Dharmagnyah In Telugu – ధర్మజ్ఞః

Dharmagnyah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ.

ధర్మజ్ఞః

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్నవాడై శ్రీ రామ చంద్పుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్పులతో వచ్చి ఆకాశమార్నాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్తీవుని “మిత్రమా! నీ అభిషప్పాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ముడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టము. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలళాలి. సాయుధులైన నలుగురు మంత్పులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్చేశ్యం”.

స్మితపూర్వభాషి అయిన శ్రీ రాముడు ఇట్టు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్సిన బోయవాడు ఆర్హుడైవచ్చినప్పుడు ఆకపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్పార్భించుచు శ్రణుజొచ్చిన శత్తువునైనా చంపకూడదు. సజ్బనుడు తన ప్పాణాలసైతం ఇచ్చి శరణార్చి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్పాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే సితిలోనున్నను ఏ ఉద్చేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎజుగని ధర్మజ్నతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర, మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్‌. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన ప్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట
  2. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్వౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జీ జీ లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్స మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపజుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
  3. “ద్హాపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషము

శ్రీ స్కాంద పురాణము లోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ స్కాంద పురాణము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము.

ఆశ్రయ పరిత్యాగ దోషము

ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొజకు తీర్భయాత్రులకు బయలుదేరారు. అట్ని మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్తాలు తీర్ధాలు ఉన్న మన భారతదేశం ధన్యము. అట్బి అమ్మ కడుపున పుట్సిన మనము ధన్యులము.

మహదానందంతో వారెన్నో తీర్ధాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొజ్బలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్దాది దేవతలు “ఓ శుకవరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది

“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్స ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి తీదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.

ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్దోహం చేయలేదు. తల్శిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూనుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్నానం కలిగింది”.

చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకము బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు. తీర్భయాత్రులు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్పాప్తించింది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్నిన నేలతల్సిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్టు త్యజించినవాడు కృతఘ్నుడొతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్న వారందరితో కృతజ్నతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dilipa Maharaju Katha In Telugu – దిలీప మహారాజు కథ | శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీకాళిదాసకృత రఘువంశం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దిలీప మహారాజు కథ.

దిలీప మహారాజు కథ

రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సదురు దర్శనం కోసం వసిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపజచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ముల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేపేంద్రులోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి.

ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు బుతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేళావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!

అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.

చేసిన తప్పును సరిదిద్భుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటక్టై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.

ఇలా వసిష్కులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్పారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది.

త్పుటిలో ఒక సింహం ఆ పోోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్చాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్తపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్నపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను.

నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. సేను నికుంభ మిత్తుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్పాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్టాంతాలకి వచ్చే ఏ మృగానై్వైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.

“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నపే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కాంచెం కుదుటపడ్డాడు. “భగవత్‌ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్పితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్బరికీ శ్రీేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.

ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్తాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్సిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్బి అపకీర్తి రాదు.

గురుద్దోహం అంటదు” అని అన్నాడు దిలీఫుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ‘క్ష్తతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుజుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న
ప్పాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్పార్భన మన్నించు” అని అన్నాడు.

ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్చిద్నామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుజు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ట మహర్షి తపళ్ళక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిదామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.

అప్పుడు ధర్మజ్నడైన దిలీపుడిలా అన్నాడు “తల్సీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలక్టై ఎదుజు చూస్తుంది. మహర్షులు యజ్నార్భము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆజోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్తునిగా పొందినాడు దిలీపుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్బనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
  2. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్పాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
  3. దూడ త్తాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్భి మనకు అవగతమైనది. ఇట ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథ

శివాజీ వీరగాధలలోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శివాజీ వీరగాధలలోని కథ నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ.

హీరాకానీ

దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మజిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్టించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్పాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయతత్త్వాన్ని బాగా జీర్మించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేళాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.

శివాజీ రాయగథ్‌ కోట శత్తువులకు అభేద్యంగా కట్పుదిట్పంగా ఉండేది. ప్ప్రొద్దున ఆజింటికి తెజీచిన కోట తలుపులు రాత్రి, తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్న. రాజ్య రక్షణార్భం ఇట్సి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్సి పరిస్ఫితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెజవబడదు.

హీరాకానీ అనే గ్యామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందథికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.

కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్మ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్సో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్బ మేము మీఅలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్హోనే పడుకో. ఉదయం ఆయజుకాగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊలఅడించినారు.

మణునాడు ప్పొద్భురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమజచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్బ హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి ప్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్తీ అభేద్యమైన కోట అర్బరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్పితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.

ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలక్రై ఏడుస్తున్న నా బిడ్మడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్పలూ తుప్పలూ ఆ నడిరాత్తి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్న ఒక్కడే నాకు జ్నప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్పార్భించింది హీరాకానీ.

శత్తువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందజూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ
    అందజీముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.
  2. తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్భిని మనకు నేర్చింది హీరాకానీ.
  3. ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్నను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ – నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ.

ప్రవరాఖ్యుని కథ

అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ్బాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్చయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్శగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు.

భార్యాపిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషిచడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్భయాత్రలకి వెళ్ళాలేకపోయేవాడు. తీర్భయాత్రులు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్తా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు చాలా తీర్భయాత్తులు చేసిన సిద్భుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్భుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్భయాత్రులు చేశాడని తెలుసుకోని ప్రవరడు “స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్శక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్చయాత్రులు చేసే ఉపాయముబోధించండి” అని ప్పార్భించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్భుడిలా అన్నాడు.

“నాయనా. ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్భులు శక్తులు సంపేదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్భయాత్రులకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”. మహదానందముతో ఆ పసరును ఆ సిద్భుని వదృనుండి స్వీకరీంచాడు ప్రవరుడు.

మణునాడు ప్రవరుడు ఇంటనున్న తల్సిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టానాలు పూర్తి చేసుకుని అందఠి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర, క్షేత్రాలు సుందర తీర్భప్రదేశాలు చూడాలని బయలుదేరాడు.

ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్శించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి అేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్చామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు.

“ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్సిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్గాంగినీ తలుచుకుని బాధపడ్డాడు. “ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్త్సాలు నిత్యానుష్థానాలు చేయలేని ఈ దుస్ఫితి ఎవరికీ రాకూడదు” అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు.

ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్థానాలు చేయలేక పోతానేమో అన్న దంఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్భని జీవితం వ్యర్భం అనిపించింది ప్రువరుడికి.

“ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్టానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్బాంతిచెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్టానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి “నేసే కనక నిత్యానుష్థాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మణుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్టానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపజచాడు ప్రవరుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా?
  2. గృహసన్ఫ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్శన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి బుషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు.
  3. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్సించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు పునకు మార్గదర్శి.

మరిన్ని నీతికథలు మీకోసం: