Sai! Yerchi Kurchi Perchitini… ! In Telugu | సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… !

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… ! గీతం గురించి తెలుసుకుందాం…

Sai! Yerchi Kurchi Perchitini… !

సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… !

ధరణి నీ కాంతి సోకగ ధన్యమయ్యె
కలి అహము బూడిదయ్యె నీ కాలు తాకి
మూర్ఖ బుద్ధులు నిను చూసి మూగవోయె
మంచి వెలుగొందె నీ స్పర్శ మహిమ సాయి

1

ఏమిటయ్య నీ మాయకు ఏది అంతు
రాజ్య భోగాలు లేనట్టి రాజు వీవు
సిరులు గిరులెన్నొ యుండిన శివుని వీవె
విశ్వమంత నీదే ఏమి వింత సాయి

2

అలమటించు మా తోడ నీ వలగనేల
ఆదుకొను నాథుడవు నీకు నలుగ తగదు
లోకముల నేలు దొరవు నీలోన జగతి
నిండియుండెను ఇలనీవు నిలువు సాయి

3

అలమటించు వారల నంత అక్కు చేర్చు
దిక్కు లేని వారందరి దిక్కు నీవు
ఆకలి కడుపులన్నింటి నాలకించి
అందరిని దరిచేర్చుకో వయ్య సాయి.

4

పచ్చదనపు పసిడి నేల పాయలందు
కాలకూట విషమదేదొ కలిసినేమొ
సిరులు విరియు చోటున రాళ్ళు చిందుచుండ
నీదు మహిమ దెల్పగ వచ్చి నిలువు సాయి

5

చెలిమి ముందు చెదిరిపోవు చీకటైన
సూర్య చంద్రుల చెలిమితో చూడ ధరణి
మంచి చెలిమితో నీవుండి మహిమ చూపు
చెదరనీయకు నీదైన చెలిమి సాయి

6

నీవు చేసిన లీలలు నీవు గాంచు
అన్నదమ్ముల పోరు ఈ అవని లోన
పాలి పగలాయె నిచ్చట పాము వోలె
విలువ మరచి జనము గక్క విషము సాయి

7

మాన్యుడ మహనీయుడవని మనముతోడ
కోటి కోటి దండంబుల కొలుచు చుంటి
మధ్యముడనైతి నేను నా మతిని గాంచు
కొలుచు కొనుచు గొప్పను చాటు కొందు సాయి

8

కులము లేదు మతము లేదు కుట్ర లేమి
పంతములును నీ చెంతన పట్టవోయి
మాయ జగతికి నీ మహిమలను దెల్పి
మానవతను పెంచితివి ఈ మహిన సాయి

9

రాముడవు నీవు ఏసు రహీము నీవు
ఏ విధముగ పిలిచిన మా యెదను చేరు
మమ్ము గన్న తండ్రివి నీవు మమ్ము గాంచు
మనుచు జీవులు తలప రావయ్య సాయి.

10

చిన్ననాటివౌ ఆటలు చిందు మరచె
చెలిమి చేయ ఆనాటి రోజేమి లేదు
మరల బాల్య మొకటి యున్న మాదుహృదిని
రాని బాల్యపుసిరి చూపరమ్ము సాయి

11

వయసు రేపిన బాసతో వరుస గలిపి
వావి వరుసల నెల్లను వదిలి నారు
వెళ్లి తనముల పోగొట్టి వింత జూపి
జనుల మార్చగ బూనుము సాధు సాయి

12

అవనికే భారతావని అందమగుచు
కుల మతాల భిన్నత్వాన కుదిరి పొత్తు
ఐకమత్యమే సౌఖ్యమ్ము ఐన దిచట
మూడు వర్ణాల ధ్వజముగా మురియ సాయి

13

తోటలో పూలు నిను చేర తొందరపడి
కోర్కెతో నన్ను చూసి పక్కునను విరిసె
పువ్వులెన్ని కోసిన నింక పూలు మిగిలె
పువ్వు వదలక మెడలోన పొదుగు సాయి

14

తల్లిదండ్రుల వోలెను తనువు నిచ్చి
వెలుగు పంచెడి గురువుగా వెలసి నావు
లోకముల నేలు నీకు నా లోగిలంత
యిచ్చి యుంటి కాదన బోకు మెపుడు సాయి

15

పొత్తు కుదురునే పదముల పొగడ నిన్ను
నాదు బ్రతుకెంత నీ ముందు నాదు తండ్రి
నా తరంబే పలుకగ నీ నామమైన
నీదు కాలి ధూళినవను నేను సాయి

16

నీదు కరుణయే తోడుగ నిలువ నాకు
రచనయే రాని వాడను రాయ పూని
శతక మాలిక నల్లితి శరణు కోరి
ఇటకు విచ్చేసి గైకొని యేలు సాయి

17

మరిన్ని భక్తి గీతాలు

Leave a Comment