Sri Raghavendra Mangala Ashtakam In Telugu | శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Raghavendra Mangala Ashtakam In Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకమ్

శ్రీమ| ద్రామపదారవిందమధుపః శ్రీమ్రధ్వవంశాధిపః
సచ్ఛిప్యోడుగణోడుపః శ్రితజగద్గీర్వాణసత్పాదపః |
అత్యర్థం మనసా కృతాచ్యుతజపః పాపాంధకారాతపః
శ్రీమత్సద్గురు రాఘవేంద్ర యతిరాట్ కుర్యాద్ధువం

మంగళమ్ ||

శ్రీరాముని పాదపద్మములందు తుమ్మెద ఐనట్టివాడును, మధ్వవంశమునకుఅధిపతి ఐనట్టివాడును, మంచి శిష్యులను నక్షత్ర ములలోని చంద్రుడును, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమును, మానసికముగా మాధవమంత్రి జపమును సమధిక ముగా జేసినట్టి వాడును, పాప మనునంధ కారమునకు సూర్యకాంతి ఐనట్టి వాడును, అగు శ్రీసద్గురు రాఘవేంద్రయతీంద్రుడు శాశ్వత మంగళమును గూర్చుగాక.

కర్మంద్రీంద్ర సుధీంద్ర సద్గురుక రాంభోజోద్భవః సంతతం
ప్రాజ్యధ్యానవశీకృతాఖలజగ ద్వా స్తవ్యలక్ష్మీధవః |
సచ్ఛాస్త్రాతివిదూష కాఖలమృపావాదీభకంఠీరవః
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్ కుర్యాదు వం

మంగళమ్||

యతీశ్వరులగు సుధీంద్ర సద్గురువుల కరకమలసంజాతు డును, నిరంతరము మహత్తరమగు ధ్యానముతో సర్వజగన్ని వాసి యగు లక్ష్మీపతిని వశమొనర్చుకొనినవాడును, మంచి శాస్త్రములను మిక్కిలిగా దూపించు అసత్యవాదులనెడి సమస్త ప్రతివాదుల నెడి గజములపాలిటి సింహము నగుశ్రీసద్గురురాఘ వేంద్రయతీంద్రుడు శాశ్వత మంగళకరుడగుగాక.

సాలంకారక కావ్యనాటకకలా కాణాద పాతంజల
త్రైయర్థస్మృతి జై మినీయ కవితా సంగీతపారంగతః |
విపక్షత్రవిడంఫ్రీ జాతముఖరానేక ప్రజా సేవితః
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్ కుర్యాదు వం

మంగళమ్ ||

అలంకారశాస్త్రము, కావ్యములు, నాటకములు, కళలు, న్యాయశాస్త్రము, వ్యాకరణము, వేదార్థ ప్రతిపాదకస్మృతులు, మీమాంసకవిత్వము, సంగీతములందు పారంగతుడును, అనంత మైన చాతుర్వర్ణ్యప్రజా సేవితుడును నగు శ్రీసద్గురు రాఘ వేంద్ర యతీంద్రుడు నిరంతరము మంగళకరుడగుగాక.

రంగోత్తుంగ తరంగ మంగళకర శ్రీతుంగభద్రాతట
ప్రత్యస్థ ద్విజపుంగ వాలయలసన్ మంత్రాలయాఖ్యేపురే
న వ్యేంద్రోపల నీలభవ్యకరసద్బృందావనాంతర్గతః
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్ కుర్యాదువం

మంగళమ్||

శుభంకరమైన ఉత్తుంగ తరంగములలో మంగళకరమగు తుంగభద్రానదీతీరమున నున్నట్టియు, బ్రాహ్మణశ్రేష్ఠులతో ప్రకాశించు మంత్రాలయపురమునందు నవీనములగు ఇంద్ర నీలమణులవలె శుభకరమైన బృందావనమునందున్న శ్రీ సద్గురు రాఘవేంద్ర యతీంద్రుడు మంగళకరుడగుగాక.

విద్వద్రాజశిరః కిరీటఖచితానర్హ్యోరు రత్నప్రభా
రాగాఘాఘహ పాదుకద్వయచరః పద్మాక్షమాలాధరః
భాస్వద్దండ కమండలూజ్వలకరః రక్తాంబరాడంబరః
శ్రీమత్సద్గుకురాఘ వేంద్రయతిరాట్ కు ర్యాదు

మంగళమ్||

పండిత శ్రేష్ఠుల శిరస్సులందలి కిరీటములందు ఖచితము లైన అనర్ఘములైన రత్నములకాంతులతో పాపపుంజముల నశింపజేయు పాదుకలతో చరించువాడును, పద్మబీజముల అక్షమాలను ధరించువాడును, దండకమండలములు హ స్తము లందు విరాజిల్లువాడును, అరుణవస్త్రధారియు నగు శ్రీసద్గురు రాఘ వేంద్రయతీంద్రుడు శాశ్వతమంగళము గూర్చుగాక.

యద్బృందావన సప్రదక్షిణ నమస్కా రాభిషేక స్తుతి
ధ్యానారాధన మృద్విలేపన ముఖానే కోపచారాన్ సదా
కారం కారమభిప్రయాంతి చతురోలో కాః పుమర్థాన్ సదా
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్ కుర్యాద్ధువం

మంగళమ్||

ఎవరినివాసమగు బృందావనమునందు ప్రదక్షిణనమస్కా రములను, అభిషేకములను, స్తోత్రములను, ధ్యానమును, ఆరా ధనమును, మృద్వి లేపనము మున్నగు నుపచారములను నిరంతరము చేసి చేసి చతుశ్లోకములు పురుషార్థములను పొందుచున్నవో ఆ శ్రీమత్సద్గురు రాఘవేంద్రయతీంద్రుడు మంగళమును గలిగించుగాక.

వేదవ్యాస మునీశ మధ్వయతిరాట్ టీ కార్య వాక్యామృతం
జ్ఞాత్వాద్వైతమతం హలాహలసమంత్య శ్వాసమాఖ్యా ప్తయే
సంఖ్యావత్సుఖదాం దశోపనిష దాం వ్యాఖ్యాంసమాఖ్యాన్ ముదా
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్కర్యాదు వం

మంగళమ్||

వేదవ్యాసముని యొనర్చిన బ్రహ్మసూత్రములకు మధ్వా చార్యులవారు రచించిన వ్యాఖ్యావాక్యామృతమును తెలిసి కొని మోక్షప్రాప్తి కి అద్వైతము హాలాహలమువలె నపకారి యని త్యజించి పండితులకు సుఖకరములగు దశోపనిషత్తులకు వ్యాఖ్యను రచించి విరాజిల్లు శ్రీసద్గురు రాఘ వేంద్రయతీంద్రుడు ధ్రువమగు మంగళమును గలిగించుగాక.

శ్రీమద్వైష్ణవలోక జాలకగురుః శ్రీమత్పరివ్రాట్ భరుః
శాస్త్రే దేవగురుః శ్రితామరతరుః ప్రత్యూహ గోత్రస్వరుః
చేతీతశిరుః తథా జితవరుః సత్సౌఖ్య సంపత్కురుః
శ్రీమత్సద్గురురాఘ వేంద్రయతిరాట్ కుర్యాద్రువం

మంగళమ్||

వైష్ణవలోకబృందములకు గురువును, ప శ్రేష్ఠుడును, శాస్త్రవిషయములందు దేవగురువును, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమును, విఘ్న పర్వతములకు వజ్రాయుధము వంటివాడును, మనస్సునకు అతీతమైన మహిమగలిగినవాడును, మన్మధుని జయించినవాడు, మంచిసౌఖ్యసంపదను గలిగించు వాడును నగు శ్రీసద్గురు రాఘ వేంద్రయతీంద్రుడు ధ్రువమంగళకరుడగుగాక.

యఃసంధ్యాస్వనిశం గురోర్వతిపతే సన్మంగళ స్యాష్టకం
సద్యఃపాపహరం స్వసేవి విదుషాు భక్త్యావ మాభాషితం
భక్త్యావక్తి సుసంపదం శుభప్రదం దీర్ఘాయురారోగ్యకం
కీర్తింపుత్రకళత్ర బాంధవ సుహృన్మూర్తీః ప్రయాతిద్రువమ్

మంగళమ్||

వినినంతనె సమ_స్తపాపములను పోగొట్టుయతిపతి యగు శ్రీరాఘ వేంద్రస్వామివారి యీ మంగళాష్టకమును ప్రతిదినము సంధ్యాసమయమునందు పఠించువాడును, భక్తితో పలుకబడిన దీనిని భక్తి తో విద్వాంసులకు పలుకునాడును, సంపదను ఉ త్తమపదమును, దీర్ఘాయురారోగ్యములను, కీర్తిని, పత్నీపుత్రు లను, బంధువులను, మిత్రులను పొందును. ఇదినిశ్చయము.

మరిన్ని అష్టకములు:

Leave a Comment