. రాజ్యము అరాచకము అవుతుంది. రాముడికి తన రాజ్యము ఎంతవరకూ విస్తరించింది. ఏమేమి సామంత రాజ్యాలు ఉన్నాయి. మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏమీ తెలియదు. పైగా దక్షిణ దిశలో దండకారణ్యంలో రాక్షస మూకలు తమ స్థావరాలను ఏర్పరచుకొని ఉన్నాయి. వారు ఇంకా ముందుకు చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉంది. రాక్షసులు మునులకు, జానపదులకు అపకారం చేస్తున్నారని, వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానిని నివారించాలి.

ఈ పరిస్థితులలో రాముడు రాజు అయి అంత:పురంలో కూర్చుంటే అతనికి దేశం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి రాముడు దేశాటన చెయ్యాలి. అడవులలో తిరగాలి. అక్కడి స్థితి గతులు తెలుసుకోవాలి. దానికి మార్గం వెతకాలి.” ఇదీ కైక ఆలోచన. కైక మరొక కోణంలోనుండి కూడా ఆలోచించింది. రాముడు కేవలం స్వలాభం కోసం పాటుపటేవాడా. లేక ప్రజా క్షేమం కోసం రాజ్యాన్ని కూడా త్యజించే జితేంద్రియుడా. రాముడు స్వార్థపరుడా లేక ప్రజల మేలుకోరేవాడా. అందుకే ఈ వరాలు కోరే నాటకం ఆడింది. అందుకే రాముని 14 సంవత్సరాలు అరణ్య వాసం చెయ్యాలి అని కోరింది. రెండవది భరతునికి పట్టాభిషేకము. ఇందులో రెండు సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

మొదటిది… నాటి న్యాయసూత్రాల ప్రకారం, రాముడు రాజ్యాన్ని తనకు తెలిసీ 14 ఏళ్లు అన్యాక్రాంతం చేస్తే, తిరిగి దానిని కోరే హక్కు లేదు. (అది ఈ రోజుల్లో అడ్వర్సుపోసేషన్ సూత్రం ప్రకారం 12 ఏళ్లుగా ఉంది. ) తన రాజ్యం పోతుందని తెలిసీ రాముడు అడవులకు పోతాడా. లేక తండ్రి మీద తిరగబడతాడా అని పరీక్షించవచ్చు.

రెండవది… రాముడు తిరిగి వస్తే భరతుడు తిరిగి రాజ్యం రామునికి ఇస్తాడా. లేక నీకు హక్కులేదు పొమ్మంటాడా! దీనితో భరతుని నిజాయితీ కూడా తేలిపోతుంది.

కాబట్టి కైక రాముని ఒక పరిపూర్ణ మహారాజుగా తీర్చిదిద్దాలని అనుకుంది. రాజ్యపాలన గురించి అవగాహన కలిగించాలి అనుకొంది. ప్రజల కష్టసుఖాలు రాముడు తెలుసుకోవాలి అనుకొంది. రాజ్యంలో శత్రువులను నాశనం చెయ్యడం, రాజ్య విస్తరణ ముఖ్యం అనుకొంది. ఇవన్నీ జరగాలంటే రాముడు దేశాటన చెయ్యాలి. అందుకే తన గుండెల నిండా బాధనునింపుకొని, కన్నీళ్లు ఆపుకుంటూ, మనసులోనే కుమిలిపోతూ, అత్యంత కఠినంగా ప్రవర్తించింది. అందరితోనూ ఛీ అనిపించుకుంది. నాడే రాముడు పట్టాభిషిక్తుడు అయి ఉంటే మనకు రామాయణం లేదు. రాముని గురించి అనుకొనే వాడే లేడు. మనకు రామాయణాన్ని అందించిన ఘనత కైకకు దక్కుతుంది. రాముని కీర్తి ఆసేతుహిమాచలము వ్యాపింపచేసింది. రాముడి రాజ్యాన్ని లంక దాకా విస్తరింపచేసింది. రాముని చేత రాక్షస సంహారం చేయించింది. అయోధ్యకు శత్రుశేషం లేకుండా చేసింది. కాని పుట్టెడు అపకీర్తిని మూట గట్టుకొంది. తుదకు భర్తను కూడా కోల్పోయింది. అంతటి త్యాగమూర్తి కైక. కాని అందరి మనసుల్లో ఒక స్వార్ధపరురాలిగా, చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది కైక.

ఈ నాడు రాముని ఊరూరా, ఇంటింటా పూజించు కుంటున్నా మంటే దానికి మూలకారణం కైక అని మనం తెలుసుకుంటే, ఆమె జీవితం ధన్యం అయినట్టే. )

అయోధ్యాకాండ త్రయోదశోత్తరశతతమః సర్గః (113) >>

Ayodhya Kanda Sarga 111 In Telugu – అయోధ్యాకాండ ఏకాదశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 111

అయోధ్యాకాండములోని 111వ సర్గ సుందరమైన కవితా రూపంలో ఉంది. ఈ సర్గలో రాముడు, సీతను కోల్పోయిన తరువాత తన తల్లిని, మిత్రులను వదిలి అనేక కష్టాలను అనుభవిస్తున్నాడు. అతని భక్తులు మరియు ప్రజలు అతన్ని పరమ భక్తితో ఆరాధిస్తున్నారు. సీత కోసం వనములో రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. సీత రక్షణ కోసం హనుమంతుడు లంకకు ప్రయాణించి రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ సర్గ రాముని ధైర్యం, భక్తి, మరియు సీతపై అతని ప్రేమను వివరంగా చర్చిస్తుంది.

భరతానుశాసనమ్

వసిష్ఠస్తు తదా రామముక్త్వా రాజపురోహితః |
అబ్రవీద్ధర్మసంయుక్తం పునరేవాపరం వచః || ౧ ||

పురుషస్యేహ జాతస్య భవంతి గురవస్త్రయః |
ఆచార్యశ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ || ౨ ||

పితా హ్యేనం జనయతి పురుషం పురుషర్షభ |
ప్రజ్ఞాం దదాతి చాచార్యస్తస్మాత్స గురురుచ్యతే || ౩ ||

సోఽహం తే పితురాచార్యస్తవ చైవ పరంతప |
మమ త్వం వచనం కుర్వన్ నాతివర్తేః సతాంగతిమ్ || ౪ ||

ఇమా హి తే పరిషదః శ్రేణయశ్చ ద్విజాస్తథా |
ఏషు తాత చరన్ ధర్మం నాతివర్తేః సతాంగతిమ్ || ౫ ||

వృద్ధాయా ధర్మశీలాయాః మాతుర్నార్హస్యవర్తితుమ్ |
అస్యాస్తు వచనం కుర్వన్ నాతివర్తేః సతాంగతిమ్ || ౬ ||

భరతస్య వచః కుర్వన్ యాచమానస్య రాఘవ |
ఆత్మానం నాతివర్తేస్త్వం సత్యధర్మపరాక్రమ || ౭ ||

ఏవం మధురముక్తస్తు గురుణా రాఘవః స్వయమ్ |
ప్రత్యువాచ సమాసీనం వసిష్ఠం పురుషర్షభః || ౮ ||

యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా |
న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతమ్ || ౯ ||

యథాశక్తి ప్రదానేన స్నాపనోచ్ఛాదనేన చ |
నిత్యం చ ప్రియవాదేన తథా సంవర్ధనేన చ || ౧౦ ||

స హి రాజా జనయితా పితా దశరథో మమ |
ఆజ్ఞాతం యన్మయా తస్య న తన్మిథ్యా భవిష్యతి || ౧౧ ||

ఏవముక్తస్తు రామేణ భరతః ప్రత్యనంతరమ్ |
ఉవాచ పరమోదారః సూతం పరమదుర్మనాః || ౧౨ ||

ఇహ మే స్థండిలే శీఘ్రం కుశానాస్తర సారథే |
ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మే న ప్రసీదతి || ౧౩ ||

అనాహారో నిరాలోకో ధనహీనో యథా ద్విజః |
శేష్యే పురస్తాత్ శాలాయాః యావన్న ప్రతియాస్యతి || ౧౪ ||

స తు రామమవేక్షంతం సుమంత్రం ప్రేక్ష్య దుర్మనాః |
కుశోత్తరముపస్థాప్య భూమావేవాస్తరత్ స్వయమ్ || ౧౫ ||

తమువాచ మహాతేజాః రామో రాజర్షిసత్తమః |
కిం మాం భరత కుర్వాణం తాత ప్రత్యుపవేక్ష్యసి || ౧౬ ||

బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి |
న తు మూర్ధాభిషిక్తానాం విధిః ప్రత్యుపవేశనే || ౧౭ ||

ఉత్తిష్ఠ నరశార్దూల హిత్వైతద్దారుణం వ్రతమ్ |
పురవర్యామితః క్షిప్రమయోధ్యాం యాహి రాఘవ || ౧౮ ||

ఆసీనస్త్వేవ భరతః పౌరజానపదం జనమ్ |
ఉవాచ సర్వతః ప్రేక్ష్య కిమార్యం నానుశాసథ || ౧౯ ||

తే తమూచుర్మహాత్మానం పౌరజానపదా జనాః |
కాకుత్స్థమభిజానీమః సమ్యగ్వదతి రాఘవః || ౨౦ ||

ఏషోఽపి హి మహాభాగః పితుర్వచసి తిష్ఠతి |
అతైవ న శక్తాః స్మో వ్యావర్తయితుమంజసా || ౨౧ ||

తేషామాజ్ఞాయ వచనం రామో వచనమబ్రవీత్ |
ఏవం నిబోధ వచనం సుహృదాం ధర్మచక్షుషామ్ || ౨౨ ||

ఏతచ్చైవోభయం శ్రుత్వా సమ్యక్ సంపశ్య రాఘవ |
ఉత్తిష్ఠ త్వం మహాబాహో మాం చ స్పృశ తథోదకమ్ || ౨౩ ||

అథోత్థాయ జలం స్పృష్ట్వా భరతో వాక్యమబ్రవీత్ |
శ్రృణ్వంతు మే పరిషదో మంత్రిణః శ్రేణయస్తథా || ౨౪ ||

న యాచే పితరం రాజ్యం నానుశాసామి మాతరమ్ |
ఆర్యం పరమధర్మజ్ఞం నానుజానామి రాఘవమ్ || ౨౫ ||

యది త్వవశ్యం వస్తవ్యం కర్తవ్యం చ పితుర్వచః |
అహమేవ నివత్స్యామి చతుర్దశ సమా వనే || ౨౬ ||

ధర్మాత్మా తస్య తథ్యేన భ్రాతుర్వాక్యేన విస్మితః |
ఉవాచ రామః సంప్రేక్ష్య పౌరజానపదం జనమ్ || ౨౭ ||

విక్రీతమాహితం క్రీతం యత్ పిత్రా జీవతా మమ |
న తల్లోపయితుం శక్యం మయా వా భరతేన వా || ౨౮ ||

ఉపధిర్న మయా కార్య్యో వనవాసే జుగుప్సితః |
యుక్తముక్తం చ కైకేయ్యా పిత్రా మే సుకృతం కృతమ్ || ౨౯ ||

జానామి భరతం క్షాంతం గురుసత్కారకారిణమ్ |
సర్వమేవాత్ర కళ్యాణం సత్యసంధే మహాత్మని || ౩౦ ||

అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగతః పునః |
భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాః పతిరుత్తమః || ౩౧ ||

వృతో రాజా హి కైకేయ్యా మయా తద్వచనం కృతమ్ |
అనృతన్మోచయానేన పితరం తం మహీపతిమ్ || ౩౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశోత్తరశతతమః సర్గః || ౧౧౧ ||

Ayodhya Kanda Sarga 111 Meaning In Telugu

వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశరాజుల నందరి గురించి చెప్పి, వారందరూ రాజధర్మమును పాటించారనీ, ఆ వంశముల రాజులందరూ జ్యేష్ణునికే పట్టం కట్టారనీ వివరించాడు. కానీ రాముడు ఏమీ మాట్లాడలేదు. వసిష్ఠుడు మరలా చెప్పనారంభించాడు.

“ఓరామా! జన్మఎత్తిన ప్రతివాడికీ ముగ్గురు గురువులు ఉంటారు. వారు తల్లి, తండ్రి, విద్యనేర్పిన గురువు. తండ్రి పురుషుని జన్మకు కారకుడవుతాడు. తల్లి జన్మనిస్తుంది. గురువు జ్ఞానమును ఉపదేశిస్తాడు. నేను నీ తండ్రిగారికీ. ఇప్పుడు నీకూ గురువును. గురువుచెప్పిన మాటలు వినడం లోకధర్మం. గురువు చెప్పిన మాటలు వినకపోతే నీవు పెద్దల మాటలను ఎదిరించినవాడివి అవుతావు.

నీకు సహజ గురువు నీ తల్లి కౌసల్య. ఆమె భర్తను పోగొట్టుకొని వృద్ధాప్యములో ఉంది. ఒకకుమారునిగా నీ తల్లికి సేవచేయడం నీ ధర్మం. నీ తల్లి సేవను మరిచి, నీవు అడవులలో ఉంటే నీవు నీ ధర్మమును అతిక్రమించిన వాడవు అవుతావు. భరతుడు నీ తమ్ముడు. చిన్న వాడి మాటలు మన్నించడం పెద్దల ధర్మము. కాబట్టి నీ తమ్ముని మాటలు మన్నించు. ఒక గురువుగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.” అని పలికాడు వసిష్టుడు.
కులగురువు వసిష్ఠుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు. గురువు గారికి నేరుగా ప్రత్యుత్తరం ఇచ్చి వారిని అగౌరవ పరచినట్టు కాకుండా, పక్కన ఉన్న వారితో అన్నట్టు ఇలా అన్నాడు.

“నా తల్లి, తండ్రి నన్ను పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు. నేను కోరకుండానే అన్నీ సమకూర్చారు. వారి ఋణం తీర్చుకోడం నా కర్తవ్యము. నా తండ్రి దశరథుని ఎదుట నేను ప్రతిజ్ఞ చేసాను. దానిని పాటించడం నా ధర్మము. నా తండ్రి ఇప్పుడు లేడని ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆయనకు ఇచ్చిన మాటను అబద్ధం చేయలేను. కాబట్టి నేను అయోధ్యకు రాలేను. ఇది నా నిశ్చయము.” అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు.

రాముని మాటలు విన్న భరతుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! నీవు దర్భలు తీసుకొని వచ్చి ఇక్కడ పరుచు. రాముడు అయోధ్యకు వచ్చువరకు రాముని కదలనీయను. నేను ఇక్కడే పడుకుంటాను. ఆహారము, నీరు ముట్టను. రాముడు అయోధ్యకు రావడానికి అంగీకరించే వరకూ ఇక్కడే పడుకుంటాను.” అని అన్నాడు. (ప్రస్తుతము మన నాయకులు చేస్తున్న ఘోరావ్, హర్తాళ్, నిరాహారదీక్షలకు ఆద్యుడు భరతుడు అని చెప్పవచ్చు. కాని నిరాహారదీక్షలు చేసి చచ్చిన రాజకీయనాయకుడు ఒక్కడూ లేడు, ఒక్క పొట్టిశ్రీరాములు తప్ప.) భరతుని ఆదేశము మేరకు సుమంత్రుడు దర్భలు తెచ్చి అక్కడ పరిచాడు. ఇదంతా చూస్తున్న రాముడు భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! ఏమిటీ పని. నేనేం పాడు పని చేసానని నీవు ఇలా దీక్ష చేస్తున్నావు. ఎవరైనా బ్రాహ్మణుని వద్ద అప్పుతీసుకొని ఎగవేస్తే, వారి ఇంటి ముందు, ఆ బ్రాహ్మణుడు ఇలా నిరాహార దీక్ష చెయ్యవచ్చు కానీ క్షత్రియులకు ఇది తగదు. కాబట్టి ఈ నిరశన వ్రతమును విడిచిపెట్టి అయోధ్యకు వెళ్లు.” అని అన్నాడు.

దీనితో భరతునికి తిక్కరేగింది. అక్కడ ఉన్న పురప్రముఖులను చూచి ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడకువచ్చి ఏం చేస్తున్నారు. ఎంత సేపటికీ నేను మాట్లాడటం తప్ప మీరు ఏమీ మాట్లాడరా. రాముని అయోధ్యకు తీసుకురావడినికి మీవంతు ప్రయత్నం చేయరా! మీరంతా అన్నగారికి చెప్పండి.” అని అన్నాడు భరతుడు.

అప్పుడు వారంతా భరతునితో ఇలాఅన్నారు.“భరతా! రాముడు అన్యాయంగా అధర్మంగా మాట్లాడుతుంటే ఆయనను వారించ వచ్చుగానీ, రాముడు ధర్మంగా, న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఆయనను మేము ఏమని వారించగలము. రాముడు చెప్పే ప్రతి మాటా యుక్తియుక్తముగా ఉంది. రాముడు తండ్రి మాటను మీరడం లేదు. అది ప్రతి పౌరుడి ధర్మము. ఆ ధర్మాన్నే రాముడు నెరవేరుస్తు న్నాడు. రాముడే తండ్రి మాటను కాదని రాజు అయితే ఇంక రాజ్యంలో రాముని మాట ఎవరు వింటారు. అది అరాచకానికి దారి తీస్తుంది. కాబట్టి రామునికి ఎదురు చెప్పలేము.” అని ముక్తకంఠంతో పలికారు పౌరులు.

రాముడు చిరునవ్వు నవ్వాడు. “భరతా! చూచావాపౌరులు ఏమంటున్నారో! వారిది ధర్మదృష్టి. అందుకే ధర్మం చెప్పారు. నీవు కూడా ధర్మం ఆలోచించు. నీ ప్రయత్నం మానుకో. అయోధ్యకు వెళ్లు.”అని అన్నాడు రాముడు. భరతుడు పైకి లేచాడు. ఆచమనం చేసాడు. అక్కడ సమావేశమయిన మంత్రులు, విద్వాంసులు, సేనానాయకులు, పురప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నాడు.

నా మాటలను శ్రద్ధగా వినండి. నేను ఎన్నడూ రాజ్యము నాకు ఇమ్మని నా తండ్రిని అడగలేదు. బలవంతం చేయలేదు. నేను రాజు కావాలని ఎన్నడూ నా తల్లి కైకతో అనలేదు. ఆమెను ఆ దిశగా ప్రేరేపించలేదు. నా తల్లి చేసిన పనికి నా అనుమతి లేదు. కాని దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకు నేను కారణం అయ్యాను కాబట్టి నా తండ్రిగారి మాట ప్రకారము రామునికి బదులు నేను పదునాలుగు సంత్సరములు అరణ్య వాసము చేస్తాను. నన్ను వద్దు అనడానికి ఎవరికీ అధికారము లేదు.” అని అన్నాడు భరతుడు.

రాముడు ఆశ్చర్యంగా భరతుని వంక చూచాడు. ఒక్క నవ్వు నవ్వి ఇలా అన్నాడు. “పౌరులారా! నా తండ్రి గారి పాలనలో జరిగిన అమ్మకాలూ, కొనుగోళ్లు, కుదువలు, ఆయన చనిపోయినాడని రద్దు చేస్తామా. లేక మరొకరి పేరుతో మార్చుకుంటామా! లేదు కదా. ఇదీ అంతే. నా తండ్రి నన్ను అరణ్యములకు వెళ్లమన్నాడు. నేను అరణ్యము లకు వచ్చాను. ఇప్పుడు మా తండ్రిగారు లేరని నా ప్రతిజ్ఞను మార్చుకోలేము కదా! నాకు మారుగా భరతుడు అరణ్యవాసము చేయలేడు కదా! నాక ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేయవచ్చుకానీ, అరణ్యవాసం చెయ్యడం హాస్యాస్పదము, జుగుప్సాకరము. నా తల్లి వరాలు కోరడం, నా తండ్రి ఆ వరాలు ఇవ్వడం, నేను అరణ్యములకు రావడం అన్నీ ధర్మబద్ధములే. భరతుడు రాజ్యం చేస్తాడు. అతనికి అన్నీ శుభాలే జరుగుతాయి. నేను తొందరలోనే వనవాసము నుండి తిరిగి వచ్చి లక్షణ, భరత, శత్రుఘ్నుల సాయంతో రాజ్యపాలన చేస్తాను.

భరతా! మహారాజు దశరథుడు నీకు రాజ్యము, నాకు వనములు ఇచ్చాడు. వాటిని మనం సమర్థవంతంగా పాలిద్దాము. మహారాజునకు అసత్యదోషం రాకుండా చేద్దాము. నేను చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించు” అని అన్నాడు రాముడు.
(అరణ్యంలో నేను శత్రు సంహారం చేసి అయోధ్యను శత్రుశేషం లేకుండా చేస్తాను. అంతవరకూ నీవు అయోధ్యను పాలించు అని రాముని మాటల్లోని భావము అని చెప్పవచ్చు.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వాదశోత్తరశతతమః సర్గః (112) >>

Aranya Kanda Sarga 38 In Telugu – అరణ్యకాండ అష్టాత్రింశః సర్గః

Aranya Kanda Sarga 38 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టాత్రింశః సర్గం రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో సీతను వెతికే క్రమంలో రాముడు, లక్ష్మణుడు సీతను కనుగొనడానికి దండకారణ్యంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తుంది. సీతాపహరణం తర్వాత రాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రయాణిస్తూ, అక్కడి ఆత్మలతో సంభాషణలు జరుపుతారు.

రామాస్త్రమహిమా

కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమామ్ |
బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః ||

1

నీలజీమూతసంకాశస్తప్తకాంచనకుండలః |
భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధః ||

2

వ్యచరం దండకారణ్యే ఋషిమాంసాని భక్షయన్ |
విశ్వామిత్రోఽథ ధర్మాత్మా మద్విత్రస్తో మహామునిః ||

3

స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్ |
అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః ||

4

మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర |
ఇత్యేవముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తదా ||

5

ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిమ్ |
బాలో ద్వాదశవర్షోఽయమకృతాస్త్రశ్చ రాఘవః ||

6

కామం తు మమ యత్సైన్యం మయా సహ గమిష్యతి |
బలేన చతురంగేణ స్వయమేత్య నిశాచరాన్ ||

7

వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రూంస్తే మనసేప్సితమ్ |
ఇత్యేవముక్తః స మునీ రాజానమిదమబ్రవీత్ ||

8

రామాన్నాన్యద్బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః |
దేవతానామపి భవాన్ సమరేష్వభిపాలకః ||

9

ఆసీత్తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప |
కామమస్తు మహత్సైన్యం తిష్ఠత్విహ పరంతప ||

10

బాలోఽప్యేష మహాతేజాః సమర్థస్తస్య నిగ్రహే |
గమిష్యే రామమాదాయ స్వస్తి తేఽస్తు పరంతప ||

11

ఏవముక్త్వా తు స మునిస్తమాదాయ నృపాత్మజమ్ |
జగామ పరమప్రీతో విశ్వామిత్రః స్వమాశ్రమమ్ ||

12

తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితమ్ |
బభూవోపస్థితో రామశ్చిత్రం విస్ఫారయన్ ధనుః ||

13

అజాతవ్యంజనః శ్రీమాన్ పద్మపత్రనిభేక్షణః |
ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా ||

14

శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజసా |
అదృశ్యత తతో రామో బాలచంద్ర ఇవోదితః ||

15

తతోఽహం మేఘసంకాశస్తప్తకాంచనకుండలః |
బలీ దత్తవరో దర్పాదాజగామ తదాశ్రమమ్ ||

16

తేన దృష్టః ప్రవిష్టోఽహం సహసైవోద్యతాయుధః |
మాం తు దృష్టా ధనుః సజ్యమసంభ్రాంతశ్చకార సః ||

17

అవజానన్నహం మోహాద్బాలోఽయమితి రాఘవమ్ |
విశ్వామిత్రస్య తాం వేదిమభ్యధావం కృతత్వరః ||

18

తేన ముక్తస్తతో బాణః శితః శత్రునిబర్హణః |
తేనాహం త్వాహతః క్షిప్తః సముద్రే శతయోజనే ||

19

నేచ్ఛతా తాత మాం హంతుం తదా వీరేణ రక్షితః |
రామస్య శరవేగేన నిరస్తోఽహమచేతనః ||

20

పాతితోఽహం తదా తేన గంభీరే సాగరాంభసి |
ప్రాప్య సంజ్ఞాం చిరాత్తాత లంకాం ప్రతి గతః పురీమ్ ||

21

ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః |
అకృతాస్త్రేణ బాలేన రామేణాక్లిష్టకర్మణా ||

22

తన్మయా వార్యమాణస్త్వం యది రామేణ విగ్రహమ్ |
కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ ||

23

క్రీడారతివిధిజ్ఞానాం సమాజోత్సవశాలినామ్ |
రక్షసాం చైవ సంతాపమనర్థం చాహరిష్యసి ||

24

హర్మ్యప్రాసాదసంబాధాం నానారత్నవిభూషితామ్ |
ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే ||

25

అకుర్వంతోఽపి పాపాని శుచయః పాపసంశ్రయాత్ |
పరపాపైర్వినశ్యంతి మత్స్యా నాగహ్రదే యథా ||

26

దివ్యచందనదిగ్ధాంగాన్ దివ్యాభరణభూషితాన్ |
ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్ ||

27

హృతదారాన్ సదారాంశ్చ దశ విద్రవతో దిశః |
హతశేషానశరణాన్ ద్రక్ష్యసి త్వం నిశాచరాన్ ||

28

శరజాలపరిక్షిప్తామగ్నిజ్వాలాసమావృతామ్ |
ప్రదగ్ధభవనాం లంకాం ద్రక్ష్యసి త్వం న సంశయః ||

29

పరదారాభిమర్శాత్తు నాన్యత్పాపతరం మహత్ |
ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహః ||

30

భవ స్వదారనిరతః స్వకులం రక్ష రాక్షస |
మానమృద్ధిం చ రాజ్యం చ జీవితం చేష్టమాత్మనః ||

31

కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ |
యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామవిప్రియమ్ ||

32

నివార్యమాణః సుహృదా మయా భృశం
ప్రసహ్య సీతాం యది ధర్షయిష్యసి |
గమిష్యసి క్షీణబలః సబాంధవో
యమక్షయం రామశరాత్తజీవితః ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టాత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 38 Meaning In Telugu

“ఓ దానవేంద్రా! ఆ రోజుల్లో నేను మహా పరాక్రమంతో నాకు ఎదురు ఎవరూ లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని. చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను, ఋషులను చంపుతూ, వారి మాంసము తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని.

ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్లము. మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథుని వద్దకు పోయి

“ఓ దశరథ మహారాజా! మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాడి వలన మాకు చాలా భయంగా ఉంది. నీవు రాముని పంపి మా యజ్ఞాలు మారీచుని బారి నుండి కాపాడు” అని అడిగాడు. దశరథుడు కొంచెం సేపు తటపటాయించి, తరువాత రాముని విశ్వామిత్రుని వెంట పంపాడు. రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు.

ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను చేత పట్టుకొని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లాను. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూచి రాముడు తన వింటికి నారి సంధించాడు. నేను రాముని వంక చూచాను. ఇంకా మీసములు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు. నేను గబా గబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్లాను.

రాముడు ఒక బాణమునుసంధించి నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరుయోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికి నేను నట్టనడిసముద్రంలో ఉన్నాను. రాముడు నన్ను చంపాలనుకోలేదు అందుకని సముద్రంలో పడవేసాడు. లేకపోతే నీతో ఇలా మాట్లాడ టానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు. ఆ ప్రకారంగా సాగరజలాలలో పడ్డ నాకు ఎంతో సేపటికి గానీ స్పృహ రాలేదు. తరువాత నానా పాట్లు పడి లంకానగరం చేరుకున్నాను. తరువాత తెలిసింది నన్ను సాగరంలో పడేట్టు కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసుల నందరినీ సంహరించాడని.

ఓ రావణా! అప్పుడు రాముడు బాలుడు. ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపము. 14,000 వేల మందిని ముహూర్తకాలంలో చంపాడు. కాబట్టి రాముడితో విరోధము పెట్టుకోకు. తరువాత నీ ఇష్టం.

లంకా నగరము దూరంగా సముద్రమధ్యలో ఉంది కాబట్టి లంకావాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు. నీ పుణ్యమా అని వారిని ఆ సుఖాలకు దూరం చెయ్యకు. సీత కారణంగా లంకానగరం నాశనం చెయ్యకు. ఇనుముతో కూడిన అగ్ని సమ్మెట దెబ్బలుతిన్నట్టు, నీవు రాజుగా ఉన్న కారణంగా లంకానగరం అంతా ఆపదలలో చిక్కుకుంటుంది. నీ మూలంగా రాక్షసులు అంతా మరణిస్తే, వారి భార్యలకు దిక్కు ఎవ్వరు. ఒక్క స్త్రీ కారణం ఎంతోమంది రాక్షసస్త్రీలను అనాధలుగా చేస్తావా! నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లను కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్లకు దిక్కెవ్వరు?

ఓ దానవేంద్రా! నీకు ఎంతో మంది అందమైన అప్సరసలవంటి భార్యలు ఉన్నారు కదా! ఇంకా ఈ పరభార్యల మీద నీకు ఎందుకయ్యా వ్యామోహము. పరదారాపహరణము పాపం అని తెలియదా! నా మాట విను. నీ భార్యలతో సంతృప్తి చెందు. వారితో సుఖించు. సీతను మరిచిపో. నీవు నాలుగు కాలాల పాటు నీభార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకోకు.

నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే, రాముని కోపాగ్నిలో మాడి మసి అయిపోతావు. నీ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. నీవు బంధు మిత్రులతో సహా యమసదనానికి ప్రయాణం కడతావు.” అని రావణునికి హితోపదేశం చేసాడు మారీచుడు.

మారీచుడు రావణుని వంక చూచాడు. రావణునిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Aranya Kanda Sarga 37 In Telugu – అరణ్యకాండ సప్తత్రింశః సర్గః

Aranya Kanda Sarga 37 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తత్రింశః సర్గంలో, రావణుడు తన సహచరుడు మరీచుని రాముని కోసం మాయా మృగంగా మారమని ఆదేశిస్తాడు. మరీచుడు మొదట తిరస్కరించినా, రావణుడి బలవంతం చేయడంతో అంగీకరిస్తాడు. మరీచుడు అందమైన మృగంగా మారి రాముడి ఆశ్రమం వద్ద ప్రత్యక్షమవుతాడు.

అప్రియపథ్యవచనమ్

తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్యవిశారదః |
ప్రత్యువాచ మహాప్రాజ్ఞో మారీచో రాక్షసేశ్వరమ్ ||

1

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||

2

న నూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతమ్ |
అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమమ్ ||

3

అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువి రక్షసామ్ |
అపి రామో న సంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసమ్ ||

4

అపి తే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజా |
అపి సీతానిమిత్తం చ న భవేద్వ్యసనం మమ ||

5

అపి త్వమీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశమ్ |
న వినశ్యేత్ పురీ లంకా త్వయా సహ సరాక్షసా ||

6

త్వద్విధః కామవృత్తో హి దుఃశీలః పాపమంత్రితః |
ఆత్మానం స్వజనం రాష్ట్రం స రాజా హంతి దుర్మతిః ||

7

న చ పిత్రా పరిత్యక్తో నామర్యాదః కథంచన |
న లుబ్ధో న చ దుఃశీలో న చ క్షత్రియపాంసనః ||

8

న చ ధర్మగుణైర్హీనః కౌసల్యానందవర్ధనః |
న తీక్ష్ణో న చ భూతానాం సర్వేషామహితే రతః ||

9

వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినమ్ |
కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనమ్ ||

10

కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ |
హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావనమ్ ||

11

న రామః కర్కశస్తాత నావిద్వాన్నాజితేంద్రియః |
అనృతం దుఃశ్రుతం చైవ నైవ త్వం వక్తుమర్హసి ||

12

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ||

13

కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా |
ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః ||

14

శరార్చిషమనాధృష్యం చాపఖడ్గేంధనం రణే |
రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి ||

15

ధనుర్వ్యాదితదీప్తాస్యం శరార్చిషమమర్షణమ్ |
చాపపాశధరం వీరం శత్రుసైన్యపహారిణమ్ ||

16

రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః |
నాత్యాసాదయితుం తాత రామాంతకమిహార్హసి ||

17

అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజా |
న త్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వనే ||

18

తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామినీ |
ప్రాణేభ్యోఽపి ప్రియతరా భార్యా నిత్యమనువ్రతా ||

19

న సా ధర్షయితుం శక్యా మైథిల్యోజస్వినః ప్రియా |
దీప్తస్యేవ హుతాశస్య శిఖా సీతా సుమధ్యమా ||

20

కిముద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప |
దృష్టశ్చేత్త్వం రణే తేన తదంతం తవ జీవితమ్ ||

21

జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభమ్ |
యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామవిప్రియమ్ ||

22

స సర్వైః సచివైః సార్ధం విభీషణపురోగమైః |
మంత్రయిత్వా తు ధర్మిష్ఠైః కృత్వా నిశ్చయమాత్మనః ||

23

దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలమ్ |
ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్త్వతః |
హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి ||

24

అహం తు మన్యే తవ న క్షమం రణే
సమాగమం కోసలరాజసూనునా |
ఇదం హి భూయః శృణు వాక్యముత్తమం
క్షమం చ యుక్తం చ నిశాచరేశ్వర ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 37 Meaning In Telugu

“ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు కానీ నీకు హితము చెప్పేవాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి.

నీవు ఎవరి మీద కైనా యుద్ధానికి పోయేముందు వారి గురించి తెలుసుకోడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు. వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు.

ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానము. లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు, లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకా వాసులు అష్టకష్టాలు పడక తప్పదు.

ఓ రావణా! నీ వంటి వాడు రాజుగా ఉంటే, ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంక అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రిచేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యమునుండి వెళ్లగొట్టబడేంత చెడ్డపనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు.

అసలు విషయం నేను చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే, తల్లితండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ల గొట్టబడలేదు.

(ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అది ఇప్పుడు ఒక నానుడి అయిపోయింది.)
రామో విగ్రహవాన్ ధర్మ: సాధు: సత్య పరాక్రమః॥
రాజాసర్వస్య లోకస్య దేవానాం మఘవానిమ॥

రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు. నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకలలోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడు తుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయునట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది. రామ బాణము అనే మంటలలోకి నీవు శలభము వలె దూకపోతున్నావు. జాగ్రత్త. నా మాటవిను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్లకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు.

రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్తరాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ. మిథిలాధిపతి జనకమహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు.

ఇటువంటి వ్యర్ధమైన పనికి ఎందుకు పూనుకుంటావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ, రాజభోగములు అనుభవించవలసిన వాడివి. అర్ధాంతరంగా . జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటాడు. నాలుగు కాలాలపాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు.

నామాట మీద నమ్మకం లేకపోతే, నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడుకదా! అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారుచెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకొనే ముందు, రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగానీ తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాలపాలుగాకు.

రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది, రామునితో వైరం మంచిదో కాదో!” అని మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టాత్రింశః సర్గః (38) >>

Ayodhya Kanda Sarga 110 In Telugu – అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 110

అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక ప్రముఖమైన భాగం. ఈ సర్గలో, భరతుడు, తన తండ్రి దశరథ మహారాజు మరణవార్త విని తీవ్రంగా దుఃఖిస్తాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు, తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమవుతాడు. ప్రజలమధ్య భరతుడు, తన తల్లిదండ్రుల పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, రాముని వనవాసానికి కారణమైన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. భరతుడు, కైకేయిని మందలించకుండానే ఆమెను క్షమిస్తాడు. ఈ సర్గ భక్తి, క్షమ, మరియు ధర్మానికి ఉన్న ప్రాధాన్యతను తెలుపుతుంది. భరతుడు తన అన్న రాముడి పట్ల ఉన్న ప్రేమను, తన తండ్రి పట్ల ఉన్న కృతజ్ఞతను అందరికీ చూపిస్తాడు.

ఇక్ష్వాకువంశకీర్తనమ్

క్రుద్ధమాజ్ఞాయ రామం తం వసిష్ఠః ప్రత్యువాచ హ |
జాబాలిరపి జానీతే లోకస్యాస్య గతాగతిమ్ || ౧ ||

నివర్తయితుకామస్తు త్వామేతద్వాక్యముక్తవాన్ |
ఇమాం లోకసముత్పత్తిం లోకనాథ నిబోధ మే || ౨ ||

సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మితా |
తతః సమభవద్బ్రహ్మా స్వయంభూర్దైవతైః సహ |
స వరాహస్తతో భూత్వా ప్రోజ్జహార వసుంధరామ్ || ౩ ||

అసృజచ్చ జగత్ సర్వం సహ పుత్రైః కృతాత్మభిః |
ఆకాశప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్యావ్యయః || ౪ ||

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః || ౫ ||

వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతస్సుతః |
స తు ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః || ౬ ||

యస్యేయం ప్రథమం దత్తా సమృద్ధా మనునా మహీ |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ || ౭ ||

ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్ కుక్షిరేవేతి విశ్రుతః |
కుక్షేరథాత్మజో వీరో వికుక్షిరుదపద్యత || ౮ ||

వికుక్షేస్తు మహాతేజాః బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాబాహురనరణ్యో మహాయశాః || ౯ ||

నానావృష్టిర్బభూవాస్మిన్న దుర్భిక్షం సతాం వరే |
అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన || ౧౦ ||

అనరణ్యాన్మహాబాహుః పృథూరాజా బభూవ హ |
తస్మాత్ పృథోర్మహారాజస్త్రిశంకురుదపద్యత || ౧౧ ||

స సత్యవచనాద్వీరః సశరీరో దివంగతః |
త్రిశంకోరభవత్సూనుర్ధుంధుమారో మహాయశాః || ౧౨ ||

ధుంధుమారో మహాతేజాః యువనాశ్వో వ్యజాయత |
యువనాశ్వసుతః శ్రీమాన్ మాంధాతా సమపద్యత || ౧౩ ||

మాంధాతుస్తు మహాతేజాః సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ || ౧౪ ||

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో రిపుసూదనః |
భరతాత్తు మహాబాహోరసితో నామ జాయత || ౧౫ ||

యస్యైతే ప్రతిరాజానో ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః || ౧౬ ||

తాంస్తు సర్వాన్ ప్రతివ్యూహ్య యుద్ధే రాజా ప్రవాసితః |
స చ శైలవరే రమ్యే బభూవాభిరతో మునిః || ౧౭ ||

ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతిః |
ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ || ౧౮ ||

భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తమృషిం సముపాగమ్య కాలిందీ త్వభ్యవాదయత్ || ౧౯ ||

స తామభ్యవదద్విప్రో వరేప్సుం పుత్రజన్మని |
పుత్రస్తే భవితా దేవి మహాత్మా లోకవిశ్రుతః || ౨౦ ||

ధార్మికశ్చ సుశీలశ్చ వంశకర్తాఽరిసూదనః |
కృత్వా ప్రదక్షిణం హృష్టా మునిం తమనుమాన్య చ || ౨౧ ||

పద్మపత్రసమానాక్షం పద్మగర్భసమప్రభమ్ |
తతః సా గృహమాగమ్య దేవీ పుత్రం వ్యజాయత || ౨౨ ||

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
గరేణ సహ తేనైవ జాతః స సగరోఽభవత్ || ౨౩ ||

స రాజా సగరో నామ యః సముద్రమఖానయత్ |
ఇష్ట్వా పర్వణి వేగేన త్రాసయంతమిమాః ప్రజాః || ౨౪ ||

అసమంజస్తు పుత్రోభూత్ సగరస్యేతి నః శ్రుతమ్ |
జీవన్నేవ స పిత్రా తు నిరస్తః పాపకర్మకృత్ || ౨౫ ||

అంశుమానపి పుత్రోఽభూదసమంజస్య వీర్యవాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః || ౨౬ ||

భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థా యేన విశ్రుతాః |
కకుత్స్థస్య చ పుత్రోఽభూద్రఘుర్యేన తు రాఘవాః || ౨౭ ||

రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః |
కల్మాషపాదః సౌదాసః ఇత్యేవం ప్రథితో భువి || ౨౮ ||

కల్మాషపాదపుత్రోఽభూచ్ఛంఖణస్త్వితి విశ్రుతః |
యస్తు తద్వీర్యమాసాద్య సహసైన్యో వ్యనీనశత్ || ౨౯ ||

శంఖణస్య చ పుత్రోఽభూచ్ఛూరః శ్రీమాన్ సుదర్శనః |
సుదర్శనస్యాగ్నివర్ణాగ్నివర్ణస్య శీఘ్రగః || ౩౦ ||

శీఘ్రగస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రశుశ్రుకః |
ప్రశుశ్రుకస్య పుత్రోఽభూదంబరీషో మహాద్యుతిః || ౩౧ ||

అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః |
నహుషస్య చ నాభాగః పుత్రః పరమధార్మికః || ౩౨ ||

అజశ్చ సువ్రతశ్చైవ నాభాగస్య సుతావుభౌ |
అజస్య చైవ ధర్మాత్మా రాజా దశరథః సుతః || ౩౩ ||

తస్య జ్యేష్ఠోఽసి దాయాదో రామ ఇత్యభివిశ్రుతః |
తద్గృహాణ స్వకం రాజ్యమవేక్షస్వ జనం నృప || ౩౪ ||

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజః |
పూర్వజే నావరః పుత్రో జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే || ౩౫ ||

స రాఘవాణాం కులధర్మమాత్మనః
సనాతనం నాద్య విహంతుమర్హసి |
ప్రభూతరత్నామనుశాధి మేదినీమ్
ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః || ౩౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః || ౧౧౦ ||

Ayodhya Kanda Sarga 110 Meaning In Telugu

సభలో జరుగుతున్న వాదోపవాదాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు కులగురువు వసిష్ఠుడు. ఎవరు చెప్పినా రాముడు ఒప్పుకోడంలేదు. జాబాలిమాటలతో రాముడు కోపగించుకున్నాడు అని అర్ధం అయింది వసిష్ఠునకు. జాబాలి సామాన్యుడు కాదు. అందుకని జాబాలి మాటలను సర్దిచెప్పడానికి ప్రయత్నం చేసాడు వసిష్ఠుడు.

“ఓ రామా! ఈ లోకంలో జనులు పుడుతూ చస్తూ ఉంటారనీ, పుణ్యలోకాలకు, పాప లోకాలకూ పోయి మరలా జన్మ ఎత్తుతుంటారనీ జాబాలికి కూడా తెలుసు. కానీ నిన్ను ఎలాగైనా అయోధ్యకు రప్పించాలనే తాపత్రయంతో అలా మాట్లాడాడు కానీ వేరు కాదు. ఇంతకూ ఈ సృష్టి ఎలా మొదలయిందో నాకు తెలిసినంత వరకూ చెబుతాను విను. ఈ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ జలంలో నుండి భూమి ఆవిర్భవించింది. తరువాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. తరువాత బ్రహ్మ వరాహ రూపంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ( విష్ణుదేవుడు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు అని నానుడి కాని బ్రహ్మ దేవుడు వరాహావతారము ధరించాడని కొన్ని పురాణాలలో ఉంది అని పండితులఅభిప్రాయము.) శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మ నుండి మరీచి, కశ్యపుడు పుట్టారు. కశ్యపునికి సూర్యుడు కుమారుడు. సూర్యుని కుమారుడు మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు మొట్ట మొదటగా ఈ అయోధ్యను పాలించాడు. అందుకే మీ వంశమును ఇక్ష్వాకు వంశము అని పిలుస్తారు.

ఇక్ష్వాకు కుమారుడు కుక్ష్మి, కుక్షికి వికుక్షి అనే కుమారుడు పుట్టాడు. వికుక్షికి బాణుడు జన్మించాడు. బాణుడి కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు ఈ దేశమును సుభిక్షంగా పరిపాలించాడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకుడు. ఆ త్రిశంకువే విశ్వామిత్రుని సాయంతో సశరీరంగా స్వర్గమునకు వెళ్లాడు. ఆ త్రిశంకుని కుమారుడు దుగ్ధుమారుడు, దుగ్ధుమారుని కుమారుడు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుని కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధృవసంధి. ధృవసంధికుమారుడు భరతుడు. (ఆ భరతుని పేరు మీదనే భారత దేశము, భరత ఖండము అని పిలువబడుతూ ఉంది.)

భరతుని కుమారుడు అసితుడు. ఈ అసితునికి ఒక కధ ఉండి. అసితునికి హైహయులు, తాలజంఘులు, శశిబిందువులు అనే రాజవంశీయులు శత్రువులు. వారు అసితుని రాజ్యము నుండి తరిమివేసారు. అసితుడు భార్యలతో సహా అడవులకు పారిపోయాడు. అప్పుడు అసితుని భార్యలు గర్భవతులు. అసితుని భార్యలకు ఒకరంటే ఒకరికి పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భం స్రావం అయేట్టు విషం పెట్టింది.

భృగు వంశమునకు చెందిన చ్యవనుడు హిమవత్పర్వతము మీద ఉంటున్నాడు. అసితుని భార్య కాళింది. కాళిందికే ఆమె సవతి విషం పెట్టింది. కాళింది చ్యవనుడి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించింది. “నీకు లోకముచే పూజింపబడేవాడు, ధార్మికుడు, మంచి శీలము కలవాడు, మీ వంశము నిలబెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు” అని ఆశీర్వదించాడు.

చ్యవనుని ఆశీర్వాదము ఫలించి కాళిందికి సర్వలక్షణ సమన్వితుడైన కుమారుడు జన్మించాడు. విషమును విరిచి పుట్టాడు. కాబట్టి అతనికి సగరుడు అనే పేరు సార్థకమయింది. సగర చక్రవర్తి ఒక యజ్ఞము చేసాడు. యజ్ఞాశ్వమును వదిలిపెట్టాడు. ఆయజ్ఞాశ్వము మాయం అయింది. దానిని వెదికించే ప్రయత్నంలో సముద్రమును తవ్వించాడు. సముద్రమును తవ్వడానికి సగరుడు కారకుడు అయ్యాడు కాబట్టి ఆయనపేరు మీద సముద్రమునకు సాగరము అనే పేరు సార్థకమయింది.

సగరునకు అసమంజుడు అనే కుమారుడు పుట్టాడు. వాడుచిన్నప్పటినుండి పాపకృత్యాలకు అలవాటుపడ్డాడు. కాబట్టి సగరుడు అసమంజుని వదిలివేసాడు. (ఈ అసమంజుడి గురించే కైక వాదించింది. దానిని మంత్రులు తిప్పికొట్టారు). అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. (ఈ భగీరథుడే గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. అందుకే గంగానదికి భాగీరధి అనే పేరు వచ్చింది).

భగీరథుని కుమారుడు కకుత్సుడు. ఆ కకుమ్హుని పేరు మీద మీ వంశమునకు కాకుత్స్య వంశము అనేపేరు వచ్చింది. కకుతున రఘువుకుమారుడు. అతని పేరుమీదుగానే మీ వంశమునకు రఘువంశము అనే పేరు, మీ అందరికీ రాఘువులు అనే పేరు వచ్చింది. రఘువు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. మరువుకుమారుడు ప్రశుశ్రువుడు.

అతని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడు మీ తండ్రి దశరథమహారాజు. నీవు ఆ దశరథుని పెద్దకుమారుడవు. మీ వంశములో అందరూ తమ పెద్దకుమారులకు రాజ్యాధికారము సంక్రమింపజేసారు. వంశపారంపర్యంగా పెద్దవాడివైన నీకు రాజ్యాధికారము లభించింది. అందుకని నీవు కాదనకుండా అయోధ్యను పాలించు. ఇక్ష్వాకు వంశములో ఇప్పటి వరకూ జ్యేష్టుడే రాజు అయ్యాడు. జ్యేష్టుడు ఉండగా చిన్నవాడు రాజుకావడం ధర్మవిరుద్ధము. కాబట్టి ఓ రామా! ఇప్పుడు నీవు నీ వంశ గౌరవమును వారు కాపాడుకుంటూ వస్తున్న రాజధర్మమును నాశనం చెయ్యవద్దు. నీ తండ్రి పరిపాలించినట్టు నీవు కూడాఅయోధ్యను పాలించు.” అని అన్నాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకాదశోత్తరశతతమః సర్గః (111) >>

Aranya Kanda Sarga 36 In Telugu – అరణ్యకాండ షట్త్రింశః సర్గః

Aranya Kanda Sarga 36 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్త్రింశః సర్గంలో, రాముడు సీతను మళ్లీ సాంత్విస్తాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి పంచవటిలో నివసిస్తుంటాడు. ఆ సమయంలో, శూర్పణఖా తన సోదరుడు ఖరుడికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతన్ని ప్రేరేపిస్తుంది. ఖరుడు తన రాక్షస సైన్యంతో రామునిపై దాడి చేయడానికి సిద్ధమవుతాడు.

సహాయైషణా

మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః |
ఆర్తోఽస్మి మమ చార్తస్య భవాన్ హి పరమా గతిః ||

1

జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ |
దూషణశ్చ మహాబాహుః స్వసా శూర్పణఖా చ మే ||

2

త్రిశిరాశ్చ మహాతేజా రాక్షసః పిశితాశనః |
అన్యే చ బహవః శూరా లబ్ధలక్షా నిశాచరాః ||

3

వసంతి మన్నియోగేన నిత్యవాసం చ రాక్షసాః |
బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః ||

4

చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినామ్ ||

5

తే త్విదానీం జనస్థానే వసమానా మహాబలాః |
సంగతాః పరమాయత్తా రామేణ సహ సంయుగే ||

6

నానాప్రహరణోపేతాః ఖరప్రముఖరాక్షసాః |
తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని ||

7

అనుక్త్వా పరుషం కించిచ్ఛరైర్వ్యాపారితం ధనుః |
చతుర్దశసహస్రాణి రక్షసాముగ్రతేజసామ్ ||

8

నిహతాని శరైస్తీక్ష్ణైర్మానుషేణ పదాతినా |
ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణశ్చ నిపాతితః ||

9

హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయా దండకాః కృతాః |
పిత్రా నిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః ||

10

స హంతా తస్య సైన్యస్య రామః క్షత్రియపాంసనః |
దుఃశీలః కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధోఽజితేంద్రియః ||

11

త్యక్త్వా ధర్మమధర్మాత్మా భూతానామహితే రతః |
యేన వైరం వినాఽరణ్యే సత్త్వమాశ్రిత్య కేవలమ్ ||

12

కర్ణనాసాపహరణాద్భగినీ మే విరూపితా |
తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమామ్ ||

13

ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవ |
త్వయా హ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబల ||

14

భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే |
తత్సహాయో భవ త్వం మే సమర్థో హ్యసి రాక్షస ||

15

వీర్యే యుద్ధే చ దర్పే చ న హ్యస్తి సదృశస్తవ |
ఉపాయజ్ఞో మహాన్ శూరః సర్వమాయావిశారదః ||

16

ఏతదర్థమహం ప్రాప్తస్త్వత్సమీపం నిశాచర |
శృణు తత్ కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్మమ ||

17

సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజతబిందుభిః |
ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర ||

18

త్వాం తు నిఃసంశయం సీతా దృష్ట్వా తు మృగరూపిణమ్ |
గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి ||

19

తతస్తయోరపాయే తు శూన్యే సీతాం యథాసుఖమ్ |
నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్రప్రభామివ ||

20

తతః పశ్చాత్సుఖం రామే భార్యాహరణకర్శితే |
విస్రబ్ధః ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మనా ||

21

తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః |
శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవ సః ||

22

ఓష్ఠౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివ |
మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత ||

23

స రావణం త్రస్తవిషణ్ణచేతా
మహావనే రామపరాక్రమజ్ఞః |
కృతాంజలిస్తత్త్వమువాచ వాక్యం
హితం చ తస్మై హితమాత్మనశ్చ ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్త్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 36 Meaning In Telugu PDF

మారీచుడు రావణుని కన్నా పెద్దవాడు. అందుకని రావణుడు మారీచుని గౌరవంగా సంబోధిస్తున్నాడు.

“ఓ తాతా! మారీచా! నేను చెప్పేమాటలను శ్రద్ధగా విను. ప్రస్తుతము నేను చాలా కష్టాలలో ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపించాలి. నా సోదరుడు ఖరుడు, దూషణుడు, వారి సేనాధిపతులు, 14,000 రాక్షస సేనలు, నరమాంస భక్షకుడైన త్రిశిరుడు, నా ఆజ్ఞమేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరచుకొని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా!

ఈ మధ్య ఎవరో రాముడు అట. దండకారణ్యమునకు వచ్చాడు. మన వాళ్లు అతనిని ప్రతిఘటించారు. ఇద్దరి మధ్య పోరు సాగింది. మన వాళ్లు సాయుధులు, రథములు మొదలగు వాహనములు కలవారు. కాని ఆ రాముడు కేవలం ధనుస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు. అతనికి ఏ వాహనమూ లేదు. కాని యుద్ధంలో రాముడు మన సేనలు 14,000 మందిని తుదముట్టించాడు. వారినే కాకుండా మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఖరుని, దూషణుని, త్రిశిరుని కూడా చంపాడు.

ఇంతకూ ఆ రాముడు ఎవరంటే, అయోధ్యా రాజు దశరథుని కుమారుడు. రాముడు చిన్నప్పటినుండి దుష్టుడు. దుర్మార్గుడు. ఇంద్రియలోలుడు. ఎప్పుడూ ఇతరులను హింసిస్తూ ఉండేవాడు. అధర్మపరుడు అటువంటి రాముని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముని, భార్యాసహితంగా దేశంనుంచి వెళ్లగొట్టాడు. ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యమునకు వచ్చాడు. మనవాళ్లను అన్యాయంగా అక్రమంగా చంపాడు.

మారీచా! అంతేకాదు. రాముడు ఇంకో ఘోరం కూడా చేసాడు. తనకే కదా బలం, దర్భం ఉన్నాయని విర్రవీగుతూ, ఏ పాపమూ ఎరుగని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తన భార్యముందు నా చెల్లెలును అవమానించాడు. దీనికి ప్రతీకారము చెయ్యాలని నిశ్చయించుకున్నాను. రాముడు నా చెల్లెలును అవమానించాడు. కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి. రాముని భార్యను అపహరించి లంకకు తీసుకొని రావాలి.

ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే, నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం. నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను. నాకు సాయం చెయ్యడానికి నీవే సమర్థుడవు. నీ కన్నా బలవంతుడు, పరాక్రమ వంతుడు ముల్లోకాలలో ఎవరున్నారు. నీకు బలము, పరాక్రమమేకాదు, చతురోపాయములలో కూడా ప్రావీణ్యం ఉంది. ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది.

పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు. అందుకనే నీ దగ్గరకు వచ్చాను. నీ సాయం అర్ధిస్తున్నాను. ఇంతకూ నీవు చేయాల్సిన పని ఏమిటంటే….. రాముడు, అతని భార్య సీత, అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్నారు. నీవు ఒక బంగారు వర్ణం కల లేడి రూపం ధరించి, సీతకు కనపడేటట్టు అటు ఇటు సంచరించు. నీ అందమైన రూపం చూచి. సీత తనకు ఆ బంగారు లేడి కావాలి అని రాముని అడుగుతుంది. నిన్ను పట్టుకోడానికి, ముందు రాముడు, తరువాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు. నీవు వారికి అందకుండా దూరంగా పరుగెత్తు. రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు.

అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతను అపహరిస్తాను.

తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా, శారీరకంగా బలం కోల్పోతాడు. అప్పుడు సమయం చూచి నేను రాముని సంహరిస్తాను. యుద్ధములో ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది రాక్షసులకు, నా సోదరులు ఖర, దూషణాదులకు ఆత్మశాంతి కలిగిస్తాను. నా చెల్లెలు రాముని మీద పెంచుకున్న పగ, ప్రతీకారము చల్లారుస్తాను. నాకీ సాయం చేసి పెట్టు.” అని బతిమాలాడు.

రావణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు కానీ రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తడి ఆరిపోయింది. శరీరం వణికిపోయింది. పెదాలు ఎండిపోయాయి. అలాగే గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యము కూడగట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Aranya Kanda Sarga 35 In Telugu – అరణ్యకాండ పంచత్రింశః సర్గః

Aranya Kanda Sarga 35 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచత్రింశః సర్గంలో, రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యంలో నివసిస్తూ రాక్షసులను సంహరిస్తున్నాడు. శూర్పణఖా అనే రాక్షసి రాముని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ రాముడు తన భార్య సీతతో ఉండటం వల్ల ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడిపై దాడి చేస్తుంది.

మారీచాశ్రమపునర్గమనమ్

తతః శూర్పణఖావాక్యం తచ్ఛ్రుత్వా రోమహర్షణమ్ |
సచివానభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామ సః ||

1

తత్కార్యమనుగమ్యాథ యథావదుపలభ్య చ |
దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలమ్ ||

2

ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః |
స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాముపాగమత్ ||

3

యానశాలాం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధిపః |
సూతం సంచోదయామాస రథః సంయోజ్యతామితి ||

4

ఏవముక్తః క్షణేనైవ సారథిర్లఘువిక్రమః |
రథం సంయోజయామాస తస్యాభిమతముత్తమమ్ ||

5

కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితమ్ |
పిశాచవదనైర్యుక్తం ఖరైః కనకభూషణైః ||

6

మేఘప్రతిమనాదేన స తేన ధనదానుజః |
రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నదనదీపతిమ్ ||

7

స శ్వేతవాలవ్యజనః శ్వేతచ్ఛత్రో దశాననః |
స్నిగ్ధవైడూర్యసంకాశస్తప్తకాంచనకుండలః ||

8

వింశద్భుజో దశగ్రీవో దర్శనీయపరిచ్ఛదః |
త్రిదశారిర్మునీంద్రఘ్నో దశశీర్ష ఇవాద్రిరాట్ ||

9

కామగం రథమాస్థాయ శుశుభే రాక్షసేశ్వరః |
విద్యున్మండలవాన్ మేఘః సబలాక ఇవాంబరే ||

10

సశైలం సాగరానూపం వీర్యవానవలోకయన్ |
నానాపుష్పఫలైర్వృక్షైరనుకీర్ణం సహస్రశః ||

11

శీతమంగళతోయాభిః పద్మినీభిః సమంతతః |
విశాలైరాశ్రమపదైర్వేదిమద్భి సమావృతమ్ ||

12

కదల్యాఽఽఢకిసంబాధం నాలికేరోపశోభితమ్ |
సాలైస్తాలైస్తమాలైశ్చ పుష్పితైస్తరుభిర్వృతమ్ ||

13

నాగైః సుపర్ణైర్గంధర్వైః కిన్నరైశ్చ సహస్రశః |
ఆజైర్వైఖానసైర్మాషైః వాలఖిల్యైర్మరీచిపైః ||

14

అత్యంతనియతాహారైః శోభితం పరమర్షిభిః |
జితకామైశ్చ సిద్ధైశ్చ చారణైరుపశోభితమ్ ||

15

దివ్యాభరణమాల్యాభిర్దివ్యరూపాభిరావృతమ్ |
క్రీడారతివిధిజ్ఞాభిరప్సరోభిః సహస్రశః ||

16

సేవితం దేవపత్నీభిః శ్రీమతీభిః శ్రియావృతమ్ |
దేవదానవసంఘైశ్చ చరితం త్వమృతాశిభిః ||

17

హంసక్రౌంచప్లవాకీర్ణం సారసైః సంప్రణాదితమ్ |
వైడూర్యప్రస్తరం రమ్యం స్నిగ్ధం సాగరతేజసా ||

18

పాండురాణి విశాలాని దివ్యమాల్యయుతాని చ |
తూర్యగీతాభిజుష్టాని విమానాని సమంతతః ||

19

తపసా జితలోకానాం కామగాన్యభిసంపతన్ |
గంధర్వాప్సరసశ్చైవ దదర్శ ధనదానుజః ||

20

నిర్యాసరసమూలానాం చందనానాం సహస్రశః |
వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాణి చ ||

21

అగురూణాం చ ముఖ్యానాం వనాన్యుపవనాని చ |
తక్కోలానాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినామ్ ||

22

పుష్పాణి చ తమాలస్య గుల్మాని మరిచస్య చ |
ముక్తానాం చ సమూహాని శుష్యమాణాని తీరతః ||

23

శంఖానాం ప్రస్తరం చైవ ప్రవాలనిచయం తథా |
కాంచనాని చ శైలాని రాజతాని చ సర్వశః ||

24

ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని హ్రదాని చ |
ధనధాన్యోపపన్నాని స్త్రీరత్నైః శోభితాని చ ||

25

హస్త్యశ్వరథగాఢాని నగరాణ్యవలోకయన్ |
తం సమం సర్వతః స్నిగ్ధం మృదుసంస్పర్శమారుతమ్ ||

26

అనూపం సింధురాజస్య దదర్శ త్రిదివోపమమ్ |
తత్రాపశ్యత్స మేఘాభం న్యగ్రోధమృషిభిర్వృతమ్ ||

27

సమంతాద్యస్య తాః శాఖాః శతయోజనమాయతాః |
యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్ఛపమ్ ||

28

భక్షార్థం గరుడః శాఖామాజగామ మహాబలః |
తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః ||

29

సుపర్ణః పర్ణబహులాం బభంజ చ మహాబలః |
తత్ర వైఖానసా మాషా వాలఖిల్యా మరీచిపాః ||

30

అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః |
తేషాం దయార్థం గరుడస్తాం శాఖాం శతయోజనామ్ ||

31

జగామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్ఛపౌ |
ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషమ్ ||

32

నిషాదవిషయం హత్వా శాఖయా పతగోత్తమః |
ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్ ||

33

స తేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృతవిక్రమః |
అమృతానయనార్థం వై చకార మతిమాన్ మతిమ్ ||

34

అయోజాలాని నిర్మథ్య భిత్త్వా రత్నమయం గృహమ్ |
మహేంద్రభవనాద్గుప్తమాజహారామృతం తతః ||

35

తం మహర్షిగణైర్జుష్టం సుపర్ణ కృతలక్షణమ్ |
నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః ||

36

తం తు గత్వా పరం పారం సముద్రస్య నదీపతేః |
దదర్శాశ్రమమేకాంతే రమ్యే పుణ్యే వనాంతరే ||

37

తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణమ్ |
దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసమ్ ||

38

స రావణః సమాగమ్య విధివత్తేన రక్షసా |
మారీచేనార్చితో రాజా సర్వకామైరమానుషైః ||

39

తం స్వయం పూజయిత్వా తు భోజనేనోదకేన చ |
అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్ ||

40

కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర |
కేనార్థేన పునస్త్వం వై తూర్ణమేవమిహాగతః ||

41

ఏవముక్తో మహాతేజా మారీచేన స రావణః |
తం తు పశ్చాదిదం వాక్యమబ్రవీద్వాక్యకోవిదః ||

42

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 35 Meaning In Telugu

శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు.

శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు.

రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు.

రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు. ఆ ప్రదేశములో ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని కొమ్మలు, ఊడలు నూరు యోజనముల మేర విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు మీద కొంత మంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అనే ఋషులు కేవలము చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సుచేసుకుంటున్నారు.

ఒక సారి గరుడుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకొని రావడానికి వెళుతున్నాడు. ఆహారంగా ఒక ఏనుగును, ఒక తాబేలును రెండు కాళ్లతో పట్టుకొని ఎగురుతున్నాడు. అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది. గరుడుడు నూరుయోజనముల పొడవు గల ఒక బలిష్టమైన కొమ్మమీద ఆ గజ,కచ్ఛపములతో వాలాడు. గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ విరిగితే దాని మీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు, వేలాడుతున్న వాలఖిల్యులకు తపోభంగము అవుతుందని, గజకచ్ఛపములను చెరి ఒక కాలితో పట్టుకొని, ఆ కొమ్మను నోట కరచుకొని మరలా పైకి ఎగిరాడు. వారిని ఒక సమతల ప్రదేశముమీద దింపి, ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేసాడు. తరువాత గరుడుడు గజ కచ్ఛపములను ఆరగించి, తరువాత అమృతం తేవడానికి స్వర్గమునకు వెళ్లాడు. (ఈ కధ మహాభారతంలో ఉన్నది).

రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్లాడు. అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు. సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్లాడు.

అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము. మారీచుడు జన్మత: రాక్షసుడే అయినా ముని వృత్తి స్వీకరించి, జటావల్కలములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సుచేసుకుంటున్నాడు. రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూచాడు మారీచుడు. రావణునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు. రావణునికి భోజన, పానీయాలుసమకూర్చాడు. కాస్త సేద దీరిన తరువాత మారీచుడు రావణుని ఇలా అడిగాడు.

“రావణా! రాక రాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు. ఏమి కారణము? లంకలో అంతా క్షేమంగా ఉన్నారు కదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు. అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా ఉన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షట్త్రింశః సర్గః (36) >>

Ayodhya Kanda Sarga 109 In Telugu – అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 109

అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక శోకకరమైన ఘట్టం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం వల్ల కలిగిన వేదనను తట్టుకోలేక మరణిస్తాడు. ఆయన మరణ వార్తను విని, కైకేయి తన చర్యల పట్ల పశ్చాత్తాపపడుతుంది. భారతుడు, శత్రుఘ్నుడు, తక్షిణ ప్రాంతం నుండి తిరిగి వస్తారు. అయోధ్యలో జరిగిన మార్పులు, రాజకుమారుల హృదయాన్ని బాధిస్తాయి. దశరథుని మరణంతో, భరతుడు ఆవేదనతో రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ, కుటుంబ బంధాలు, బాధ్యత, మరియు పితృఋణాన్ని నొక్కి చెబుతుంది. ఇది భరతుడు తన అన్న రాముడి పట్ల చూపించే ప్రేమ, భక్తిని స్పష్టంగా చూపిస్తుంది.

సత్యప్రశంసా

జాబాలేస్తు వచః శ్రుత్వా రామః సత్యాత్మనాం వరః |
ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చావిపన్నయా || ౧ ||

భవాన్ మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్ |
అకార్యం కార్యసంకాశమపథ్యం పథ్యసమ్మితమ్ || ౨ ||

నిర్మర్యాదస్తు పురుషః పాపాచారసమన్వితః |
మానం న లభతే సత్సు భిన్నచారిత్రదర్శనః || ౩ ||

కులీనమకులీనం వా వీరం పురుషమానినమ్ |
చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వాఽశుచిమ్ || ౪ ||

అనార్యస్త్వార్యసంకాశః శౌచాద్ధీనస్తథా శుచిః |
లక్షణ్యవదలక్షణ్యో దుఃశీల శీలవానివ || ౫ ||

అధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరమ్ |
అభిపత్స్యే శుభం హిత్వా క్రియావిధివివర్జితమ్ || ౬ ||

కశ్చేతయానః పురుషః కార్యాకార్యవిచక్షణః |
బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణమ్ || ౭ ||

కస్య ధాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయామ్ |
అనయా వర్తమానో హి వృత్త్యా హీనప్రతిజ్ఞయా || ౮ ||

కామవృత్తస్త్వయం లోకః కృత్స్నః సముపవర్తతే |
యద్వృత్తాః సంతి రాజానస్తద్వృత్తాః సంతి హి ప్రజాః || ౯ ||

సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనమ్ |
తస్మాత్సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః || ౧౦ ||

ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే |
సత్యవాదీ హి లోకేఽస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్ || ౧౧ ||

ఉద్విజంతే యథా సర్పాన్నరాదనృతవాదినః |
ధర్మః సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే || ౧౨ ||

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మా శ్రితా సదా |
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ || ౧౩ ||

దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ |
వేదాః సత్యప్రతిష్ఠానాస్తస్మాత్ సత్యపరో భవేత్ || ౧౪ ||

ఏకః పాలయతే లోకమేకః పాలయతే కులమ్ |
మజ్జత్యేకో హి నిరయైకః స్వర్గే మహీయతే || ౧౫ ||

సోఽహం పితుర్నియోగంతు కిమర్థం నానుపాలయే |
సత్యప్రతిశ్రవః సత్యం సత్యేన సమయీకృతః || ౧౬ ||

నైవ లోభాన్న మోహాద్వా న హ్యజ్ఞానాత్తమోఽన్వితః |
సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః || ౧౭ ||

అసత్యసంధస్య సతశ్చలస్యాస్థిరచేతసః |
నైవ దేవా న పితరః ప్రతీచ్ఛంతీతి నః శ్రుతమ్ || ౧౮ ||

ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయమ్ |
భారః సత్పురుషాచీర్ణస్తదర్థమభిమన్యతే || ౧౯ ||

క్షాత్త్రం ధర్మమహం త్యక్ష్యే హ్యధర్మం ధర్మసంహితమ్ |
క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః || ౨౦ ||

కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్య చ |
అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మ పాతకమ్ || ౨౧ ||

భూమిః కీర్తిర్యశో లక్ష్మీః పురుషం ప్రార్థయంతి హి |
స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్ || ౨౨ ||

శ్రేష్ఠం హ్యనార్యమేవ స్యాద్యద్భవానవధార్య మామ్ |
ఆహ యుక్తికరైర్వాక్యైరిదం భద్రం కురుష్వ హ || ౨౩ ||

కథం హ్యహం ప్రతిజ్ఞాయ వనవాసమిమం గురౌ |
భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః || ౨౪ ||

స్థిరా మయా ప్రతిజ్ఞాతా ప్రతిజ్ఞా గురుసన్నిధౌ |
ప్రహృష్యమాణా సా దేవీ కైకేయీ చాభవత్తదా || ౨౫ ||

వనవాసం వసన్నేవం శుచిర్నియతభోజనః |
మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః పితన్ దేవాంశ్చ తర్పయన్ || ౨౬ ||

సంతుష్టపంచవర్గోఽహం లోకయాత్రాం ప్రవర్తయే |
అకుహః శ్రద్దధానస్సన్ కార్యాకార్యవిచక్షణః || ౨౭ ||

కర్మభూమిమిమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్ఛుభమ్ |
అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః || ౨౮ ||

శతం క్రతూనామాహృత్య దేవరాట్ త్రిదివంగతః |
తపాంస్యుగ్రాణి చాస్థాయ దివం యాతా మహర్షయః || ౨౯ ||

అమృష్యమాణః పునరుగ్రతేజాః
నిశమ్య తన్నాస్తికవాక్యహేతుమ్ |
అథాబ్రవీత్తం నృపతేస్తనూజో
విగర్హమాణో వచనాని తస్య || ౩౦ ||

సత్యం చ ధర్మం చ పరాక్రమం చ
భూతానుకంపాం ప్రియవాదితాశ్చ |
ద్విజాతిదేవాతిథిపూజనం చ
పంథానమాహుస్త్రిదివస్య సంతః || ౩౧ ||

తేనైవమాజ్ఞాయ యథావదర్థమ్
ఏకోదయం సంప్రతిపద్య విప్రాః |
ధర్మం చరంతః సకలం యథావత్
కాంక్షంతి లోకాగమమప్రమత్తాః || ౩౨ ||

నిందామ్యహం కర్మ పితుః కృతం తత్
యస్త్వామగృహ్ణాద్విషమస్థబుద్ధిమ్ |
బుద్ధ్యానయైవంవిధయా చరంతమ్
సునాస్తికం ధర్మపథాదపేతమ్ || ౩౩ ||

యథా హి చోరః స తథా హి బుద్ధః
తథాగతం నాస్తికమత్ర విద్ధి |
తస్మాద్ధి యః శంక్యతమః ప్రజానామ్
న నాస్తికేనాభిముఖో బుధః స్యాత్ || ౩౪ ||

త్వత్తో జనాః పూర్వతరే వరాశ్చ
శుభాని కర్మాణి బహూని చక్రుః |
జిత్వా సదేమం చ పరంచ లోకమ్
తస్మాద్ద్విజాః స్వస్తి హుతం కృతం చ || ౩౫ ||

ధర్మే రతాః సత్పురుషైః సమేతాః
తేజస్వినో దానగుణప్రధానాః |
అహింసకా వీతమలాశ్చ లోకే
భవంతి పూజ్యా మునయః ప్రధానాః || ౩౬ ||

ఇతి బ్రువంతం వచనం సరోషం
రామం మహాత్మానమదీనసత్త్వమ్ |
ఉవాచ తథ్యం పునరాస్తికం చ
సత్యం వచః సానునయం చ విప్రః || ౩౭ ||

న నాస్తికానాం వచనం బ్రవీమ్యహమ్
న చాస్తికోఽహం న చ నాస్తి కించన |
సమీక్ష్య కాలం పునరాస్తికోఽభవమ్
భవేయ కాలే పునరేవ నాస్తికః || ౩౮ ||

స చాపి కాలోఽయముపాగతశ్శనైః
యథా మయా నాస్తికవాగుదీరితా |
నివర్తనార్థం తవ రామ కారణాత్
ప్రసాదనార్థం తు మయైతదీరితమ్ || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గః || ౧౦౯ ||

Ayodhya Kanda Sarga 109 Meaning In Telugu

జాబాలి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా పలికాడు. “ఓ మహాత్మా! మీరు నా హితము కోరి చెప్పినమాటలు నాకు బాగున్నా లోకసమ్మతము కావు. అవి లోకానికి హితమును చేకూర్చలేవు. మీ మాటలు ఆచరిస్తే ప్రజలలో కట్టుబాటు తప్పుతుంది. స్వేచ్ఛా విహారము పెచ్చరిల్లుతుంది. ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు. అరాచకము నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరూ గౌరవించరు.

ఒక మనిషియొక్క గుణగణములు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటి లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చెయ్యకూడని పనులు చేసేవారు, పైకి ఉత్తమ లక్షణములు కనబరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవారు, పైకి నీతి మంతుడి మాదిరి కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవారు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు. కాని పైకి మాత్రం ధర్మాత్ములు మాదిరి కనపడతారు.

మీరు చెప్పిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనము కోసరం వెండ్లాడేవాడి నవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకు రమ్మని ఆహ్వానించే వారు కూడా రేపు నన్ను దురాత్ముడని నిందిస్తారు. నన్ను ఎవరూ గౌరవించరు. గౌరవం లేని రాముడు జీవించి కూడా వృధా!

నేను నా తండ్రి మాటను పక్కన బెట్టి రాజ్యము స్వీకరిస్తే, లోకంలో అందరూ నా మాదిరే ఆడిన మాట తప్పడంలో పోటీ పడతారు తప్ప నన్ను ఎవరూ గౌరవించరు. నీమాటలు నమ్మిన వారికి నీవు నమ్మిన ఈలోకంలో సుఖం దక్కదు. పైగా, వారికి, నేను నమ్మిన పరలోకంలో నరకం ప్రాప్తిస్తుంది.

రాజు అనే వాడు ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. రాజు ఆచరించే ఆదర్శాలను ప్రజలుకూడా ఆచరిస్తారు. అలా కాకుండా నేనే మాటతప్పి రాజ్యం స్వీకరిస్తే, ప్రజలుకూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. స్వేచ్ఛాజీవులు అవుతారు. అది దీర్ఘకాలంలో చెడుఫలితాలను ఇస్తుంది.

రాజధర్మము సనాతనమైనది. సత్యము, ధర్మము ఈ రెంటి మీదనే రాజ్యము నడవాలి. అప్పుడు ప్రజలకు రాజుమీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి సత్యమును మించిన ధర్మము మరొకటి లేదు. మేమే చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఆ సత్యము మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి మానవునకు సత్యవ్రతమును అవలంబించడం ఆవశ్యకము. నేను కూడా ఆ సత్యవాక్పరిపాలననే నమ్ముకున్నాను. ఆడిన మాట తప్పను. నా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటను.
ఈ లోకంలో జనులు పలురకాలు. ఒకడు రాజ్యపాలన చేస్తాడు. మరొకడు పాపపు పనులు చేస్తాడు. మరొకడు వంశ గౌరవాన్ని కాపాడుతాడు. మరొకడు నరకద్వారాలు వెతుక్కుంటూ నరకానికివెళతాడు. ఎవరు చేసిన కర్మలకు తగ్గ ఫలములను వారు అనుభవిస్తారు. నేను సత్యమును పాటించడమే ధర్మంగా పెట్టుకున్నాను. అదే ఆచరిస్తాను. తగిన ఫలితాన్ని పొందుతాను.

నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటను, మోహము చేతగానీ, ఆశాపాశముల చేతగానీ, చిత్తభ్రమలో గానీ, అజ్ఞానమువలన గానీ, ఇంకా ఎటువంటి పరిస్థితులలో గానీ తప్పను. ఇదే నా నిశ్చయం. నేనే గనక ఆడిన మాట తప్పితే దేవతలు గానీ, నా పితృదేవతలు గానీ నేను చేసిన పనిని సమర్థించరు.

నేను ఆడిన మాట కోసరము నా క్షత్రియ ధర్మమును కూడా త్యజించుటకు వెనుకాడను. ఎందుకంటే క్షత్రియ ధర్మంలో ఎక్కువగా క్రూరత్వానికి, దురాశకు తావు ఉంటుంది కానీ సత్యధర్మానికి తావు లేదు. మానవుడు తాను చెప్పదలచుకొన్నది ముందుగా మనసులో తలచుకుంటాడు. దానిని వాక్కు రూపంలో బయటకు చెబుతాడు. కాబట్టి నీవు చెప్పినవి అన్నీ నీచెడ్డ ప్రవర్తనను సూచిస్తున్నాయి. నేను నా తండ్రి ఎదుట వనవాసమునకు పోతాను అని అంగీకరించాను. అప్పుడు నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక, ఎంతో సంతోషించారు. ఇప్పుడు భరతుని మాట, నీ మాట విని ఎలా అయోధ్యకు పోగలను. కాబట్టి వనవాసమే నాకు శ్రేయోదాయకము. ఇక్కడ స్వచ్ఛమైన గాలీ పీలుస్తూ, కందమూలములు తింటూ, నిర్మలమైన జలములు త్రాగుతూ, హాయిగా కాలం గడుపుతాను.

ఇది కర్మభూమి. మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నీ మాట విని నేను అధర్మంగా ప్రవర్తిస్తే నాకు చెడుఫలితాలే వస్తాయి. దేవేంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసి ఇంద్రపదవి అధిష్ఠించాడు. ఎంతో మంది మహాఋషులు ఘోరమైన తపస్సులు చేసి ఉత్తమలోకములు పొందారు. వారే కాకుండా, సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, సరళమైన మాట, దేవతలను, బ్రాహ్మణులను పూజించడం, వీటిని మార్గములుగా చేసుకొని మానవులు ఉత్తమ లోకములు పొందారు. ఆ మానవులలో కూడా, బ్రాహ్మణులు, పైన చెప్పబడిన మార్గంలో పయనించి ఉత్తమలోకములు పొందారు.

నీవు బ్రాహ్మణుడవు. కాని అపమార్గంలో పయనిస్తున్నావు. నీ వంటి అధర్మపరుడిని, అవినీతి పరుడిని దగ్గర చేర్చి నా తండ్రి తప్పుచేసాడు. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ మాటలు అన్నావో ఆ బుద్ధుడు, తథాగతుడు, పరమ నాస్తికుడు, ఒట్టి దొంగ. అందుకే ప్రజలు అతనినినమ్మలేదు. జ్ఞానులు ఎప్పుడూ నాస్తికులతో సంబంధం పెట్టుకో.

ఓ జాబాలీ! నీకు పూర్వులు చాలామంది ఉన్నారు. వారు ఎన్నో యజ్ఞయాగములు, శుభమైన కర్మలు చేసారు. వారు ఈ లోకము లోనూ పరలోకములోనూ సుఖాలు అనుభవించారు. బ్రాహ్మణులు మానవుల చేత యజ్ఞములు, యాగములు మొదలగు మంగళ కరమైన కార్యములు చేయిస్తారు కానీ నీ మాదిరి నాస్తిక వాదమును వ్యాప్తి చేయరు. ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించువారు. మంచివారి స్నేహము చేయువారు, తేజస్సు కలవారు, దానవ్రతులు, అహింసాపరులు, పాపము చేయని వారూ, ఉత్తములు అయిన వారు లోకములో పూజింపబడతారు. నీ లాంటి వారిని ప్రజలు గౌరవించరు.” అని కోపంతో అన్నాడు రాముడు.

రాముని మాటలు విన్న జాబాలి రాముని అనునయిస్తూ ఈ విధంగా అన్నాడు. “రామా! నీవు పొరపడుతున్నావు. నేను నాస్తికుడను కాను. నాస్తికత్వమును వ్యాప్తిచేయడం లేదు. కేవలము నిజాలు చెప్పడమే నా సంకల్పము అది నాస్తికత్వము మాదిరి అనిపిస్తుంది. నేను కూడా ఆస్తికుని వలె మాట్లాడగలను. కేవలము నిన్ను మరలా అయోధ్యకు పట్టాభిషిక్తుని చేసి, అయోధ్యా ప్రజలు, భరతుని కోరిక నెరవేరవలెననే కోరికతో అలా మాట్లాడాను కానీ వేరు కాదు.” అని రాముని అనునయించాడు జాబాలి. అంతటితో ఆ వివాదము ముగిసిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

(ఈ సర్గలో మీకు ఒక శ్లోకము కనిపిస్తుంది. అందులో బుద్ధుడు, తథాగతుని ప్రస్తావన వచ్చింది. రాముడు బుద్ధుని చోరుడు అని కూడా అంటాడు. “యథాహి చోర: స తథా హి బుద్ధ స్తథాగతం నాస్తిక మత్ర విద్ధి,”. ఇది ఎలా సంభవము. రాముడు త్రేతాయుగము కాలము నాటి వాడు. బుద్ధుడు క్రీ.పూ.563 వ సంవత్సరములో జన్మించాడు. 80 సంవత్సరాలు జీవించాడు. కీ.పూ.483 సంవత్సరములో మరణించాడు. ఆయన బౌద్ధమతమును వ్యాప్తిచేసాడు. బౌద్ధము భారతదేశంలో వ్యాప్తి చెందకపోయినా దేశాలలో అవలంబింపబడుతూ ఉంది.

రామాయణ ప్రాశస్త్యమునకు ముగ్ధులై బౌద్ధులు రామాయణమును తమకు అనుకూలంగా మార్చి రాసుకున్నారు అని అంటారు. కాబట్టి బుద్ధుని కాలం నాటికే రామాయణము ఉంది అని తెలుస్తూ ఉంది. ఆ కారణం చేత రాముడు బుద్దుని గూర్చి చెప్పడం, దూషించడం అసంగతం అని అర్థం అవుతూ ఉంది. అందువలన ఈ శ్లోకములు ప్రక్షిప్తములు అనగా తరువాత “తరువాత చేర్చబడినవి” అని నిర్ధారణ అయింది. ఈ విషయమును శ్రీమద్రామాయణమునకు వ్యాఖ్య రాసిన బ్రహ్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు కూడా ధృవీకరించారు. వారి అభిప్రాయము ప్రకారము ఈ శ్లోకములు ఛందస్సు మార్చి రాయబడ్డాయి. అప్పటిదాకా అనుష్టుప్ ఛందస్సులో నడిచిన రామాయణ కధ ఈ సర్గలో ఆఖరి పదిశ్లోకములు ఉపజాతి వృత్తంలో రాయబడ్డాయి. కాబట్టి ఈ పదిశ్లోకములను ప్రక్షిప్తములు అనడంలో సందేహము లేదు. అని అభిప్రాయపడ్డారు. రాముడు బుద్ధుని గురించి చెప్పడంలోనే ఈ విషయం తేటతెల్లము అవుతోంది. బుద్ధుని మీద, బౌద్ధము మీద ద్వేషము ఉన్న అజ్ఞాత రచయిత, ఎవరో ‘ ఔచిత్యమును మరిచి, ఈ శ్లోకములను రామాయణములో చేర్చి ఉండవచ్చు అని అనుకొనవలసి వస్తోంది.)

అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః (110) >>

Ayodhya Kanda Sarga 108 In Telugu – అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 108

అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో కీలకమైన ఘట్టం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం గురించి తీవ్రంగా బాధపడుతూ, కౌసల్యా దేవితో తన మనోవేదనను వ్యక్తం చేస్తాడు. దశరథుడు, తన గత పాపాన్ని గుర్తుచేసుకుంటాడు, యాదృచ్ఛికంగా శ్రవణకుమారుని వధ కారణంగా అతని తల్లిదండ్రులకు చేసిన అన్యాయాన్ని స్మరించుకుంటాడు. ఈ ఘటన అతని మనస్సులో మరింత బాధను కలిగిస్తుంది. ఈ స్మృతులు, తన ప్రస్తుత దుఃఖానికి కారణమని భావిస్తూ, దశరథుడు ప్రాణాలు విడుస్తాడు. ఈ సర్గ, కర్మ ఫలితాన్ని మరియు వ్యక్తి చేసిన పాపాలు ఎలా వెంబడిస్తాయో చూపిస్తుంది. రామాయణంలో ఈ భాగం, పితృవ్యతసతో ధర్మాన్నీ, బాధ్యతలను నొక్కి చెబుతుంది.

జాబాలివాక్యమ్

ఆశ్వాసయంతం భరతం జాబాలిర్బ్రాహ్మణోత్తమః |
ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వచః || ౧ ||

సాధు రాఘవ మాభూత్తే బుద్ధిరేవం నిరర్థికా |
ప్రాకృతస్య నరస్యేవ హ్యార్యబుద్ధేర్మనస్వినః || ౨ ||

కః కస్య పురుషో బంధుః కిమాప్యం కస్య కేనచిత్ |
యదేకో జాయతే జంతురేకైవ వినశ్యతి || ౩ ||

తస్మాన్మాతా పితా చేతి రామ సజ్జేతయో నరః |
ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కశ్చిద్ధి కస్యచిత్ || ౪ ||

యథా గ్రామాంతరం గచ్ఛన్ నరః కశ్చిత్ క్వచిద్వసేత్ |
ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతాపరేఽహని || ౫ ||

ఏవమేవ మనుష్యాణాం పితా మాతా గృహం వసు |
ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనాః || ౬ ||

పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య స నార్హసి నరోత్తమ |
ఆస్థాతుం కాపథం దుఃఖం విషమం బహుకణ్టకమ్ || ౭ ||

సమృద్ధాయామయోధ్యాయామాత్మానమభిషేచయ |
ఏకవేణీధరా హి త్వాం నగరీ సంప్రతీక్షతే || ౮ ||

రాజభోగాననుభవన్ మహార్హాన్ పార్థివాత్మజ |
విహర త్వమయోధ్యాయాం యథా శక్రస్త్రివిష్టపే || ౯ ||

న తే కశ్చిద్దశరథస్త్వం చ తస్య న కశ్చన |
అన్యో రాజా త్వమన్యః స తస్మాత్ కురు యదుచ్యతే || ౧౦ ||

బీజమాత్రం పితా జంతోః శుక్లం రుధిరమేవ చ |
సంయుక్తమృతుమన్మాత్రా పురుషస్యేహ జన్మ తత్ || ౧౧ ||

గతః స నృపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై |
ప్రవృత్తిరేషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే || ౧౨ ||

అర్థధర్మపరా యే యే తాంస్తాన్ శోచామి నేతరాన్ |
తే హి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే || ౧౩ ||

అష్టకా పితృదైవత్యమిత్యయం ప్రసృతో జనః |
అన్నస్యోపద్రవం పశ్య మృతో హి కిమశిష్యతి || ౧౪ ||

యది భుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్ఛతి |
దద్యాత్ ప్రవసతః శ్రాద్ధం న తత్ పథ్యశనం భవేత్ || ౧౫ ||

దానసంవననా హ్యేతే గ్రంథా మేధావిభిః కృతాః |
యజస్వ దేహి దీక్షస్వ తపస్తప్యస్వ సంత్యజ || ౧౬ ||

స నాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే |
ప్రత్యక్షం యత్తదాతిష్ఠ పరోక్షం పృష్ఠతః కురు || ౧౭ ||

స తాం బుద్ధిం పురస్కృత్య సర్వలోకనిదర్శినీమ్ |
రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః || ౧౦౮ ||

Ayodhya Kanda Sarga 108 Meaning In Telugu

త్రేతాయుగంలో జాబాలి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నాస్తిక వాది. ఈ ప్రాకృతిక ప్రపంచము తప్ప వేరే ఏమీ లేదు.ఉన్నంత కాలం సుఖాలు అనుభవించడం మాత్రమే మనము చెయ్యాల్సిన పని అని నమ్మే వాడు. అలాంటి భావాలు ఉన్న జాబాలి ఆసభలో ఉన్నాడు. రాముడు, భరతుడు చేసిన సంవాదమును విన్న జాబాలి ఇలామాట్లాడసాగాడు.

“రామా! నీవు ఎంతో బుద్ధిమంతుడికి, జ్ఞానము కలవాడవు అనుకున్నాను. కాని ఇంతమూర్ఖంగా ఆలోచిస్తావు అని అనుకోలేదు. నీ ఆలోచన ఎందుకూ పనికిరాదు.

రామా! మానవుడు పుట్టేటప్పుడు ఒంటరి వాడు. చచ్చేటప్పుడు ఒంటరి వాడే. ఈ బంధుత్వాలు, మమతలు మమకారాలు అన్నీ నడుమ వచ్చినవే. చచ్చిన తరువాత ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అందుకే ఈ బంధుత్వాలు అన్నీ వ్యర్థము. తల్లి, తండ్రి, మనకు దైవసమానులు, వాళ్ల మాటలను పాటించాలి, అని అనుకోవడం అవివేకము. మీ తండ్రి మరణించాడు. ఇంక ఆయన మాటకు విలువేముంది. దూర ప్రయాణాలు చేసే వాళ్లు రాత్రిళ్లు సత్రములలో బస చేస్తారు. ఆ రాత్రికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది.

మరునాడు ఉదయం ఎవరి దోవన వారు వెళతారు. ఈ జీవితాలూ అంతే. తల్లి, తండ్రి, ధనము, భార్య, సంతానము అన్నీ సత్రములలో పరిచయాల్లాంటివే. కాలం తీరగానే ఎవరి దోవ వారిది. ఆ కాస్త పరిచయంతో మాటకు కట్టుబడి ఉండాలి అని అనుకోవడం అవివేకము. విజ్ఞులైన వారు ఈ బంధుత్వాలకు విలువ ఇవ్వరు.

నీకు రాజ్యము సంక్రమించింది. భరతుడు కూడా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చెయ్యమంటున్నాడు. హాయిగా రాజభోగాలు అనుభవించక తండ్రిమాటకు కట్టుబడి వనవాసము చెయ్యడం ఏమిటి? ఈ చెడు ఆలోచన నీకు ఎలా కలిగింది. రామా! నా మాటవిను. అయోధ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. వెంటనే అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడిపై స్వర్గలోకముతో సమానమైన రాజభోగాలు అనుభవించు.

అసలు దశరథుడు ఎవరు? నీకు జన్మను ఇచ్చాడు. వెళ్లిపోయాడు. అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట. తండ్రి బీజము. తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు, తండ్రి బీజము(శుక్లము) తల్లి శోణితములో కలిసి అండము అవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. (తల్లి సత్యం. తండ్రి నమ్మకం అనే సామెత ఉంది.) నీ తండ్రి తన జీవిత కాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్దచేసాడు. కాలం తీరగానే తన దారిన తాను వెళ్లిపోయాడు.

చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడటం ఎందుకు? నీ మాదిరి ధర్మము, ధర్మము ప్రకారమే అర్థకామములు అనుభవించాలి అనే వాళ్లు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలికలుగుతుంది.

అసలు దశరథుడు ఎవరు? నీకు జన్మను ఇచ్చాడు. వెళ్లిపోయాడు. అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట. తండ్రి బీజము. తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు, తండ్రి బీజము(శుక్లము) తల్లి శోణితములో కలిసి అండము అవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. (తల్లి సత్యం. తండ్రి నమ్మకం అనే సామెత ఉంది.) నీ తండ్రి తన జీవిత కాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్దచేసాడు. కాలం తీరగానే తన దారిన తాను వెళ్లిపోయాడు. చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడటం ఎందుకు? నీ మాదిరి ధర్మము, ధర్మము ప్రకారమే అర్థకామములు అనుభవించాలి అనే వాళ్లు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలికలుగుతుంది. మాటవిని అయోధ్యకు పోయి హాయిగా రాజ్యపాలన చెయ్యి సుఖించు.” అని చెప్పాడు జాబాలి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః (109) >>

Ayodhya Kanda Sarga 107 In Telugu – అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 107

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో మరొక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముడి అనారోగ్యం గురించి తెలుసుకుని, ఎంతో చింతతో బాధపడతాడు. అతను రాముని వద్దకు వెళ్లి, అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. కానీ రాముడు తన వనవాసాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. రాముడు ధర్మం, పితృవాక్య పరిపాలనకు ప్రాముఖ్యతను ఇస్తూ, భరతుని శాంతన చేస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్లి, అవే పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మనిష్ట, మరియు పితృవాక్య పరిపాలనను మునుపటి కంటే మరింతగా స్పష్టం చేస్తుంది.

రామప్రతివచనమ్

పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజః |
ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతిమధ్యేఽభిసత్కృతః || ౧ ||

ఉపపన్నమిదం వాక్యం యత్త్వమేవమభాషథాః |
జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ || ౨ ||

పురా భ్రాతః పితా నః స మాతరం తే సముద్వహన్ |
మాతామహే సమాశ్రౌషీద్రాజ్యశుల్కమనుత్తమమ్ || ౩ ||

దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః |
సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధితః ప్రభుః || ౪ ||

తతః సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్వినీ |
అయాచత నరశ్రేష్ఠం ద్వౌ వరౌ వరవర్ణినీ || ౫ ||

తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా |
తౌ చ రాజా తదా తస్యై నియుక్తః ప్రదదౌ వరౌ || ౬ ||

తేన పిత్రాఽహమప్యత్ర నియుక్తః పురుషర్షభ |
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్ || ౭ ||

సోఽహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్వితః |
సీతయా చాప్రతిద్వంద్వః సత్యవాదే స్థితః పితుః || ౮ ||

భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినమ్ |
కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ || ౯ ||

ఋణాన్మోచయ రాజానం మత్కృతే భరతప్రభుమ్ |
పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ || ౧౦ ||

శ్రూయతే హి పురా తాత శ్రుతిర్గీతా యశస్వినా |
గయేన యజమానేన గయేష్వేవ పితన్ ప్రతి || ౧౧ ||

పున్నామ్నో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః |
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితౄన్ యత్పాతి వా సుతః || ౧౨ ||

ఏష్టవ్యా బహవః పుత్రా గుణవంతో బహుశ్రుతాః |
తేషాం వై సమవేతానామపి కశ్చిద్గయాం వ్రజేత్ || ౧౩ ||

ఏవం రాజర్షయః సర్వే ప్రతీతా రాజనందన |
తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో || ౧౪ ||

అయోధ్యాం గచ్ఛ భరత ప్రకృతీరనురంజయ |
శత్రుఘ్నసహితో వీర సహ సర్వైర్ద్విజాతిభిః || ౧౫ ||

ప్రవేక్ష్యే దండకారణ్యమహమప్యవిలంబయన్ |
ఆభ్యాం తు సహితో రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ || ౧౬ ||

త్వం రాజా భరత భవ స్వయం నరాణామ్
వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్ |
గచ్ఛత్వం పురవరమద్య సంప్రహృష్టః
సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే || ౧౭ ||

ఛాయాం తే దినకరభాః ప్రబాధమానమ్
వర్షత్రం భరత కరోతు మూర్ధ్ని శీతామ్ |
ఏతేషామహమపి కాననద్రుమాణాం
ఛాయాం తామతిశయినీం సుఖీ శ్రయిష్యే || ౧౮ ||

శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయః
సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్ |
చత్వారస్తనయవరా వయం నరేంద్రమ్
సత్యస్థం భరత చరామ మా విషాదమ్ || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః || ౧౦౭ ||

Ayodhya Kanda Sarga 107 Meaning In Telugu

తన మనోనిశ్చయాన్ని రాముడు భరతునికి ఈ విధంగా తెలిపాడు.
“భరతా! ఇప్పటి దాకా నీ వు చెప్పినది అంతా మిగుల యుక్తి యుక్తముగా ఉంది. అందులో ఏ దోషమూ లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని విషయములు కొన్ని నీకు చెప్పక తప్పదు.

మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యమునకు ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని మీ మాతామహులకు (కైక తండ్రికి) వాగ్దానం చేసాడట. అదీకాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణములు రెండు సార్లు కాపాడినందుకు గాను, రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భములో కోరినది.

అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము. రెండవ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకువెళ్లమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞమేరకు నేను అరణ్యములకు వచ్చాను.

నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెరవేరినది.
మన తండ్రి నీ తల్లికి ఇచ్చిన రెండవ వరమును అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివి కావాలి. అప్పుడే నీవు నీ తల్లి తండ్రుల మాటను పాటించినట్టవుతుంది. నీవు నీ తండ్రిని ఋణవిముక్తుని చేసినట్టవుతుంది. దీనికి ఒక ఇతిహాసమును కూడా చెబుతాను విను.

పూర్వము గయుడు గయా క్షేత్రంలో పితృదేవతల గురించి ఒక యాగము చేసాడట. ఆ సందర్భంలో గయుడు ఈవిధంగా చెప్పాడు అని పెద్దలుచెబుతారు. పుత్రుడు అనే వాడు పితరులను పున్నామ నరకము నుండి రక్షిస్తాడట. అందుకని అతడికి పుత్రుడు అనే పేరు వచ్చిందట. అందుకే తల్లితండ్రులు తమకు చాలా మంది పుత్రసంతానము కావాలని కోరుకుంటారట. ఎందుకంటే, అందులో కనీసం ఒకడైనా గయకు వెళ్లి అక్కడ పితృకార్యము చేస్తాడని వారి ఆశ.

ఓభరతా! నీవు కూడా నీ తండ్రి మాటను పాటించి ఆయనను పున్నామ నరకమునుండి రక్షించు. నీ తండ్రి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వెంటనే అయోధ్యకు వెళ్లి, పట్టాభిషిక్తుడివై, శత్రుఘ్నుని సాయంతో అయోధ్యను పాలించు. నేను కూడా ఇక్కడ ఉండను. సీత, లక్ష్మణులతో కలిసి దండకారణ్యమునకు వెళతాను. నీవు అయోధ్యను పాలిస్తుంటే, నేను అడవిలో ఉన్న మృగములను పాలిస్తాను. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్లు, నేను అంతే సంతోషంగా దండకారణ్యమునకు వెళతాను.

నీకు నీ సింహాసనము మీద ఉన్న తెల్లటి గొడుగు (శ్వేతఛత్రము) ఎలా నీడనిస్తుందో, నాకు కూడా ఈ అడవిలో ఉన్న ఫలవృక్షములు నీడనిస్తాయి. నీవు శ్వేతఛత్రఛాయలో, నేను వటవృక్షఛాయలో సుఖిద్దాము. నీకు తోడుగా శత్రుఘ్నుడు ఉంటాడు. నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటాడు. దశరథునికి కుమారులుగా పుట్టినందుకు, మనము నలుగురము ఆయన మాటను సత్యవ్రతమును నిలబెడదాము.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః (108) >>