Sri Rama Raksha Sthotram In Telugu | శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీరామరక్షా స్తోత్రం ఓ మనోవైజ్ఞానికమైన ఓషధి, ఇందులో మానసిక రోగాలన్నీ దూరమై అలౌకిక మగు శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయి. ఈ క్రింది విదంగా వర్ణించబడింది…

Sri Rama Raksha Sthotram In Telugu

శ్రీ రామ రక్షా స్తోత్రం

హద్దులు మీరి మీరు భయపడుతూన్నప్పుడు అశాంతి మిమ్మల్ని అణగద్రొక్కే స్థితిలో బ్రతకాలని మీకు లేని సమయంలో ఘోరమైన అశాంతి ద్వేషాదులతో మీ జీవనం గడుస్తూన్నపుడు జీవితం నీరసంగా, దుఃఖమయంగా వున్నప్పుడు లోకమంతా దయారహితంగా, పాఖండంగా గోచరించే వేళలో – మీరు అవశ్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. సూక్ష్మమైన ఆధ్యాత్మికశక్తితో అవశ్యం మీరు లాభాన్ని పొందుతారు.

ధనబల, విద్యాబల, బుద్ధిబలాదుల కన్న మిన్న అయిన అధికబలం కలిగినట్టిది యీస్తోత్రము. దీనివల్ల దుష్టసంస్కారాలు దూరమై శుభసంస్కారాలు జాగృతమవుతాయి. ఆశాకిరణాలు బహిర్గతమవుతాయి. వేలాదిమంది ” శ్రీరామ రక్షాస్తోత్రం” వల్ల మృత్యు, అశాంతి, ఉన్మాదం, ఆత్మహత్య ఆదిగా గల రోగాలనుండి సంరక్షింపబడ్డారు. దీనివల్ల శరీరం రోగ రహితమవుతుంది. ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మస్తిష్కమూ జ్ఞానతంతువులూ పరిపుష్టమవుతాయి.

స్మరణ శక్తి తీవ్రమవుతుంది. రక్తచాపం (బ్లడప్రెషర్) హృదయరోగాలు సమూలంగా నిర్మూలమవుతాయి. మానసిక ఆరోగ్య సంతులనార్ధం దీనిని నిత్యం పారాయణ చెయ్యాలి. అనుదినం ప్రతివ్యక్తి ముఖ్యంగా శ్రీరామ భక్తులూ పూజతో బాటు దీనిని అభ్యసించాలి. (సిద్ధ్యర్ధం నిత్యం 11 పారాయణాల వంతున 9రోజులు పారాయణ చెయ్యాలి.)

ఓం శ్రీ గణేశాయ నమః అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః! సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీ రామచంద్ర ప్రీత్యర్ధే రామ రక్షా స్తోత్ర జపే వినియోగః

తాత్పర్యము ||

ఈ రామరక్షా స్తోత్రానికి ఋషి బుధకౌశికుడు, దేవతలు సీతారాములు, శక్తిసీత, కీలకము హనుమంతుడు, దీని వినియోగము శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకు వున్నది. అందుకే రామరక్షా స్తోత్ర జపములో దీని వినియోగము వున్నది.

ధ్యానం

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్
పీతం వాసోవసానం, నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్
నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.

తా ||  ధనుర్బాణములను ధరించినవాడు. బద్ధ పద్మాసన విరాజమానుడు, పీతాంబరధారీ, నూతన కమల దళములతో స్పర్ధకలిగియున్న ప్రసన్న నయనుడు, వామభాగమున వీరాజిల్లు సీతాముఖ కమలముతో కలిసి -యున్నవాడు, ఆజానుబాహువు, మేఘశ్యాముడు, వివిధాలంకార విభూషితుడు విశాల జటాజూటధారీ అయిన శ్రీరామచంద్రుని ధ్యానించవలెను.

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్లో || చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ |

తా ||  శ్రీరఘునాథుని చరిత్ర శతకోటి ప్రవిస్తరమై యున్నది. అందలి ఒక్కొక్క అక్షరము కూడ మనుష్య మాత్రుని మహాపాపములను నాశనము చేయును.

శ్లో || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ |

శ్లో || స్కా సీతూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూత మజం విభుమ్ |

శ్లో || రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః |

నీలకమల దళశ్యాముడును, కమలనయనుడు, జటామకుట సుశోభితుడును, ఖడ్గ, తూణీర, ధనుర్బాణధారియు, రాక్షస సంహారకారియు జగత్ రక్షణార్ధమే తన లీలచే అవతరించిన వాడును, అజన్ముడును సర్వవ్యాపకుడు అయిన శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణ సమేతముగా స్మరించి ప్రాజ్ఞ పురుషుడు సర్వకామప్రదమై పాపములను నాశనము చేయునదైన యీ రామరక్షాస్తోత్రమును పఠింపవలెను. నా శిరస్సును రాఘవుడును లలాట భాగమును దశరధాత్మజుడను రక్షించు గాక !

శ్లో || కౌసల్యేయో దృశాపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః |

తా || కౌసల్యానందనుడు నేత్రములను రక్షించుగాక! విశ్వామిత్ర ప్రియుడు కర్ణములను సురక్షితముగా వుంచును గాక! యజ్ఞ రక్షకుడు జ్ఞానేంద్రియములను, సౌమిత్రి వత్సలుడు, ముఖమును రక్షించును గాక!

శ్లో || జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః |

తా || నా జిహ్వను విద్యానిధియు, కంఠమును భరతవందితుడును, స్కంధములను దివ్యాయుధుడును భుజములను శివధనుర్భంగము చేసిన వాడును రక్షించును గాక !

శ్లో || కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః |

తా || హస్తములను సీతాపతియు, హృదయమును పరుశురామ విజేతయు, మధ్య భాగమును ఖర రాక్షసాంతకుడును నాభిని జాంబవ దాశ్రయడును రక్షించును గాక!

శ్లో || సుగ్రీవేశః కటీ పాతు సక్టినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

తా || కటి భాగమును సుగ్రీవస్వామియు, సర్థినిని హనుమత్ప్రభువును జఘన భాగములను, రాక్షసకుల వినాశకుడగు రఘుకుల శ్రేష్ఠుడును రక్షించును గాక.

శ్లో || జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీ దః పాతు రామోఖిలం వపుః |

తా || జానువులను (మోకాళ్ళను) సేతు నిర్మాతయు జఘనములను (మణికట్టును) దశ ముఖాంతకుడును, చరణములను విభీషణునికి ఐశ్వర్యము ప్రసాదించిన వాడును సంపూర్ణ శరీరమును శ్రీరాముడును రక్షించును గాక!

శ్లో || ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ 
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ |

తా || ఏ పుణ్యాత్ముడు రామబల సంపన్నమగు యీ రామరక్షా స్తోత్రమును పఠించునో అట్టివాడు దీర్ఘార్దాయముతో సుఖియై పుత్రవంతుడు విజయశీలుడనై వినయ సంపన్నుడగును.

శ్లో || పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః 
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః |

తా|| పృథివ్యాకాశ పాతాళ లోకములలో ఛద్మ వేషముతో పరిభ్రమించే యే జీవియైనను సరే రామ నామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి చూడలేదు.

శ్లో || రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైర్భుక్షిం ముక్తిం చ విందతి |

తా|| ” రామ ” ” ” రామభద్ర ” “ రామచంద్ర ” యీ నామములను స్మరించుటవల్ల మనుష్యుడు పాప విముక్తుడగుటయే కాక భోగమోక్షములను -కూడ పొందగలుగును.

శ్లో || జగజ్జెత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ 
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః |

తా|| జగత్తును జయించుటకు ఏకమాత్ర మంత్రమైన రామనామముచే సురక్షితమైన యీ స్తోత్రమును కంఠస్థము చేయువానికి సమస్త సిద్ధులు కరతలామలకములగును.

శ్లో || వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం |

తా || వజ్రపంజర నామకమగు యీ రామ కవచమును స్మరించు వాని ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించ జాలరు. వానికి సర్వే సర్వత్రా జయ మంగళములు ప్రాప్తించును.

శ్లో || ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ||

తా|| రాత్రి స్వప్నమునందు తనకు యీ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగనే ప్రాతఃకాలమున మేల్కాంచిన పిమ్మట బుధ కౌశిక మహర్షి దీనిని వ్రాసెను.

శ్లో || ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామస్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః || 

తా || కల్పవృక్షములతో కూడిన ఉద్యానవనమువంటి వాడును సమస్త ఆపదలను రూపుమాపువాడును ముల్లోకములలో పరమ సుందరుడును అయిన శ్రీ రామచంద్రుడే మా ప్రభువు.

శ్లో || తరుణో రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ |

శ్లో || ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణా
పుత్రా దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణా |

శ్లో || శరణ్యా సర్వసత్వానాం శ్రేష్ట్లా సర్వధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ |

తా || తరుణ వయస్కులు రూప సంపన్నులు, మహా బలశాలురు కమల సదృశ విశాల నేత్రములు కలవారు, చీరవస్త్ర, కృష్ణ మృగ చర్మ ధారులు, ఫలమూలములను ఆహారముగా గైకొనువారు, సంయమన చిత్తులు, తపస్వులు సమస్త జీవులకు శరణిచ్చువారు ధనుర్ధారులందరిలోను శ్రేష్ఠులు, రాక్షస కులనాశకులు అయిన రామలక్ష్మణ సోదరులిద్దరు మనలను రక్షించు గాక !

శ్లో || ఆత్తసజ్యధనుషావిషుస్ప్పశావక్షయాశుగ నిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్

తా || నారి సారించిన ధనుస్సులు చేబూనిన వారును, బాణముపై హస్తములను త్రిప్పుచుండువారును, అక్షయ బాణయుక్త తూణీర ధారులును అయిన రామలక్ష్మణులు నన్ను రక్షించుట కొరకు మార్గములో సదా నాకు ముందుండెదరు గాక.

శ్లో || సన్నద్ధః కవచీ ఖడ్డీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

తా || తాకీ సర్వకాల సర్వావస్థలయందు, సన్నద్ధులై యుండువారు, కవచధారులై, ఖడ్గ పాణులై ధనుర్బాణధారులై యువావస్థలోవుండు నట్టి శ్రీరామ భగవానుడు లక్ష్మణ సహితుడై మున్ముందు నడచుచు మనలను మన మనోరథములను రక్షించును గాక !

శ్లో || రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః ||

శ్లో || వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః ||

శ్లో || ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ||

తా || (భగవత్కథన మేమన) రామ, దాశరథి, శూర, లక్ష్మణాను చర, బలి కాకుత్థ పరమపురుష, పూర్ణ కౌసల్యేయ రఘూత్తమ వేదాంతవేద్య, యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకీవల్లభ! శ్రీమాన్అప్రమేయ పరాక్రమ యీ నామములను ప్రతి నిత్యము శ్రద్ధా పూర్వకముగా జపించు నా భక్తుడు అశ్వమేథ యాగము కన్నను మిన్నయైన అధిక ఫలము పొందు ననుటలో సందేహము లేదు.

శ్లో || రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతావాససమ్ 
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః ||

తా || దూర్వాదళ సదృశశ్యామ వర్ణుడును, కమలనేత్రుడును పీతాంబరధారియు అయిన శ్రీ రామభగవానుని యీ దివ్య నామములను కీర్తించు వారు సంసార సాగరములో పడరు.

శ్లో || రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.

తా || లక్ష్మణాగ్రజుడును రఘుకుల శ్రేష్ఠుడును, సీతాపతియును, అత్యంత సుందరుడును, కకుత్సకుల నందనుడును కరుణా సాగరుడును గుణనిధానుడును, బ్రాహ్మణ ప్రియుడును రాజ రాజేశ్వరుడును, సత్యప్రతిజ్ఞుడును దశరథపుత్రుడును, శ్యాముడును, శాంతమూర్తియు, సర్వలోక సుందరుడును రఘుకుల తిలకుడును రాఘవుడును రావణారియును, అయిన రామభగవానునకు నేను వందన మాచరించుచున్నాను.

శ్లో || రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

తా || రామా, రామభద్రా! రామచంద్రా ! విధాతృ స్వరూపా, రఘునాథా ! ప్రభూ, సీతా పతివీ అయిన నీకు నమస్కారము.

శ్లో || శ్రీ రామ రామ రఘునందన రామరామ |
శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ |
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ||

తా || ఓ రఘునందనా, శ్రీరామా ! భరతాగ్రజా | భగవంతుడవగు ఓరామా ! ఓ రణకర్కశ ప్రభువైన రామా ! నీవు రక్షకుడవు కమ్ము.

శ్లో || శ్రీ రామ చంద్ర చరణా మనసా స్మరామి |
శ్రీరామ చంద్ర చరణా వచసా గృణామి |
శ్రీరామ చంద్ర చరణా శిరసా నమామి |
శ్రీరామ చంద్ర చరణా శరణం ప్రపద్యే ||

తా || శ్రీరామ చంద్రుని చరణములను నేను మనసా స్మరించు చున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా నేను కీర్తించుచున్నాను, శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణు వేడుచున్నాను.

శ్లో || మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
ర్నాన్యం జానే నైవ జానే న జానే.

తా || రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వము. అతనిని వీనా నేను మరెవరినీ యెంత మాత్రమూ ఎరుగను.

శ్లో || దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ |

తా || దక్షిణ భాగములో లక్ష్మణుడు వామాంకమున జానకీ దేవియు సమ్ముఖమున ఆంజనేయుడును విరాజిల్లుచుండగా భాసిల్లునట్టి రఘునాథునకు నేను వందన మాచరించుచున్నాను.

శ్లో || లోకాభిరామం రణరంగధీరం |
రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం |
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే |

తా || పరిపూర్ణత్వముగల సుందరుడును, రణక్రీడలో ధీరుడును, కమలనయనుడును, రఘువంశ నాయకుడును కరుణామూర్తియు, కరుణానిధియు అయిన శ్రీ రామచంద్రుని నేను శరణు వేడుచున్నాను.

శ్లో || మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూథముఖ్యమ్
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే

తా || మనస్సమానగతితో వాయు సదృశవేగంతో పరమ జితేంద్రియుడై శ్రీమంతులలో శ్రేష్ఠుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను నేను శరణు వేడుచున్నాను.

శ్లో || కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం |

శ్లో || ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ |

తా || ఆపదలను హరించువాడును సమస్త సంపదలను ప్రసాదించువాడును లోకాభి రాముడును అయిన రామ భగవానుననకు నేను మాటిమాటికి నమస్కరించుచున్నాను.

శ్లో || భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ |

తా || తారామ, రామ” అని యీ ప్రకారముగా ఘోషించుట సంపూర్ణ సంసార బీజములను వేయించి వేయునదియు సమస్త సుఖసంపత్తులను ప్రాప్తింపచేయునదియు యమదూతలను భయభీతుల నొనర్చునదియు అయి యున్నది.

శ్లో || రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతుమే భో రామ మాముద్ధర ||

తా || రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడుసదా విజయశీలుడై =యుండును. లక్ష్మీపతియగు రామ భగవానుని నేను భజించెదను. రాక్షససెన్య సర్వస్వమును ధ్వంస మొనర్చిన శ్రీ రామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను. రామునికన్న ఘనమై అన్యమయిన ఆశ్రయము మరియొకటి లేదు. నేను అట్టి రాముని దాసుడను. నా చిత్తము సదా రామునియందే లగ్నమయి యుండు గాక! ఓ రామా! నీవు నన్నుద్ధరింపుము.

శ్లో || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||

తా || ( శ్రీశంకరుడు పార్వతీ దేవితో ‘ ఇట్లు పలుకుచున్నాడు) ఓ సుముఖీ! రామనామము విష్ణు సహస్రనామ తుల్యమైనది. నేను సర్వదా =రామ, రామ, రామ, అని యీ ప్రకారముగా మనోహరమైన రామనామమునందే రమించు చుందును.

( ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షాస్తోత్రం సంపూర్ణం)

మరిన్ని స్తోత్రములు:

Leave a Comment