Sai Bratuku Batalu In Telugu – సాయి బ్రతుకు బాటలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి బ్రతుకు బాటలు గురించి తెలుసుకుందాం…

Sai Bratuku Batalu Telugu

సాయి బ్రతుకు బాటలు

లక్ష్య సాధనతో విద్య లక్షితముగ
తలచిన గురిని సాధించ వలయు నెపుడు
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి

1

నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు
కొండ తోను పందెము గాసి కుప్పగూలు
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి

2

నీవు పెంచిన తోటకు నీరు లేక
కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె
ముళ్ళతో నిండె నీ వనములిట నేరి
వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి

3

తెల్లనగు కాగితాలపై నల్ల రాత
జీవితమ్మన రంగు పేజీలు గావు
నడుమ వచ్చిన అమృతంపు నాణ్యతయును
వ్యర్థమే కాద యోచింపవలయు సాయి

4

సాగ నది వోలె జీవిక సాగి పోవ
మధ్యలో దూరు మాయని మచ్చ ఝరులు
మాటి మాటికి మాయచే మరియు మారె
మాయ వల నుండి కాపాడు మమ్ము సాయి

5

నడిమి సంద్రము నందున్న నావ మేము
మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు
కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు
అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి.

6

ఆపి ఏ రాగ మనెద నేను
ఆకలియను నీ రాగమునాలపించ
ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ
కాటికేగెడు ముసలి రాగమిది సాయి

7

విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు
తాను ముందనుచు జనుడు తలచునెపుడు
సకల జీవులన్ని తెలివి చాలవనెడు
మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి

8

కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట
అలమటించు చుండెను దేవ ఆలకించు
ఆకలి కలి పిశాచమై అరయు చుండ
ఆపకుండ నీ కరుణను చూపు సాయి

9

చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి
అక్షరముల తోడనె లోకమంత వెలుగు
చిలుకరించెడు గురువులు చేరు సాయి

10

కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి
పదములన్నియు నొకటిగా పదిల పరచి
నీతి విలువ చాటుచు అవినీతినణచి
చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి

11

ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని
చేత గాని వారిని చేసి చిదిమివేయ
ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి

12

ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక
అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇప్పుడు
ముందు చూడు నీయాలయ మందు చూడు
వరుస గూర్చుండిరీ ముష్టి వారు సాయి

13

పనుకు బట్టెను ఫలములు పసరు లేక
పాహియనుచిల దరి చేరె పసరు కోరి
కనికరమ్మును పూనుచు గాంచవయ్య
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి

14

ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న
నీడ పట్టు కుదురుగ నిలిచి యుండు
మగని బ్రతుకును వలచిన మగువతీరు
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి

15

తెలివి యున్నను జనులకు తెల్ల మొహము
చదువులెన్ని యున్నను వీరి చవట బుద్ధి
విందు ముందరున్నను రుచి విధమెరుగదు
నీవు మార్చగ ఇటు రమ్ము నియతి సాయి

16

పల్లె పల్లె నీరాకకై పరితపించె
వానదేవుడ కరుణించి వరములిమ్ము
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి
మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి

17

ఒక్క చినుకైన రాదేమి ఓర్మి గూర్చ
ధరణి తల్లికి కానని దాహ మయ్యె
మేఘునకు నెట్టి మబ్బులు మేళ వించ
యిట్టి పగబూనుచు అలిగె నేమి సాయి

18

ధాన్యరాసులు కాలము దారి మరిచి
ఆకలి కడుపులన్నియు అధిక మయ్యె
రాజ్య పదవులేమియు కానరావు ధరణి
నీవు దిగిరాగ నేమిత్తు నిజము సాయి.

19

ఆశయనెడు మూటతొ వచ్చే అవని తల్లి
అలసి పోయెను ఈ భారమంత మోసి
భాగ్య మెంతున్న బాధల బరువు పెరిగె
భారములు దించ రావయ్య భవ్య సాయి.

20

చల్లనైన కరుణ చూపు శాంత మూర్తి
చెదిరి పోతున్న బ్రతుకుల చింత దీర్చి
లోకమంతను నీ ప్రేమలోన నిలిపి
మా మదికి రాజువై యేలు మహిత సాయి

21

మరిన్ని భక్తి గీతాలు

Leave a Comment