Parvathi Vallabha Neelakanta Ashtakam In Telugu – పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Parvati Vallabha Neelakanta Ashtakam Lyrics

పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్

నమో భూతనాథం నమో దేవ దేవం
నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

1

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

2

శ్మశానం శయానం మహానంతవాసం
శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

3

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం
గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

4

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం
బృహద్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

5

కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

6

ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధారానిర్థరం సంస్థితం హ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప సవ్యం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

7

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

8

సదా భావనాథ స్సదా సేవ్యమానం
సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

మరిన్ని అష్టకములు

Leave a Comment