Ayodhya Kanda Sarga 106 In Telugu – అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 106

అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తాడు, ఎందుకంటే రాముడు తన వనవాసాన్ని ముగించక ముందే రావడానికి నిరాకరిస్తాడు. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞలను గౌరవిస్తూ, తన వనవాస ధర్మాన్ని కొనసాగిస్తాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని పరిపాలనలో దేశాన్ని పాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మం, మరియు పితృభక్తికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తుంది.

భరతవచనమ్

ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్థవత్ |
తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలమ్ |
ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః || ౧ ||

కో హి స్యాదీదృశో లోకే యాదృశస్త్వమరిందమ |
న త్వాం ప్రవ్యథయేద్దుఃఖం ప్రీతిర్వా న ప్రహర్షయేత్ || ౨ ||

సమ్మతశ్చాసి వృద్ధానాం తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ |
యథా మృతస్తథా జీవన్ యథాఽసతి తథా సతి || ౩ ||

యస్యైష బుద్ధిలాభః స్యాత్పరితప్యేత కేన సః |
పరావరజ్ఞో యశ్చ స్యాత్తథా త్వం మనుజాధిప || ౪ ||

సైవం వ్యసనం ప్రాప్య న విషీదితుమర్హతి |
అమరోపమ సత్త్వస్త్వం మహాత్మా సత్యసంగరః || ౫ ||

సర్వజ్ఞః సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చాసి రాఘవ |
న త్వామేవంగుణైర్యుక్తం ప్రభవాభవకోవిదమ్ || ౬ ||

అవిషహ్యతమం దుఃఖమాసాదయితుమర్హతి |
ప్రోషితే మయి యత్పాపం మాత్రా మత్కారణాత్కృతమ్ || ౭ ||

క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్మమ |
ధర్మబంధేన బద్ధోఽస్మి తేనేమాం నేహ మాతరమ్ || ౮ ||

హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీమ్ |
కథం దశరథాజ్జాతః శుద్ధాభిజనకర్మణః || ౯ ||

జానన్ ధర్మమధర్మిష్ఠం కుర్యాం కర్మ జుగుప్సితమ్ |
గురుః క్రియావాన్ వృద్ధశ్చ రాజా ప్రేతః పితేతి చ || ౧౦ ||

తాతం న పరిగర్హేయం దైవతం చేతి సంసది |
కో హి ధర్మార్థయోర్హీనమీదృశం కర్మ కిల్బిషమ్ || ౧౧ ||

స్త్రియాః ప్రియం చికీర్షుః సన్ కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్ |
అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతిః || ౧౨ ||

రాజ్ఞైవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శ్రుతిః కృతా |
సాధ్వర్థమభిసంధాయ క్రోధాన్మోహాచ్చ సాహసాత్ || ౧౩ ||

తాతస్య యదతిక్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ |
పితుర్హి యదతిక్రాంతం పుత్రో యస్సాధు మన్యతే || ౧౪ ||

తదపత్యం మతం లోకే విపరీతమతోఽన్యథా |
అభిపత్తా కృతం కర్మ లోకే ధీరవిగర్హితమ్ || ౧౫ ||

కైకేయీం మాం చ తాతం చ సుహృదో బాంధవాంశ్చ నః |
పౌరజానపదాన్ సర్వాంస్త్రాతు సర్వమిదం భవాన్ || ౧౬ ||

క్వ చారణ్యం క్వ చ క్షాత్త్రం క్వ జటాః క్వ చ పాలనమ్ |
ఈదృశం వ్యాహతం కర్మ న భవాన్ కర్తుమర్హతి || ౧౭ ||

ఏష హి ప్రథమో ధర్మః క్షత్రియస్యాభిషేచనమ్ |
యేన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనమ్ || ౧౮ ||

కశ్చ ప్రత్యక్షముత్సృజ్య సంశయస్థమలక్షణమ్ |
ఆయతిస్థం చరేద్ధర్మం క్షత్త్రబంధురనిశ్చితమ్ || ౧౯ ||

అథ క్లేశజమేవ త్వం ధర్మం చరితుమిచ్ఛసి |
ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి || ౨౦ ||

చతుర్ణామాశ్రమాణాం హి గార్హస్థ్యం శ్రేష్ఠమాశ్రమమ్ |
ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాస్తం కథం త్యక్తుమర్హసి || ౨౧ ||

శ్రుతేన బాలః స్థానేన జన్మనా భవతో హ్యహమ్ |
స కథం పాలయిష్యామి భూమిం భవతి తిష్ఠతి || ౨౨ ||

హీనబుద్ధిగుణో బాలో హీనః స్థానేన చాప్యహమ్ |
భవతా చ వినాభూతో న వర్తయితుముత్సహే || ౨౩ ||

ఇదం నిఖిలమవ్యగ్రం రాజ్యం పిత్ర్యమకణ్టకమ్ |
అనుశాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవైః || ౨౪ ||

ఇహైవ త్వాఽభిషించంతు సర్వాః ప్రకృతయః సహ |
ఋత్విజః సవసిష్ఠాశ్చ మంత్రవన్మంత్రకోవిదాః || ౨౫ ||

అభిషిక్తస్త్వమస్మాభిరయోధ్యాం పాలనే వ్రజ |
విజిత్య తరసా లోకాన్ మరుద్భిరివ వాసవః || ౨౬ ||

ఋణాని త్రీణ్యపాకుర్వన్ దుర్హృదః సాధు నిర్దహన్ |
సుహృదస్తర్పయన్ కామైస్త్వమేవాత్రానుశాధి మామ్ || ౨౭ ||

అద్యార్య ముదితాః సంతు సుహృదస్తేఽభిషేచనే |
అద్య భీతాః పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ || ౨౮ ||

ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ |
అద్య తత్రభవంతం చ పితరం రక్ష కిల్బిషాత్ || ౨౯ ||

శిరసా త్వాఽభియాచేఽహం కురుష్వ కరుణాం మయి |
బాంధవేషు చ సర్వేషు భూతేష్వివ మహేశ్వరః || ౩౦ ||

అథైతత్ పృష్ఠతః కృత్వా వనమేవ భవానితః |
గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహమ్ || ౩౧ ||

తథా హి రామో భరతేన తామ్యతా
ప్రసాద్యమానః శిరసా మహీపతిః |
న చైవ చక్రే గమనాయ సత్త్వవాన్
మతిం పితుస్తద్వచనే వ్యవస్థితః || ౩౨ ||

తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే
సమం జనో హర్షమవాప దుఃఖితః |
న యాత్యయోధ్యామితి దుఃఖితోఽభవత్
స్థిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః || ౩౩ ||

తమృత్విజో నైగమయూథవల్లభాః
తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః |
తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః
ప్రణమ్య రామం చ యయాచిరే సహ || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః || ౧౦౬ ||

Ayodhya Kanda Sarga 106 Meaning In Telugu

రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు.
“ఓ రామా! నీవు జితేంద్రియుడవు. నీకు సుఖమువస్తే సంతోషము, దు:ఖమువస్తే బాధా రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. మేమంతా సామాన్యులము. సుఖదు:ఖములను అనుభవిస్తూ ఉంటాము.

జీవించి ఉన్నా, మరణించినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండూ సమభావనలో ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నీవు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీ లాంటివాడికి అలా బాధపడటం యుక్తంకాదు.

నీవు రాజ్యం చేసినా, అరణ్యంలో ఉన్న ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చేయి. తప్పేముంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా! నీవు రాజ్యం తీసుకుంటే నేను బాధ పడను. ఎందుకంటే నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యము వలన ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారమూ లేదు. నా తల్లి చేసినది రాజద్రోహము. దానికి మరణదండనే సరి అయిన శిక్ష కాని ఇక్కడ నిందితురాలు నా తల్లి కాబట్టి నేను ఆ దండన అమలు చేయలేక పోతున్నాను.

నేను పవిత్రమైన ఇక్ష్వాకు వంశములో పుట్టాను. ధర్మానికి ప్రతిరూపమైన దశరథమహారాజుకు పుత్రుడుగా జన్మించాను. అటువంటి నేను అధర్మమునకు పాల్పడతాను అని నీవు ఎలా అనుకుంటావు.? ఈ అధర్మములో నా తండ్రికి కూడా భాగం ఉంది. ఆయన నా తల్లి మాటను వినకపోతే ఇంత అనర్థము వాటిల్లదు.

ఆయన నా తండ్రి, పైగా వృద్ధుడు, ఈ లోకం విడిచి వెళ్లాడు కాబట్టి సభలో ఆయనను నిందించడం భావ్యం కాదు. ఎందుకంటే ధర్మము తెలిసిన వాడు ఎవరైనా ఒక స్త్రీకి ప్రియం చేకూర్చడానికి మరొకరికి అప్రియం చేస్తాడా! కాని నా తండ్రి ధర్మం తప్పి తన భార్యకు వరములు ఇచ్చే మిషమీద నీకు అపకారము చేసాడు.

రామా! వినాశకాలే విపరీత బుద్ధీ అని వినాశకాలము దాపురించబట్టి దశరథునికి ఇటువంటి విపరీత బుద్ధి పుట్టింది. తండ్రి మంచి కార్యము చేస్తే దానిని పుత్రుడు శ్లాఘించాలి, అభినందించాలి. కాని తండ్రి అధర్మానికి పాల్పడితే, దానిని పుత్రుడు ఖండించాలి. ఆ అధర్మము వలన కలిగిన తప్పును సరిదిద్దాలి. నా తండ్రి దశరథుడు చేసిన అధర్మము వలన అయోధ్య అరాచక మయింది. ఆ తప్పును నీవు సరిదిద్ది, నీ రాజ్యము నీవు పరిపాలించు. అందరికీ ఆనందము నీ చేకూర్చు. తండ్రి చేసిన అధర్మమును చక్కదిద్దిన సుపుత్రుడిగా ప్రఖ్యాతి చెందు.

ఎందుకంటే నా తండ్రి చేసిన అధర్మమును, పాపపు పనిని లోకమంతా ఖండిస్తూ ఉంది. ఆ అధర్మమును సరిదిద్దడం నీ చేతిలో ఉంది. నా తల్లి కైక కూడా దీనికి తన అంగీకారము తెలిపింది. ఆమెను కూడా ఈ అధర్మకార్యము నుండి రక్షించు.

పైగా క్షత్రియునకు స్వధర్మపాలనను మించిన ధర్మము మరొకటి లేదు. క్షత్రియ ధర్మము రాజ్యమును పాలించుట. నీవు నీ ధర్మమును వదిలి జటలు కట్టుకొని అరణ్యములలో ఉండటం భావ్యమా! ఎక్కడా? అరణ్యము ఎక్కడ? రాజు కిరీటము ఎక్కడ? జటాజూటములు ఎక్కడ? రెండింటికీ దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది కదా! నీకు తెలియనిది ఏమున్నది.

పైగా రాజ్యపాలన క్షత్రియధర్మము. అది తక్షణ ఫలములను ఇస్తుంది. వనవాస వృత్తి కాలాంతరమున మోక్షరూపంలో ఫలిస్తుంది. క్షత్రియుడైన వాడు రజోగుణప్రధానుడు కానీ తమోగుణ ప్రధానుడు కాదు కదా! కాబట్టి రామా! ఈ తాపస ధర్మము నీకు తగినది కాదు. నీకు క్షత్రియ ధర్మమే ఉచితము.

రామా! బ్రహ్మచర్య, గృహస్థ,వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు ఒకదాని తరువాత ఒకటి ఆచరించాలి. అందులోనూ గృహస్థాశ్రమము శ్రేష్టమైనది అని పెద్దలు చెబుతారుకదా! మరి నీవు ఆ పెద్దల మాటలను పెడచెవిని పెట్టి గృహస్థాశ్రమమును విడిచిపెట్టడం ధర్మమా!

దీని వలన పితృఋణము తీర్చినట్టు అవుతుంది. తండ్రిగారు చేసిన తప్పును సరిదిద్దినట్టు అవుతుంది. ఈ పాపపు కార్యము వలన నా తల్లికి తండ్రికి అంటిన పాపమును తొలగించు. వారిని పాపవిముక్తులను చెయ్యి. నీకు శిరస్సువంచి పాదములు అంటి అర్థిస్తున్నాను. నా మీద, అయోధ్య మీద దయచూపించు. నేను ఇంతచెప్పినా కాదని నీవు అరణ్యములలో ఉండటానికి నిశ్చయించుకుంటే. నేనుకూడా నీతో అరణ్యవాసము చేస్తాను. నా తల్లి చేసిన పాపమునకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. అయోధ్యకు వెళ్లినే వెళ్లను. ఇదే నా కృతనిశ్చయము.” అని పలికి భరతుడు చేతులు జోడించి రాముని ముందు నిలబడ్డాడు.

అక్కడ ఉన్న వారు కూడా శాయశక్తులా రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించారు. కాని రామునిలో చలనం లేదు. తన పట్టు వీడలేదు. అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వారికి రాముని మనోనిశ్చయానికి అభినందించాలో లేక రాముడు అయోధ్యకు రాక పోవడానికి విచారించాలో తెలియక కొట్టుమిట్టాడు తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః (107) >>

Ayodhya Kanda Sarga 105 In Telugu – అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 105

అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః, వాల్మీకి రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, శ్రీరాముడు, సీతాదేవిని దుఃఖంతో విడిచిపెట్టి, లక్ష్మణునితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళతాడు. సీతాదేవి, అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించుకుంటుంది. ఈ ఘటనలో రాముడు ధర్మాన్ని పాటిస్తూ, ప్రజల సమక్షంలో సీతా దేవిని అంగీకరిస్తాడు. ఈ సర్గ, ధర్మానికి, నిష్కపటతకు, మరియు రాజనీతికి సంబంధించిన అంశాలను స్పృశిస్తుంది. వాల్మీకి రామాయణంలో ఈ సర్గ ప్రత్యేకంగా రాముని జీవన పద్ధతిని, అతని ధైర్యం, ధర్మనిష్టలను ఉద్దీపింపచేస్తుంది.

రామవాక్యమ్

తతః పురుషసింహానాం వృతానాం తైః సుహృద్గణైః |
శోచతామేవ రజనీ దుఃఖేన వ్యత్యవర్తత || ౧ ||

రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్వృతాః |
మందాకిన్యాం హుతం జప్యం కృత్వా రామముపాగమన్ || ౨ ||

తూష్ణీం తే సముపాసీనాః న కశ్చిత్కించిదబ్రవీత్ |
భరతస్తు సుహృన్మధ్యే రామం వచనమబ్రవీత్ || ౩ ||

సాంత్వితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ |
తద్దదామి తవైవాహం భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ || ౪ ||

మహతేవాంబువేగేన భిన్నః సేతుర్జలాగమే |
దురావారం త్వదన్యేన రాజ్యఖండమిదం మహత్ || ౫ ||

గతిం ఖర ఇవాశ్వస్య తార్క్ష్యస్యేవ పతత్రిణః |
అనుగంతుం న శక్తిర్మే గతిం తవ మహీపతే || ౬ ||

సుజీవం నిత్యశస్తస్య యః పరైరుపజీవ్యతే |
రామ తేన తు దుర్జీవం యః పరానుపజీవతి || ౭ ||

యథా తు రోపితో వృక్షః పురుషేణ వివర్ధితః |
హ్రస్వకేన దురారోహో రూఢస్కంధో మహాద్రుమః || ౮ ||

స యథా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేత్ |
స తాం నానుభవేత్ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః || ౯ ||

ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి |
యది త్వమస్మాన్ వృషభో భర్తా భృత్యాన్న శాధి హి || ౧౦ ||

శ్రేణయస్త్వాం మహారాజ పశ్యంత్వగ్ర్యాశ్చ సర్వశః |
ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమమ్ || ౧౧ ||

తవానుయానే కాకుత్స్థ మత్తా నర్దంతు కుంజరాః |
అంతఃపురగతా నార్యో నందంతు సుసమాహితాః || ౧౨ ||

తస్య సాధ్విత్యమన్యంత నాగరా వివిధా జనాః |
భరతస్య వచః శ్రుత్వా రామం ప్రత్యనుయాచతః || ౧౩ ||

తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినమ్ |
రామః కృతాత్మా భరతం సమాశ్వాసయ దాత్మవాన్ || ౧౪ ||

నాత్మనః కామకారోఽస్తి పురుషోఽయమనీశ్వరః |
ఇతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికర్షతి || ౧౫ ||

సర్వే క్షయాంతా నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః |
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితమ్ || ౧౬ ||

యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయమ్ |
ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయమ్ || ౧౭ ||

యథాఽగారం దృఢస్థూణం జీర్ణం భూత్వాఽవసీదతి |
తథైవ సీదంతి నరాః జరామృత్యువశంగతాః || ౧౮ ||

అత్యేతి రజనీ యా తు సా న ప్రతినివర్తతే |
యాత్యేవ యమునా పూర్ణా సముద్రముదకాకులమ్ || ౧౯ ||

అహోరాత్రాణి గచ్ఛంతి సర్వేషాం ప్రాణినామిహ |
ఆయూంషి క్షపయంత్యాశు గ్రీష్మే జలమివాంశవః || ౨౦ ||

ఆత్మానమనుశోచ త్వం కిమన్యమనుశోచసి |
ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ || ౨౧ ||

సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి |
గత్వా సుదీర్ఘమధ్వానం సహమృత్యుర్నివర్తతే || ౨౨ ||

గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః |
జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్ || ౨౩ ||

నందంత్యుదితాదిత్యే నందంత్యస్తమితే రవౌ |
ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవితక్షయమ్ || ౨౪ ||

హృష్యంత్యృతుమఖం దృష్ట్వా నవం నవమిహాగతమ్ |
ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణసంక్షయః || ౨౫ ||

యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహార్ణవే |
సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన || ౨౬ ||

ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ |
సమేత్య వ్యవధావంతి ధ్రువో హ్యేషాం వినాభవః || ౨౭ ||

నాత్ర కశ్చిద్యథాభావం ప్రాణీ సమభివర్తతే |
తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్యాస్త్యనుశోచతః || ౨౮ ||

యథా హి సార్థం గచ్ఛంతం బ్రూయాత్ కశ్చిత్ పథి స్థితః |
అహమప్యాగమిష్యామి పృష్ఠతో భవతామితి || ౨౯ ||

ఏవం పూర్వైర్గతో మార్గః పితృపైతామహో ధ్రువః |
తమాపన్నః కథం శోచేద్యస్య నాస్తి వ్యతిక్రమః || ౩౦ ||

వయసః పతమానస్య స్రోతసో వాఽనివర్తినః |
ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః || ౩౧ ||

ధర్మాత్మా స శుభైః కృత్స్నైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
ధూతపాపో గతః స్వర్గం పితా నః పృథివీపతిః || ౩౨ ||

భృత్యానాం భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ |
అర్థాదానాచ్చ ధర్మేణ పితా నస్త్రిదివం గతః || ౩౩ ||

కర్మభిస్తు శుభైరిష్టైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
స్వర్గం దశరథః ప్రాప్తః పితా నః పృథివీపతిః || ౩౪ ||

ఇష్ట్వా బహువిధైర్యజ్ఞైర్భోగాంశ్చావాప్య పుష్కలాన్ |
ఉత్తమం చాయురాసాద్య స్వర్గతః పృథివీపతిః || ౩౫ ||

ఆయురుత్తమమాసాద్య భోగానపి చ రాఘవః |
స న శోచ్యః పితా తాతః స్వర్గతః సత్కృతః సతామ్ || ౩౬ ||

స జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితా హి నః |
దైవీమృద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోకవిహారిణీమ్ || ౩౭ ||

తం తు నైవంవిధః కశ్చిత్ ప్రాజ్ఞః శోచితుమర్హతి |
తద్విధో యద్విధశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః || ౩౮ ||

ఏతే బహువిధాః శోకా విలాపరుదితే తథా |
వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా || ౩౯ ||

స స్వస్థో భవ మాశోచీర్యాత్వా చావస తాం పురీమ్ |
తథా పిత్రా నియుక్తోఽసి వశినా వదతాం వర || ౪౦ ||

యత్రాహమపి తేనైవ నియుక్తః పుణ్యకర్మణా |
తత్రైవాహం కరిష్యామి పితురార్య్యస్య శాసనమ్ || ౪౧ ||

న మయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్యమరిందమ |
తత్ త్వయాఽపి సదా మాన్యం స వై బంధుస్స నః పితా || ౪౨ ||

తద్వచః పితురేవాహం సమ్మతం ధర్మచారిణః |
కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ || ౪౩ ||

ధార్మికేణానృశంసేన నరేణ గురువర్తినా |
భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషతా || ౪౪ ||

ఆత్మానమనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ |
నిశామ్య తు శుభం వృత్తం పితుర్దశరథస్య నః || ౪౫ ||

ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
పితుర్నిదేశప్రతిపాలనార్థమ్ |
యవీయసం భ్రాతరమర్థవచ్చ
ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః || ౪౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః || ౧౦౫ ||

Ayodhya Kanda Sarga 105 Meaning In Telugu

అంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ భరతుడు లేచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు.
“రామా! నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి, నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్యా రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టమువచ్చిన వారికి ఇచ్చే అధికారము నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తరువాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే గాడిద గుర్రము ఒకటి కావు కదా!

ఎవని మీద అందరూ ఆధారపడి బతుకుతారో, అతని జీవనము చాలా గొప్పది. కాని ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరము. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాము. నీ పాలనకొరకు ఎదురు చూస్తున్నాము. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరంకాదా! ఒకడు ఒక వృక్షమును నాటి, పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టుఎందుకూ ఉపయోగపడదు కదా! అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్దాడు. సకల విద్యలు నేర్పించాడు. వేదాలు, ధర్మశాస్త్రములు చదివించాడు. కాని ఈనాడు నువ్వు రాజ్యమును పాలించను అంటున్నావు. నీవు నేర్చుకున్న విద్యలు అన్నీ ఫలితం లేకుండా పోవలసిందేనా! దశరథుని శ్రమ అంతా వృధా కావలసిందేనా!

నీవు అయోధ్యను పాలిస్తుంటే ఆనందించని వారు ఉండరు. రాజ్యములో ప్రజలు కానీ అంతఃపురములోని జనులు కానీ అంతా సుఖసంతోషాలలో ఓలలాడుతారు. అందరికీ ఆమోద యోగ్యుడవైన నీవు రాజ్యమును పాలించకుండా అడవులలో తిరగడం ధర్మమా! కాబట్టి నీవు వెంటనే అయోధ్యకుతిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవు కావాలని సకలజనులకోరిక.” అని ముగించాడు భరతుడు.

రాముడు లేచి భరతుని వీపు తట్టి ఇలా పలికాడు. “ భరతా! ఈ చరాచర జగత్తులో తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసే స్వాతంత్య్రము ఎవరికీ లేదు. అంతా విధిచేతిలో కీలుబొమ్మలమే. విధి ఎలా ఆడిస్తే అలా ఆడవలసినదే! ప్రతివానికీ ఉత్థానపతనాలు తప్పవు.
ఎంత ధనము సంపాదించినా ఆధనము తుదకు అతనిని వదిలి పోతుంది. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరినా, చివరకు పతనం తప్పదు. (సత్యం రామలింగరాజు, సన్ టివి అధినేతలు, గాలి జనార్దనరెడ్డి లాగా).

పుట్టినవాడు గిట్టడం ఎలాగో, పుట్టుకతో వచ్చిన మానవ సంబంధాలు చావుతో సమసిపోతాయి. ఏవీ శాశ్వతము కాదు. పండిన పండు రాలడం ఎంత నిజమో, పుట్టిన మనిషి చావడం అంతే నిజం. కాని అంతా శాశ్వతం అనుకోవడం అవివేకము. మనం గృహములు ఎంత ధృడంగా కట్టుకున్నా, కాలక్రమేణా అవి కూలిపోవడం తథ్యం. అలాగే ఈ శరీరాన్ని ఎంత ప్రేమగా పెంచి పోషించినా, తుదకు అది భూగర్భంలో కలిసిపోవలసిందే!

నిన్నటి దినం మరలా రాదు. సముద్రంలో కలిసిన నదీజలములు తిరిగి వెనక్కురావు కదా! ఒక్కొక్క రోజు గడుస్తుంటే, మానవుల జీవితంలో ఒక్కొక్క రోజు తరిగిపోతుంటుంది. చావుకు దగ్గర అవుతుంటాడు.

మానవుడు భూమి మీద ఉన్న అంతరిక్షంలో ఉన్నా, మృత్యువు అతని వెన్నంటి ఉంటుంది. కాలం తీరగానే కబళిస్తుంది. కాబట్టి మానవుడు సదా మృత్యువును వెంటబెట్టుకొని తిరుగుతుంటాడు. కాబట్టి భరతా! నీగురించి ఆలోచించుకో. నాగురించి ఎందుకు ఆలోచిస్తావు. ఎందుకంటే మన మానవ సంబంధాలు క్షణికములు. ఒక నదిలో రెండు దుంగలు కొట్టుకొని వస్తుంటాయి., అవి కలిసి కొంతదూరం ప్రయాణం చేస్తాయి. మరలా అవి విడిపోయి దేని దారిన అవి వెళతాయి. అలాగే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనము, అన్నీ కొంతకాలము కలిసి ఉంటాయి. తరువాత విడిపోతుంటాయి. దాని కోసరం ఇప్పుడు బాధపడటం ఎందుకు?

లోకములో ఏ ప్రాణికూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. జనన మరణములు వారి చేతిలో లేవు. వాటి గురించి చింతించడం నిష్ప్రయోజనము.

నేను ఇంతకు ముందు చెప్పినట్టు, మన జీవితము మన చేతిలో లేదు. ఏది ప్రాప్తమో అది అనుభవించవలసిందే. ఇప్పుడు నీకు రాజ్యాధికారము సంక్రమించింది. దానిని అనుభవించడమే నీ బాధ్యత. మన పూర్వులు అదే చేసారు. నువ్వుకూడా అదే చెయ్యి. మన పితృపితామహులు పోయిన మార్గముననే మనమూ నడుద్దాము. నిన్నటి రోజు మరలా రాదు. ప్రవహించిన నీరు తిరిగి రాదు. వయస్సు కూడా అంతే.

కాబట్టి నీ జీవితమును ధర్మమార్గములో నడిపించు. ప్రజలను పాలించి వారికి సుఖమైన పాలనను అందించు. దానికి మన తండ్రి దశరథుడే నిదర్శనము. ఆయన ఎన్నో యజ్ఞములు, యాగములు చేసి, ప్రజలను చక్కగా పాలించి, దానధర్మములు చేసి, చివరకు స్వర్గము చేరుకున్నాడు.
మనము మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆయన పరిపూర్ణజీవితము అనుభవించి స్వర్గము చేరుకున్నాడు. ఆయనను గురించి దుఃఖించడం మాను. కర్తవ్యమును విస్మరించకు.

అయోధ్యను పాలించమని దశరథుడు నిన్ను ఆదేశించాడు. ఆయన ఆదేశములను పాటించు. అయోధ్యను పాలించు. ఎందుకుంటే, తండ్రిగారు నన్ను వనములకు వెళ్లమని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారము నేను అడవులకు వచ్చానుకదా! అలాగే నీవు కూడా తండ్రి గారి ఆదేశమును పాటించి రాజ్యమును పాలించు. అదే నీ కర్తవ్యము.

ఇప్పుడు నేను నీ మాట విని అయోధ్యకు వస్తే తండ్రిగారి ఆదేశమును ధిక్కరించిన వాడిని అవుతాను. అది అధర్మము. అలాగే నీవు రాజ్యపాలన చెయ్యపోతే నీవుకూడా తండ్రిగారి ఆజ్ఞను ధిక్కరించినట్టే. అది కూడా అధర్మమే.

కాబట్టి నీవు అధర్మము చెయ్యకు. నన్ను అధర్మము వైపుకు లాగకు. తండ్రి గారి ఆదేశము ప్రకారము నీవు అయోధ్యనుపాలించు. నేను అరణ్యమునుపాలించెదను. అదే మన ధర్మము. అప్పుడే మనకు ఇహములో కానీ పరములో కానీసుఖము లభిస్తుంది. కాబట్టి మనము ఇద్దరమూ మన తండ్రి గారి ఆజ్ఞను పాటించి ఆయన పేరు నిలబెడదాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరుద్దాము.” అని పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః (106) >>

Aranya Kanda Sarga 34 In Telugu – అరణ్యకాండ చతుస్త్రింశః సర్గః

Aranya Kanda Sarga 34 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుస్త్రింశః సర్గలో, రావణుడు రాముడి పరాక్రమం మరియు ఆయుధాల గురించి ఆరా తీస్తాడు, దీని కోసం శూర్పణఖ రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి మరియు జనస్థానంలో ఏమి జరిగిందో వివరిస్తుంది. సీతను తన భార్యగా సాధించమని రావణుడిని ఆమె ప్రేరేపిస్తుంది, ఎందుకంటే ఆమె అందంలో సీతను మించిన వారు ఎవరూ లేరు.

సీతాహరణోపదేశః

తతః శూర్పణఖాం కృద్ధాం బ్రువంతీం పరుషం వచః |
అమాత్యమధ్యే సంక్రుద్ధః పరిపప్రచ్ఛ రావణః ||

1

కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః |
కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః స దురాసదమ్ ||

2

ఆయుధం కిం చ రామస్య నిహతా యేన రాక్షసాః |
ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా ||

3

ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛితా |
తతో రామం యథాతత్త్వమాఖ్యాతుముపచక్రమే ||

4

దీర్ఘబాహుర్విశాలాక్షశ్చీరకృష్ణాజినాంబరః |
కందర్పసమరూపశ్చ రామో దశరథాత్మజః ||

5

శక్రచాపనిభం చాపం వికృష్య కనకాంగదమ్ |
దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్ ||

6

నాదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం శిలీముఖాన్ |
న కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే ||

7

హన్యమానం తు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః |
ఇంద్రేణేవోత్తమం సస్యమాహతం త్వశ్మవృష్టిభిః ||

8

రక్షసాం భీమరూపాణాం సహస్రాణి చతుర్దశ |
నిహతాని శరైస్తీక్ష్ణైస్తేనైకేన పదాతినా ||

9

అర్ధాధికముహూర్తేన ఖరశ్చ సహదూషణః |
ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ||

10

ఏకా కథంచిన్ముక్తాఽహం పరిభూయ మహాత్మనా |
స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మనా ||

11

భ్రాతా చాస్య మహాతేజాః గుణతస్తుల్యవిక్రమః |
అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||

12

అమర్షీ దుర్జయో జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలీ |
రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చరః ||

13

రామస్య తు విశాలాక్షీ పూర్ణేందుసదృశాననా |
ధర్మపత్నీ ప్రియా భర్తుర్నిత్యం ప్రియహితే రతా ||

14

సా సుకేశీ సునాసోరుః సురూపా చ యశస్వినీ |
దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా ||

15

తప్తకాంచనవర్ణాభా రక్తతుంగనఖీ శుభా |
సీతా నామ వరారోహా వైదేహీ తనుమధ్యమా ||

16

నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ |
నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే ||

17

యస్య సీతా భవేద్భార్యా యం చ హృష్టా పరిష్వజేత్ |
అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్ ||

18

సా సుశీలా వపుః శ్లాఘ్యా రూపేణాప్రతిమా భువి |
తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథా పతిః ||

19

తాం తు విస్తీర్ణజఘనాం పీనశ్రోణీపయోధరామ్ |
భార్యార్థే తు తవానేతుముద్యతాహం వరాననామ్ ||

20

విరూపితాఽస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ |
తాం తు దృష్ట్వాఽద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననామ్ ||

21

మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి |
యది తస్యామభిప్రాయో భార్యార్థే తవ జాయతే ||

22

శీఘ్రముద్ధ్రియతాం పాదో జయార్థమిహ దక్షిణః |
కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర ||

23

వధాత్తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః |
తం శరైర్నిశితైర్హత్వా లక్ష్మణం చ మహారథమ్ ||

24

హతనాథాం సుఖం సీతాం యథావదుపభోక్ష్యసి |
రోచతే యది తే వాక్యం మమైతద్రాక్షసేశ్వర ||

25

క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ |

విజ్ఞాయేహాత్మశక్తిం చ హ్రియతామబలా బలాత్ |
సీతా సర్వానవద్యాంగీ భార్యర్థే రాక్షసేశ్వర ||

26

నిశమ్య రామేణ శరైరజిహ్మగై-
-ర్హతాన్ జనస్థానగతాన్నిశాచరాన్ |
ఖరం చ బుధ్వా నిహతం చ దూషణం
త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి ||

27

Aranya Kanda Sarga 34 In Telugu Pdf Download

నిండు సభలో, మంత్రి సామంత దండనాధుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజం ఉన్నా, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు.

“శూర్పణఖా! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు! అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏయే ఆయుధములు ఉన్నాయి. అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు!” అని అన్నాడు రావణుడు.

అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది.

“ఓ రాక్షసేంద్రా! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు. అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు కానీ ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎవరికి తెలియదు. కాని ఆబాణాలు తగిలి రాక్షసులు చావడం మాత్రం కనపడుతుంది.

అతని ధనుస్సుమాత్రం ఎల్లప్పుడు ఒంగి వర్తులాకారంలో ఉ ంటుంది. అతని యుద్ధము నేను ప్రత్యక్షముగా చూచాను. అతడు ఖరదూషణులను, వారి సేనాధిపతులను, 14,000 సైనికులను ఒకటిన్నర ముహూర్తకాలములో సంహరించాడు. (ముహూర్తము అంటే 48 నిమిషముల కాలము. అంటే మొత్తము యుద్ధము 72 నిమిషము లలో ముగిసిపోయింది అని అర్థము.). ఆ యుద్ధములో నేను తప్ప తక్కిన రాక్షసులు అందరూ మరణించారు. నేను స్త్రీని కాబట్టి నన్ను చంపలేదు అని అనుకుంటున్నాను.

ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. అతనికి మహాకోపము. అన్నతో సమానమైన బలపరాక్రమములు కలవాడు. అతనిని జయించడం కూడా చాలా కష్టము. రామునికి కుడిభుజము లక్షణుడు. ఇంక ఆ రామునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సీత. మహా సౌందర్యవతి. దేవతాస్త్రీలు, అప్సరసలు, గంధర్వ కాంతలు అందరూ అందంలో ఆమె కాలిగోటికి కూడా చాలరు. ముల్లోకములలో సీత వంటి సౌందర్యవతిని, దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలలో నేను ఇంతవరకు చూడలేదు.

రాముడు తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి సీత ప్రేమను పొందిన రాముడు దేవేంద్రుని కన్నా గొప్పవాడు. (ఇప్పటిదాకా ఉన్నది ఉన్నట్టు చెప్పిన శూర్పణఖ మాట మార్చింది.) రావణా! నా ఉద్దేశంలో సీత లాంటి సౌందర్యవతి నీ వంటి వాడి దగ్గర ఉండాలి కానీ ఆ మానవునికి భార్యగా తగదు. నీవే ఆమెకు తగిన భర్తవు. ఆమె సౌందర్యమును చూచిన తరువాత నీవే ఆమెకు తగినవాడివి అనుకొని, ఆ మాట చెప్పడానికి, సీతను తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లాను. ఆ సీతను బలవంతంగా నీ వద్దకు తీసుకు రావడానికి ప్రయత్నించాను. అపుడు ఆ ధూర్తుడైన లక్ష్మణుడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు కోసి నన్ను అవమానించాడు.

నా సంగతి అటుంచు. ఈ సీతను నీవు ఒకసారి చూస్తే ఆమె లేకుండా తిరిగి లంకానగరానికి రావు. ఆమె చూపులు అనే మన్మధ బాణములకు బలి అయిపోతావు. నా కైతే ఆమె నీకు కైతే ఆమె నీకు భార్యగా తగినది అనిపించింది. నీకు కూడా అదే ఉద్దేశ్యం ఉంటే వెంటనే బయలు దేరు. ఆ రామలక్ష్మణులను చంపి సీతను తీసుకొని రా. నీ భార్యగా చేసుకో. అమరసుఖాలు అనుభవించు. ఆ రామలక్ష్మణులను చంపి, రాముని చేతిలో చచ్చిన రాక్షసుల ఆత్మలకు శాంతి చేకూర్చు.

లక్షణుని చంపితేనే నా అవమానానికి ప్రతీకారం చేసిన వాడివి అవుతావు. రామలక్ష్మణులు చస్తే సీత నీ వశం అవుతుంది. సీతలాంటి సౌందర్యరాసి భార్యగా ఉన్న నిన్ను ముల్లోకాలు శ్లాఘిస్తాయి. నీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సీత మంచి మాటలతో నీకు లొంగకుంటే, బలత్కారంగానైనా తీసుకొనిరా! నీ భార్యగా చేసుకో!

రాక్షసేంద్రా! అన్నింటి కన్నా ముందు, ఆ రాముడు నీ రాక్షససేనలను సర్వనాశనం చేసాడు అని గుర్తుంచుకో! రాముని సంహరించకపోతే దండ కారణ్యములో నీ సార్వభౌమత్వానికి విలువ ఉండదు. తరువాత నీ ఇష్టం.” అని లేని పోని మాటలతో రావణుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచత్రింశః సర్గః (35) >>

Ayodhya Kanda Sarga 104 In Telugu – అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 104

అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః

ఈ సర్గలో, రాముడు చైత్రరథానికి వెళ్ళి అక్కడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. చైత్రరథం దివ్యమైన తోటలతో, పుష్పాలతో, వృక్షాలతో, సుందరమైన నీరు ప్రవహించే సరస్సులతో అలరారుతోంది. ఈ ప్రాంతం దివ్యగంధాలతో పరిమళిస్తుంది. రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి చైత్రరథంలో సేదతీరుతాడు. అక్కడ రాముడు సీతకు ఆ ప్రదేశంలోని అందాలను వివరిస్తాడు. తాత్కాలికంగా తన బాధలను మరచిపోయి, సీత, లక్ష్మణులతో ఆనందంగా గడుపుతాడు. ఈ సర్గ రాముడి మనోధైర్యాన్ని, ప్రకృతి ప్రేమను, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది.

రామభరతసంవాదః

తం తు రామః సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రష్టుం సముపచక్రమే || ౧ ||

కిమేతదిచ్ఛేయమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా |
యస్మాత్త్వమాగతో దేశమిమం చీరజటాజినీ || ౨ ||

కిం నిమిత్తమిమం దేశం కృష్ణాజినజటాధరః |
హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి || ౩ ||

ఇత్యుక్తః కైకయీపుత్రః కాకుత్స్థేన మహాత్మనా |
ప్రగృహ్య బలవద్భూయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ || ౪ ||

ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరమ్ |
గతః స్వర్గం మహాబాహుః పుత్రశోకాభిపీడితః || ౫ ||

స్త్రియా నియుక్తః కైకేయ్యా మమ మాత్రా పరంతప |
చకార సుమహత్పాపమిదమాత్మయశోహరమ్ || ౬ ||

సా రాజ్యఫలమప్రాప్య విధవా శోకకర్శితా |
పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ || ౭ ||

తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి |
అభిషించస్వ చాద్యైవ రాజ్యేనప మఘవానివ || ౮ ||

ఇమాః ప్రకృతయః సర్వా విధవా మాతరశ్చ యాః |
త్వత్సకాశమనుప్రాప్తాః ప్రసాదం కర్తుమర్హసి || ౯ ||

తదానుపూర్వ్యా యుక్తం చ యుక్తం చాత్మని మానద |
రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు || ౧౦ ||

భవత్వవిధవా భూమిః సమగ్రా పతినా త్వయా |
శశినా విమలేనేవ శారదీ రజనీ యథా || ౧౧ ||

ఏభిశ్చ సచివైః సార్ధం శిరసా యాచితో మయా |
భ్రాతుః శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి || ౧౨ ||

తదిదం శాశ్వతం పిత్ర్యం సర్వం ప్రకృతిమండలమ్ |
పూజితం పురుషవ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి || ౧౩ ||

ఏవముక్త్వా మహాబాహుః సబాష్పః కైకయీసుతః |
రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్పునః || ౧౪ ||

తం మత్తమివ మాతంగం నిఃశ్వసంతం పునఃపునః |
భ్రాతరం భరతం రామః పరిష్వజ్యేదమబ్రవీత్ || ౧౫ ||

కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః |
రాజ్యహేతోః కథం పాపమాచరేత్త్వద్విధో జనః || ౧౬ ||

న దోషం త్వయి పశ్యామి సూక్ష్మమప్యరిసూదన |
న చాపి జననీం బాల్యాత్త్వం విగర్హితుమర్హసి || ౧౭ ||

కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదాఽనఘ |
ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే || ౧౮ ||

వయమస్య యథా లోకే సంఖ్యాతాః సౌమ్య సాధుభిః |
భార్యాః పుత్రాశ్చ శిష్యాశ్చ త్వమను జ్ఞాతుమర్హసి || ౧౯ ||

వనే వా చీరవసనం సౌమ్య కృష్ణాజినాంబరమ్ |
రాజ్యే వాఽపి మహారాజో మాం వాసయితుమీశ్వరః || ౨౦ ||

యావత్పితరి ధర్మజ్ఞే గౌరవం లోకసత్కృతమ్ |
తావద్ధర్మభృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవమ్ || ౨౧ ||

ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్ఛేతి రాఘవ |
మాతాపితృభ్యాముక్తోఽహం కథమన్యత్ సమాచరే || ౨౨ ||

త్వయా రాజ్యమయోధ్యాయాం ప్రాప్తవ్యం లోకసత్కృతమ్ |
వస్తవ్యం దండకారణ్యే మయా వల్కలవాససా || ౨౩ ||

ఏవం కృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ |
వ్యాదిశ్య చ మహాతేజాః దివం దశరథో గతః || ౨౪ ||

స చ ప్రమాణం ధర్మాత్మా రాజా లోకగురుస్తవ |
పిత్రా దత్తం యథాభాగముపభోక్తుం త్వమర్హసి || ౨౫ ||

చతుర్దశసమాః సౌమ్య దండకారణ్యమాశ్రితః |
ఉపభోక్ష్యే త్వహం దత్తం భాగం పిత్రా మహాత్మనా || ౨౬ ||

యదబ్రవీన్మాం నరలోకసత్కృతః
పితా మహాత్మా విబుధాధిపోపమః |
తదేవ మన్యే పరమాత్మనో హితమ్
న సర్వలోకేశ్వరభావమప్యహమ్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురుత్తరశతతమః సర్గః || ౧౦౪ ||

Ayodhya Kanda Sarga 104 Meaning In Telugu

దశరథుని భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయీ కులగురువు వసిష్ఠుని వెంట రాముని ఆశ్రమానికి వస్తున్నారు. వారుమందాకినీ నది ఒడ్డున నడుస్తున్నారు. అక్కడి వారు, రాముడు, సీత స్నానమునకు ఉపయోగించు నదీతీరమును చూపించారు. కౌసల్యకు దు:ఖము ఆగలేదు. తనవెంట ఉన్న సుమిత్రను చూచి ఇలా అంది.

“చూచావా సుమిత్రా! రాజభోగములు అనుభవించవలసిన నీ కుమారుడు లక్ష్మణుడు, నా కుమారుడు రాముడు, నా కోడలు సీత, అయోధ్యనుండి వెడలగొట్టబడి, దిక్కులేని వారి మాదిరి ఒంటరిగా ఈ నదీతీరంలో స్నానం చేస్తున్నారు. సుమిత్రా! నీ కుమారుడు ఇక్కడి నుండి రాముని కొరకు, సీతకొరకు జలములు తీసుకొనిపోవడం నీచకార్యము అని అనుకోకు. తన అన్నకు సేవ చేసే నిమిత్తం చేసే ఏ కార్యమైనా అది దోషము కాదు. అయినా ఇంక ఎన్నాళ్లు? భరతుడు ఇప్పటికే రాముని అయోధ్యకు వచ్చి తన రాజ్యము స్వీకరించమని ప్రార్థిస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల కష్టాలు గట్టెక్కుతాయి. లక్ష్మణునికి అన్నగారి దాస్యము తప్పుతుంది.” అని అన్నది కౌలస్య. ఇంతలో వారు రాముడు తన తండ్రికి పిండప్రదానము చేసినచోటికి చేరుకున్నారు. దక్షిణ ముఖంగా పరచిన దర్భలు, వాటి మీద పెట్టబడిన పిండి తో చేసిన పిండములు చూచారు.
“చూడండి. రాముడు ఇక్కడే తన తండ్రికి పిండప్రదానం చేసాడు. ఆ పిండములు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ప్రతిరోజూ పంచభక్ష్య పరమాన్నములతో భోజనము చేసే దశరథుడు ఈ పిండితో చేసిన పిండములను ఎలా ఆరగించగలడో.. ఏమో!

అయోధ్యాపతి అయిన రాముడు తన తండ్రికి పిండితో పిండప్రదానము చెయ్యడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లోకంలో పురుషులు ఏమి తింటారో దానిని పితృదేవతలకు సమర్పిస్తారట. అంటే రాముడు ఈ పిండి తిని బతుకుతున్నాడా! రాజాధిరాజైన రామునికి ఎంత దుర్గతిపట్టింది. ఇది చూచి కూడా నా హృదయం ముక్కలు కాలేదంటే నా హృదయం రాయి కంటే కఠినమై ఉండాలి.” అని శోకించింది కౌసల్య.

మిగిలిన భార్యలు ఆమెను ఓదార్చారు. ఈప్రకారంగా రాముని గురించి తలచుకుంటూ దు:ఖపడుతూ అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల వద్ద నేల మీద కూర్చుని ఉన్న రాముని చూడగానే దశరథుని భార్యలకు దుఃఖము ఆగలేదు. భోరున ఏడ్చారు. వారిని చూడగానే రాముడు వారి వద్దకు వెళ్లాడు. తనతల్లులందరికీ పాదనమస్కారము చేసాడు. వారంతరూ రాముని వీపునిమిరి, తలను నిమిరి ఆశీర్వదించారు. రాముని వెంట లక్ష్మణుడుకూడా తల్లులందరి పాదములు తాకి నమస్కరించాడు. వారందరూ లక్ష్మణుని శిరస్సునిమిరి ఆశీర్వదించారు. తరువాత సీత తన అత్తగార్లు అందరికీ పాద నమస్కారము చేసి వారి ఆశీర్వ చనములు స్వీకరించింది.

సీతను చూచిన కౌసల్యకు దు:ఖము ఆగలేదు. సీతను తన కూతురును కౌగలించుకున్నట్టు గట్టిగా కౌగలించుకుంది. “జనకమహారాజు కూతురు, దశరధ మహారాజు కోడలు, రామునిభార్య, నిర్మానుష్యంగా ఉన్న ఈ అరణ్యములలో ఎన్ని కష్టములు పడుతూ ఉందోకదా! అమ్మా సీతా! వాడి పోయిన కమలము వలె ఉన్న నీ ముఖం చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదమ్మా!”అనిసీతను పట్టుకొని ఏడిచింది.

వీరు ఇలా దు:ఖపడుతూ ఉంటే, రాముడు వసిష్ఠునికి పాదాభివందనం చేసాడు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. తరువాత అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. వసిష్ఠుడు రాముని పక్కన కూర్చున్నాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరొకపక్క కూర్చున్నారు. మంత్రులు, దండనాధులు, పురప్రముఖులు వారి వారి అర్హతకు తగ్గట్టు కూర్చున్నారు. అందరూ భరతుడు రామునితో ఏం మాట్లాడతాడో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః (105) >>

Ayodhya Kanda Sarga 103 In Telugu – అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 103

అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః

ఈ సర్గలో, రాముడు సుమంతుని ద్వారా తన తండ్రి మరణవార్త తెలుసుకుంటాడు. ఆయన విషాదంలో మునిగి తండ్రి, జననీ కౌసల్యా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. భరతుడు ఆయన్ని తిరిగి రావాలని ప్రార్థించినా, రాముడు తన వాగ్దానాన్ని పాటించాల్సిన కర్తవ్యం ఉందని అంటాడు. రాముడు తన తల్లి కౌసల్యా, సుమిత్రా, కైకేయి లకు దాస్యభక్తితో వీడా వడులు చెప్పి, తన ధర్మాన్ని పరిరక్షించాలని నిర్ణయిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసాన్ని కొనసాగించడానికి దండకారణ్యంలోకి వెళ్లి, పుణ్యాశ్రమాలలో నివసిస్తారు. ఈ సర్గ రాముడి ధర్మబద్ధతను, కుటుంబానుభవాలను, దైవిక కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మాతృదర్శనమ్

వసిష్ఠః పురతః కృత్వా దారాన్ దశరథస్య చ |
అభిచక్రామ తం దేశం రామదర్శనతర్షితః || ౧ ||

రాజపత్న్యశ్చ గచ్ఛంత్యో మందం మందాకినీం ప్రతి |
దదృశుస్తత్ర తత్తీర్థం రామలక్ష్మణసేవితమ్ || ౨ ||

కౌసల్యా బాష్పపూర్ణేన ముఖేన పరిశుష్యతా |
సుమిత్రామబ్రవీద్దీనా యాశ్చాన్యా రాజయోషితః || ౩ ||

ఇదం తేషామనాథానాం క్లిష్టమక్లిష్టకర్మణామ్ |
వనే ప్రాక్కేవలం తీర్థం యే తే నిర్విషయీకృతాః || ౪ ||

ఇతః సుమిత్రే పుత్రస్తే సదా జలమతంద్రితః |
స్వయం హరతి సౌమిత్రిర్మమ పుత్రస్య కారణాత్ || ౫ ||

జఘన్యమపి తే పుత్రః కృతవాన్న తు గర్హితః |
భ్రాతుర్యదర్థసహితం సర్వం తద్విహితం గుణైః || ౬ ||

అద్యాయమపి తే పుత్రః క్లేశానామతథోచితః |
నీచానర్థసమాచారం సజ్జం కర్మ ప్రముంచతు || ౭ ||

దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే |
పితురింగుదిపిణ్యాకం న్యస్తమాయతలోచనా || ౮ ||

తం భూమౌ పితురార్తేన న్యస్తం రామేణ వీక్ష్య సా |
ఉవాచ దేవీ కౌసల్యా సర్వా దశరథస్త్రియః || ౯ ||

ఇదమిక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః |
రాఘవేణ పితుర్దత్తం పశ్యతైతద్యథావిధి || ౧౦ ||

తస్య దేవసమానస్య పార్థివస్య మహాత్మనః |
నైతదౌపయికం మన్యే భుక్తభోగస్య భోజనమ్ || ౧౧ ||

చతురంతాం మహీం భుక్త్వా మహేంద్రసదృశో విభుః |
కథమింగుదిపిణ్యాకం స భుంక్తే వసుధాఽధిపః || ౧౨ ||

అతో దుఃఖతరం లోకే న కించిత్ ప్రతిభాతి మా |
యత్ర రామః పితుర్దద్యాదింగుదీక్షోదమృద్ధిమాన్ || ౧౩ ||

రామేణేంగుదిపిణ్యాకం పితుర్దత్తం సమీక్ష్య మే |
కథం దుఃఖేన హృదయం న స్ఫోటతి సహస్రధా || ౧౪ ||

శ్రుతిస్తు ఖల్వియం సత్యా లౌకికీ ప్రతిభాతి మా |
యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౧౫ ||

ఏవమార్తాం సపత్న్యస్తాః జగ్మురాశ్వాస్య తాం తదా |
దదృశుశ్చాశ్రమే రామం స్వర్గచ్యుతమివామరమ్ || ౧౬ ||

సర్వభోగైః పరిత్యక్తం రామం సంప్రేక్ష్య మాతరః |
ఆర్తా ముముచురశ్రూణి సస్వరం శోకకర్శితాః || ౧౭ ||

తాసాం రామః సముత్థాయ జగ్రాహ చరణాన్ శుభాన్ |
మాతౄఽణాం మనుజవ్యాఘ్రః సర్వాసాం సత్యసంగరః || ౧౮ ||

తాః పాణిభిః సుఖస్పర్శైర్మృద్వంగుళితలైః శుభైః |
ప్రమమార్జూ రజః పృష్ఠాద్రామస్యాయతలోచనాః || ౧౯ ||

సౌమిత్రిరపి తాః సర్వాః మాతౄఽస్సంప్రేక్ష్య దుఃఖితః |
అభ్యవాదయతాసక్తం శనై రామాదనంతరమ్ || ౨౦ ||

యథా రామే తథా తస్మిన్ సర్వా వవృతిరే స్త్రియః |
వృత్తిం దశరథాజ్జాతే లక్ష్మణే శుభలక్షణే || ౨౧ ||

సీతాఽపి చరణాంస్తాసాముపసంగృహ్య దుఃఖితా |
శ్వశ్రూణామశ్రుపూర్ణాక్షీ సా బభూవాగ్రతః స్థితా || ౨౨ ||

తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుహితరం యథా |
వనవాసకృశాం దీనాం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౨౩ ||

విదేహరాజస్య సుతా స్నుషా దశరథస్య చ |
రామపత్నీ కథం దుఃఖం సంప్రాప్తా నిర్జనే వనే || ౨౪ ||

పద్మమాతపసంతప్తం పరిక్లిష్టమివోత్పలమ్ |
కాంచనం రజసా ధ్వస్తం క్లిష్టం చంద్రమివాంబుదైః || ౨౫ ||

ముఖం తే ప్రేక్ష్య మాం శోకో దహత్యగ్నిరివాశ్రయం
భృశం మనసి వైదేహి వ్యసనారణిసంభవః || ౨౬ ||

బ్రువంత్యామేవమార్తాయాం జనన్యాం భరతాగ్రజః |
పాదావాసాద్య జగ్రాహ వసిష్ఠస్య చ రాఘవః || ౨౭ ||

పురోహితస్యాగ్నిసమస్య వై తదా
బృహస్పతేరింద్ర ఇవామరాధిపః |
ప్రగృహ్య పాదౌ సుసమృద్ధతేజసః
సహైవ తేనోపవివేశ రాఘవః || ౨౮ ||

తతో జఘన్యం సహితైః సమంత్రిభిః
పురప్రధానైశ్చ సహైవ సైనికైః |
జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్
ఉపోపవిష్టో భరతస్తదాగ్రజమ్ || ౨౯ ||

ఉపోపవిష్టస్తు తథా స వీర్యవాన్
తపస్వివేషేణ సమీక్ష్య రాఘవమ్ |
శ్రియా జ్వలంతం భరతః కృతాంజలిః
యథా మహేంద్రః ప్రయతః ప్రజాపతిమ్ || ౩౦ ||

కిమేష వాక్యం భరతోఽద్య రాఘవం
ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్ష్యతి |
ఇతీవ తస్యార్యజనస్య తత్త్వతో
బభూవ కౌతూహలముత్తమం తదా || ౩౧ ||

స రాఘవః సత్యధృతిశ్చ లక్ష్మణో
మహానుభావో భరతశ్చ ధార్మికః |
వృతాః సుహృద్భిశ్చ విరేజురధ్వరే
యథా సదస్యైః సహితాస్త్రయోఽగ్నయః || ౩౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యుత్తరశతతమః సర్గః || ౧౦౩ ||

Ayodhya Kanda Sarga 103 Meaning In Telugu

భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు.
(ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు. 101వ సర్గలో భరతుడు రామునికి దశరథుని మరణ వార్త చెప్పాడు. “గతః స్వర్గం మహాబాహు: పుత్రశోకాభిపీడిత:” పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యూడు అని చెప్పాడు. 101వ సర్గ ఆఖరులో రాముడు “ఏవంకృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాదిశ్య చ మాహాతేజ దివం దశరథో గత:” ఈ విధంగా రాజ్యవిభాగము చేసి దశరథుడు దివంగతుడయ్యాడు అని రాముడు కూడా అన్నాడు. కాని 103 వ సర్గ మొదటి భాగంలో తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు అని ఉంది. ఈ మూర్ఛపోవడం మొదట భరతుడు తండ్రి మరణ వార్త చెప్పినపుడే జరిగి ఉండాల్సింది. ముందు ముందు ఇలాంటి పరస్పర వ్యతిరేక సన్నివేశాలు వస్తుంటాయి. గమనించండి.) మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను.

ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు దిశానిర్దేశము ఎవరు చేస్తారు. నాకు మంచీ చెడూ ఎవరు చెబుతారు. నేను అయోధ్యలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ తండ్రిగారు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. ఇప్పుడు నాకు అలా ఎవరు చెబుతారు.” అని శోకిస్తున్నాడు రాముడు.

సీతను చూచి రాముడు ఇలా అన్నాడు. “సీతా! నీకు పితృసమానులు, నీ మామగారు మరణించారు. లక్ష్మణుడు పితృహీనుడయ్యాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు?’ అని విలపిస్తున్నాడు రాముడు. రాముడు ఇలా ఏడుస్తుంటే మిగిలిన తమ్ముళ్లు కూడా ఏడుస్తున్నారు.
కొంచెం సేపటికి లక్ష్మణుడు తేరుకొని అన్నరాముని చూచి “అన్నయ్యా! మనప్రస్తుత కర్తవ్యము తండ్రి గారికి జలతర్పణములు ఇవ్వాలి.” అని గుర్తుచేసాడు.

పితృసమానుడైన మామగారు పరమపదించారు అన్నవార్త విన్న సీత దు:ఖంతో కుమిలిపోయింది. కళ్లనిండా నీళ్లుకమ్ముకున్నాయి. ఏడుస్తున్న సీతను చూచాడు రాముడు. ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా!మనము తండ్రిగారికి పిండప్రదానముచేయవలెను. నీవుపోయి పిండి, బదరీఫలములు సిద్ధ చేయి.” అని అన్నాడు. ముందు సీత నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే రాముడు వారి వెనక మందాకినీ నదీ తీరానికి వెళ్లాడు. వారి వెంట సుమంత్రుడు వెళ్లాడు. అందరూ మందాకినీ నదీ తీరానికి చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!”అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులు మందాకినీ నది ఒడ్డున దశరథునకు పిండితో పిండప్రదానము చేసారు. నేల మీద దరలు పరిచారు. ఆ దర్భల మీద బదరీఫలములతో కూడిన పిండిని పిండములుగాచేసి పెట్టారు. “ఓ తండ్రీ! మేమే ప్రతిదినమూ తినే ఆహారమునే నీకు పిండములుగా సమర్పించుకుంటున్నాము. స్వీకరించు. ఈ లోకంలో పురుషులు దేనిని తింటారో దానినే పితృలోకంలో ఉన్నపితృదేవతలు కూడా తింటారుకదా!” అని పలికాడు రాముడు.

పిండప్రదాన కార్యక్రమము ముగిసినతరువాత అందరూ పర్ణశాలకు చేరుకున్నారు. తరువాత కూడా అన్నదమ్ములు తండ్రిమరణానికి బాధపడుతూనే ఉన్నారు. అన్నదమ్ములు చేస్తున్న రోదన ధ్వనులు దూరంగా ఉన్న సైనికులకు వినబడ్డాయి. ‘భరతుడు రాముని చేరుకున్నాడు, అందరూ దశరథుని మరణానికి దు:ఖిస్తున్నారు’ అని వారు తెలుసుకున్నారు. వారంతా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. అందరూ రాముని పర్ణశాల వైపుకు ప్రయాణం అయ్యారు.

అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల ముందు నేలమీదకూర్చొని ఉన్న రాముని చూచారు. రామునికి ఆ గతి పట్టించిన కైకను, మంధరను నోటికొచ్చినట్టు తిడుతూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న రాముని చూచి వారికి కన్నీళ్లు ఆగలేదు. రాముడు అందరినీ చూచాడు. పురుషులను, స్త్రీలను తన కన్న తల్లి తండ్రులవలె కౌగలించుకొని వారి ఓదార్పువచనములను విన్నాడు. కొంతమంది రామునికి నమస్కరించారు. కొంత మంది రాముని పరామర్శించారు. రాముడు అందరినీ వారి వారి అర్హతలను బట్టి గౌరవించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః (104) >>

Ayodhya Kanda Sarga 102 In Telugu – అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 102

అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః

ఈ సర్గలో భరతుడు, రాముడి వనవాసాన్ని ముగించి ఆయోధ్యకు తిరిగి రమ్మని వేడుకుంటాడు. రాముడు తన వాగ్దానాన్ని గుర్తుచేసి, వనవాసం పూర్తయ్యే వరకు తిరిగి రాలేనని చెబుతాడు. భరతుడు నిరాశచెందినప్పటికీ, రాముడి పాదుకలను తీసుకుని తిరిగి ఆయోధ్యకు వెళ్ళి, అవి రాజాసనంపై ఉంచి రాముడి తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను ప్రతినిధిగా భావించి, ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. ఈ సర్గ భరతుడి వినయం, రాముడి నిబద్ధత, సోదరుల మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది.

నివాపదానమ్ 

తాం శ్రుత్వా కరుణాం వాచం పితుర్మరణసంహితామ్ |
రాఘవో భరతేనోక్తాం బభూవ గతచేతనః || ౧ ||

తం తు వజ్రమివోత్సృష్టమాహవే దానవారిణా |
వాగ్వజ్రం భరతేనోక్తమమనోజ్ఞం పరంతపః || ౨ ||

ప్రగృహ్య బాహూ రామో వై పుష్పితాగ్రో యథా ద్రుమః |
వనే పరశునా కృత్తస్తథా భువి పపాత హ || ౩ ||

తథా నిపతితం రామం జగత్యాం జగతీపతిమ్ |
కూలఘాతపరిశ్రాంతం ప్రసుప్తమివ కుంజరమ్ || ౪ ||

భ్రాతరస్తే మహేష్వాసం సర్వతః శోకకర్శితమ్ |
రుదంతః సహ వైదేహ్యా సిషిచుః సలిలేన వై || ౫ ||

స తు సంజ్ఞాం పునర్లబ్ధ్వా నేత్రాభ్యామాస్రముత్సృజన్ |
ఉపాక్రామత కాకుత్స్థః కృపణం బహుభాషితుమ్ || ౬ ||

స రామః స్వర్గతం శ్రుత్వా పితరం పృథివీపతిమ్ |
ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మా ధర్మసంహితమ్ || ౭ ||

కిం కరిష్యామ్యయోధ్యాయాం తాతే దిష్టాం గతిం గతే |
కస్తాం రాజవరాద్ధీనామయోధ్యాం పాలయిష్యతి || ౮ ||

కిం ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మనః |
యో మృతో మమ శోకేన మయా చాపి న సంస్కృతః || ౯ ||

అహో భరత సిద్ధార్థో యేన రాజా త్వయాఽనఘ |
శత్రుఘ్నేన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృతః || ౧౦ ||

నిష్ప్రధానామనేకాగ్రాం నరేంద్రేణ వినా కృతామ్ |
నివృత్తవనవాసోఽపి నాయోధ్యాం గంతుముత్సహే || ౧౧ ||

సమాప్తవనవాసం మామయోధ్యాయాం పరంతప |
కో ను శాసిష్యతి పునస్తాతే లోకాంతరం గతే || ౧౨ ||

పురా ప్రేక్ష్య సువృత్తం మాం పితా యాన్యాహ సాంత్వయన్ |
వాక్యాని తాని శ్రోష్యామి కుతః కర్ణసుఖాన్యహమ్ || ౧౩ ||

ఏవముక్త్వా స భరతం భార్యామభ్యేత్య రాఘవః |
ఉవాచ శోకసంతప్తః పూర్ణచంద్రనిభాననామ్ || ౧౪ ||

సీతే మృతస్తే శ్వశురః పిత్రా హీనోఽసి లక్ష్మణ |
భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిమ్ || ౧౫ ||

తతో బహుగుణం తేషాం బాష్పం నేత్రేష్వజాయత |
తథా బ్రువతి కాకుత్స్థే కుమారాణాం యశస్వినామ్ || ౧౬ ||

తతస్తే భ్రాతరః సర్వే భృశమాశ్వాస్య రాఘవమ్ |
అబ్రువన్ జగతీభర్తుః క్రియతాముదకం పితుః || ౧౭ ||

సా సీతా శ్వశురం శ్రుత్వా స్వర్గలోకగతం నృపమ్ |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామశకన్నేక్షితుం పతిమ్ || ౧౮ ||

సాంత్వయిత్వా తు తాం రామో రుదంతీం జనకాత్మజామ్ |
ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః || ౧౯ ||

ఆనయేంగుదిపిణ్యాకం చీరమాహర చోత్తరమ్ |
జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మనః || ౨౦ ||

సీతా పురస్తాద్వ్రజతుత్వమేనామభితో వ్రజ |
అహం పశ్చాద్గమిష్యామి గతిర్హ్యేషా సుదారుణా || ౨౧ ||

తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతిః |
మృదుర్దాంతశ్చ శాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్ || ౨౨ ||

సుమంత్రస్తైర్నృపసుతైః సార్ధమాశ్వాస్య రాఘవమ్ |
అవాతారయదాలంబ్య నదీం మందాకినీం శివామ్ || ౨౩ ||

తే సుతీర్థాం తతః కృచ్ఛ్రాదుపాగమ్య యశస్వినః |
నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననామ్ || ౨౪ ||

శీఘ్రస్రోతసమాసాద్య తీర్థం శివమకర్దమమ్ |
సిషిచుస్తూదకం రాజ్ఞే తత్రైతత్తే భవత్వితి || ౨౫ ||

ప్రగృహ్య చ మహీపాలో జలపూరితమంజలిమ్ |
దిశం యామ్యామభిముఖో రుదన్ వచనమబ్రవీత్ || ౨౬ ||

ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయమ్ |
పితృలోకగతస్యాద్య మద్దత్తముపతిష్ఠతు || ౨౭ ||

తతో మందాకినీతీరాత్ ప్రత్యుత్తీర్య స రాఘవః |
పితుశ్చకార తేజస్వీ నివాపం భ్రాతృభిః సహ || ౨౮ ||

ఐంగుదం బదరీమిశ్రం పిణ్యాకం దర్భసంస్తరే |
న్యస్య రామః సుదుఃఖార్తో రుదన్ వచనమబ్రవీత్ || ౨౯ ||

ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీతో యదశనా వయమ్ |
యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౩౦ ||

తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య నదీతటాత్ |
ఆరురోహ నరవ్యాఘ్రో రమ్యసానుం మహీధరమ్ || ౩౧ ||

తతః పర్ణకుటీద్వారమాసాద్య జగతీపతిః |
పరిజగ్రాహ బాహుభ్యాముభౌ భరతలక్ష్మణౌ || ౩౨ ||

తేషాం తు రుదతాం శబ్దాత్ ప్రతిశ్రుత్కోఽభవద్గిరౌ |
భ్రాతౄఽణాం సహ వైదేహ్యాః సింహానామివ నర్దతామ్ || ౩౩ ||

మహాబలానాం రుదతాం కుర్వతాముదకం పితుః |
విజ్ఞాయ తుములం శబ్దం త్రస్తా భరతసైనికాః || ౩౪ ||

అబ్రువంశ్చాపి రామేణ భరతః సంగతో ధ్రువమ్ |
తేషామేవ మహాంఛబ్దః శోచతాం పితరం మృతమ్ || ౩౫ ||

అథ వాసాన్ పరిత్యజ్య తం సర్వేఽభిముఖాః స్వనమ్ |
అప్యేకమనసో జగ్ముర్యథాస్థానం ప్రధావితాః || ౩౬ ||

హయైరన్యే గజైరన్యే రథైరన్యే స్వలంకృతైః |
సుకుమారాస్తథైవాన్యే పద్భిరేవ నరా యయుః || ౩౭ ||

అచిరప్రోషితం రామం చిరవిప్రోషితం యథా |
ద్రష్టుకామో జనః సర్వో జగామ సహసాఽఽశ్రమమ్ || ౩౮ ||

భ్రాతౄఽణాం త్వరితాస్తత్ర ద్రష్టుకామాః సమాగమమ్ |
యయుర్బహువిధైర్యానైః ఖురనేమిస్వనాకులైః || ౩౯ ||

సా భూమిర్బహుభిర్యానైః ఖురనేమిసమాహతా |
ముమోచ తుములం శబ్దం ద్యౌరివాభ్రసమాగమే || ౪౦ ||

తేన విత్రాసితా నాగాః కరేణుపరివారితాః |
ఆవాసయంతో గంధేన జగ్మురన్యద్వనం తతః || ౪౧ ||

వరాహవృకసంఘాశ్చ మహిషాః సర్ప్పవానరాః |
వ్యాఘ్రగోకర్ణగవయాః విత్రేసుః పృషతైః సహ || ౪౨ ||

రథాంగసాహ్వా నత్యూహాః హంసాః కారండవాః ప్లవాః |
తథా పుంస్కోకిలాః క్రౌంచా విసంజ్ఞా భేజిరే దిశః || ౪౩ ||

తేన శబ్దేన విత్రస్తైరాకాశం పక్షిభిర్వృతమ్ |
మనుష్యైరావృతా భూమిరుభయం ప్రబభౌ తదా || ౪౪ ||

తతస్తం పురుషవ్యాఘ్రం యశస్వినమరిందమమ్ |
ఆసీనం స్థండిలే రామం దదర్శ సహసా జనః || ౪౫ ||

విగర్హమాణః కైకేయీం సహితో మంథరామపి |
అభిగమ్య జనో రామం బాష్పపూర్ణముఖోఽభవత్ || ౪౬ ||

తాన్నరాన్ బాష్పపూర్ణాక్షాన్ సమీక్ష్యాథ సుదుఃఖితాన్ |
పర్యష్వజత ధర్మజ్ఞః పితృవన్మాతృవచ్చ సః || ౪౭ ||

స తత్ర కాంశ్చిత్ పరిషస్వజే నరాన్
నరాశ్చ కేచిత్తు తమభ్యవాదయన్ |
చకార సర్వాన్ సవయస్యబాంధవాన్
యథాఽర్హమాసాద్య తదా నృపాత్మజః || ౪౮ ||

స తత్ర తేషాం రుదతాం మహాత్మనామ్
భువం చ ఖం చానునినాదయన్ స్వనః |
గుహా గిరీణాం చ దిశశ్చ సంతతం
మృదంగఘోషప్రతిమః ప్రశుశ్రువే || ౪౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే శ్రీమదయోధ్యాకాండే ద్వ్యధికశతతమః సర్గః || ౧౦౨ ||

Ayodhya Kanda Sarga 102 Meaning In Telugu

రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు భరతుడు. తిరిగి రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను ధర్మహీనుడను. నాకు రాజధర్మము గురించి ఏమితెలుసు. నాకు తెలిసిందల్లా ఒకటే. అది మన కులధర్మము. మనవంశాచారము. ఇక్ష్వాకు వంశములో ఇంతవరకూ పెద్దవాడే రాజ్యభారము వహించాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేదు. కాకూడదు. ఇప్పుడు నీవు మన వంశములో పెద్దవాడవు. నేను నీ కన్నా చిన్నవాడను. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడవు కమ్ము. అదే నాకోరిక.

రామా! మామూలు ప్రజల దృష్టిలో రాజుకూడా ఒక సాధారణమానవుడే. కానీ, రాజు అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. రాజుకాదగ్గ లక్షణాలే నీకే ఉన్నాయి. నాలో ఎంత మాత్రమూ లేవు. కాబట్టి అయోధ్యకు రాజుకాదగ్గ వాడవు నీవే. ఇంక అసలు విషయానికి వద్దాము. నేను కేకయ దేశములో ఉండగా. నీవు అరణ్యములకు వెళ్లగా, మన తండ్రిగారు దశరథమహారాజుగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు కలిసి తండ్రి గారికి అంత్యక్రియలు చేసాము. ఇప్పుడు నీవు తండ్రిగారికి జలతర్పణములు విడువ వలెను. తండ్రిగారికి జ్యేష్టుడవు, ప్రియపుత్రుడవు నీవు. కాబట్టి నీవు విడిచే జలతర్పణములు మన తండ్రిగారికి అత్యంత ప్రియమైనవి.

ఎందుకంటే నేను విన్నదాని ప్రకారము దశరథుడు తన అవసాన కాలములో నిన్నే తలచుకుంటూ, నీమీద దిగులు చేత మరణించాడు. కాబట్టి నీవు జలతర్పణములు విడిస్తేగాని తండ్రిగారి ఆత్మశాంతించదు.” అనిఅన్నాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః (103) >>

Aranya Kanda Sarga 30 In Telugu – అరణ్యకాండ త్రింశః సర్గః

Aranya Kanda Sarga 30 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రింశః సర్గః (30వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రాముడు సువర్ణమృగాన్ని వెంబడించి, దాన్ని వేటాడిన తర్వాత, మృగం రూపంలో ఉన్న మారీచుడు తన అసలు రూపంలోకి మారి “హా సీత! హా లక్ష్మణ!” అని కేకలు వేస్తాడు. ఆ కేకలు విని సీత భయంతో లక్ష్మణుని రక్షణ కోసం రమ్మని వేడుకుంటుంది.

ఖరసంహారః

భిత్త్వా తు తాం గదాం బాణై రాఘవో ధర్మవత్సలః |
స్మయమానః ఖరం వాక్యం సంరబ్ధమిదమబ్రవీత్ ||

1

ఏతత్తే బలసర్వస్వం దర్శితం రాక్షసాధమ |
శక్తిహీనతరో మత్తో వృథా త్వమవగర్జసి ||

2

ఏషా బాణవినిర్భిన్నా గదా భూమితలం గతా |
అభిధానప్రగల్భస్య తవ ప్రత్యరిఘాతినీ ||

3

యత్త్వయోక్తం వినష్టానామహమశ్రుప్రమార్జనమ్ |
రాక్షసానాం కరోమీతి మిథ్యా తదపి తే వచః ||

4

నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్తస్య రక్షసః |
ప్రాణానపహరిష్యామి గరుత్మానమృతం యథా ||

5

అద్య తే ఛిన్నకంఠస్య ఫేనబుద్బుదభూషితమ్ |
విదారితస్య మద్బాణైర్మహీ పాస్యతి శోణితమ్ ||

6

పాంసురూషితసర్వాంగః స్రస్తన్యస్తభుజద్వయః |
స్వప్స్యసే గాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివ ||

7

ప్రవృద్ధనిద్రే శయితే త్వయి రాక్షసపాంసనే |
భవిష్యంత్యశరణ్యానాం శరణ్యా దండకా ఇమే ||

8

జనస్థానే హతస్థానే తవ రాక్షస మచ్ఛరైః |
నిర్భయా విచరిష్యంతి సర్వతో మునయో వనే ||

9

అద్య విప్రసరిష్యంతి రాక్షస్యో హతబాంధవాః |
బాష్పార్ద్రవదనా దీనా భయాదన్యభయావహాః ||

10

అద్య శోకరసజ్ఞాస్తాః భవిష్యంతి నిరర్థకాః |
అనురూపకులాః పత్న్యో యాసాం త్వం పతిరీదృశః ||

11

నృశంస నీచ క్షుద్రాత్మన్ నిత్యం బ్రాహ్మణకంటక |
యత్కృతే శంకితైరగ్నౌ మునిభిః పాత్యతే హవిః ||

12

తమేవమభిసంరబ్ధం బ్రువాణం రాఘవం రణే |
ఖరో నిర్భర్త్సయామాస రోషాత్ఖరతరస్వనః ||

13

దృఢం ఖల్వవలిప్తోసి భయేష్వపి చ నిర్భయః |
వాచ్యావాచ్యం తతో హి త్వం మృత్యువశ్యో న బుధ్యసే ||

14

కాలపాశపరిక్షిప్తా భవంతి పురుషా హి యే |
కార్యాకార్యం న జానంతి తే నిరస్తషడింద్రియాః ||

15

ఏవముక్త్వా తతో రామం సంరుధ్య భృకుటిం తతః |
స దదర్శ మహాసాలమవిదూరే నిశాచరః ||

16

రణే ప్రహరణస్యార్థే సర్వతో హ్యవలోకయన్ |
స తముత్పాటయామాస సందశ్య దశనచ్ఛదమ్ ||

17

తం సముత్క్షిప్య బాహుభ్యాం వినద్య చ మహాబలః |
రామముద్దిశ్య చిక్షేప హతస్త్వమితి చాబ్రవీత్ ||

18

తమాపతంతం బాణౌఘైశ్ఛిత్త్వా రామః ప్రతాపవాన్ |
రోషమాహారయత్తీవ్రం నిహంతుం సమరే ఖరమ్ ||

19

జాతస్వేదస్తతో రామో రోషాద్రక్తాంతలోచనః |
నిర్బిభేద సహస్రేణ బాణానాం సమరే ఖరమ్ ||

20

తస్య బాణాంతరాద్రక్తం బహు సుస్రావ ఫేనిలమ్ |
గిరేః ప్రస్రవణస్యేవ తోయధారాపరిస్రవః ||

21

విహలః స కృతో బాణైః ఖరో రామేణ సంయుగే |
మత్తో రుధిరగంధేన తమేవాభ్యద్రవద్ద్రుతమ్ ||

22

తమాపతంతం సంరబ్ధం కృతాస్త్రో రుధిరాప్లుతమ్ |
అపాసర్పత్ప్రతిపదం కించిత్త్వరితవిక్రమః ||

23

తతః పావకసంకాశం వధాయ సమరే శరమ్ |
ఖరస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివాపరమ్ ||

24

స తం దత్తం మఘవతా సురరాజేన ధీమతా |
సందధే చాపి ధర్మాత్మా ముమోచ చ ఖరం ప్రతి ||

25

స విముక్తో మహాబాణో నిర్ఘాతసమనిస్వనః |
రామేణ ధనురాయమ్య ఖరస్యోరసి చాపతత్ ||

26

స పపాత ఖరో భూమౌ దహ్యమానః శరాగ్నినా |
రుద్రేణేవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథాంతకః ||

27

స వృత్ర ఇవ వజ్రేణ ఫేనేన నముచిర్యథా |
బలో వేంద్రాశనిహతో నిపపాత హతః ఖరః ||

28

తతో రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయః |
సభాజ్య ముదితా రామమిదం వచనమబ్రువన్ ||

29

ఏతదర్థం మహాభాగ మహేంద్రః పాకశాసనః | [మహాతేజా]
శరభంగాశ్రమం పుణ్యమాజగామ పురందరః ||

30

ఆనీతస్త్వమిమం దేశముపాయేన మహర్షిభిః |
ఏషాం వధార్థం క్రూరాణాం రక్షసాం పాపకర్మణామ్ ||

31

తదిదం నః కృతం కార్యం త్వయా దశరథాత్మజ |
సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః ||

32

ఏతస్మిన్నంతరే దేవాశ్చారణైః సహ సంగతాః |
దుందుభీంశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః ||

33

రామస్యోపరి సంహృష్టా వవృషుర్విస్మితాస్తదా |
అర్ధాధికముహూర్తేన రామేణ నిశితైః శరైః ||

34

చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
ఖరదూషణముఖ్యానాం నిహతాని మహాహవే ||

35

అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః |
అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివ హి దృశ్యతే ||

36

ఇత్యేవముక్త్వా తే సర్వే యయుర్దేవా యథాగతమ్ |
ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణః సహ సీతయా ||

37

గిరిదుర్గాద్వినిష్క్రమ్య సంవివేశాశ్రమం సుఖీ |
తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభిః ||

38

ప్రవివేశాశ్రమం వీరో లక్ష్మణేనాభిపూజితః |
తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహమ్ ||

39

బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే |
ముదా పరమయా యుక్తా దృష్ట్వా రక్షోగణాన్హతాన్ |
రామం చైవావ్యథం దృష్ట్వా తుతోష జనకాత్మజా ||

40

తతస్తు తం రాక్షససంఘమర్దనం
సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః ||
పునః పరిష్వజ్య శశిప్రభాననా
బభూవ హృష్టా జనకాత్మజా తదా ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 30 Meaning In Telugu

రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు.

“ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ము అయినట్లే కదా!

దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను.

ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ, వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంక ఈ దండకారణ్యము విడిచిపోకతప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చేరోజు వచ్చింది.” అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచి ఖరుడు రాముడి బెదిరించడానికి పూనుకున్నాడు.

“ఓ రామా! నీవు అవివేకివే అనుకున్నాను. గర్విష్టివి కూడా. నీకు మహా గర్వము ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చేముందు సంధిప్రేలాపన లాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు.” అంటూ ఖరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూచాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాలవృక్షమును కూకటి వేళ్లతో పెకలించాడు. దానిని ఆయుధంగా ధరించి, “రామా! ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా!” అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదికి విసిరాడు.

రాముడు తన మీదికి అత్యంత వేగంతో దూసుకువస్తున్న సాలవృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు వేయి బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి ఖరుని శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. ఖరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరం అంతా నెత్తురు కారుతుండగా ఖరుడు రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. ఖరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము ఖరుని గుండెలను చీల్చింది. ఖరుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడ్డాడు. ఖరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడ అయింది.

ఆ దృశ్యమును చూచిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రాముని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు. “దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్లాడట. ఈ ఖరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముని ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చారట. ఇంక దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు.” అని అనుకొన్నారు. అంతట దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు. రాముని మీద పుష్పవర్షము కురిపించారు.

రాముడికి, ఖరునికి, దూషణునికి, 14,000 మంది రాక్షసులకు జరిగిన యుద్ధము దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలము జరిగింది. (ముహూర్తము అనగా 48 నిమిషములు. అనగా ఒక గంటా పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.

రామునికి రాక్షసులకు మధ్యయుద్ధము ముగిసింది అని తెలుసుకొన్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు. రాముని తో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు.

పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందన పూర్వకంగా కౌగలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత. రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Aranya Kanda Sarga 29 In Telugu – అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః

Aranya Kanda Sarga 29 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రావణుడు మారీచుడిని సీతను అపహరించడానికి సహాయం చేయమని కోరుతాడు. మొదట మారీచుడు, రాముడి శక్తి గురించి తెలుసు కావున, ఈ పని చేయవద్దని రావణుడిని హెచ్చరిస్తాడు. కానీ, రావణుడు అతన్ని బలవంతం చేసి, రాముడు మరియు లక్ష్మణులను వలలో పడేసే పథకాన్ని తయారు చేస్తాడు.

ఖరగదాభేదనమ్

ఖరం తు విరథం రామో గదాపాణిమవస్థితమ్ |
మృదుపూర్వం మహాతేజాః పరుషం వాక్యమబ్రవీత్ ||

1

గజాశ్వరథసంబాధే బలే మహతి తిష్ఠతా |
కృతం సుదారుణం కర్మ సర్వలోకజుగుప్సితమ్ ||

2

ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్ |
త్రయాణామపి లోకానామీశ్వరోపి న తిష్ఠతి ||

3

కర్మ లోకవిరుద్ధం తు కుర్వాణం క్షణదాచర |
తీక్ష్ణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతమ్ ||

4

లోభాత్పాపాని కుర్వాణః కామాద్వా యో న బుధ్యతే |
భ్రష్టాః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివ ||

5

వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః |
కింను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస ||

6

న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః |
ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠంతి శీర్ణమూలా ఇవ ద్రుమాః ||

7

అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః |
ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివార్తవమ్ ||

8

న చిరాత్ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలమ్ |
సవిషాణామివాన్నానాం భుక్తానాం క్షణదాచర ||

9

పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్ఛతామ్ |
అహమాసాదితో రాజ్ఞా ప్రాణాన్ హంతుం నిశాచర ||

10

అద్య హి త్వాం మయా ముక్తాః శరాః కాంచనభూషణాః |
విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః ||

11

యే త్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః |
తానద్య నిహతః సంఖ్యే ససైన్యోఽనుగమిష్యసి ||

12

అద్య త్వాం విహతం బాణైః పశ్యంతు పరమర్షయః |
నిరయస్థం విమానస్థా యే త్వయా హింసితాః పురా ||

13

ప్రహర త్వం యథాకామం కురు యత్నం కులాధమ |
అద్య తే పాతయిష్యామి శిరస్తాలఫలం యథా ||

14

ఏవముక్తస్తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః |
ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః ||

15

ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ |
ఆత్మనా కథమాత్మానమప్రశస్యం ప్రశంససి ||

16

విక్రాంతా బలవంతో వా యే భవంతి నరర్షభాః |
కథయంతి న తే కించిత్తేజసా స్వేన గర్వితాః ||

17

ప్రాకృతాస్త్వకృతాత్మానో లోకే క్షత్రియపాంసనాః |
నిరర్థకం వికత్థంతే యథా రామ వికత్థసే ||

18

కులం వ్యపదిశన్వీరః సమరే కోఽభిధాస్యతి |
మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవే స్తవమ్ ||

19

సర్వథైవ లఘుత్వం తే కత్థనేన విదర్శితమ్ |
సువర్ణప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నినా ||

20

న తు మామిహ తిష్ఠంతం పశ్యసి త్వం గదాధరమ్ |
ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితమ్ ||

21

పర్యాప్తోఽహం గదాపాణిర్హంతుం ప్రాణాన్రణే తవ |
త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతకః ||

22

కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి న త్వహమ్ |
అస్తం గచ్ఛేద్ధి సవితా యుద్ధవిఘ్నస్తతో భవేత్ ||

23

చతుర్దశ సహస్రాణి రాక్షసానాం హతాని తే |
త్వద్వినాశాత్కరోమ్యేష తేషామస్రప్రమార్జనమ్ ||

24

ఇత్యుక్త్వా పరమక్రుద్ధస్తాం గదాం పరమాంగదః |
ఖరశ్చిక్షేప రామాయ ప్రదీప్తామశనిం యథా ||

25

ఖరబాహుప్రముక్తా సా ప్రదీప్తా మహతీ గదా |
భస్మ వృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాఽగాత్తత్సమీపతః ||

26

తామాపతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదామ్ |
అంతరిక్షగతాం రామశ్చిచ్ఛేద బహుధా శరైః ||

27

సా వికీర్ణా శరైర్భగ్నా పపాత ధరణీతలే |
గదా మంత్రౌషధబలైర్వ్యాలీవ వినిపాతితా ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 29 Meaning In Telugu

ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు.

ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు.

నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో, పాపపు పనులుచేస్తే, ఆ పాపఫలము కూడా వెంటనే కట్టికుడుపుతుంది. దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యములో ఉన్న ఋషులు, మునులు నన్ను ఆశ్రయించారు. అందుకే నేను దుష్టుడవైన నిన్ను చంపుతున్నాను. ఓ ఖరుడా! ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యములో ఉన్న మునులను, ఋషులను ఎలా యమపురికి పంపారో, అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు. నీవు చంపిన మునులందరూ స్వర్గ ద్వారముల వద్ద నిలబడి, నువ్వు నరకానికి పోవడం కళ్లారా చూస్తారు. ఓ దురాత్ముడా! కాచుకో! ఒకే ఒక్క బాణంతో నీ తల తాటి పండు మాదిరి నేల మీద దొర్లుతుంది.” అని తన ధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు.

రాముని సూటి పోటీ మాటలు విన్న ఖరుడు అవమాన భారంతో కోపంతో రగిలిపోయాడు. “ఓ రామా! ఇదేంటి! నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నా సైన్యము నశించినా నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే నన్ను గెల్చానని గర్వపడుతున్నావు. నిన్ను నీవే అభినందించుకుంటున్నావు.

నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.

రామా! నీకు మృత్యువు ఆసన్నమయింది. ముందు అది తెలుసుకో. నిన్ను అభినందించుకోడం మానుకో! లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు. నీ ఎదుట పాశమును చేత ధరించిన కాల యముడి వలె గదాయుధమును ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా! జీవులు యముని కాలపాశమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు.

ఓ రామా! ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి. కానీ సూర్యాస్తమయము కాబోతోంది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా! అందుకని చెప్పడం లేదు. నీవు నా సేనలను 14,000 మందిని మట్టుబెట్టావు. ఈ రోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధు మిత్రుల కన్నీళ్లు తుడుస్తాను.”

ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముని మీదికి విసిరాడు. రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేసాడు. ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేలమీద పడ్డాయి.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రింశః సర్గః (30) >>

Aranya Kanda Sarga 28 In Telugu – అరణ్యకాండ అష్టావింశః సర్గః

Aranya Kanda Sarga 28 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టావింశః సర్గ (28వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, శూర్పణఖా రాముడు మరియు లక్ష్మణుని చేత అవమానింపబడిన తర్వాత తన అన్న రావణుడిని కలుస్తుంది. ఆమె రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి వివరించి, తనపై జరిగిన దాడిని చెప్పుతుంది. సీత యొక్క అపూర్వ సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆమెను కిడ్నాప్ చేయమని పెల్లుబికుతుంది.

ఖరరామసంప్రహారః

నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ |
ఖరస్యాప్యభవత్రాసో దృష్ట్వా రామస్య విక్రమమ్ ||

1

స దృష్ట్వా రాక్షసం సైన్యమవిషహ్యం మహాబలః |
హతమేకేన రామేణ త్రిశిరోదూషణావపి ||

2

తద్బలం హతభూయిష్ఠం విమనాః ప్రేక్ష్య రాక్షసః |
ఆససాద ఖరో రామం నముచిర్వాసవం యథా ||

3

వికృష్య బలవచ్చాపం నారాచాన్రక్తభోజనాన్ |
ఖరశ్చిక్షేప రామాయ క్రుద్ధానాశీవిషానివ ||

4

జ్యాం విధున్వన్ సుబహుశః శిక్షయాఽస్త్రాణి దర్శయన్ |
చకార సమరే మార్గాన్ శరై రథగతః ఖరః ||

5

స సర్వాశ్చ దిశో బాణైః ప్రదిశశ్చ మహారథః |
పూరయామాస తం దృష్ట్వా రామోఽపి సుమహద్ధనుః ||

6

స సాయకైర్దుర్విషహైః సస్ఫులింగైరివాగ్నిభిః |
నభశ్చకారావివరం పర్జన్య ఇవ వృష్టిభిః ||

7

తద్బభూవ శితైర్బాణైః ఖరరామవిసర్జితైః |
పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకులమ్ ||

8

శరజాలావృతః సూర్యో న తదా స్మ ప్రకాశతే |
అన్యోన్యవధసంరంభాదుభయోః సంప్రయుధ్యతోః ||

9

తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
ఆజఘాన ఖరో రామం తోత్రైరివ మహాద్విపమ్ ||

10

తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితమ్ |
దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకమ్ ||

11

హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితమ్ |
పరిశ్రాంతం మహాసత్త్వం మేనే రామం ఖరస్తదా ||

12

తం సింహమివ విక్రాంతం సింహవిక్రాంతగామినమ్ |
దృష్ట్వా నోద్విజతే రామః సింహః క్షుద్రమృగం యథా ||

13

తతః సూర్యనికాశేన రథేన మహతా ఖరః |
ఆససాద రణే రామం పతంగ ఇవ పావకమ్ ||

14

తతోఽస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః |
ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవమ్ ||

15

స పునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి |
నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశనిసమప్రభాన్ ||

16

తతస్తత్ప్రహతం బాణైః ఖరముక్తైః సుపర్వభిః |
పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః ||

17

తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసమ్ |
అర్దయిత్వా మహానాదం ననాద సమేరే ఖరః ||

18

స శరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః |
రరాజ సమరే రామో విధూమోఽగ్నిరివ జ్వలన్ ||

19

తతో గంభీరనిర్హ్రాదం రామః శత్రునిబర్హణః |
చకారాంతాయ స రిపోః సజ్యమన్యన్మహద్ధనుః ||

20

సుమహద్వైష్ణవం యత్తదతిసృష్టం మహర్షిణా |
వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత ||

21

తతః కనకపుంఖైస్తు శరైః సన్నతపర్వభిః |
బిభేద రామః సంక్రుద్ధః ఖరస్య సమరే ధ్వజమ్ ||

22

స దర్శనీయో బహుధా వికీర్ణః కాంచనధ్వజః |
జగామ ధరణీం సూర్యో దేవతానామివాజ్ఞయా ||

23

తం చతుర్భిః ఖరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గణైః |
వివ్యాధ యుధి మర్మజ్ఞో మాతంగమివ తోమరైః ||

24

స రామో బహుభిర్బాణైః ఖరకార్ముకనిఃసృతైః |
విద్ధో రుధిరసిక్తాంగో బభూవ రుషితో భృశమ్ ||

25

స ధనుర్ధన్వినాం శ్రేష్ఠః ప్రగృహ్య పరమాహవే |
ముమోచ పరమేష్వాసః షట్ శరానభిలక్షితాన్ ||

26

శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోరథార్దయత్ |
త్రిభిశ్చంద్రార్ధవక్త్రైశ్చ వక్షస్యభిజఘాన హ ||

27

తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ భాస్కరోపమాన్ |
జిఘాంసూ రాక్షసం క్రుద్ధస్త్రయోదశ సమాదదే ||

28

తతోఽస్య యుగమేకేన చతుర్భిశ్చతురో హయాన్ |
షష్ఠేన తు శిరః సంఖ్యే ఖరస్య రథసారథేః ||

29

త్రిభిస్త్రివేణుం బలవాన్ ద్వాభ్యామక్షం మహాబలః |
ద్వాదశేన తు బాణేన ఖరస్య సశరం ధనుః ||

30

ఛిత్త్వా వజ్రనికాశేన రాఘవః ప్రహసన్నివ |
త్రయోదశేనేంద్రసమో బిభేద సమరే ఖరమ్ ||

31

ప్రభగ్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః |
గదాపాణిరవప్లుత్య తస్థౌ భూమౌ ఖరస్తదా ||

32

తత్కర్మ రామస్య మహారథస్య
సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ |
అపూజయన్ ప్రాంజలయః ప్రహృష్టా-
-స్తదా విమానాగ్రగతాః సమేతాః ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే అరణ్యకాండే అష్టావింశః సర్గః ||

Aranya Kanda Sarga 28 Meaning In Telugu PDF

రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు.

ఖరుడు రాముని మీద నారాచములను (ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు.

రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు.

అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకొన్నాడు. ఖరుడు. కాని రామునిముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు. పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఖరునికి తెలియదు.

ఖరుడు రాముని ధనుస్సును సగ భాగంలో విరగగొట్టాడు. మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు. రాముని కవచము విరిగి నేలమీద పడింది. అదే అవకాశముగా, ఖరుడు రాముని శరీరం అంతా బాణములతో కొట్టాడు. విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. రాముడు వెంటనే తనకు అగస్త్యమహాముని ఇచ్చిన వైష్ణవ ధనుస్సుకు నారి బిగించి సంధించాడు. ముందు ఖరుని ధ్వజమును కూల్చాడు. అది చూచిన ఖరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది.

రాముని కోపము కట్టలు తెంచుకుంది. ఒక బాణముతో ఖరుని శిరస్సును, రెండు బాణములతో ఖరుని రెండు చేతులను, మూడు అర్థచంద్రాకారపు బాణములతో ఖరుని వక్షస్థలమును కొట్టాడు. ఎలాగైనా ఖరుని చంపాలని నిశ్చయించుకొన్న రాముడు ఖరుని మీద తీవ్రమైన 13 నారాచములను ప్రయోగించాడు. అందులో ఒక బాణముతో ఖరుని రథము యొక్క నొగలను, నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను, ఒక బాణముతో రథ సారథిని, మూడు బాణములతో రధం ముందు భాగమును, రెండు బాణములతో ఖరుని రథము ఇరుసులను, ఒక బాణముతో ఖరుని కంఠమును కొట్టాడు. ఇలా 13 బాణములతో ఖరుని ఆపాదమస్తకము కొట్టాడు రాముడు.

ఖరునికి రథము విరిగిపోయింది. సారథి చచ్చాడు. రథానికి కట్టిన గుర్రాలు నేలకూలాయి. విల్లు విరిగిపోయింది. చేసేది లేక ఖరుడు తన గదను తీసుకొని నేలమీదికి దూకాడు. ఖరుని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలలో నిలబడి చూస్తున్న దేవతాసమూహములు రాముని అభినందించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Ayodhya Kanda Sarga 101 In Telugu – అయోధ్యాకాండ ఏకాధికశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 101 In Telugu

అయోధ్యకాండ సర్గ 101″ రామాయణం లో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు కైకేయి మాట మేరకు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటించి అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. లక్ష్మణుడు మరియు సీతా ఆయనతో పాటు రావడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో, అయోధ్య నగరం దుఃఖంలో మునిగిపోతుంది. ప్రజలు రాముడు వెళ్లిపోతుండడాన్ని చూడలేక బాధపడతారు. రాముడు తన తల్లి కౌసల్య, సుమిత్రా, మరియు ఇతర పెద్దలను వీడిపోతాడు. ఆ తరువాత, రథం పై అరణ్యవాసం వైపు పయనమవుతాడు. ఈ సర్గలో రాముడి ధర్మనిష్ట, పితృవాక్యపారిపాలనం, మరియు కుటుంబ పట్ల అతని ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి.

పితృదిష్టాంతశ్రవణమ్

రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచ హ |
కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యతి || ౧ ||

శాశ్వతోఽయం సదా ధర్మః స్థితోఽస్మాసు నరర్షభ |
జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్న కనీయాన్ నృపో భవేత్ || ౨ ||

స సమృద్ధాం మయా సార్ధమయోధ్యాం గచ్ఛ రాఘవ |
అభిషేచయ చాత్మానం కులస్యాస్య భవాయ నః || ౩ ||

రాజానం మానుషం ప్రాహుర్దేవత్వే స మతో మమ |
యస్య ధర్మార్థసహితం వృత్తమాహురమానుషమ్ || ౪ ||

కేకయస్థే చ మయి తు త్వయి చారణ్యమాశ్రితే |
దివమార్యో గతో రాజా యాయజూకః సతాం మతః || ౫ ||

నిష్క్రాంతమాత్రే భవతి సహసీతే సలక్ష్మణే |
దుఃఖశోకాభిభూతస్తు రాజా త్రిదివమభ్యగాత్ || ౬ ||

ఉత్తిష్ఠ పురుషవ్యాఘ్ర క్రియతాముదకం పితుః |
అహం చాయం చ శత్రుఘ్నః పూర్వమేవ కృతోదకౌ || ౭ ||

ప్రియేణ ఖలు దత్తం హి పితృలోకేషు రాఘవ |
అక్షయ్యం భవతీత్యాహుర్భవాంశ్చైవ పితుః ప్రియః || ౮ ||

త్వామేవ శోచంస్తవ దర్శనేప్సుః
త్వయ్యేవ సక్తామనివర్త్య బుద్ధిమ్ |
త్వయా విహీనస్తవ శోకరుగ్ణః
త్వాం సంస్మరన్నస్తమితః పితా తే || ౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాధికశతతమః సర్గః || ౧౦౧ ||

Ayodhya Kanda Sarga 101 Meaning In Telugu

భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?” అని అడిగాడు.

దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు.

రామా! మనవంశాచారము నీకు తెలుసు. మన వంశములో పెద్దవాడికే రాజ్యాభిషేకము జరుగుతుంది. ఇది అనువంశికంగా వస్తున్న ఆచారము. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడివి కావడం ధర్మమే కాని అధర్మము కాదు. నీ రాక కొరకు అయోధ్య ఎదురుచూస్తూ ఉంది. నేను, శత్రుఘ్నుడు, మన మంత్రులు అందరూ శిరస్సువంచి నీకు నమస్కారము చేస్తున్నాము. మామాట మన్నించు. వంశాచారమును మన్నించు. పెద్దల ఆచారములను గౌరవించు.” అనిచెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు భరతుడు.

రాముడు భరతుని కౌగలించుకొని అనునయించాడు. “ఓ భరతా! కులీనుడు, సత్త్వసంపన్నుడు, తేజస్వి, ధృడనిశ్చయము కలవాడు ఎవరైనా తుచ్ఛమైన రాజ్యము కోసరం మాట తప్పుతాడా! నేనూ అంతే. భరతా! నీవు చిన్నవాడవు. నీవు అనవసరంగా నీ తల్లిని దూషిస్తున్నావు. తప్పు. నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసింది కానీ వేరుకాదు.

పెద్దలకు భార్యను, పుత్రులను, శాసించే అధికారము ఉంది. ఆ అధికారం తోనే దశరథుడు నాకు నార చీరలు కట్టబెట్టి అరణ్యానికి పంపాడు. నేను ఆయన ఆదేశము పాటించాలి. నేను నా తండ్రి యందు ఎలాంటి గౌరవము చూపిస్తున్నానో, నీవు నీ తల్లి పట్ల అంత గౌరవము చూపించు. నీ తల్లి తనస్వార్థము కోసరం ఇదంతా చేయలేదు. కేవలం నీకోసరమే చేసింది. నీ తల్లి కూడా నా తల్లితో సమానము. నా తల్లి కైక, నా తండ్రి దశరథుడు నన్ను అడవులకు వెళ్లమన్నారు. నేను అడవులకు వచ్చాను. ఇంతకన్నా వేరు విధంగా నేను ఎలా చేయగలను? తల్లి తండ్రుల మాట నాకు శిరోధార్యము కదా!

నా తరువాత రాజ్యమునకు అర్హుడవు నీవు. అందుకని నీవు రాజ్యము చేయవలెను. నేను అరణ్యములలో ఉండవలెను. నా తండ్రి దశరథుడు పదిమంది ఎదుట ఈవిధంగా భాగపంపకములు చేసాడు. నీకు రాజ్యము ఇచ్చాడు. నాకు 14 ఏళ్లు వనవాసము ఇచ్చాడు. దీనిని మనము పాటించాలి. ఇప్పుడు మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు. ఆయన లేడు కదా అని మనకు ఆయన మాటను వమ్ముచేయలేము కదా!కాబట్టి నేను రాజ్యాభిషిక్తుని కాలేను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః (102) >>