Yamalarjuna Bhanjanam In Telugu – యమళార్జున భంజనమ్

srikrishna leelalu yamalarjuna bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్ నీతికథ.

శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్

అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు.

బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనే తెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీద నుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది. తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు!

పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే. కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో జోకటికి (ఉలూఖలమునకు కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది.

మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు గానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!

యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా జోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ జోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాల ముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకు వెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యోన్ముఖులై వెళ్ళిపోయారు.

యమళార్జుమల వృత్తాంతము

నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేర పుత్రులు వస్త్రములను ధరించలేదు. ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా
అన్నాడు.

“ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీ సంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్భయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.

మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
  2. వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసికూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
  3. ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేర పుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
  4. తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Uttama Sansari Ila Undali In Telugu – ఉత్తమ సంసారి ఇలా ఉండాలి

Uttama Sansari Ila Undali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఉత్తమ సంసారి ఇలా ఉండాలి నీతికథ.

ఉత్తమ సంసారి ఇలా ఉండాలి.

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)

” మహామునులారా !

జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు”. అని సూతుడు కథ మొదలు పెట్టాడు.
జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు.
క్రింద పెద్ద గొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు.
దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు. ఆశ్చర్యంతో వారిని సమీపించి :
‘అయ్యా ! మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు. నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు.
నాయనా! మేము వరమ విషాదంతో యిలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం.
ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగి పోతుంది. మేము ఈ నరకకూపంలో పడతాం. వాడు వివాహం చేసు కుని సంతానవంతుడై తే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి’ అన్నారు. అప్పుడా ముని :
‘ఆర్యా, నేనే ఆ జరత్కారుడను. మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను’ అని తనకు తగిన భార్యకోసం అన్వేషణ ఆరంభించాడు.
తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు.
ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి.
తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి
‘మహామునీ ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలూ ఉద్ధరించండి’ అని ప్రార్థించాడు.
అందుకు అంగీకరించాడు జరత్కారుడు.
ఒకానొక సుముహూర్తంలో వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో
‘ధర్మచారిణి ఈ రోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు ! ” అన్నాడు.
జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి, నిరంతరం పతిసేవతో గున్నది.
అలా ఆయన మనసుకి అనుగుణంగా మెంగుతూ, ఆయన అను రాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ, గర్భవతి అయింది.
రోజులు గడుస్తున్నాయి.
ఒకనాడాయన తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన, తన భార్య తొడమీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు.

సూర్యుడు పడమటి కొండకు చేరాడు.
మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు.
అప్పుడామె ఆలోచనలో పడింది.
సంధ్యాసమయంలో జరపవలసిన వేదవిహిత కర్మలకు లోపం రాకూడదు కదా ! ఇప్పుడీయనను లేపితే కోపం వస్తుందేమో! లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపంవస్తే అది నేను భరించాలి. కాని ధర్మలోపం జరగరాదు కదా అని నిశ్చయించి నిద్ర లేపింది.
సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది.
‘ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు?’ అని తీవ్రంగా అడిగాడు.
‘స్వామి | సంధ్యాసమయం అయింది. మీరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా !’ అంది.
‘ఎంత వెర్రిదానివి. నేను నిద్రపోతూండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు. కనుక వా నియమ ప్రకారం నిన్ను విడిచి పెడుతు న్నాను. అయితే యింత కాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతో షము కలిగించింది.
ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయవంశాలనూ ఉద్ధరిస్తాడు. మవ్వు నిర్వి చారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు’ అని తన కమండలుపు తీసు కుని ఆయన వెళ్ళిపోయాడు.
విచారంతో జరత్కారువు తన అన్న గారి దగ్గరకు వచ్చింది.
జరిగిన విషయం విన్నాడు వాసుకి. సోదరిని ఓదార్చి, ఆదరంతో చూసుకుంటున్నాడు.
నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసుకి పరమానందంతో వారుభయులకూ ఉచిత సేవలు చేయించాడు.
పెరిగిన కుమారునికి ఆ స్తీకుడని పేరు పెట్టారు.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడై, పర్వ విద్యలూ నేర్పి పలువురి ప్రశంసలు పొందాడు.
‘ఈ ఆస్తీకుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్ప యాగాన్ని ఆపి తన తల్లి చుట్టాఅయిన నాగజాతిని మహ వివత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు.” జ్ఞానులయినవారు సంసార కూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తిచేసి విరాగు లవాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Garuda Garvabhangam In Telugu – గరుడ గర్వభంగం

Garuda Garvabhangam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గరుడ గర్వభంగం నీతికథ.

గరుడ గర్వభంగం

(ఉద్యోగ పర్వంలో చేయబార సమయంలో కణ్వమహర్షి చెప్పిన కథ)

” నాయనా దుర్యోధనా !

దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా! ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి.

ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల లోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.

ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీలసంపన్న, విద్యావతి. తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని, ఆచార మర్యాదలనూ చక్కగా అలవరచుకొని పదినుందిలో వినయగుణవతిగా పేరు పొందింది.
బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభిం చాడు మాతలి.
ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతు రాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలాకష్టం.
విద్యఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటే సంపద ఉండదు.
విద్యా వినయ గుణరూపాలున్ని వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు.
ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించ కుండా తిరుగుతూనే ఉండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు.
ఇరువురూ కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆలోకం లోని వింతలు, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి!
దేవమునీ :
నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా ! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
గరుడ లోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు.
ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపు తున్నారు. అది మాతలికి రుచించలేదు.
అప్పుడు నాగలోకానికి చేరారు. ఆలోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధానీ నగరంలో అన్వేషణ ఆరంభించారు.
నాగ వంశ ప్రముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు.
వింటూ వింటూన్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి.
అది గ్రహించి నారదుడు మాతలీ

నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది. అందులో పెద్ద ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు.
నువ్వు చూపే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు, అని చెప్పాడు. తరువాత ‘ కుల పెద్ద ‘ అయిన ఆర్యకునితో:
‘నాయనా! ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు దేవయినీ: వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీ రెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయాడు. అప్పుడే చెప్పాడాయన.
తరువాయి వంతు సుముఖునిది, అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వడల మంటారా ? ‘ అన్నాడు.
అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు.
తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖు నితో వివాహం జరిపించాడు.
వా రుభయులా అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తున్నారు.
ఈ వార్త గరుత్మంతుని చెప్పిని పడింది.
తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి
‘చతుర్దశ భువనాలకూ అధిపతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించ లేడని తెలియదామీకు? అంతటి శక్తికల నన్ను మీరు అవమానించారు, నామాట వినకుండా ఈ వివాహం జరిపించి’ అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించ బోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో:
‘నాయనా! వినతానందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది, నా చెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు,’ అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు.
అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి నాలుక పిడచకట్టింది.
అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి? ‘నాయనా గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తి స్తాయి’ అన్నాడు.
అనంతరం గరుడవాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు.

‘చూశావా, దుర్యోధనాః గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చి పెడు తుందో ! కనక అది విడిచి పెట్టాలి’ అన్నాడు కణ్వమహర్షి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ekachakrapura Baka Vadha In Telugu – ఏకచక్రపుర బక వధ

Ekachakrapura Baka Vadha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఏకచక్రపుర బక వధ.

ఏకచక్రపుర బక వధ

“అమ్మా! ఎందులకు నీవు పుత్రుత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయటపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వని పై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొదుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.

“నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్పుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యము. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకము. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.

వెయ్యి ఏనుగుల బలమున్న భీమనేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగైపోయింది! యుద్ధములో వజ్రని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకము. ఆ పైన శ్రీకృష్ణుని దయ” అని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.

ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపినాడు. అనుకున్న ప్రకారం భీమసేనుడు ఒక బండీలో అన్నం నింపుకుని ఆ రాక్షసుని స్థావరమునకు వెళ్ళి అతనిని పిలిచి తానే ఆ ఆహారమంతా తినసాగాడు. బకాసురుడు నరార్భకుడు తన భోజనం తినేస్తున్నాడని కుపితుడై గట్టిగా భీముని వీపుపై గుద్దాడు. చలించని భీమసేనుడు ఆహారం తీసుకుంటూనే ఉన్నాడు. మహా క్రోధముతో బకుడు ఒక పెద్ద వృక్షమును పెకిలించి భీమునిపైకి విసరబోయాడు.

ఇంతలో భీముడు భోజనము ముగించి కాళ్ళూ చేతులూ కడుక్కోని ఆచమించి శుచి అయ్యి రాక్షసుడు విసిరిన చెట్టుని పట్టుకుని తిప్పికొట్టాడు! అలా కొంత సేపు వారు రాళ్ళతో చెట్లతో భీకర యుద్ధం చేసి చివరికి ముష్టియుద్ధము చేయసాగారు. అలసిపోయిన రాక్షసుని బోర్లదోసి తన మోకాలిని బకుని వీపుపైన ఉంచి బలముగా ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు భీముడు. బకుడు ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసినాడు. ఆ కేకలు విని బకుని బంధువులు బయటికి వచ్చారు. భయకంపితులైన వారితో భీముడు “ఇక నుంచీ మీరు మనుషులను హింసించటం మానకపోతే మీకూ ఈ బకునికి పట్టిన గతే పడుతుంది” అని హెచ్చరించాడు. వారందఱూ అలాగే ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజునుండి ఏకచక్రపురం లోని ప్రజలు హాయిగా జీవించడం మొదులుపెట్టారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. కుంతీదేవి ధర్మరాజుకు చేసిన హితబోధ మనమెన్నడూ మఱువరాదు. కృతజ్ఞత ఆర్తరక్షణ కనీస కర్తవ్యాలని మనకు ఈ కథ ద్వారా తెలిసినవి.
  2. ఒక సజ్జనుడు తన బలాన్ని పరోపకారానికి ఎలా ఉపయోగిస్తాడో మనకు ఈ కథలో భీమసేనుని ద్వారా తెలిసినది. దుష్టులైన కౌరవులు తమ బలాన్ని యుక్తిని ప్రజాశ్రయస్సుకు వాడకుండా మత్సరముతో పాండవులను మట్టుపెట్టడానికే ఉపయోగించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sibi Chakravarthy Datalalo Patilenivadu In Telugu – శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు

Sibi Chakravarthy Datalalo Patilenivadu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు నీతికథ.

శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు

(ఆరణ్య పర్వంలో రోమశ మహర్షి ధర్మరాజుతో చెప్పిన కథ )

ఉశీనరుడనే మహారాజుండేవాడు. ఆయన కుమారుడు శిబి. ఈయన మహాదాతగా లోకలోకాలలో ప్రఖ్యాతి పొందాడు.

అంతటి కీర్తి వచ్చిన శిబి చక్రవర్తి దాన విశేషం ఏమిటో వరీ క్షించాలని ఇంద్రుడు, అగ్ని బయలుదేరారు.

అగ్ని హోత్రుడు పావురం రూపం ధరించాడు.
దేవేంద్రుడు డేగలా బయలుదేరాడు.

ఆ పావురాన్ని తరుముతూ డేగవస్తున్నది. పావురం గజ గజ వణుకుతూ ఎగిరి ఎగిరి అలసటతో శిబిచక్రవర్తి దగ్గరకు వచ్చిపడి, * శరణు. శరణు, మహారాజా ‘! అని ప్రార్థించింది.

అప్పుడు అక్కడే ఉన్న రాజపురోహితుడు :
‘మహారాజా ! ఈ పావురం ప్రాణభయంతో నిన్ను శరణువేడింది. ఏ జీవికయినా ప్రాణమంత ప్రీతికర మయింది మరొకటి లేదు. అలానే ప్రాణరక్షణ కంటె ఉ త్తను కర్మలేదు.

కాని – పావురాలను చేరదీయడం మృత్యు సూచక మంటున్నారు. విద్యాంసులు, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు’ అన్నాడు.

అది విని ఆ పావురం :
“మహారాజా ! ఆ డేగకు భయపడి నిన్ను శరణు వేడాను . నేనా క మహామునిని. ఆ రూపం విడిచి యిలా తిరుగుతున్నాము. దీనులకూ, అసమర్థులకూ మహారాజే రక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి కనుక నిన్ను శరణు వేడుకున్నాను” అంది.

అప్పటి కక్కడకు చేరిన వేగః
‘మహారాజా! ప్రతి జీవికీ ఎన్నో రూపాలు ప్రాప్తిస్తాయి. ఇది పావురమై నిన్ను శరణు వేడింది. అయితే పావురాలు డేగలకు ఆహారం అని మరిచిపోట, నా’ నోటి దగ్గరి ఆహారముయిన ఈ పావురాన్ని విడిచి పెట్టి నా ప్రాణాలు కాపాడు” అంది.

ఆ పక్షుల మాటలు వింటున్న శిబి చక్రవర్తి మనస్సు ఆందోళనలో పడింది.

‘ప్రాణ భీకేతో వచ్చి శరణు వేడిన వారికి అభయమివ్వని రాజు యొక్క దేశంలో వానలు కురియక, పంటలుమాడి క్షామదేవత విలయ తాండవం చేస్తుంది. పయిగా అటువంటి రాజ్యంలో ప్రజలకు రక్షణలేక నానా బాధలు పడతారు. అందువల్ల మహారాజు నరకంలో పడతాడు.

మరి ఈ డేగ ఆకలితో ఉంది.’ దాని ఆహారం పావురం. దాని నోటిముందు అన్నం తీసెయ్యడమూ పాపమే. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి ?’ అని ఆలోచించి, ఆలోచించి రాజు ” ఓ డేగా ! నీకు యింతకంటె రుచిగా ఉండే, బలం కలిగించే ఆహారం యిప్పిస్తాను. దీన్ని విడిచిపెట్టు’ అన్నాడు.

డేగః మహారాజా ! ఈ పావురంమాంసం కంటె రుచికరమయిన ఆహారం మరొకటి లేదు. ఏ పక్షి దొరకనప్పుడు పావురాలనే మాకు ఆహా రంగా యిచ్చాడు బ్రహ్మదేవుడు.

శిబి: ఓ డేగా ? శరణు వేడిన ఈ పావురాన్ని విడిచి ధర్మహాని చెయ్యను. నా ప్రాణాలు వదులు కుంటాను కాని అభయమిచ్చిన ప్రాణికి హాని జరగనివ్వను. ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు, అందుచేత నువ్వు పావురాన్ని విడిచి ఏమయినా అడుగు.

డేగః మహారాజా ! నువ్వు అంత దయచూప దలిచినట్ల యితే నా మాట విను. నీ కుడితొడ చీల్చి దానిలోని మాంసం తీసి ఈ పావురం బరువుతో సమంగా తూచి ఆ మాంసం నాకియ్యి. ఆరగిస్తాను.

ఇది వింటూనే శిబి చక్రవర్తి, శ్రమ తెప్పించి ఒక వయిపు పావురాన్ని ఉంచి, కత్తితో తనతొడ కోపి మాంసం తక్కెడలో ఉంచాడు. ఎంత మాంసం పడుతున్నా పావురం బరువుకి సమం కావడం లేదు. రెండవకొడ, చెయ్యికోసి పెట్టినా అది తూగలేదు. అంతలో శిబితానే క్రాసులో కూర్చున్నాడు.

డేగ: చాలు. నేను వెడుతున్నాము, అని ఎగిరిపోయింది.

అది చూసి శిబిచక్రవర్తి :
‘ ఓ పావురమా ! నువ్వెపరవు. ఏమిటి నీ కథ’? అని అడిగాడు.

‘ మహారాజా ! నేను అగ్నిహోత్రుడను. ఆ డేగ దేవేంద్రుడు. నీ కీర్తి విని, నీ శరణాగత రక్షణ దృష్టినీ, దాన శక్తిని పరిశీలించాలని వచ్చాం. నువ్వు విజయం పొందావు. నీ మశశ్చంద్రికలు ఈ భువన భవనం అంతటా వ్యాపిస్తాయి. నీకు కలిగే కుమారుడు కూడా నీ కీర్తిని నిలబెడతాడు’, అని అదృశ్యమయింది.

ఈ విధంగా శరణువేడిన ప్రాణికోసం తన శరీరాన్నే దానం చేసిన మహాపురుషుడు కనకనే ఈ నాటికి శిబి చక్రవర్తి పేరు ప్రఖ్యాత మయింది. దాతల పేరు చెప్పేటప్పుడు ఆ పేరు తప్పని సరిగా చెప్పుకుంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bakasura Vadha In Telugu – బకాసుర వధ

Sri Krishna Lilalu Bakasura Vadha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ నీతికథ.

శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ

యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలురతో యమునాతీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వత మంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలెనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకొని మ్రింగెను.

లోకరక్షకుని రక్షించుటకై దేవేంద్రుడు వజ్రప్రయోగము చేసెను. విధాతదండమును విసరెను. ఆ బకాసురునికి ఏ హానీ జరగలేదు! పరమేశ్వరుడు త్రిశూలముచే దాని రెక్క విఱుగగొట్టెను. వాయుదేవుని వాయవ్యాస్త్రము యముని దండము సూర్యుని వేయిబాణములు చంద్రుని నీహారాష్త్రము ఆ బకాసురునిపై పనిచేయలేదు! ఆగ్నేయాస్త్రముతో అగ్నిదేవుడు ఆ బకుని రొమ్ములను కాల్చెను. వరుణదేవుడు పాశముతో భద్రకాళి గదతో కొట్టగా ఆ బకాసురుడు మూర్ఛనొందెను. కొంతసేపటికి తేరుకున్న బకుని కాలు విఱుగగొట్టెను తన శక్త్యాస్త్రముతో కుమారస్వామి. ఒంటికాలితోనే మింటికెగసి ఆ బకాసురుడు దేవతలను తరిమికొట్టెను!

మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను. మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణపరమాత్మలో కలసెను.

బకాసురుని వృత్తాంతము

హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడు ఉత్కలుడు. వాడు తన బలపరాక్రమాలతో దేవేంద్రుని జయించి స్వర్గాధిపతి అయ్యెను. ఇట్లు నూరేండ్లు త్రిలోకాధిపతియై శోభిల్లెను. అన్ని ఏండ్లు దేవేంద్రపదవిని పొందియూ బుద్ధిమాంద్యముచే ఆతడు మహాతెజస్వి అయిన జాజిలి మహర్షి ఆశ్రమము వద్దనున్న సింధూ మహాసాగరమునకు పోయి అక్కడ చేపలను పట్టుచుండెను. అప్పుడు జాజిలి మహర్షి ఉత్కలుని చూచి “ఓయి! నీకిట్టి జీవహింస చేయ తగునా? వంశానుక్రమమున నీకు లభించిన సంస్కారమేమి? నీవు చేయుచున్న పని ఏమి? జీవ హింస మహాపాపమని ఎఱుగవా”? అని మందలించెను. మూర్ఖుడైన ఉత్కలుడు మహర్షి మాటలను విశ్వసించక జీవహింస కొనసాగించుచుండెను. అంతట జాజిలి మహర్షి “కొంగవలె చేపలు పట్టుచుంటివి కావున బకుడవు కమ్ము” అని శపించెను. పశ్చాత్తాపముతో మహర్షిని శరణువేడినాడు ఉత్కలుడు. అప్పుడు మహర్షి “వత్సా! కర్మ ఫలితమును అనుభవింపక తప్పు కదా! పశ్చాత్తాముతో పునీతుడవైన నీకు శ్రీకృష్ణ సందర్శనము కలుగును. ముక్తిని పొందెదవు” అని అనుగ్రహించినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

అహింసా పరమో ధర్మః ।
ధర్మహింసా తథైవచ ||

ఈ సూక్తికి అద్దంపట్టే కథ బకాసుర వధ. ఇంద్రపదవిని చేపట్టి తన సంస్కారానికి విరుద్ధ్భముగా చేపలను పట్టుకుని ఉత్కలుడు జీవహింస చేసినాడు. అందులకు జాజిలి మహర్షి అతనిని శపించినాడు. కావున మనము జీవ హింస ఎన్నడూ చేయరాదు.

దుష్టుడు లోకహింసా పరాయణుడు అయిన ఉత్కలుని సంహరించి శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంస్థాపన చేసినాడు. శ్రీకృష్ణుడు చేసినది ధర్మహింస అయినది. పైన చెప్పిన సూక్తి ప్రకారము అహింస పరమ ధర్మము. అహింస అంతే గొప్పది ధర్మహింస.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satsangatyamu In Telugu – సత్సాంగత్యము

Satsangatyamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సత్సాంగత్యము నీతికథ.

సత్సాంగత్యము

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దే పర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగా నే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక వెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు.

అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవత గా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి ? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే.

అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

జగద్గురువులైన ఆదిశంకరులు

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ॥”

అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదు

Santruptini Minchina Sampada Ledu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు.

సంతృప్తిని మించిన సంపద లేదు

సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బాల్యస్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీ మించి శ్రీ కృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరువచ్చెను. అయిననూ కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు. దీనునివలె యాచనచేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగినదానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్ఠ యందుండెడివాడు. సంతృప్తి లేని యెంత ధనవంతుడైననూ దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెఱిగినవాడు.

సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి. అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లాఅన్నది “నాథా! అవంతీపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీ కృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా. ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా?” అని ఆవేదనను వ్యక్తపఱచినది. తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు “వామాక్షీ! ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? అయిననూ ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయెదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకొంటాడు. నేనును నా స్నేహితున్ని చూడాలని చాలా రోజులగా అనుకొంటున్నాను. దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు. నాలుగుగుప్పెళ్లు అటుకులు దొరకునేమో చూచి రమ్ము”. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది.

పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వర త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీ కృష్ణుడే మందిరములో నున్నాడ ని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. పదహారు వేలయెమినిది మంది భార్యలున్నాకూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీ కృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీ దేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీ కృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నులనిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీ కృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోనికి తీసుకు వెళ్ళాడు.

రుక్మిణీ దేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీ కృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్ళు తన శిరమున చల్లుకొన్నాడు. “అతిథి దేవోభవ” అని లోకానికి చాటడానికి శ్రీకృష్ణుడలా చేసెను. అది చూచినవారంతా ఆ జలమును తమ శిరముల పై చల్లుకొన్నారు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసెను. మృష్టాన్నములతో భోజనము పెట్టెను. పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుదాముడు శ్రీ కృష్ణ స్తుతి చేసెను. తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి. శ్రీకృష్ణుడు సుదాముడు తెచ్చిన అటుకులు తిని “ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది. మరల ఇప్పుడే తినుట” అని అన్నాడు. మఱునాడు సుదాముడు తన గృహమునకు మఱలెను. శ్రీ కృష్ణుడు సుదామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను.

సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళిపోవటం చూసి శ్రీ కృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీ కృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీ కృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చెనని తెలుసుకొనెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమదికాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరఁగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే. అడిగే అవకాశమున్నా తనకున్నదానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీ కృష్ణపరమాత్మ సుదామదంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు.
  2. స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీలేదు. సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం అద్వితీయం. శ్రీకృష్ణుని చెలిమి సాటిలేని కలిమి.
  3. ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీ కృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు. సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీ కృష్ణుడు సుదాముని కాళ్ళుకడిగి ఆ నీళ్ళు తన నెత్తిన చల్లుకొన్నాడు.
  4. నిష్కల్మష భక్తి ఎలావుండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు. నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం భగవంతుని మీద ఉండాలని సుదాముడు చెప్పినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Chiranjeevulu In Telugu – చిరంజీవులు

Chiranjeevulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చిరంజీవులు నీతికథ.

చిరంజీవులు

(అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ యిది)
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కం డేయ ముని దర్శనభాగ్యం లభించింది.

ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగి నవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటే దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ, నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు.

అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.

ఒకనాడు ధర్మరాజు వినయంగా, చేతులు జోడించి
‘మహర్షీ ! నా కొక ప్రశ్న వచ్చింది’ అని అడగడానికి సంకో చించాడు. మార్కండియుడు చిరునవ్వు నవ్వి
‘తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా! నీ సందేహం ఏమిటి, అడుగు’ అన్నాడు.
‘మహామునీ। మాకు తెలిసినంత వరకూ మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరయినా చిరంజీవులున్నారా’ అని అడిగాడు.

మార్కండేయ ముని చిరునవ్వుతో, తన తెల్లని వండు గడ్డం నవ రించి, ‘ధర్మనందనా ! మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకో దగ్గది. సావధానంగా విము

ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడనే పేరుగల మహారాజు ఉండే వాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మ పురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజర్షిగా పేరుపొంది ప్రజలందరి మన్ననలూ పొందిన ఆ పుణ్య పురుషుడు కాలం చెల్లగానే స్వర్గం చేరాడు.

అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్య కర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు.

భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి: ‘మహర్షీ ! మీరు పన్ను ఎరుగుదురా?’ అని అడిగాడు.
అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉప వాస వ్రతంతో కృశించి ఉన్నాను. అందుచేత ‘నాకు గుర్తులేదయ్యా’ అన్నాను.
‘స్వామీ! మీకంటె ముందు పుట్టిన ప్రాణి ఏదయినా జీవించి ఉన్నదా ?’ అని అడిగాడు.
‘ హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకరం అనే పేరు గల గుడ్లగూబ ఉంది అది నా కంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు, ‘ అన్నాను.

ఇంద్రద్యుమ్నుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్ల గూబను చేరి: ‘నువ్వు నన్ను ఎరుగుదువా?’ అన్నాడు. తెలి యదని తల ఊపింది, ఆ పక్షి. ‘అయితే నీ కంటే ముందు పుట్టిన వారిని ఎవరినయినా ఎరుగుదువా?’ అని అడిగాడు.

‘అయ్యా! ఇక్కడకు యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో వాడీ జంఘమనే పేరు గల కొంగ ఉంటుంది. అది నాకంటే పెద్దది, ‘ అంది.

ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడా కొంగః

‘ ఈ కొలనులోనే ఆకూపారం అనే పేరు గల తాబేలు ఉంది, అది నాకంటె ముందు పుట్టింది’, అని జవా బిచ్చింది.

ఆకూపారాన్ని పిలిచి యిదే ప్రశ్న వేయగా, అది కన్నీరు విడుస్తూ:

‘అయ్యా ! ఆయన వెయ్యి మారులు యజ్ఞం చేసి వెయ్యి యూవ స్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోపుల రాకపోకలతో భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇది ఆయన చలవ”, అంది.

ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకు వెళ్ళారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంత కాలం మనం స్వర్గంలో ఉంకాం.

మరిన్ని నీతికథలు మీకోసం:

Kanikanitito Karyalu Sadhinchali In Telugu – కణికనీతితో కార్యాలు సాధించాలి

Kanikanitito Karyalu Sadhinchali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కణికనీతితో కార్యాలు సాధించాలి నీతికథ.

కణికనీతితో కార్యాలు సాధించాలి

( ఈ కథ ఆదిపర్వం కోసేది )

హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులున్నారు.

అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మ పరుడు, నీతికోవిదుడు.రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వ హిస్తూ, నిరంతరం ధృతరాష్ట్రుని అంతరంగిక సలహాదారుగా ఉంటాడు.
మూడవ వాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే !

మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైనా కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీరు చదవబోతున్నారు.
మహారాజా !

అనగా అనగా ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు, యథేచ్ఛగా విహరిస్తు న్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరులచేత చేయించుకుని, పని పూర్తికాగానే వాటిని మోసంచేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిప, ఎలుక. వీటితో కలిసి మెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నారు.

ఆరోజులలో ఒకనాడు – .

పిక్కబలీసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటబడింది. ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. నిను కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా, దాన్ని పట్టడం సాధ్యం కావడంలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని:

” స్నేహితులారా ! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యంకాదు. ఇప్పుడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంతరుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరింది.

“ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతు రతతో అటేచూస్తూ.

అది కొంతసేపు ఆలోచన అభినయించింది.

“ఆ ఇప్పుడు ఆలోచన వచ్చింది.”

” జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకు వగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అద నులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది.
దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతు లేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళుజాపి నిద్రపోతున్నది లేడి. నక్క పలహా ప్రకారం అలికిడి కాకుండా ఎంకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతూండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతోపాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పుడా నక్క:

“స్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందు చేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.
అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.
నక్క బొటబొటా కన్నీప కారుస్తూంటే చూసిన పులి :
“బావా ! ఎందుకు విచారిస్తున్నావు? అంది.

“ఏం చెప్పను పులిబావా : ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో
తెలుసా ? ‘పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం. నేను కాళ్ళు కొరి కితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలి గింది, అంటూ నక్క కన్నీరు విడిచింది.
పులికి పౌరుషం వచ్చింది.

“మిత్రమా! ఎఇక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను. ” అంటూ వెళ్లిపోయింది.
అంతలో ఎలక రాగా –
విన్నావా, ఎలకబావా ! ఈ లేడిని పులి ముట్టుకుంది కనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎంకము తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులిబావకు నీ మీద కోపంవచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్ని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడిమాంసం ఆరగించింది నక్క. విన్నారా ! మహారాజా ! తెలివితో వంచనతో మనకార్యాలు చక్క బెట్టుకోవాలి అన్నాడు కణికుడు. ఇదే కణిక నీతి.

మరిన్ని నీతికథలు మీకోసం: